రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్‌కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్న లైగర్ టీం ఇటీవలె సాక్షి టీవీతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
సినిమా బ్యాగ్రౌండ్ ఏమాత్రం లేకపోయినా, ఎంత స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. అసలు విజయ్ దేవరకొండ ఎవరు అని అడిగితే.. 'నాకు పూర్తిగా నేను ఎవరో తెలియదు. కానీ నాకు ఒకటి తెలుసు.. నాకు అనిపించింది నేను చేస్తా. నచ్చినట్లు ఉంటా. అన్నింటికంటే నాకు ఇదే ముఖ్యం. నచ్చినట్లు బతకలేకపోతే సూపర్ స్టార్ అయినా, ఎంత సంపాదించినా లాభం లేదు' అంటూ చెప్పుకొచ్చాడు.
పూరి జగన్నాథ్ తనను చాలా బాగా అర్థం చేసుకుంటారని, తన గురించి తనకే చెప్తారంటూ పేర్కొన్నాడు. ఇక విజయ్ అందరికీ ఇంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం అతని నిజాయితీ అని హీరోయిన్ అనన్య పాండే తెలిపింది. ప్రతిరోజూ విజయ్ తనకు కొత్తగానే కనిపిస్తాడని, పని విషయంలో చాలా కష్టపడతాడని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment