సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి భౌతికంగా కేసుల విచారణ జరగనుంది. మొదటి దశలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనంతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ షమీమ్ అఖ్తర్, జస్టిస్ జి.శ్రీదేవీలు భోజన విరామం వరకు భౌతికంగా, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో కేసులను విచారిస్తారు. అలాగే 7వ తేదీ నుంచి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టులు భౌతికంగా పనిచేయనున్నాయి.
ఈ మేరకు హైకోర్టు ఫుల్ కోర్టు శనివారం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 7 నుంచి ఐదు రోజులపాటు భౌతికంగా కేసులను విచారించిన తర్వాత 11న తిరిగి ఫుల్ కోర్టు సమావేశమై పరిస్థితులకు అనుగుణంగా భౌతిక కోర్టులను కొనసాగించాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ఇటీవల మృతి చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్‌కు 7వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు ఫుల్ కోర్టు సంతాపం తెలియజేయనుంది. కాగా, లాక్‌డౌన్ నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే హైకోర్టు న్యాయమూర్తులు కేసులను విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment