
సాక్షి, ద్వారకాతిరుమల: ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ.. తన పెళ్లికి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉందనగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పంగిడిగూడెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంటి పుష్పవతి నాల్గో కుమారుడు హరీష్‌బాబు (33) ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అతడికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది.
సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్‌బాబు అప్పటినుంచి ఇక్కడే ఉంటూ పెళ్లి పనులు చూసుకుంటున్నారు. ఈనెల 16న వివాహం జరగాల్సి ఉండగా శనివారం పెళ్లి బట్టలు కొనేందుకు తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఉదయం అతడు ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటికి తల్లి వచ్చి తలుపు తట్టగా హరీష్‌బాబు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టగా హరీష్‌బాబు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కిందకు దింపి చూడగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు.
(చదవండి: పెళ్లీడు వచ్చినా పెళ్లి చేయటం లేదన్న కోపంతో అన్నని..)
Comments
Please login to add a commentAdd a comment