september 7th
-
జాతీయ సమైక్యత దినోత్సవం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా రేపు(17 సెప్టెంబర్ 2022) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం బంజారాహిల్స్‌లో ఆదివాసీ, బంజారా భవనాలను ప్రారంభిస్తారు. తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. చదవండి: హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది? -
7 నుంచి భౌతికంగా కేసుల విచారణ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి భౌతికంగా కేసుల విచారణ జరగనుంది. మొదటి దశలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనంతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ షమీమ్ అఖ్తర్, జస్టిస్ జి.శ్రీదేవీలు భోజన విరామం వరకు భౌతికంగా, ఆ తర్వాత ఆన్లైన్లో కేసులను విచారిస్తారు. అలాగే 7వ తేదీ నుంచి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టులు భౌతికంగా పనిచేయనున్నాయి. ఈ మేరకు హైకోర్టు ఫుల్ కోర్టు శనివారం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 7 నుంచి ఐదు రోజులపాటు భౌతికంగా కేసులను విచారించిన తర్వాత 11న తిరిగి ఫుల్ కోర్టు సమావేశమై పరిస్థితులకు అనుగుణంగా భౌతిక కోర్టులను కొనసాగించాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ఇటీవల మృతి చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్‌కు 7వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు ఫుల్ కోర్టు సంతాపం తెలియజేయనుంది. కాగా, లాక్డౌన్ నుంచి ఆన్లైన్లో మాత్రమే హైకోర్టు న్యాయమూర్తులు కేసులను విచారిస్తున్నారు. -
సెప్టెంబర్ 7 నుంచి ‘కళా ఉత్సవ్’
విద్యారణ్యపురి : ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో ‘కళా ఉత్సవ్’ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7,8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీని నిర్వహణకు డీఈఓ కన్వీనర్‌గా, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. మ్యూజిక్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, క్రాఫ్ట్ విభాగాల్లో విద్యార్థులు జట్లుగా పోటీల్లో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, పాఠశాలలు, కళాశాలలకు చెందిన 9,10, ఇంటర్మీడియట్ విద్యార్థినీ,విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనొచ్చన్నారు. వీటిలో రాణించిన వారిని వచ్చే నెల 27,28 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారన్నారు. అక్కడ కూడా ఎంపికైతే నవంబర్ 15 నుంచి 19 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారన్నారు. జాతీయ స్థాయి విజేతలకు మొదటి బహుమతిగా రూ.1.25 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.75వేలు, తృతీయ బహుమతిగా రూ.50వేలు అందజేస్తారన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. -
వచ్చేనెల 7 నుంచి ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్
హైదరాబాద్: ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్‌ను సెప్టెంబర్ 7 నుంచి 14 వరకు సంగారెడ్డిలో నిర్వహిస్తున్నట్లు ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండెంట్ డీకే చౌదరి వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్, ఐఎఫ్ సెక్యూరిటీ ఉద్యోగాలకు నియామకాలు జరుగుతాయని చెప్పారు. బీఈడీ పూర్తి చేసి.. 25 ఏళ్ల వయసున్న వారు ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టుకు అర్హులని తెలిపారు. 10+2 అర్హత కలిగి ఉండి 21 ఏళ్లున్నవారు ఐఎఫ్ సెక్యూరిటీ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్లో ఎంపికైన వారికి వెంటనే రాత, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి నియామకపత్రాన్ని అందజేస్తామని ఆయన వెల్లడించారు. -
హైదరాబాద్ రానున్న సింగపూర్ ప్రభుత్వం
-
అనుమతిని రద్దు చేయాలి:టీ కాంగ్ నేతలు
-
ఖాకీలకు సెప్టెంబరు 7 భయం
ఈ నెల 7వ తేదీ అంటే హైదరాబాద్ పోలీసులు హడలిపోతున్నారు. ఆ రోజున ఏపిఎన్జిఓలు, తెలంగాణవాదులు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున వేరువేరు కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోలీస్ శాఖ అనుమతి ఇస్తే ఎల్బి స్టేడియం లోపల, అనుమతి ఇవ్వకపోతే బయట 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సదస్సు నిర్వహించాలన్న పట్టుదలతో ఏపి ఎన్జిఓ సంఘం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి ప్రకటించింది. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నిజాం కాలేజీ వరకు వేలాది మందితో శాంతి ర్యాలీ నిర్వహించాలన్న పట్టుదలతో తెలంగాణ జేఏసీ నాయకులు ఉన్నారు. సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వాలని, లేకపోతే కోర్టు ద్వారా అనుమతిని తెచ్చుకుంటామని ఇప్పటికే ఏపీఎన్జీఓలు స్పష్టం చేశారు. అనుమతి రాకపోయినా సదస్సును నిర్వహించి తీరుతామని వారు చెబుతున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు కేవలం 13 జిల్లాల సభ కాదని, రాష్ట్రంలోని 23 జిల్లాల సభ అని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. సమైక్యవాదాన్ని వినిపించే ఈ సభలో అన్ని ప్రాంతాలవారు పాల్గొంటారని చెప్పారు. ''ఉద్యోగుల సభను అడ్డుకుంటామంటున్నవారికి ఒకటే చెబుతున్నాం. మా సభ ఎవరికీ వ్యతిరేకం కాదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని, విభజన వల్ల జరిగే నష్టాలు, ఎదురయ్యే ఇబ్బందులను వివరించడానికే దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. సభ పెట్టొద్దనే హక్కు ఎవరికీ లేదు. మా సభ విజయవంతం అయితే విభజన వాదనకు బలం లేనట్లే’’ అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా తమ సభకు రావచ్చని, అయితే పార్టీల జెండా, ఎజెండాలను పక్కనబెట్టి వస్తేనే ఆహ్వానిస్తామని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు పలికే ఏ ప్రాంతం నాయకులైనా సభకు రావచ్చని తెలిపారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏపీఎన్జీఓల సభకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ప్రక్రియను కేంద్రం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ నెల 7న హైదరాబాదులో ముల్కీ అమరవీరుల శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సిటీ కాలేజ్ నుంచి ఇందిరా పార్కు వరకు శాంతి ర్యాలీ జరుపుతామని చెప్పారు. తర్వాత ముగింపు సభ ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఇప్పటికే రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు రెండు వర్గాలు చీలిపోయారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలో రెండు ప్రాంతాల వారు ఒకే రోజు హైదరాబాద్ చేరుకుంటే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయోనని పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండు పక్షాలకూ అనుమతి ఇవ్వవద్దని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు నివేదికను పంపించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ చర్చలు జరిపారు. ఏ ప్రాంతం వారైనా సచివాలయం ప్రాంగణంలో ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని మహంతి తెలిపారు. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా శాంతి యుతంగా నిరసన తెలుపుకోవాలని ఆయన ఉద్యోగులను కోరారు. ఇరు ప్రాంతాల ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేసేందుకు రెండు వేర్వేరు ప్రదేశాలను కేటాయించారు. సచివాలయం జే బ్లాక్ వద్ద తెలంగాణ ఉద్యోగులు శాంతియుత నిరసనకు అవకాశం కల్పించారు. సీమాంధ్ర ఉద్యోగులకు అమ్మవారి ఆలయం దగ్గర నిరసనకు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఈనెల 10 తేదీ వరకు ఎలాంటి సభలు, ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఈనెల 10 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల వారు సభలు నిర్వహించడానికి ప్రయత్నిస్తుంటే, పోలీసులు అందుకు అనుమతి ఇవ్వని పరిస్థితులలో 7వ తేదీన ఏం జరుగుతుందో వేచిచూడవలసిందే.