హైదరాబాద్: ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్‌ను సెప్టెంబర్ 7 నుంచి 14 వరకు సంగారెడ్డిలో నిర్వహిస్తున్నట్లు ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండెంట్ డీకే చౌదరి వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్స్, ఐఎఫ్ సెక్యూరిటీ ఉద్యోగాలకు నియామకాలు జరుగుతాయని చెప్పారు. బీఈడీ పూర్తి చేసి.. 25 ఏళ్ల వయసున్న వారు ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్స్ పోస్టుకు అర్హులని తెలిపారు. 10+2 అర్హత కలిగి ఉండి 21 ఏళ్లున్నవారు ఐఎఫ్ సెక్యూరిటీ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన వారికి వెంటనే రాత, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి నియామకపత్రాన్ని అందజేస్తామని ఆయన వెల్లడించారు.