
వామపక్షాల ఆందోళన..అరెస్ట్
కల్తీ మద్యం బారిన పడి విజయవాడలోని నెహ్రూనగర్కు చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై వామపక్షాలు మండిపడ్డాయి
విజయవాడ: కల్తీ మద్యం బారిన పడి విజయవాడలోని నెహ్రూనగర్కు చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై వామపక్షాలు మండిపడ్డాయి. సీఎం చంద్రబాబునాయుడు పరామర్శిస్తున్న ఆంధ్రా ఆస్పత్రి వద్ద సోమవారం రాత్రి వామపక్షాలు ఆందోళనకు దిగియి. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వామపక్షాలు పోలీసుల అనుమతి కోరాయి. అయితే వారిని ముందుకు రాకుండా అడ్డుకొని పలువురు నేతలను అరెస్టు చేశారు.