టీడీపీ నేతలకు ఘోర అవమానం | Left Parties Boycott TDP leaders meeting over steel plant in Kadapa district | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు ఘోర అవమానం

Published Fri, Jun 15 2018 12:31 PM | Last Updated on Wed, Aug 29 2018 9:12 PM

Left Parties Boycott TDP leaders meeting over steel plant in Kadapa district - Sakshi

సాక్షి, కడప: వైఎస్సార్ కడప జిల్లా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు ఘోర అవమానం జరిగింది. జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ అమరణ దీక్షపై శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. ఈ క్రమంలో సమావేశానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, టీడీపీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

అయితే ఈ సమావేశానికి టీడీపీ నేతలు, ఒకరిద్దరు ప్రజా సంఘాల నేతలు తప్ప మిగతా రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు హాజరు కాలేదు. నాలుగేళ్లుగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం పోరాడని టీడీపీ ఈరోజు సమావేశం పెడితే ఎలా అంటూ వామపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. బీజేపీతో సంసారం చేసి విడిపోయి జిల్లాకు మోసం చేసారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement