Vijay Devarakonda: మాది ఎయిర్‌ఫోర్స్‌ బ్యాచ్‌ | Vijay Devarakonda Interesting Comments On Tharun Bhaskar About Friendship Day 2024, Deets Inside | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: మాది ఎయిర్‌ఫోర్స్‌ బ్యాచ్‌

Published Sun, Aug 4 2024 6:26 AM | Last Updated on Sun, Aug 4 2024 12:23 PM

Vijay Devarakonda Talks On Tharun Bhaskar About Friendship Day 2024

‘ఎయిర్‌ఫోర్స్‌ బ్యాచ్‌’ నుంచి ఎయిర్‌ బస్‌ దాకా... ఆఫర్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకున్న రోజుల నుంచి, ఫైవ్‌స్టార్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే రోజుల దాకా... రెండు ఐదు రూ΄ాయల కాయిన్స్‌ కోసం వెతికిన రోజుల నుంచి కోట్లు లెక్క పెట్టుకునే రోజుల దాకా...  ఇద్దరూ విజయప్రయాణాలు చేశారు. ఇండస్ట్రీలో నిలిచారు. విజయ్‌ దేవరకొండ, తరుణ్‌ భాస్కర్‌... ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘ఫ్రెండ్‌షిప్‌ డే’ సందర్భంగా వీరి స్నేహంలోని ముచ్చట్లను ‘సాక్షి’తో తరుణ్‌ భాస్కర్‌ ప్రత్యేకంగా పంచుకున్నారు.

→ విజయ్‌తో మీ స్నేహం మొదలైన రోజులను షేర్‌ చేసుకుంటారా? 
తరుణ్‌ భాస్కర్‌: మహేశ్వరి చాంబర్స్‌లో నాకో ఆఫీస్‌ ఉండేది. వెడ్డింగ్‌ ఫిల్మ్స్, కార్పొరేట్‌ ఫిల్మ్స్, షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసేవాళ్లం. 2011 అనుకుంటా. ఆ టైమ్‌లో థియేటర్‌ ఆర్టిస్ట్స్‌ని కలిసేవాడిని. అప్పుడే విజయ్‌ని కలిశా. పరిచయం బాగా పెరిగింది. ‘డబ్బులు ఉన్నా లేక΄ోయినా ఫర్వాలేదు... షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసేద్దాంరా’ అని విజయ్‌ కాన్ఫిడెంట్‌గా అనేవాడు. ఒక షార్ట్‌ ఫిల్మ్‌ కూడా అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్లీ ‘పెళ్ళి చూపులు’ సినిమా చేశాం. అప్పట్లో మాది ఎయిర్‌ఫోర్స్‌ బ్యాచ్‌ (ఖాళీగా తిరిగేవాళ్లను అలా అంటుంటారు). ఇక ‘పెళ్ళి చూపులు’ని ఒక ΄్యాషన్‌తో చేశాం. నా వల్ల విజయ్‌కి హిట్‌ వచ్చింది.. విజయ్‌ వల్ల నాకు అనే ఫీలింగ్‌ లేదు. సాధించాం అనే ΄÷గరు లేదు. మనస్ఫూర్తిగా ఎంజాయ్‌ చేసుకుంటూ చేశాం. మా ΄్యాషన్‌కి దక్కిన సక్సెస్‌ అనుకుంటాను. 

→ మీ జర్నీ ఇంతదాకా వచ్చిన విషయాన్ని అప్పుడప్పుడూ మాట్లాడుకుంటారా?
కోవిడ్‌ టైమ్‌లో విజయ్‌ ఫోన్‌ చేసి, ‘అరేయ్‌... మనం ఎక్కడ స్టార్ట్‌ అయ్యాం... ఇంత దూరం వచ్చాం.. అస్సలు అనుకోలేదు కదరా... లైఫ్‌లో ఒక్కో ΄ాయింట్‌ ఎలా టర్న్‌ అయిందో కదా. దీన్నే డెస్టినీ అంటారు’ అని మాట్లాడుకున్నాం.  

→ అప్పట్లో  మీ ఇద్దరూ డబ్బులు లేక ఇబ్బంది పడేవారా? డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారా? 
డబ్బులంటే... ఒకరికొకరు ఇచ్చుకునే రేంజ్‌ ఎవరికీ ఉండేది కాదు. అయితే కలిసి బిజినెస్‌ చేద్దామని అనుకునేవాళ్లం. నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్‌ ఏంటంటే... ఒకసారి ఏదో కొనడానికి విజయ్‌ని పది రూ΄ాయలు అడిగాను. అప్పుడు ‘పెళ్ళి చూపులు’ సినిమా ట్రైల్‌ జరుగుతోంది. కారులో రెండు ఐదు రూ΄ాయల బిళ్లల కోసం ఇద్దరం బాగా వెతికాం... దొరకలేదు (నవ్వుతూ). ఆ పరిస్థితి ఎప్పటికీ గుర్తుంటుంది. 

→ మీ ఇద్దరి కుటుంబాల మధ్య అనుబంధం? 
మేమంతా ఒక ఫ్యామిలీ అని మా ఇద్దరి ఇంట్లోనూ అనుకుంటారు. విజయ్‌ నాన్న ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా నాతో మాట్లాడతారు...  టైమ్‌ వేస్ట్‌ చేస్తున్నావని తిడుతుంటారు. ఆ ప్రేమ నాకు నచ్చుతుంది. అలాగే మా అమ్మ చేసే బిర్యానీ విజయ్‌కి చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు డైట్‌ అంతా గడప దగ్గరే పెట్టి లోపలికి వస్తాడు.  

→ మీరు, విజయ్‌ గొడవలు పడిన సందర్భాలు... 
‘పెళ్ళి చూపులు’ అప్పుడు గొడవపడేవాళ్లం. నాకు ఎవరైనా సలహాలిస్తే నచ్చేది కాదు. ఇలా చేస్తే బాగుంటుందని క్రియేటివ్‌గా కొన్ని చెప్పేవాడు విజయ్‌. అక్కడ గొడవలు పడేవాళ్లం. ఫైనల్‌గా విజయ్‌ నాన్న సాల్వ్‌ చేశారు. రేయ్‌.. వాడు చెప్పిన మాట విను అని విజయ్‌తో వాళ్ల నాన్న అంటే, ఓకే డాడీ అన్నాడు. నీ డైరెక్షన్‌ నీది.. నా యాక్టింగ్‌ నాది అని ఫిక్స్‌ అయి, గొడవలు మానేశాం. ఇప్పుడు కూడా ఎలాంటి కథలతో సినిమాలు చేయాలి? కమర్షియల్‌గా ఎలా చేయాలి? అని చర్చించుకుంటాం. విజయ్‌ బాలీవుడ్‌ వరకూ వెళ్లాడు కాబట్టి తన ఫీడ్‌బ్యాక్‌ బాగుంటుంది. తనకు చాలా అవగాహన ఉంది. 

→ ఇద్దరూ  కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం... 
బాధలో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. కానీ ‘పెళ్ళి చూపులు’ సక్సెస్‌కి ఎమోషనల్‌ అయ్యాం. అప్పుడు విజయ్‌ది, నాది బ్యాడ్‌ సిట్యువేషన్‌... నిరాశలో ఉన్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాలేదు. మా నాన్న సంవత్సరీకం కూడా. ఆ టైమ్‌లో వచ్చినన్ని అప్స్‌ అండ్‌ డౌన్స్‌ మాకెప్పుడూ రాలేదు. ఆ పరిస్థితుల్లో చేసిన సినిమా హిట్‌ కావడంతో ఎమోషన్‌తో కన్నీళ్లు వచ్చాయి.  

→ విజయ్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు? 
విజయ్‌ నా ట్రంప్‌ కార్డ్‌. గేమ్‌లో ఎప్పుడైనా కొంచెం అటూ ఇటూ అయితే ఆ ట్రంప్‌ కార్డ్‌ వాడుకుంటా. ఆ టైమ్‌ దగ్గరికొచ్చింది. నాక్కూడా ఎక్కువమంది ఆడియన్స్‌కి రీచ్‌ కావాలని ఉంది. మా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. 

→ విజయ్‌ లాంటి ఫ్రెండ్‌ ఉండటం గురించి?  
విజయ్‌ ప్రతి సక్సెస్‌లో నా విజయం ఒకటి కనబడుతుంటుంది. తను నా హోమ్‌ బాయ్‌... నా డార్లింగ్‌. విజయ్‌ అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీకి వచ్చి, ఆ స్టేటస్‌కి రావడమనేది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత కూడా ఆ అచీవ్‌మెంట్‌ గురించి మాట్లాడుకుంటారు. విజయ్‌ జర్నీలో నేనో చిన్న ΄ార్ట్‌ అవడం గర్వంగా ఉంటుంది.

మీ ఫస్ట్‌ సినిమాలో విజయ్‌ని ‘పెళ్ళి చూపులు’కి పంపించారు. మరి రియల్‌ లైఫ్‌లో విజయ్‌ని పెళ్లి కొడుకుగా చూడాలని  లేదా? 
కచ్చితంగా ఉంది. మా మధ్య ఆ విషయం గురించి చర్చకు వస్తుంటుంది. కానీ అవి వ్యక్తిగతం కాబట్టి బయటకు చెప్పలేను. అయితే నాకు హండ్రెడ్‌ పర్సంట్‌ విజయ్‌ని ఫ్యామిలీ మేన్‌గా చూడాలని ఉంది. ఎందుకంటే తనలో మంచి ఫ్యామిలీ మేన్‌ ఉన్నాడు. మంచి భర్త, తండ్రి కాగలుగుతాడు. విజయ్‌ ఆ లైఫ్‌ని కూడా ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నా. నా ఫ్రెండ్‌ పక్కా ‘జెంటిల్‌మేన్‌’.

మీ బాయ్స్‌కి ‘అడ్డా’ ఉంటుంది కదా...అప్పట్లో మీ అడ్డా ఎక్కడ? 
నెక్లెస్‌ రోడ్, మహేశ్వరి చాంబర్స్‌ దగ్గర చాయ్‌ బండి, ఆ పక్కన చైనీస్‌ ఫుడ్‌ సెంటర్‌. అక్కడే ఏదొకటి తింటూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ మధ్య అటువైపు వెళ్లినప్పుడు ఆ చాయ్‌ కేఫ్‌ దగ్గర థమ్సప్‌ లోగోలో విజయ్‌ థమ్సప్‌ తాగే ఫొటో కనిపించింది. అది ఫొటో తీసి, విజయ్‌కి పంపిస్తే ఎక్కడరా ఇది అని అడిగాడు. మనం ఒకప్పుడు కూర్చున్న కేఫ్‌ దగ్గర అన్నాను. మాకు అదో ఎమోషనల్‌ మూమెంట్‌. ఇక అప్పట్లో ఎక్కడ ఆఫర్‌లో ఫుడ్‌ ఉంటే అక్కడ తినేవాళ్లం (నవ్వుతూ). ఇప్పుడు ఆ ప్లేసెస్‌కి అంత ఫ్రీగా వెళ్లలేం. అందుకే ఇప్పుడు మాస్క్‌ లేకుండా సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి ఓ ΄ాల ΄్యాకెట్‌ కొనుక్కురా దమ్ముంటే అని విజయ్‌తో అంటుంటాను. అది మాత్రం నా వల్ల కాదురా అంటాడు.

మా కల ఒకటే
– విజయ్‌ దేవరకొండ
మేం ఇద్దరం చిన్నప్పట్నుంచి కలిసి పెరిగినవాళ్లం కాదు... ఒకే స్కూల్‌లో చదువుకున్నవాళ్లమూ కాదు. నేను పుట్టపర్తిలో, తరుణ్‌ హైదరాబాద్‌లో చదువుకున్నాడు. ఎక్కడెక్కడో పెరిగినప్పటికీ మా ఇద్దరి కల (సినిమా) ఒకటే. నా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూసి, తరుణ్‌ నాతో ‘పెళ్ళి చూపులు’ సినిమా చేద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడే మా పరిచయం బలపడుతోంది. జేబులో రూ΄ాయి లేక΄ోయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్లం. ఎంతో నమ్మకంగా ‘పెళ్ళి చూపులు’ చేసి, సక్సెస్‌ అయ్యాం. ఆ సినిమా తర్వాత తరుణ్‌కి చాలా అవకాశాలు వచ్చినా, మళ్లీ కొత్తవాళ్లతోనే చేద్దాం అనుకున్నాడు. తన మీద, తన స్క్రిప్ట్‌ మీద తనకు చాలా నమ్మకం. తరుణ్‌లో ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా స్క్రిప్ట్‌తో నా దగ్గరకు రారా అంటుంటాను... వస్తా అంటాడు. ఎక్కడో స్టార్ట్‌ అయి, చాలా దూరం వచ్చిన మా ఈ జర్నీలో ఎన్నో కష్టాలు చూశాం... ధైర్యంగా ఎదుర్కొన్నాం. గొప్పగా ఏదో చేస్తాం అనే నమ్మకంతో ఉండేవాళ్లం. మాతో ΄ాటు మా ఫ్రెండ్‌షిప్‌ కూడా పెరుగుతూ వచ్చింది. లైఫ్‌లో ఒక మంచి ఫ్రెండ్‌ ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement