నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలనే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్నారని లెఫ్ట్ పార్టీ నేతలు మండిపడ్డారు.
హైదరాబాద్: నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలనే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్నారని లెఫ్ట్ పార్టీ నేతలు మండిపడ్డారు.
గతంలో చంద్రబాబు విద్యుత్ ధరలను పెంచాడని.. అదే మాదిరిగా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపించారు. గత ఉద్యమ స్ఫూర్తిగా ఇప్పుడు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.