సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన | left parties strike on coruuption sez land | Sakshi
Sakshi News home page

సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన

Published Thu, Aug 13 2015 1:20 PM | Last Updated on Sat, Sep 22 2018 8:31 PM

సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన - Sakshi

సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన

పెనుకొండ (అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా తుంగోడు సెజ్ భూముల నష్టపరిహారం చెల్లింపులో అధికారులు రూ.2 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం నేతలు, సమాచార హక్కు ఐక్యవేదిక నేతలు, సీపీఐ, సీపీఎం నేతలు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని సోమందేపల్లి ఎంపీడీవో కార్యాలయంవద్ద ధర్నా చేశారు. రైతులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలను అధికారులు స్వాహా చేశారని, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement