- గవర్నర్‌కు వామపక్ష పార్టీల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అశాస్త్రీయమైన వాస్తు పేరుతో తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వామపక్ష పార్టీలు గవర్నర్ నరసింహన్‌ను కోరాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పది వామపక్ష పార్టీల ప్రతినిధులు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), కె.గోవర్ధన్, వేములపల్లి వెంకట్రామయ్య(సీపీఐ-ఎంఎల్-న్యూడెమొక్రసీ), బండా సురేందర్ రెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్), ఆర్.గోవింద్(ఆర్‌ఎస్‌పీ), బి.వీరయ్య(సీపీఐ-ఎంఎల్), సి.హెచ్.మురహరి(ఎస్‌యూసీఐసీ), ఎం.డి.గౌస్(ఎంసీపీఐయూ) తదితరులు గవర్నర్‌ను కలసినవారిలో ఉన్నారు. కొత్త సచివాలయం పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వంటి చర్యలను ఆపాలని వామపక్షనేతలు గవర్నర్‌ను కోరారు. ఈ అంశాలపై ప్రభుత్వంతో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని వామపక్ష పార్టీల నేతలు మీడియాకు తెలిపారు.