పారిస్: ర్యాగింగ్ పేరుతో ఓ పైలట్‌పై గన్ ఫైరింగ్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, ఈ సంఘటన ఫ్రాన్స్ దేశానికి చెందిన మధ్యధరా సముద్రంలోని కార్సికా ద్వీపంలో సోలెన్జారా వైమానిక స్థావరంలో చోటుచేసుకుంది. ర్యాగింగ్‌కు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కంప్లెయిట్‌ను బాధితుడు ఫైల్ చేశాడు. వైమానిక దళ శిక్షణ సమయంలో సహచర పైలట్లు అతడిని ఫైరింగ్ టార్గెట్‌కు కట్టేసి, అతడి మీదుగా ఫైటర్ విమానాలను పోనిస్తూ పైలట్‌పై కాల్పులను జరిపారని ఫిర్యాదులో తెలిపాడు. సహచరులు పాశవికంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను అతడి న్యాయవాది ఫ్రెడ్రిక్ బెర్నా ఫిర్యాదులో పొందుపర్చాడు.
ఈ సంఘటన 2019 మార్చిలో చోటుచేసుకున్న బాధితుడు మిలటరీ అధికారులను సవాలు చేయడానికి భయపడి ర్యాగింగ్ పాల్పడిన వారిపై ఫిర్యాదును ఇవ్వలేదు. ఆ సమయంలో వారిపై ఫిర్యాదును ఇవ్వలేకపోయాడని బాధితుడి లాయర్ పేర్కొన్నారు.
కాగా ఈ విషయంపై ఫ్రెంచి వైమానిక దళ ప్రతినిధి కల్నల్ స్టీఫెన్ స్పెట్ స్పందించారు. శిక్షణ కేంద్రంలో ర్యాగింగ్ లాంటి చర్యలకు తావుండదని తెలిపారు. ర్యాగింగ్‌పై అంతర్గత విచారణ జరిగిందని తెలిపారు. అంతేకాకుండా వారికి శిక్షను కూడా విధించామని పేర్కొన్నారు. కాగా నిందితులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదని, అంతేకాకుండా నిందితులను ఈ కేసు నుంచి తప్పించేలా చర్యలు జరుగుతున్నాయనీ బాధితుడి లాయర్ ఆరోపించారు.
చదవండి: అమెరికాలో కాల్పులు: వేర్వేరు చోట్ల 12 మంది మృతి
దారుణం: ర్యాగింగ్ పేరుతో పైలట్‌పై గన్ ఫైరింగ్..!
Published Mon, May 10 2021 3:18 PM | Last Updated on Mon, May 10 2021 3:28 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment