adulterated
-
కిచెన్ టిప్స్.. ఇక కల్తీ కథ కంచికే!
కల్తీ... కల్తీ... కల్తీ. కల్తీ లేని వస్తువు కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోంది. బతకాలంటే రోజుకు మూడుసార్లు తినాలి. హోటల్లో తిందామంటే పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం వంటల్లో రంగులేస్తారు. ఇంట్లో శుభ్రంగా వండుకుని తిందామంటే... వంట దినుసులు కల్తీ. మిరప్పొడి కొందామంటే అందమైన ప్యాకింగ్ మీద నోరూరించే ఎర్రటిరంగు ఫొటో ఉంటుంది.లోపల మిరప్పొడి ఏ రంగులో ఉందో కనిపించదు. ఇంటికి తెచ్చి ప్యాకెట్ తెరిచి చూస్తే ఒక్కోసారి రంపం పొట్టులా, ఇటుక పొడిలా నిర్జీవంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఎర్రటి ఎరుపుతో ఇది కారంపొడేనా లేక గోడలకేసే రంగా అన్నంత చిక్కగా ఉంటుంది. మనం దాదాపుగా వంటల్లో రోజూ వాడే ఐదు దినుసులను ఎలా పరీక్షించుకోవచ్చో చూద్దాం.మిరప్పొడి: ఒక కప్పు నీటిని తీసుకుని అందులో టీ స్పూన్ మిరప్పొడి వేయాలి. మిరప్పొడి నీటిమీద తేలుతూ ఉండి రేణువులు నీటిని పీల్చుకుంటూ మెల్లగా మిరప్పొడి మొత్తం కప్పు అడుగుకు చేరుతుంది. కల్తీ మిరప్పొడి అయితే నీటిలో వేయగానే అడుగుకు చేరుతుంది. అంతేకాదు, కప్పు అడుగుకు చేరేలోపు రంగు వదులుతూ నీటిని ఎర్రగా మారుస్తుంది.ఇంగువ: ఇంగువకు మండే గుణం ఎక్కువ. ఇంగువ కల్తీని తెలుసుకోవడానికి అదే మంచి గీటురాయి కూడా. ఇంగువను చిన్న ముక్క తీసుకుని మంట మీద పెడితే వెంటనే మంట అంటుకుని ఇంగువ ముక్క మండిపోతుంది. కల్తీ ఇంగువ అయితే వెంటనే మండదు. మంట మీద పెట్టి వెలిగించే ప్రయత్నం చేసినా సరే వెలగకుండా మాడిపోతుంది. ఇంగువ పొడి కొనేవాళ్లకు కూడా ఇదే చిట్కా. చిన్న పేపర్ మీద పావు టీ స్పూన్ ఇంగువ వేసి కాగితాన్ని వెలిగించాలి. కాగితంతోపాటే ఇంగువ కూడా మంటను ఆకర్షిస్తే అది అసలైన ఇంగువ. కాగితం మండిపోయి ఇంగువ పొడి నల్లబారి సరిగా మండకపోతే అది కల్తీ ఇంగువ అని అర్థం.మిరియాలు: మిరియాలలో కల్తీ ఎలా జరుగుతుందంటే... బొ΄్పాయి గింజలను కలుపుతారు. ఒక కప్పు నీటిలో టీ స్పూన్ మిరియాలు వేయాలి. మిరియాలు బరువుగా ఉంటాయి నేరుగా నీటి అడుగుకు చేరతాయి. బొ΄్పాయి గింజలు తేలిక. కాబట్టి అవి నీటిలో తేలుతాయి.జీలకర్ర: జీలకర్రలో ఏ గింజలు కలుపుతారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ అసలు జీలకర్ర, అందులో కలిపిన గింజలు ఒకేరకంగా కనిపించడానికి కొద్దిగా నల్లరంగు కలుపుతారు. జీలకర్రను పావు టీ స్పూన్ తీసుకుని అరచేతిలో వేసి బాగా రుద్దాలి. చేతులకు నలుపు అంటితే కల్తీ జీలకర్ర అని అర్థం.పసుపు: పసుపుకు కూడా రంగులద్దుతారు. అర టీ స్పూన్ పసుపును కప్పునీటిలో వేయాలి. మిరప్పొడి వలెనే ఇది కూడా నీటిని పీల్చుకుంటూ మెల్లగా నానుతూ అడుగుకు చేరుతుంది. రంగు కలిపిన పసుపు అయితే నీటి అడుగుకు చేరే లోపే రంగు వదులుతుంది. వేసిన వెంటనే నీరు చిక్కటి పసుపురంగులోకి మారుతాయి. -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కల్తీ చాక్లెట్ల తయారీ.. హైదర్‌గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా
-
ప్రాణాలు తీసే బర్త్ డే కేకులు తింటే పైకి పోవడమే
-
కుళ్లిపోయిన అల్లం వెల్లులితో పేస్ట్ తయారీ
-
దుప్పలపూడి కేంద్రంగా కల్తీ టీ పొడి దందా
-
విజయవాడలో బరితెగించిన మాంసం మాఫియా
సాక్షి, అమరావతి బ్యూరో/పటమట: విజయవాడలో మాంసం మాఫియా బరితెగించింది. చనిపోయిన కోళ్లు.. చనిపోయిన మేకలు, గొర్రెల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని నీట్‌గా డ్రెస్సింగ్ చేసి రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడమే కాకుండా ప్రతి ఆదివారం బహిరంగంగానే విక్రయిస్తున్నారు. కల్తీ మాంసం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నగరంలో వారానికి నాలుగు టన్నుల కల్తీ మాంసం విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. (ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు..) నిబంధనలు ఇవి.. నిబంధనల మేరకు కబేళాలో మటన్, బీఫ్ విక్రయదారులు తప్పనిసరిగా సంబంధిత జంతు శరీరంపై వీఎంసీ స్టాంప్ వేయించుకుని విక్రయాలు చేయాలి. కానీ ఒక పశువు, మేక, గొర్రెలకు స్టాంప్ వేయించుకుని మిగిలిన వాటి మాంసం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులైతే అది కూడా పాటించడం లేదు. అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. రెస్టారెంట్లో కుళ్లిన మాంసం ఈ నెల 4న బందరురోడ్డులోని ఓ రెస్టారెంట్లో నిల్వ ఉన్న 400 కిలోల మాంసాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లు, వీఎంసీ వెటర్నరీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రిజ్‌లో పురుగులు పట్టి ఉన్న మాంసంతోనే వివిధ రకాల మాంసం పదార్థాలను తయారు చేయడం ఇటీవల సంచలనం కలిగించింది. ఈ నెల 8న భవానీపురం గొల్లపాలెంగట్టు వద్ద జరిగిన దాడుల్లో నగరంలోని పేరుమోసిన హోటళ్లకు సరఫరా చేసే బల్క్ మాంసం విక్రయదారుల నుంచి 400 కిలోల మాంసాన్ని వీఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ దాడుల్లో చనిపోయిన మేక మాంసం నుంచి పురుగులు బయటకు వచ్చాయి. అంతేకాకుండా తుప్పు పట్టిన ఫ్రీజర్‌లో మాంసం ఉంచడం వల్ల్ల ఆ తుప్పు మాంసంలోకి చేరి వాటిని తిన్నవారు అనారోగ్యం పాలవుతారని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 3న రైల్వే పార్సిల్ కౌంటర్లో భువనేశ్వర్ నుంచి నగరానికి దిగుమతి చేసుకుంటున్న 100 మేక తలకాయలను అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 10న రామలింగేశ్వర నగర్‌లోని ఫిష్ మార్కెట్లో 100 కిలోల నిల్వ ఉన్న చేపలను విక్రయిస్తుండగా అడ్డుకున్నారు. ఈ నెల 15న కరెన్సీ నగర్, రామచంద్ర నగర్లో మటన్‌లో బీఫ్ కలిపి విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారుల నుంచి మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
శానిటైజర్ శాంపిల్స్‌లో 50 శాతం కల్తీమయం!
ముంబై : కరోనా కట్టడికి ఉపయోగించే శానిటైజర్లు వ్యాపారుల అక్రమ దందాకు అడ్డాగా మారాయి. నకిలీ శానిటైజర్ల విక్రయంతో తయారీదారులు, విక్రేతలు సొమ్ము చేసుకుంటున్నారు. 120 శానిటైజర్ శాంపిళ్లను తాము పరీక్షించగా వాటిలో 50 శాతం శానిటైజర్లు కల్తీవని తేలాయని కన్జూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీజీఎస్ఐ) వెల్లడించింది. 4 శాతం శానిటైజర్లలో హానికారక మిథైల్ ఆల్కహాల్ కలిసిఉన్నట్టు గుర్తించారు. దీర్ఘకాలం మిథైల్ ఆల్కహాల్‌ను వాడితే దృష్టిలోపాలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ నివేదికను కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఆహార ఔషధ నియంత్రణ మండలి (ఎఫ్‌డీఏ)కి పంపామని సీజీఎస్ఐ తెలిపింది. కరోనా వైరస్ కట్టడిలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం అనివార్యం కావడంతో ఈ వ్యాపారంలో సత్వరమే డబ్బు సంపాదించేందుకు పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని సీజీఎస్ఐ కార్యదర్శి డాక్టర్ ఎంఎస్ కామత్ పేర్కొన్నారు. సబ్బు, నీరు అందుబాటులో లేకుంటే కనీసం 60 శాతం ఆల్కహాల్ కలిగిన శానిటైజర్‌ను వాడాలని డాక్టర్ కామత్ సూచించారు. ఇథైల్ ఆల్కహాల్ స్ధానంలో మిథైల్ ఆల్కహాల్‌ను తయారీదారులు వాడటంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సీజీఎస్ఐ పరీక్షించిన కొన్ని శాంపిళ్లలో 75 రూపాయల విలువైన 250 ఎంఎల్ శానిటైజర్లో ఆల్కహాల్ అసలు లేదని గుర్తించారు. మరోవైపు మార్కెట్లో లభించే 37 శాతం శానిటైజర్లపై తయారీ వివరాలు తెలిపే లేబుల్ లేదని వెల్లడైంది. చదవండి : లిక్విడ్ బదులు జెల్ శానిటైజర్లు విక్రయించాలి -
ఫాంపాండ్‌లో విష ప్రయోగం!
కౌడిపల్లి(నర్సాపూర్): గిరిజన రైతుల చేపలు పెంచే ఫాంపాండ్ (పంటకుంట)లో గుర్తుతెలియని వ్యక్తులు విషం చల్లడంతో సుమారు 32వేల చేపలు మృతి చెందగా, సుమారు రూ.10లక్షల వరకు నష్టం వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కొట్టాల పంచాయతీ లింగంపల్లి బిట్లతండాలో జవాహర్ నాయక్ పంటకుంట (ఫాంపాండ్)లో వివిధ రకాలకు చెందిన 32వేల చేపలను పెంచుతున్నాడు. ప్రస్తుతం పావు కిలో సైజ్‌లో పెరిగాయి. రోజు అక్కడే కాపలా ఉండే జవాహర్ నాయక్ కుంటుంబ సభ్యులు శనివారం మొక్కజొన్న తెంపేందుకు వెల్లారు. ఆదివారం ఉదయం నుంచి ఒక్కొక్కటి చేపలు చనిపోగా మధ్యాహ్నం వరకు పూర్తిగా చనిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేపలు పెంచే పంటకుంటలో విషం కలపడంతోనే మృతి చెందాయని బాధితుడు తెలిపారు. దీంతో సుమారు 10లక్షలు నష్టపోయానని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కాస్మొటిక్స్ అమ్మకాలు : షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లలో సౌందర్య ఉత్పత్తులను కొంటున్నారా? అయితే మీకో విభ్రాంతికర వార్త. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజ ఈ కామర్స్సంస్థలు నకిలీ, కల్తీ కాస్మొటిక్ ఉత్పత్తులను వినియోగదారులకు అంటకడుతున్నాయి. ఈ విషయాలను దేశీయ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు పలు ఇ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న బ్రాండ్లతో సహా, పలు సౌందర్య ఉత్పతులను నకిలీవి, కల్తీవి విక్రయిస్తున్నారని మండిపడింది. తమ నోటీసులపై స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అక్టోబర్ 5-6 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు నిర్వహించిన దాడుల్లో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దేశీయంగా తయారు చేసిన కాస్మొటిక్స్‌ను చెల్లుబాటు అయ్యే ఉత్పత్తి లైసెన్స్ లేకుండానే, అవసరమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు లేకుండా దిగుమతి చేసుకున్న వాటిని ఇ-కామర్స్ వేదికలపై విక్రయిస్తున్నారని అధికారులు తేల్చారు. 1940 డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ ప్రకారం లైసెన్స్‌లేని ఉత్పత్తులను విక్రయంచడం నేరమని, తమ నోటీసులపై పదిరోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని డిసిజిఐ ఎస్ ఈశ్వర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. చట్ట ప్రకారం, భారతదేశంలో సౌందర్య సాధనాల దిగుమతి కోసం నమోదు సర్టిఫికేట్ పొందటం తప్పనిసరి, దేశంలో తయారయ్యే అన్ని సౌందర్య సాధనాలు విక్రయానికి సరైన లైసెన్స్ కలిగి ఉండాలి. అంతే కాకుండా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా కాస్మెటిక్స్ ఉండాలి, దాని ప్రతికూల జాబితాలో పేర్కొన్న ఏ ఒక్క పదార్ధాన్ని కలిగి ఉండకూడదు. -
మౌనం వీడేనా?
కల్తీ ఎరువులు రైతులను కలవర పెట్టాయి. జిల్లాలోని యూరియాను కొంతమంది అక్రమార్కులు పక్క రాష్ట్రం ఒడిశాకు తరలించి.. అక్కడ దానికి రంగు వేసి తిరిగి జిల్లాకు తీసుకొచ్చి డీఏపీ ఎరువుగా విక్రయాలు చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. అధికారులు స్పందించారు. అయితే నామమాత్రంగా దాడులు చేసి మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో మంగళవారం వ్యవసాయాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నకిలీ ఎరువుల విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లోనైనా వ్యవసాయశాఖ అధికారులు మౌనం వీడి.. చర్యలకు ఉపక్రమిస్తారో..లేదోనని రైతులు ఆసక్తిగా చూస్తున్నారు. శ్రీకాకుళం, టెక్కలి: జిల్లాలో కల్తీ ఎరువులపై స్వయంగా నేను చెప్పినా పట్టించుకోరు...టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో కల్తీ ఎరువులు విక్రయిస్తున్నారని డీలర్ల పేరుతో సహా ఫిర్యాదులు వస్తున్నా మీరేం చేస్తున్నారు... వ్యవసాయాధికారులు నిద్రపోతున్నారా...డీలర్లతో లాలూచీపడుతున్నారా అంటూ సాక్షాత్ జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏం చేయాలో తేలియక వ్యవసాయ శాఖ అధికారులు కలవర పడుతున్నారు. కలెక్టర్ హెచ్చరికలతోనైనా కల్తీ ఎరువుల బాగోతంపై అధికార యంత్రాంగం స్పందిస్తుందా లేక ఇదంతా మామూలే అని పెడచెవిన పెడతారా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. జిల్లాలో కల్తీ ఎరువులపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో వరుసగా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వ్యవసాయాధికారులు, విజిలెన్స్ అధికారులు తూతూ మంత్రంగా హడావుడి తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే కలెక్టర్ ధనంజయరెడ్డి మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రస్తావించనట్లుగా కల్తీలకు పాల్పడుతున్న ప్రాంతాలు, డీలర్ల పేర్లుతో సహా పత్రికల్లో ప్రచురితమైనప్పటికీ వ్యవసాయాధికారులు మౌనం వహించడంలో ఆంతర్యమేమిటో కలెక్టర్ హెచ్చరికలో కొన్ని మాటలతో ఏకీభవించక తప్పదు. ఖరీఫ్ ఆరంభం నుంచి పెద్ద ఎత్తున కల్తీ ఎరువులు జిల్లాకు వస్తున్నప్పటికీ వ్యవసాయాధికారులు మాత్రం కనీసం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించలేదనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. మరో వైపు విజిలెన్స్ పరిశీలనతో సైతం పూర్తి స్థాయిలో ప్రగతి లేకపోవడంతో అనేక సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కలెక్టర్ ధనంజయరెడ్డి చేసిన హెచ్చరికలతోనైనా వ్యవసాయాధికారుల్లో చలనం కనిపిస్తుందా...విజిలెన్స్ యంత్రాంగం ఈ మాటలను చాలెంజ్‌గా తీసుకుని సంయుక్తంగా విచారణ చేస్తారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇన్వాయిస్, ఈ–పాస్ అమ్మకాలపై దృష్టి సారించకపోవడంపై సందేహాలు యూరియా (సూపర్ రకం) లో గ్రాన్యూల్స్ రకం ఎరువును ఒడిశాకు తరలించి అక్కడ డీఏపీ రూపంలో కల్తీ జరిగి మరళా ఆంధ్రా ప్రాంతానికి తరలివచ్చి వాటిని కొంత మంది దళారీలతో గ్రామాల్లో అమ్మకాలు చేసినట్లు గతంలో అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే దీనిపై అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం సర్వత్రా విమర్శలకు నెలవైంది. ఇటీవల కాలంలో విజిలెన్స్ అధికారులు డివిజన్ కేంద్రమైన టెక్కలిలో తనిఖీలు నిర్వహించే సమయంలో కొంతమంది ఎరువుల దుకాణాల డీలర్లు మూకుమ్మడిగా వారి దుకాణాలను మూసివేసి పారిపోయారు. ఈ విషయం అధికారుల కళ్లెదుటే జరిగింది. దుకాణాలను ఎందుకు మూసివేశారనే అనుమానం కూడా అధికారుల్లో రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇన్వాయిస్, ఈ–పాస్ అమ్మకాలపై అధికార యంత్రాంగం కనీసం దృష్టి సారించలేదనే చెప్పాలి. కల్తీ డీఏపీపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఇన్వాయిస్, ఈ–పాస్ అమ్మకాలపై సమగ్ర పరిశీలన చేస్తే అసలు దొంగలు ఇట్టే దొరికిపోతారనే విషయం సామాన్య ప్రజలకు తెలిసినట్లుగా అధికార యంత్రాంగానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కల్తీ ఎరువులపై జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి హెచ్చరించిన దానిపై వ్యవసాయాధికారులు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా సమగ్ర పరిశీలన చేస్తారా లేదా అనే విషయం వారి చర్యలపై ఆధార పడి ఉంటుందనే చెప్పుకోవాలి. -
పట్టుబడింది కల్తీ కారమే...
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కల్తీ కారం కేసు అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తాయన్న సమాచారంతో కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేసిన వేల బస్తాల కల్తీ కారాన్ని వ్యాపారులు రోడ్ల వెంబడి విసిరి వేశారు. ఆహార నియంత్రణ, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి, కోల్డ్‌స్టోరేజీలు, కారం మిల్లులలో తనిఖీ చేస్తే కళ్లు చెదిరే నిజాలు వెలుగు చూశాయి. కోల్డ్‌స్టోరేజిలో పెద్దఎత్తున కల్తీ కారం నిల్వ ఉన్నట్లు గుర్తించి, సీజ్ చేశారు. మొత్తం 97 శాంపిల్స్ సేకరించారు. అందులో 30 శాంపిల్స్ సురక్షితం కాదని, హానికరమైన పదార్థాలు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. 28 శాంపిల్స్‌లో నాణ్యత లేదని రాష్ట్ర పరిశోధన కేంద్రంలో ధ్రువీకరించారు. అయితే, దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది కారం మిల్లులు, కోల్డ్ స్టోరేజీ యజమానులు శాంపిల్స్‌ను మైసూరులోని కేంద్రీయ పరీక్ష కేంద్రానికి పంపాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొన్నారు. 18 శాంపిల్స్‌ను అక్కడకు పంపగా అందులో సైతం 14 శాంపిల్స్‌లో నాణ్యత లేదని, 4 శాంపిల్స్ సరక్షితం కాదని రావడంతో ఆహార నియంత్రణ అధికారులు ఫైనల్ చార్జీషీట్ దాఖలు చేసినట్లు సమాచారం. కేసును నాన్చడంతో పాటు, తారుమారు చేసేందుకు, ఓ అధికార పార్టీ నేత ఆ««ధ్వర్యంలో లక్షల రూపాయిలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఓ మం త్రితో పాటు, ఓ అధికార పార్టీనేత అధికారులపై ఒత్తిడి తెచ్చి నామమాత్రపు కేసులతో సరిపెట్టినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. 30 మందిపై క్రిమినల్ కేసుల నమోదు కల్తీ కారం కేసుకు సంబంధించి 30 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. 40 కేసులు జాయింట్ కలెక్టర్ కోర్టులో నడుస్తున్నాయి. ఇందులో 18 కేసుల్లో కారం మిల్లులతోపాటు, కోల్డ్‌స్టోరేజీ యజమానులను ఆయన రూ.50 లక్షల జరిమానా విధించారు. మిగిలిన కేసులు విచారణలో ఉన్నాయి. ఈ సమయంలోనే గత ఏడాది విజిలెన్స్ అధికారుల దాడుల్లో కల్తీ కారం మిల్లులో పల్టుబడింది. వీటికి ఫుడ్ సేఫ్టీ, మార్కెట్ యార్డు శాఖ ఇచ్చే లైసెన్సులు కూడా లేవని నిర్ధారించారు. కొలిక్కి వచ్చిన విచారణ కల్తీకారం కేసుకు సంబంధించి విచారణ కొలిక్కి వచ్చింది. మొత్తం 30 క్రిమినల్ కేసులు నమోదు చేశాం. జాయింట్ కలెక్టర్ కోర్టులో 40 కేసులు ఉన్నాయి. మైసూర్ ల్యాబ్‌కు పంపిన నమానాలు వచ్చాయి. దీంతో చార్జీషీట్ దాఖలు చేశాం.– షేక్ గౌస్‌మోద్దీన్, ఆహారనియంత్రణ అధికారి, గుంటూరు -
కల్తీ టీపౌడర్ తయారి ముఠా అరెస్ట్
-
పా‘పాలు’
ప్రైవేటు పాల ఉత్పత్తుల్లో రసాయనాలు ఉన్నట్టు ధ్రువీకరణ అయ్యిందని పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ స్పష్టంచేశారు. రెండు సంస్థల పాల ఉత్పత్తుల్లో గ్యాస్ట్రిక్, బ్లీచింగ్ పౌడర్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. కల్తీ వ్యవహారంపై తాను పెదవి విప్పితే చాలు విదేశాల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, పాలల్లోకల్తీ వ్యవహారంలో మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతూ, అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగై సెల్వన్విరుచుకుపడటం గమనార్హం. ♦ పాలలో రసాయనం కల్తీ ధ్రువీకరణ ♦ అన్నింటా కాదు.. కొన్ని మాత్రమేనని వివరణ ♦ పరిశోధనలో తేటతెల్లమైనట్టు మంత్రి స్పష్టం ♦ ఇంటి వద్దకే ఆవిన్ ఉత్పత్తులు ♦ బెదిరింపులు పెరిగినట్టు ఆందోళన ♦ డోర్ డెలివరీకి శ్రీకారం ♦ రెండు సంస్థల గుట్టురట్టు చేసినట్టు ధీమా ♦ మంత్రిపై విరుచుకుపడ్డ అధికార ప్రతినిధి సాక్షి, చెన్నై: ప్రయివేటు పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్టుగా మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాల నమూనాలను పరిశోధనలకు పంపించినట్టు, నివేదిక రాగానే, చర్యలు తప్పదన్న హెచ్చరికలు చేశారు. అయితే, పాలల్లో కల్తీ లేనట్టుగా ఆరోగ్య శాఖ ఓవైపు స్పందిస్తుంటే, మరోవైపు పాలల్లో రసాయనాలు ఉన్నాయంటూ మంత్రి స్పష్టంచేస్తూ రావడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. అసెంబ్లీలోనూ చర్చ సాగింది. తాను మాత్రం ఆ ప్రకటనకు కట్టుబడే ఉన్నట్టు, ప్రైవేటు పాల సంస్థలపై చర్యలు తప్పవని మంత్రి రాజేంద్ర బాలాజీ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆయన మరో ప్రకటన చేశారు. పరిశోధనల్లో రెండు సంస్థల ఉత్పత్తుల్లో రసాయనాలు ఉన్నట్టు ధ్రువీకరణ అయ్యిందని స్పష్టం చేశారు. రసాయనాల గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆవిన్ సంస్థ పాల ఉత్పత్తులను డోర్ డెలివరీ చేసే విధంగా ‘ఇంటి వద్దకే ఆవిన్’ నినాదంతో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డోర్ డెలివరీ వాహనాలను జెండా ఊపి మంత్రి రాజేంద్ర బాలాజీ సాగనంపారు. అలాగే, ఆవిన్ ఒక లీటరు పెరుగు, ఒక లీటరు రసగుల్లా బాక్స్‌లను పరిచయం చేశారు. ఈసందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ, పాల కల్తీ వ్యవహారం గుట్టురట్టు అవుతున్నట్టు వివరించారు. తమకు అందిన ఫిర్యాదులు, తాము సేకరించిన వివరాల మేరకు కొన్ని పాల సంస్థల ఉత్పత్తులపై నిఘా వేశామని, వాటి నమూనాలను పరిశోధనలకు పంపించినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం రెండు సంస్థల ఉత్పత్తుల్లో గ్యాస్ట్రిక్, బ్లీచింగ్ పౌడర్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. చెడిపోయిన పాలను రిలయన్స్, నెస్లే సంస్థలు పౌడర్లుగా మార్చి మార్కెట్లోకి పంపుతున్నట్టు ఆరోపించారు. చెడిపోయిన పాలల్లో ఆమ్లం ప్రభావం కనిపించకుండా గ్యాస్ట్రిక్, బ్లీచింగ్ పౌడర్లు కలుపుతున్నట్టు పరిశోధనలో నిర్ధారించామని తెలిపారు. చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలో తాము జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. ఈ గ్యాస్ట్రిక్, బ్లీచింగ్‌తో కూడిన పాల పౌడర్లను వాడడం వల్ల కడుపు నొప్పి, గుండె మీద ప్రభావం చూపించే సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. మరికొన్ని సంస్థల ఉత్పత్తుల మీద పరిశోధన జరుగుతోందన్నారు. అన్ని సంస్థలు కాదని, కొన్ని సంస్థల్లోనే ఈ కల్తీ సాగుతున్నట్టు స్పష్టం అవుతోందని చెప్పారు. ఆయా సంస్థల్లో కల్తీ విషయంగా తనిఖీల్లో తాము పట్టుకుంటే, రూ.1,500 జరిమానా చెల్లించి తప్పించుకుంటున్నట్టు పేర్కొన్నారు. అందుకే ఈసారి జరిమానాతో కాకుండా, కఠిన చర్యలతో ముందుకు సాగనున్నామన్నారు. పెదవి విప్పితే బెదిరింపులు పాలల్లో రసాయనల ప్రస్తావన తాను తీసుకొచ్చినప్పుడల్లా తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. విదేశాల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నట్టు, వీటికి తాను తలొగ్గే ప్రసక్తే లేదని, కల్తీకి పాల్పడుతున్న ఆయా సంస్థలపై చర్యలు తీసుకునే వరకు ఉపక్రమించబోనని స్పష్టంచేశారు. ప్రస్తుతం రెండు సంస్థల గుట్టురట్టు చేశామని, అయితే, దీనిని ఎవరూ నమ్మడం లేదని పేర్కొనడం గమనార్హం. కాగా, మంత్రి వ్యాఖ్యలను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగై సెల్వన్ తీవ్రంగా తప్పుబట్టారు. పాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించాల్సిన మంత్రి, రోజుకో సంచలన ప్రకటనతో కాలం నెట్టుకువస్తున్నారని విరుచుకుపడ్డారు. మంత్రి పనిగట్టుకుని చేస్తున్నట్టు అనుమానం కల్గుతోందని, పద్ధతి మార్చుకోని పక్షంలో కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. -
కల్తీ నూనే దందా గుట్టురట్టు
-
గుంటూరులో 70లక్షల కల్తీ కారమ్ స్వాదీనం
-
పాతబస్తీలో కల్తీ దందా గుట్టు రట్టు
-
కల్తీ మద్యానికి చెక్..!
ప్రతి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు కల్తీ పరీక్షించే కిట్లు.. –తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు మిర్యాలగూడ అర్బన్: రాష్ట్ర ఆదాయంలో సింహభాగం మద్యం అమ్మకాల వల్లే వస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయంపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా కల్తీలేని మద్యం అందించడంపై దృష్టి సారించింది. కొంత మంది మద్యం దుకాణాల నిర్వాహకులు కల్తీ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా జిల్లాలోని అన్ని ఎక్సైజ్ పోలీస్స్టేషన్లకు కల్తీని కనిపెట్టే కిట్లు సరఫరా చేసింది. దీంతో మద్యం కల్తీకి చెక్ పడే అవకాశం ఉంది. గతంలో ఎక్కడైనా మద్యంలో కల్తీ కనిపెట్టాలంటే బాటిల్ నుంచి సేకరించిన శాంపిల్‌ను హైదరాబాద్‌లోని సంబంధిత ల్యాబ్‌కు పంపి రిపోర్ట్ వచ్చిన తర్వాతే చర్యలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు అలా కాకుండా కిట్ల ద్వారా వెంటనే కల్తీని కనిపెట్టి సదరు మద్యం దుకాణాలపై చర్య తీసుకోవడానికి వీలుంటుంది. జిల్లా వ్యాప్తంగా 15 కిట్లు పంపిణీ.. కల్తీ మద్యం అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని 15ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు కల్తీ చెక్ చేసే కిట్లను పంపిణీ చేసింది. మద్యం కల్తీనే కాకుండా కల్లులో కల్తీని గుర్తించేందుకు సైతం కిట్ అదజేశారు. వీటిని ఉపయోగించేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కల్తీ జరిగినట్లు తేలితే.. టెండర్లు దక్కించుకున్న బార్లు, వైన్స్ షాప్‌ల నిర్వాహకులు పెట్టిన పెట్టుబడిని అతి తక్కువ కాలంలో రాబట్టేందుకు మద్యాన్ని కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల బ్రాండెడ్ మద్యం సీసా మూతను సైతం చాకచక్యంగా తీసి అందులో చౌక మద్యం, నీరు పోసి కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం ఎక్కువగా బార్లు, రెస్టారెంట్లలో జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. కిట్ల ద్వారా పరీక్షించినప్పుడు మద్యం కల్తీ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వస్తే షాంపిల్స్‌ను తిరిగి వరంగల్ కెమికల్ ల్యాబ్‌కు పంపిస్తారు. ఆ రిపోర్టులో కూడా కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే మెదటిసారి రూ.1.50వేల జరిమానాతో పాటు వారం రోజుల పాటు ఆ దుఖానాన్ని సీజ్ చేస్తారు. సదరు మద్యం షాప్‌లో రెండోసారి కూడా కల్తీ జరిగితే రూ.2లక్షల జరిమానా, నెలరోజుల పాటు షాప్ సీజ్ చేస్తారు. మూడో సారి నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు లైసెన్స్‌ను రద్దు చేస్తారు. వారం వారం తనిఖీలు.. గతంలో మద్యం కల్తీని పరీక్షించేందుకు పరికరాలు లేకపోవడం వల్ల నెల రోజులకు ఒకసారి వైన్స్, బార్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని ఎక్సైజ్ పోలీస్స్టేషన్లకు కల్తీ నిర్ధారణ కిట్లు అందించడంతో ప్రతి వారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం కల్తీ ఉన్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలి – బి.సుధాకర్, ఎక్సైజ్ సీఐ, మిర్యాలగూడ కల్లు, వైన్స్, బార్, రెస్టారెంట్లలో మద్యం కల్తీ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కల్తీ మద్యం సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది. ప్రభుత్వం కల్తీ లేని మద్యం అందించాలనే ఉద్దేశంతో కిట్లను అందజేసింది. ప్రతి మద్యం దుఖానంపై నిఘా ఉంచుతున్నాం. -
మద్యం మత్తు... సినీ జీవితం చిత్తు...
తాళి తెంపే తాగుడు... భార్యను అమ్మే తాగుడు.. పిల్లల గొంతు కోసే తాగుడు.. అక్రమం కోరే తాగుడు.. హింసించే తాగుడు.. నేరం పొర్లించే తాగుడు.. లవ్ ఫెయిలైతే తాగుడు... లవ్ కిక్కిస్తే తాగుడు... ఫ్యాషన్‌కి తాగుడు... నాశనానికి తాగుడు... థూ... పాడు జీవితం. ఫుల్ బాటిల్ తాగుతున్నారు.. జీవితాల్ని ఖాళీ చేస్తున్నారు. పన్నులు చిలికి తెచ్చిన అమృతం ఇది. సమాజం కక్కుకుంటున్న విషం ఇది. దేవదాసు చేసిన ద్రోహం... ప్రేమలో విఫలమైతే మద్యం సేవించాలి అని భారతీయులకు దేవదాసు నేర్పించాడు. సాహిత్యపరంగా ‘దేవదాసు’ నవల (రచన: శరత్) ఎంతో గొప్పదే అయినా రజనీకాంత్ సిగరెట్ స్మోకింగ్ యువత మీద ప్రభావం చూపించినట్టుగా అది భగ్నప్రేమికులందరి మీద ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. లవ్ అన్నాక ఫెయిల్యూర్లే ఎక్కువ ఉంటాయి. అలాంటి వారందరూ తాగి ఆ వైఫల్యానికి కారణమైన ఆడపిల్లల మీద హింసకు పాల్పడుతున్న ఉదంతాలు ఎన్నో. ప్రేమలో విఫలమైన ఆడవారు తాగనప్పుడు మగవారు మాత్రం ఎందుకు తాగాలి? దానికి బదులు మంచిగా పాలు తాగి, చక్కగా తయారయ్యి, నచ్చినవారితో తాజా ప్రేమలో పడవచ్చు కదా? మద్యం గ్లాసు కడుక్కోవడం కన్నా పాలగ్లాసును కడుక్కోవడంలోనే ఎక్కువ మర్యాద, సుఖం, మేలు ఉన్నాయి. రాత్రికి మొగుడు ఇల్లు చేరతాడన్న గ్యారంటీ లేదు. కొడుకు తూలకుండా వస్తాడన్న గ్యారంటీ లేదు. కాలేజీకెళ్లిన పిల్లవాడు తన బైక్‌ను ఏ మత్తులో ఏ డివైడర్‌ను గుద్దుతాడోనని భయం. ఉద్యోగం సరిగ్గా నడవదు. జీతం సగం కూడా ఇంటికి రాదు. అర్ధరాత్రి పళ్లేలు విసిరికొట్టిన చప్పుడు. ఇంటి ఇల్లాలిపై తల్లిపై పిడిగుద్దుల వర్షం. తాగి... మళ్లీ మళ్లీ తాగి... మరి తాగలేక కక్కుడు. ఎవరితోనో కొట్లాట... వేరెవరి మీదకో కత్తి దూయడం... అదుపు తప్పి యాక్సిడెంట్... లేదా కల్తీ మద్యానికి ప్రాణం విడవడం... ఇదీ వర్తమాన భారతదేశం. దీనిని పుణ్యభూమి అంటాము. కర్మ భూమి అంటాము. పవిత్ర మతాలు పుట్టిన భూమి అంటాము. కాని సంస్కృతిలో సురాపానం ఉంది. దానికి ముందు సోమపానం ఉంది. అయితే ఈ అలవాటును ధర్మాలన్నీ కట్టడి చేసే ప్రయత్నం చేశాయి. హిందూ ధర్మం మద్యపానాన్ని దుర్లక్షణంగా పేర్కొంది. బౌద్ధం దీనిని పూర్తిగా వ్యతిరేకించింది. ఇక్కడ ప్రవేశించిన ఇస్లాం దీనిపై నిషేధమే ప్రకటించింది. రాచరికం అంతమయ్యి బ్రిటిష్ పాలన మొదలై సాగిన దాదాపు 200 ఏళ్లు దేశంలో మద్యం విజృంభించింది. ప్రభుత్వ రాబడికి అది ముఖ్య ఇంధనంగా మారింది. తెల్లపాలన అంతమయ్యి నల్లపాలన వచ్చాక ఆ రాబడిపై దృష్టి ఇంకా పెరిగింది. ఎన్ని విధాలుగా మద్యాన్ని ప్రజలకు చేరువ చేయవచ్చో ప్రభుత్వాలు పోటీ పడి పథకాలు కనిపెట్టాయి. ఒక చేత్తో ఇచ్చి వంద చేతులతో తీసుకునే ఈ ఆటలో ప్రజలు బలి పశువులు అవుతున్నారు. కష్ట జీవి పనిలో కండను, పని అనంతరం తాగుడు వ్యసనంలో గుండెను పోగొట్టుకుంటున్నాడు. సుష్టుగా పదే పదే తింటే మన ఆరోగ్యానికి మాత్రమే ప్రమాదం. కాని మద్యం అలవాటున్న వ్యక్తి ఒక సమాజపు ఆరోగ్యానికి ప్రమాదం. మద్యం మనసుపై ప్రభావం చూపుతుంది. మెదడును అదుపులేని గుర్రంలా పరుగు పెట్టిస్తుంది. ఆ వ్యసనం ఎన్ని జీవితాలను ఎలా కుప్పకూలుస్తున్నదో కొన్ని ఉదాహరణలు... ఘటన 1 నిలువునా కాల్చేశాడు! విశాఖపట్నానికి చెందిన రాజేశ్ చాలా నెమ్మదస్తుడు. తన పనేంటో తనదే. ఎవరైనా పలకరిస్తే పలుకుతాడు. నవ్వితే నవ్వుతాడు. అంతకుమించి తన గురించి మాట్లాడుకోడానికి ఏం లేదు. కానీ కొద్ది రోజుల్లోనే అందరూ అతని గురించే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అలా అని అతనేం గొప్ప పని చేయలేదు. ఊహించని విజయం సాధించనూ లేదు. మందు కొట్టడం మొదలెట్టాడు. అవును. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం... ఎప్పుడంటే అప్పుడే. ఎక్కడంటే అక్కడే. ఎంతంటే అంతే. తాగడం, ఇంటికొచ్చి వాగడం. మత్తులో భార్యను సాధించేవాడు. అనుమానించి వేధించేవాడు. కొట్టి హింసించేవాడు. ఆమె ఆ నరకాన్ని భరించలేక పెద్దలకు చెప్పింది. వాళ్లు అతణ్ని ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు. అక్కడ చాలా మారాడు. తిరిగి సంతోషంగా ఇంటికి చేరాడు. కానీ కథ మళ్లీ వెనక్కి నడిచింది. రాజేశ్ నాలుక మందు చుక్కల కోసం పీకడం మొదలు పెట్టింది. సారాబుడ్డీ అతణ్ని సాదరంగా ఆహ్వానించింది. అతడి జీవితం మరోసారి సారా దుకాణం పాలయ్యింది. ఒక్కసారి మానేసి మళ్లీ తాగడం మొదలెడితే మనిషి దారుణంగా తయారవుతాడట. అందుకేనేమో ఒకప్పుడు భార్యను వేధింపులకు గురిచేసిన రాజేశ్, ఈసారి మత్తులో ఏకంగా ఆమెను కిరోసిన్ పోసి చంపేశాడు. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు. ఘటన 2 ఇప్పుడే వస్తానని చెప్పి... ఢిల్లీలోని ఓ రెస్టారెంట్. ఇద్దరు దంపతులు అప్పుడే భోజనం చేశారు. ఇంటికి వెళ్లడానికి బయటికొచ్చి కారు ఎక్కారు. ‘కరణ్‌కి ఫోన్ చేస్తాను, వస్తానంటే పికప్ చేసుకుని వెళ్లిపోదాం’ అందామె. సరే అన్నట్టు తలూపాడు భర్త. ఆమె ఫోన్ చేతిలోకి తీసుకుంది. పదో తరగతి పరీక్షలు రాసి, ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటోన్న కొడుక్కి ఫోన్ చేసింది. ‘నా ఫ్రెండ్ కారుందమ్మా, ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాం, నేను వచ్చేస్తాలే, మీరు వెళ్లండి’ అన్నాడు కరణ్. సరేనని వాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఎంతసేపైనా కరణ్ ఇంటికి రాలేదు. దాంతో తల్లి ఆదుర్దాగా కొడుక్కి ఫోన్ చేసింది. ఫోన్ ఓ అపరిచిత వ్యక్తి తీశాడు. అతను చెప్పిన వార్త విని ఆ తల్లి గుండె ఆగినంత పనయ్యింది. భర్తను తీసుకుని పరుగు పరుగున బయల్దేరింది. నడిరోడ్డు మీద... నుజ్జునుజ్జయిన కారుకింద... గుర్తు పట్టలేని స్థితిలో పడివుంది కరణ్ మృతదేహం. పక్కనే మరో ఇద్దరు అబ్బాయిల దేహాలు. ఇప్పుడే వస్తానని చెప్పిన కరణ్‌కి అంతలోనే ఏమైంది? ఆరా తీస్తే.. నిజం తెలిసింది. పార్టీలో బాగా తాగేసిన ఓ కుర్రాడు వాళ్ల కారు నడిపాడు. యాక్సిడెంట్ చేశాడు. అతనికేం కాలేదు. కానీ మిగతా ముగ్గురూ మరణించారు. ఆ ముగ్గురూ ఒక్క చుక్క మద్యం సేవించలేదని అటాప్సీ రిపోర్ట్ చెప్పింది. తమ స్నేహితుడి వ్యసనానికి వాళ్లు బలైపోయారన్న నిజం అందరి గుండెల్నీ మెలిపెట్టింది. ఘటన 3 మత్తు పొరలు కమ్మి... హైదరాబాద్‌లోని బొలారం ప్రాంతం. రంగుల కార్మికుడు రామకృష్ణ, భార్య బబిత కంగారుగా ఊరంతా కలియదిరుగుతున్నారు. వాళ్ల కూతురు సరిత (10) కనిపించడం లేదు. అందరినీ అడుగుతున్నారు. అందరూ తమకు తెలియదనే చెబుతున్నారు. వెతికి వెతికి చివరికి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించారు. కంప్లయింట్ ఇవ్వడంతోనే పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు. చివరికి ఓ అటవీ ప్రాంతంలో చిన్నారి సరిత విగతజీవిగా కనిపించింది. లోకం తెలియని పాపపై దారుణంగా అత్యాచారం చేసి, బండతో తలపై మోది చంపేశారు. ఆ చిట్టితల్లిని అలా చూసి అందరి మనసులూ వికలమయ్యాయి. కానీ ఆ పాప మరణానికి కారణం తెలిశాక అవే మనసులు కోపంతో రగిలిపోయాయి. పాపను తీసుకుని తల్లిదండ్రులిద్దరూ మధ్యాహ్నం కల్లు తాగడానికి వెళ్లారు. అక్కడ వాళ్లకి మరో తాగుబోతు అనిల్ పరిచయమయ్యాడు. పాపకి చాక్లెట్ కొనిస్తాను అనంటే అతనితో పాపను పంపేశారు. అతగాడు తాగిన మత్తులో ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఆ చిన్నారిని చిదిమేసిన పాపం ఎవరిది? కన్నూ మిన్నూ గానని అనిల్‌దా... మత్తులో మునిగిపోయి ముక్కూ ముఖం తెలియనివాడితో పాపను పంపిన తల్లిదండ్రులదా... బాధ్యతల్ని, మానవత్వాన్ని మర్చిపోయేలా చేసిన మద్యానిదా??? ఘటన 4 మనిషినని మర్చిపోయి... భోరున ఏడుస్తున్నాడు పాండు. అతని భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అది అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఏదైనా కష్టం ఉంటే తనతో ఒక్కమాట చెప్పవచ్చు కదా, అంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం ఎందుకు అని పదే పదే తనలో తాను తర్కించుకుంటూ కుమిలిపోతున్నాడు. అతని పరిస్థితి చూసి పోలీసులు ఏమీ ప్రశ్నించలేకపోతున్నారు. కానీ తప్పదు కదా? విచారణ చేయాలి. అందుకే మెల్లగా తమ పని మొదలు పెట్టారు. ఎంత అడిగినా తన భార్య ఆత్మహత్యకు కారణం తెలియదని, తను ఎలా చనిపోయిందో అర్థం కావట్లేదని అంటున్నాడు పాండు. కానీ ఎందుకో పోలీసులకు అతని మీదే అనుమానం కలుగుతోంది. దాంతో రకరకాల ప్రయత్నాలు చేశారు నిజం చెప్పించడానికి. చివరికి వారి ప్రయత్నాలు ఫలించాయి. పాండు నోటివెంట నిజం బైటికొచ్చింది. తాగిన మత్తులో భార్యతో గొడవపడి, ఆమెను చంపేసి ఉరితాడుకు వేళ్లాడదీశాడు పాండు. అయితే ఆ నిజాన్ని అతడు దాచిపెట్టలేదు. పెట్టాలనీ అనుకోలేదు. మర్చిపోయాడు... అంతే. అవును. నిజంగానే మర్చిపోయాడు. అతను ఎంతగా తాగాడంటే... తాగిన మత్తులో తాను చేసిన నేరం అతనికి ఏమాత్రం గుర్తు రాలేదు. చెన్నైలో జరిగిన ఈ సంఘటన... ఆల్కహాల్ మనిషిని మనిషిలో లేకుండా ఎలా చేసేస్తుందో తెలిసేలా చేసింది. పేదవాడి పొట్ట కొడుతోంది... వైన్‌షాప్‌కు పేదవాడే మహారాజ పోషకుడు. దుర్భర దారిద్య్రం, జీవితంలోని కష్టాలు... వీటిని దూరం చేయడంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాలకులు ఆ పేదలకు చీప్ లిక్కర్ని చేరువ చేస్తారు. అవి తాగి కష్టాలు మర్చిపో అంటారు. మా జోలికి రావద్దంటారు. విప్లవం లేవదీయవద్దంటారు. తన కష్టానికి కారణం కనుక్కోలేని, వ్యవస్థలో దోపిడిని అర్థం చేసుకోలేని పేదవాడు మద్యానికి బానిస అవుతాడు. జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. పేదవాడి నెత్తురే ఇవాళ పాలకుల ఖజానాకు కాసు అందిస్తోంది. తన రోజువారి సంపాదనలో అరవై శాతాన్ని పేదలు మద్యానికి పెడుతున్నారు. ఈ విషవలయం అభేద్యమైనది. మద్యనిషేదం లేదా మద్యంపై కంట్రోల్ దీనికి ఒక ప్రధానమైన విరుగుడు. అమర్యాద కాస్తా మర్యాద అయ్యింది.. ఇరవై ఏళ్ల క్రితం వరకు ఎవరైనా తాగితే తాగుబోతు అనేవారు. తాగినవారికి అపరాధభావం ఉండేది. తాగిన కుటుంబ పెద్దతో పాటు అతని కుటుంబం కూడా ఆ పెద్దకు ఆ అలవాటు ఉన్నందుకు సిగ్గుపడేది. తాగుబోతులను సంఘం దూరం పెట్టేది. నలుగురిలో మర్యాద ఇవ్వకుండా శిక్షించేది. కాని ఇవాళ మధ్యతరగతి మద్యాన్ని దాదాపుగా అంగీకరించే పరిస్థితికి చేరుకుంది. భర్త తాగి వస్తే గుండెలు బాదుకోవాల్సిన భార్యలు ఆ ఏడుపేదో ఇంట్లోనే ఏడవొచ్చు కదా అనుకునే నిస్సహాయ పరిస్థితికి నెట్టివేయబడ్డారు. భర్తలు బయట తాగి ఏ ప్రమాదంలో పడతారో అని ఆ పనిని ఇంట్లోనే అంగీకరిస్తున్నారు. గతంలో నలుగురూ కూడటానికి సాయంత్ర వేళలు అవసరమయ్యేవి. టీలు, కాఫీలు వాటిలో పానీయాలుగా ఉండేవి. కాని ఇప్పుడు నలుగురు కూడాలంటే మద్యం అవసరమవుతోంది. ‘పార్టీ’ ఉంటే తప్ప నలుగురూ ఒకరిని మరొకరు కలవడానికి రావడం లేదు. పైగా ఎవరైనా తాగము అనంటే అలాంటి వారిని స్కిప్ చేసి మిగిలినవాళ్లు పార్టీకి కూర్చుంటూ ఉండటంతో తాగనివారు కూడా తాగాల్సి వస్తోంది. ఇక కెరీర్లో క్లయింట్లతో మీటింగ్, కస్టమర్లతో మీటింగ్, పై అధికారులతో పిచ్చాపాటి... వీటన్నింటిలో మద్యం లేకపోతే మనిషి ముందుకు కదల్లేని పరిస్థితి వచ్చింది. ఇవాళ మిడిల్‌క్లాస్ ఫ్లాట్లలో ఉండే కప్బోర్డులలో మద్యం సీసాను కూడా ఉంచి పెట్టే ఆనవాయితీ వచ్చేసిందంటే తాగుడు ఎంతగా చొచ్చుకుని వస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ సంఘం క్రైమ్ చేసినవారిని దూరం పెడుతోంది. మద్యం సేవించడం కూడా సాంఘిక నేరం అని గట్టిగా భావించగలగాలి. అలాంటివారిని సంఘమే నిరోధించాలి. మద్యం క్రైమ్‌కు పరోక్ష కారణం. ఆ కారణాన్ని చిదిమేయాల్సిందే. మద్యం మత్తు... సినీ జీవితం చిత్తు... ►తెలుగు నటీమణి సావిత్రి మద్యం ప్రభావానికి లోనవడం వల్లే ఆరోగ్యం దెబ్బ తినడం, చిన్న వయసులోనే మృతి చెందడం జరిగిందనే అభిప్రాయం ఉంది. ►సినీ నటుడు హరనాథ్ మద్యానికి బానిస కావడం వల్లే హీరోగా ఎక్కువ కాలం రాణించలేకపోయారనేది వాస్తవం. ►హిందీ రంగంలో నటి మీనాకుమారి, దర్శకుడు గురుదత్, నటి రాఖీ మద్యానికి బానిసలయ్యారు. అది వారి ప్రాణాలు తీసే దాకా ఊరుకోలేదు. ►నటుడు సల్మాన్ ఖాన్ 2002 హిట్ అండ్ రన్ కేసులో మద్యం సేవించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ►నటుడు ధర్మేంద్ర మద్యానికి ఎక్కువ ఆకర్షితుడు కావడం వల్ల కెరీర్‌ను చాలా నష్టపోయినట్టుగా స్వయంగా ఒప్పుకున్నాడు. ►నటి మనీషా కోయిరాలా మద్యానికి బానిస కావడం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. కేన్సర్ చికిత్స తర్వాత ఆమె ఆ దురలవాటును మాని ఉంటుందనే అందరి ఆశ. మద్యపానం ఏ రాష్ట్రంలో ఎక్కువ? భారతదేశంలో మద్యపానం అత్యధికంగా ఉన్న రాష్ట్రమేది? కేరళ.... ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్? దీనికి ఎవరి లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. మీడియాలో అత్యధిక శాతం మాత్రం కేరళకే ఆ అపకీర్తి కిరీటం పెట్టారు.ఇలాంటి డేటాలన్నిటికీ మూలమైన భారతదేశంలోని ‘జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్’ (ఎన్.ఎస్.ఎస్.ఒ) లెక్కలు కాస్తంత వేరుగానే ఉన్నాయి. అధిక ఆదాయ వర్గానికి చెందినవారిలో మద్యపానం అలవాటు గురించి డేటా సేకరించకపోవడం లాంటి లోటుపాట్లెన్నో ఈ లెక్కల్లో ఉన్నాయి. అయితే, ఉన్నంతలో భౌగోళిక, ఆర్థిక అంశాలకు ప్రాతినిథ్యమిస్తూ రూపొందిన విస్తృత డేటా ఇదే. ఈ డేటా ప్రకారం కల్లు, దేశవాళీ మద్యం దాద్రా అండ్ నగర్ హవేలీ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ - నికోబార్ దీవుల్లో అత్యధికంగా తాగుతారు. ఇక పెద్ద రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ అన్నిటికన్నా ముందుంది. ఆ తరువాత స్థానాలు అస్సామ్, జార్ఖండ్, బీహార్లవి.బీరు, వైన్, విదేశీ మద్యం విషయంలో డామన్ అండ్ డయ్యూ, అండమాన్ - నికోబార్ దీవులు, దాద్రా - నగర్ హవేలీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, పుదుచ్చేరీ ప్రథమస్థానంలో నిలిచాయి. ఆ తరువాతి స్థానాన్ని గోవా, ఆంధ్రప్రదేశ్‌లు ఆక్రమించాయి. ఇక, మూడో స్థానంలో కేరళ, కర్ణాటక ఉన్నాయి. మద్యం... మతి పోగొడుతుంది! డాక్టర్ మాట మద్యం తాగినప్పుడు మొదటి 20 ఎం.ఎల్. పరిమాణం మెదడులో కలిగించే రసాయన మార్పులు మరింత మద్యం తీసుకునేలా ప్రేరేపిస్తాయి. ఎందుకంటే తొలి 20 ఎం.ఎల్.తో ఉద్వేగం, హుషారుగా అనిపించడం, కాస్త దుడుకుతనం కలుగుతాయి. ఆ హుషారును కొనసాగించడానికి మద్యపానాన్ని కొనసాగిస్తారు. అయితే తొలుత చురుకుదనాన్ని కలిగించినట్లు అనిపించే మద్యం కాస్తా 80 ఎం.ఎల్. మించగానే శరీరంలో కొన్ని మార్పులు కలిగిస్తుంది. తమపై తాము నియంత్రణ కోల్పోవడం, ఒళ్లు తూలడం, ఏకాగ్రత లేకపోవడం వంటి మార్పులకు కారణమవుతుంది. ఆ తర్వాత ఆ పరిమాణం 200 ఎం.ఎల్.కు చేరితే కోపం, చిరాకు, దెబ్బలాటకు దిగడం, అరవడం వంటి దుర్లక్షణాలు చోటు చేసుకుంటాయి. దెబ్బలాటలు ముదిరినప్పుడు నేరాలకూ దారితీస్తాయి. దాదాపు 90 శాతం నేరాలు, ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలకు మద్యమే కారణమవుతోంది. ఇక మద్యం ఒక వ్యసనంగా మారినప్పుడు ఒక వ్యక్తి ప్రమేయం లేకుండానే తాగడం మొదలుపెడతాడు. ఓ మోతాదు దగ్గర తనను తాను నియంత్రించుకోలేడు. అందుకే మద్యం తాగడాన్ని వ్యాధిగానే డాక్టర్లు (మానసిక నిపుణులు) పరిగణిస్తారు. మద్యం లైంగిక హింస, గృహహింస, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య అగాధాన్ని పెంచుతుంది. నేరప్రవృత్తిని అధికం చేస్తుంది. నేరమనస్తత్వం (యాంటీసోషల్ పర్సనాలిటీ) ఉన్నవారిలో ఇతరుల బాధల పట్ల స్పందించే గుణం ఉండదు. అందుకే తాగినవారు నేరాల సమయంలో అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటారు. యౌవన దశలోనే అలవాటు ఎందుకవుతుంది? వయసు పెరుగుతున్న క్రమంలో మెదడు ఎదుగుదల కింది భాగం నుంచి పైకి జరుగుతుంటుంది. మెదడు కింది భాగాల్లో పరిణతి వచ్చాక పై భాగంలో ఉన్న నిర్మాణంలో ఎదుగుదలకు కొంత సమయం పడుతుంది. అయితే కింది భాగాలను నియంత్రించే పని పై భాగాలది. ఫలితంగా యౌవనదశలో మెదడులోని కింది భాగాలపై... పైన ఉండే భాగాల నియంత్రణ అంతగా ఉండదన్నమాట. అందుకే టీనేజ్‌నుంచి యుక్తవయసులోకి మారుతున్న వారిలో దుడుకు స్వభావం, నిగ్రహం లేకపోవడం, కొత్త విషయాలపై తీవ్రమైన ఆసక్తి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మనసు నియంత్రణ లేక మద్యం, పొగాకు వంటి దురలవాట్లు తేలిగ్గా దరిచేరుతాయి. బానిసగా మారుస్తాయి. మద్యం అలవాటు... సెక్స్ ఆసక్తి... మద్యపానం వల్ల సెక్స్ కోరికలు పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ తాగినప్పుడు లైంగిక సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. అది గమనించక చాలామంది మద్యం వల్ల పెరిగే కోరికనే సామర్థ్యంగా అపోహపడి, మరింతగా బానిస అవుతుంటారు. మద్యం అలవాటు బాగా పెరిగాక మెదడులో కొన్ని రసాయనిక మార్పులు ఏర్పడతాయి. ఈ మార్పుల వల్ల కనిపించే పరిణామాలివి... హేలూసినేషన్స్: లేని ఆకారాలు కనిపించడం, లేని శబ్దాలు వినిపించడం జరుగుతుంది. అనుమానాలు: జీవిత భాగస్వామికి ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయనే నిరాధారమైన అనుమానాలు పెరుగుతుంటాయి. డెలీరియమ్: ఒక్కోసారి తీవ్రమైన అయోమయం, చిత్రమైన, భయంకరమైన అనుభవాలకు గురవుతారు. చేతులు, తలపై పురుగులు పాకుతున్నట్లనిపిస్తుంది. మద్యం అలవాటుకు చికిత్స ఇలా: మద్యం అలవాటుకు చేసే చికిత్సలో భాగంగా మొదట అది మానే సమయంలో కనిపించే లక్షణాలకు చికిత్స చేస్తారు. తర్వాత తాగుడు మాన్పించడం కోసం మందులు ఇస్తూ అదే సమయంలో సైకోథెరపీ, కౌన్సె లింగ్ చేస్తారు. సామాజిక నైపుణ్యాల శిక్షణ (సోషల్ స్కిల్స్ ట్రైనింగ్) కూడా ఇస్తారు. ఇందుకోసం మానసిక వైద్యుల పర్యవేక్షణ అవసరం. అందుకే మద్యం మానాలన్న తీవ్రమైన కాంక్షను పెంపొందించుకుని, మానసిక వైద్యులను కలుసుకోవాల్సి ఉంటుంది. - డా॥శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై., సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, ఎర్రగడ్డ, హైదరాబాద్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ప్రమాదకరంగా పెరుగుతోంది! మన దేశంలో మద్యపానం ప్రమాదకరస్థాయిలో పెరుగుతోంది. ఈ మాట సాక్షాత్తూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యు.హెచ్.ఒ) చెప్పింది. ఆల్కహాల్‌కూ, ఆరోగ్యానికీ సంబంధించి ప్రపంచవ్యాప్త స్థితిగతుల నివేదికను డబ్ల్యు.హెచ్.ఒ ఆ మధ్య విడుదల చేసింది. అప్పుడే, ఈ సంగతి బయటపడింది. పదిహేనేళ్ళు, ఆ పై వయస్సు గలవారిలో మద్యపానం అలవాటును గురించి వివరాలు సేకరిస్తే, 2008కీ, 2012కీ మధ్య కాలంలో మనదేశంలో మద్యపానం ఊహించనంతగా పెరిగిందని వెల్లడైంది.ఒక్క 2010 నాటి లెక్కలు చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఆ లెక్కల ప్రకారం మన దేశ జనాభాలో నూటికి 30 మంది మద్యపానం చేస్తున్నారు. వారిలో 4 నుంచి 13 శాతం మంది మద్యం ముట్టకుండా, రోజు గడవనివాళ్ళే!2003 - 05 మధ్య కాలంలో మన దేశం జాతీయ సగటు మద్యపానం 1.6 లీటర్లే! అయితే, 2010-12 మధ్యకల్లా అది 2.2 లీటర్లకు చేరింది. చిత్తుగా తాగేవాళ్ళ సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 16 శాతం ఉంటే, మనదేశంలో నూటికి 11 మంది అలాంటి పచ్చి, పిచ్చి తాగుబోతులే! మరణానికి దగ్గర దోవ మద్యపానం వల్ల ఆయుఃప్రమాణం తగ్గిపోతుందన్నది జగమెరిగిన సత్యం. మద్యపానానికీ, దాని వల్ల కోల్పోయిన ఆయుష్షుకూ ముడిపెడుతూ ‘కోల్పోయిన సంవత్సరాల’ స్కేల్‌ను ఒకదాన్ని రూపొందించారు. 1 నుంచి 5 వరకు అంకెలుండే ఆ స్కేలులో మన దేశం 4గా రేట్ అయింది. అంటే, మన దేశంలో మద్యపాన ప్రియులు తాగుడు, దాని పర్యవసానాల వల్ల తమ జీవితంలో గణనీయమైన ఆయుష్షునే పొగొట్టుకుంటున్నారు.ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరణాలకూ, అంగవైకల్యాలకూ దారి తీస్తున్న అగ్రశ్రేణి కారణాల్లో 3వది మద్యపానమే! {పపంచవ్యాప్తంగా ఇవాళ ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్య - అతి మద్యపానమే! ప్రపంచంలో నూటికి ఆరుగురు మద్యపానం వల్లే మరణిస్తున్నారు. అనేక రకాల క్యాన్సర్లు, క్షయ, మూర్ఛ, రక్తనాళాలు చిట్లడం వల్ల పక్షవాతం, అధిక రక్తపోటుతో హృద్రోగం, లివర్ సిరోసిస్, న్యూరో సైకియాట్రిక్ లాంటి దాదాపు 60కి పైగా ప్రధాన వ్యాధులకు కారణం - మద్యపానమే. పెరుగుదలలో మూడో ప్లేస్! ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవెలప్మెంట్’ (ఒ.ఇ.సి.డి) ఏడాది క్రితం విడుదల చేసిన నివేదిక కూడా మన దేశంలో జాతీయ సగటు మద్యపానం గత పాతికేళ్ళలో విపరీతంగా పెరిగినట్లు తేల్చింది. 1992 - 2012 మధ్యకాలంలో మన దేశంలో జాతీయ సగటు మద్యపానం 55 శాతం మేర పెరిగింది. ప్రపంచంలో ఇంత భారీగా మద్యపానం పెరిగిన దేశాల్లో ఇండియా ఏకంగా మూడోస్థానంలో నిలిచి, అపకీర్తిని మూటగట్టుకుంది. నిజానికి, ఇదే కాలవ్యవధిలో ‘ఒ.ఇ.సి.డి’లోని 34 సభ్యదేశాల్లో వార్షిక సగటు మద్యపానం 2.5 శాతం మేర తగ్గింది. ఉత్పత్తి తగ్గుతోంది! చిత్తుగా తాగడం అలవాటవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. ఉద్యోగం ఉన్నవాళ్ళు కూడా పనికి గైర్హాజరవుతున్నారు. ఫలితంగా ఉత్పాదకత తగ్గుతోంది. వెరసి, తాగుడు వల్ల ఉన్నత, మధ్యశ్రేణి ఆదాయ దేశాల్లో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) 1 శాతం మేర పడిపోతున్నట్లు లెక్క! కొత్త బానిసలు... యువకులు, స్త్రీలు! ఇవాళ అధికభాగం దేశాల్లో యువత, మహిళల్లో మద్యపానం విపరీతంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే, పిల్లలు చిన్నవయసులోనే మద్యం రుచి చూడడం ఎక్కువవుతోంది. గడచిన పదేళ్ళ కాలంలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలూ ఈ బాట పట్టారు.మనదేశంలో 1980లలో సగటున 28 ఏళ్ళ వయస్సు వస్తే కానీ, మద్యం రుచి చూసేవారు కాదు. కానీ, 2007 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నూనూగు మీసాల వయసులోనే... అంటే 17 ఏళ్ళకే పెగ్గు బిగించడం అలవాటైపోయింది. తల్లితండ్రులు, గురువులు, సమాజం కచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం ఇది. మన దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నూటికి దాదాపు 25 యాక్సిడెంట్లు మద్యం మత్తులో జరుగుతున్నవేనని సర్వేల్లో తేలింది. ఇలాంటి ప్రమాదాల్లో యువత ఎక్కువగా చనిపోతూ ఉండటం దురదృష్టకరం. అది మాత్రమే కాదు... మద్యపానం వల్ల గృహహింస కేసులు కూడా పెరిగిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. -
పా(హా)లాహలం
* పాలను విషతుల్యం చేస్తున్న అక్రమార్కులు * రసాయనాలు కలుపుతూ యథేచ్ఛగా కల్తీ * మినరల్ వాటర్.. ప్యాకెట్ల పాలు కలుపుతూ మరో రకం మోసం * సదాశివపేటకు తరలింపు * ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం సదాశివపేట: పాల సముద్రం చిలికితే హాలాహలం వచ్చిందన్నది పురాణాల్లోని మాట.. కానీ పాలనే హాలాహలంగా మారుస్తున్నారు అక్రమార్కులు. డబ్బు జబ్బు పట్టిన అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాలల్లో నీళ్లు కలపడం పాత మాట.. కానీ పాలే అసలైనవా కాదా అనేట్టుగా రసాయనాలు కలిపి పాలను తయారు చేయడం నేటి మాట. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు పొరుగున్న ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కల్తీపాలు వేకువజామునే సదాశివపేట పట్టణానికి చేరుకుంటున్నాయి. ఆయా ప్రాంత పాల ఉత్పత్తి దారులు ఇక్కడ డీలర్లను నియమించుకుని ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. డీలర్లు సేల్స్ బాయ్‌లను నియమించుకుని ఇళ్లు హోటళ్లు, మండల పరిధిలోని వివిధ పరిశ్రమల్లోని క్యాంటిన్లకు కల్తీ పాలను అమ్ముతున్నారు. కొన్ని కంపెనీలు పూర్తిగా కల్తీ పాలనే సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలోని పాల ప్యాకెట్లను పాల డబ్బాల్లో అందరూ చూస్తుండగానే కలుపుతూ గేదే పాలంటూ ఇంటింటికీ తిరిగి విక్రయిస్తున్నారు. పాల డబ్బాలో పాల కంటే ముందుగా మినరల్ వాటర్‌ను కలుపుతున్నారు. గ్రామాల నుంచి ఖాళీ డబ్బాల్లో మంచినీళ్లు పోసుకుని వేకువజామునే వ్యాపారుల వద్ద పాల ప్యాకెట్లను కొనుగొలు చేసి అందులో కలుపుకుని యాథేచ్ఛగా గేదే పాలని ప్రజలను నమ్మిస్తూ విక్రయిస్తున్నారు. సదాశివపేట పట్టణానికి గ్రామాల నుంచి వచ్చి పాల ప్యాకెట్లను హోల్‌సేల్‌గా తీసుకువెళ్లి గ్రామాల్లో కిరాణా దుకాణాల వారు చిల్లరగా విక్రయిస్తున్నారు. జనాభా ఎక్కువ.. ఉత్పత్తి తక్కువ సదాశివపేట పట్టణ జనాభా దాదాపు 60 వేలుంటుంది. దానికి అనుగుణంగా పాల ఉత్పత్తి జరగకపోవడంతో కల్తీ పాల వ్యాపారం పెరిగిందని తెలుస్తోంది. పట్టణంలో రోజు లక్ష లీటర్ల వరకు పాల అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. స్థానికంగా లభించే పాలు కృత్రిమమైనవిగా నిరూపణ అవుతోంది. గ్రామాల్లో చాలా వరకు పాల ఉత్పత్తి తగ్గిపోయింది. అలాంటప్పుడు రోజూ లక్ష లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రముఖ వ్యాపార కేంద్రమైన సదాశివపేటలో పాల అవసరాన్ని గుర్తించిన కల్తీ వ్యాపారులు ఇక్కడ పెద్ద ఎత్తున దృష్టి సారించి అమ్మకాలు జరుపుతున్నారు. హోటళ్లు, స్వీట్ హౌస్‌లలో కల్తీ పాలతో టీ, పెరుగు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రసాయనాలతో కల్తీ పాల ఉత్పత్తి తక్కువ.. అమ్మకాలు ఎక్కువ కావడంతో కొన్ని కంపెనీలు పాలను కల్తీ చేస్తున్నాయి కృత్రిమంగా తయారు చేయడం లేదా పాలలో యూరియా, డిటర్జెంట్ పౌడర్, క్లాస్టిక్ సోడా పెయింట్లు వాడుతున్నారు. డిటర్జెంట్ పౌడర్ నురుగు రావడానికి, పెయింట్లను చిక్కదానికి వాడతారు. ఈ రకంగా వ్యాపారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కల్తీపాలు తాగడం వల్ల వ్యాధులబారిన పడే ప్రమాదం ఉంది. ఇలా తెలుసుకోవాలి పాలలో కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి వినియోగదారులు ప్రయత్నించాలి. ముఖ్యంగా స్థానికంగా లభించే పాలలో కంటే పాల ప్యాకెట్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముందుగా పాల వాసన చూస్తే కల్తీవా? స్వచ్ఛమైనవా? అని తెలిసిపోతుంది. కల్తీ పాలు పూర్తి తెల్లదనంతో కనిపిస్తాయి. చిక్కగా ఉంటాయి. పాలను వేడి చేయక ముందు మాత్రమే పాల స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. వేడి చేసిన అనంతరం కల్తీ పాలను గుర్తించడం సాధ్యం కాదని హోటళ్ల వారు తెలుపుతున్నారు. -
పాల కల్తీకి ఇలా చెక్!
న్యూఢిల్లీ: పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్. భారత్‌లో 14.60 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఈ పాలల్లో 68 శాతం కల్తీవేనని సాక్షాత్తు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్ష వర్దన్ ఈ నెల 16వ తేదీన లోక్‌సభ సాక్షిగా వెల్లడించడమే విషాధకరం. ఈ పాలల్లో కల్తీదారులు యూరియా, కాస్టిక్ సోడా, డెటర్జెంట్స్, రిఫైన్డ్ ఆయిల్, తెల్లరంగు, ఇతర రసాయనాలు కలుపుతూ మన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. పాలల్లో ఏ రసాయనాలు ఎంత మోతాదులో కలిశాయో తెల్సుకోవాలంటే ఒక్కో రసాయనం పరీక్షకు ఒక్కో పరికరాన్ని ఉపయోగించాల్సి రావడం, ఆ పరికరాలన్నింటికీ దాదాపు నాలుగున్నర లక్షల రూపాయలదాకా ఖర్చవడం, నిపుణులు మాత్రమే వాటిని ఉపయోగించాల్సి ఉండడం వల్ల పాల కల్తీదారుల ఆటలు ఇంతకాలం సాగాయి. ఇకముందు ఆ అవసరం లేకుండా రాజస్థాన్, ఫిలానీలోని ‘సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రిసెర్చ్ యూనిట్’ ఓ సరికొత్త పరికరాన్ని కనుగొన్నది. దీన్ని ఉపయోగించి కేవలం 45 సెకండ్లలోనే పాలలో కలసిన అన్ని రకాల రసాయనాలను ఏకకాలంలో కనుగొనవచ్చు. ఈ పరికరం ఖరీదు 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఇది కొనాలంటే వినియోగదారుడికి భారమే అవుతుంది కనుక ఎక్కడికక్కడ ఆరోగ్య శాఖ అధికారులు వీటిని కొనుగోలు చేసి పాల కల్తీని సులభంగానే అరికట్టవచ్చు. ఈ సరికొత్త పరికరం ద్వారా ఓ శ్యాంపుల్ కల్తీని కనుగొనేందుకు కేవలం రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. -
మంచి మాంసానికి ఇంకెన్నాళ్లు?
పనులు పూర్తయినా అందుబాటులోకి రాని స్లాటర్‌హౌస్‌లు సిటీబ్యూరో: మాంసంలో కల్తీ జరుగకుండా ఉండేందుకు, గ్రేటర్ కార్పొరేషన్‌కు మాంసపు వ్యర్థాల నిర్వహణ భారం తగ్గించేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగర ప్రజల అవసరాల కోసం ఆధునిక స్లాటర్‌హౌస్‌ల ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేశారు. నాలుగు స్లాటర్ హౌస్‌లతోపాటు ఒక రెండరింగ్(మాంసపు వ్యర్థాల ప్రాసెసింగ్) ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ. 70 కోట్లు వెచ్చించారు. దేశంలోని మరే ఇతర నగరాల్లో లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాల కనుగుణంగా అత్యాధునికంగా వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. వివిధ కారణాలతో తీవ్ర జాప్యం జరిగినప్పటికీ ఎట్టకేలకు రెండేళ్లక్రితం ప్లాంట్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. అంబర్‌పేట, న్యూబోయిగూడ, గౌలిపురా, రామ్నాస్పురాలలో ఆధునిక స్లాటర్‌హౌస్‌లు, చెంగిచెర్లలో రెండరింగ్ ప్లాంటు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. రెండరింగ్ప్లాంట్ను జర్మనీకి చెందిన కంపెనీ, నాలుగు స్లాటర్‌హౌస్‌లను నెదర్లాండ్ కంపెనీలు అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశాయి. వీటి ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (ఓ అండ్ ఎం) కోసం టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టు ఏజెన్సీలను సైతం ఎంపిక చేశారు. ఇది జరిగి రెండేళ్లయినా.. ఎంపికైన కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు మాత్రం ఇంకా అప్పగించలేదు. గౌలిపురా స్లాటర్ హౌస్‌కు సంబంధించి.. ప్లాంట్ ఏర్పాటు చేసిన భూమి పరిసరాల్లోని కొన్ని భూములు కోర్టు వివాదంలో ఉండటంతో అక్కడ కాంట్రాక్టు సంస్థకు బాధ్యతలప్పగించలేదు. మిగతా ప్రాంతాల్లోని స్లాటర్‌హౌస్‌లను కాంట్రాక్టు పొందిన సంస్థలకు అప్పగించకపోవడానికి కారణం రెండరింగ్ ప్లాంట్ వినియోగంలోకి రాకపోవడం. స్లాటర్ హౌస్‌ల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, పీసీబీ నిబంధనలు తదితర అంశాల నేపథ్యంలో స్లాటర్ హౌస్‌లను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించాలంటే.. వాటినుంచి వెలువడే జంతువ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే యూనిట్ 25 కి.మీ.లలోపు దూరంలో అందుబాటులో ఉండాలని సంబంధిత నిపుణులు పేర్కొంటున్నారు. చెంగిచెర్లలోని రెండరింగ్ ప్లాంట్ పూర్తయి, దానికి సైతం ఓ అండ్ ఎంకు టెండర్లు పిలిచినప్పటికీ.. చెంగిచెర్లలోని స్లాటర్ హౌస్ నిర్వాహకులు రెండరింగ్ప్లాంట్ నిర్వహణ తమకే ఇవ్వాలంటూ కోర్టు నాశ్రయించినట్లు తెలిసింది. కోర్టు తీర్పు వెలువడేంత వరకు దాని నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకెవరికీ కాంట్రాక్టుకివ్వరాదని కోర్టు ఆదేశించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. దాంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.70 కోట్లు వెచ్చించి నెలకొల్పిన ప్లాంట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరోవైపు స్లాటర్ హౌస్‌ల నిర్వహణను మాంసం అమ్మకం వృత్తిగా కలిగిన వారికే కాంట్రాక్టు కివ్వాలనే వివాదాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చెంగిచెర్లలోని మీట్ కార్పొరేషన్‌కు చెందిన జంతువధశాల కాంట్రాక్టు పొందిన నిర్వాహకులే అటు రెండరింగ్ప్లాంట్తో పాటు ఇటు స్లాటర్‌హౌస్‌లను ఇతరులకు ఓ అండ్ ఎం బాధ్యతలు అప్పగించకుండా వివిధ ప్రయత్నాలతోపాటు రాజకీయంగానూ చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. రాజకీయ కారణాల వల్లే జీహెచ్ఎంసీ సైతం చేష్టలుడిగి చూస్తోందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం నాలుగు స్లాటర్ హౌస్‌లను వందరోజుల ప్రణాళికలో ఉన్నందున ఆలోగా అవి అందుబాటులోకి రాగలవని పలువురు విశ్వసిస్తున్నారు. ప్రమాణాలు పాటించాలి.. కేంద్ర ప్రభుత్వం, పీసీబీ తదితర నిబంధనల మేరకు స్లాటర్‌హౌస్‌లు తగిన ప్రమాణాలు పాటించాలి. అపరిశుభ్రత, దుర్గంధాలకు తావులేకుండా ఏర్పాట్లుండాలి. జంతువ్యర్థాలను సరైన పద్ధతుల్లో డిస్పోజ్ చేయాలి. అంటే.. రెండరింగ్ప్లాంట్లో ప్రాసెసింగ్ చేయాలి. పరిసరాల ప్రజలకు కాలుష్యం వెదజల్లకుండా తగిన పర్యావరణ ఏర్పాట్లు చేయాలి. మొక్కలు నాటాలి. పార్కింగ్ సదుపాయాలుండాలి. ప్రతి మూడునెలలకోమారు సంబంధిత సంస్థలు తనిఖీలు నిర్వహించాలి ప్రారంభోత్సవం జరిగినా.. రెండేళ్ల క్రితమే స్లాటర్‌హౌస్‌ల నిర్మాణాలు పూర్తికావడంతో అప్పటి మేయర్ మాజిద్ హుస్సేన్ రామ్నాస్పురాలోని స్లాటర్‌హౌస్‌కు లాంఛనంగా ప్రారంభోత్సవం కూడా చేశారు. అంతకుమించి ఓ అండ్ ఎం పనులు జరగలేదు. స్లాటర్ హౌస్‌లు వినియోగంలోకి వస్తే.. జీహెచ్ఎంసీకి ఏటా దాదాపు రూ. 30 కోట్ల ఆదాయం రానుండటమే కాక, వేల టన్నుల మాంసం విదే శాలకు ఎగుమతయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్లాటర్ హోస్లో జంతువులను ఇలా వధిస్తారు ఈ ఆధునిక వధశాలల్లో శాస్త్రీయ పద్ధతుల్లో జంతువుల్ని వధిస్తారు. వధించేందుకు ముందు ఒక యంత్రం వద్ద హలాల్ చేస్తారు. జంతువుల చర్మం, ఎముకలు, ఇతరత్రా వ్యర్థాలు వేర్వేరు మార్గాల్లోవచ్చేలా ప్లాంట్లలో ప్రత్యేక ఏర్పాట్లున్నా యి. రక్తం సైతం ఆటోమేటిక్‌గా ప్రత్యేక ట్యాంకులోకి చేరుతుంది. ఆహారంలో వినియోగించే మాంసం మాత్రమే విడిగా వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. మాంసం చెడిపోకుండా నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీ ఏర్పాట్లున్నాయి. జంతువులుఆరోగ్యంగా ఉన్నట్లు వెటర్నరీ అధికారులు పరీక్షించి నిర్ధారిస్తారు. ఇక్కడ వృథా ఆయ్యే వ్యర్థాలంటూ ఉండవు. స్లాటర్ హౌస్‌లలో నీటినిల్వ చేసేందుకు పెద్ద నీటి ట్యాంకులు, తదితర ఏర్పాట్లున్నాయి. పరిసరాల్లో దుర్గంధం వెదజల్లకుండా వాయువులు ఆకాశంలోకి పోయేలా ఎత్తై గొట్టాలు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట స్లాటర్ హౌస్ ప్లాంట్ వ్యయం : రూ. 22.16 కోట్లు కాంట్రాక్టు విలువ: రూ. 10 కోట్లు స్లాటర్‌హౌస్ సామర్ధ్యం: 2వేల గొర్రెలు/ మేకలు, 300 పశువులు న్యూబోయిగూడ.. ప్లాంట్ వ్యయం : రూ. 14.92 కోట్లు కాంట్రాక్టు విలువ: రూ. 9 కోట్లు సామర్ధ్యం: 2వేల గొర్రెలు/ మేకలు, 200 పశువులు రామ్నాస్పురా.. ప్లాంట్ వ్యయం : రూ.8.61 కోట్లు కాంట్రాక్టు విలువ: రూ. 3.5 కోట్లు స్లాటర్‌హౌస్ సామర్ధ్యం: 100 పశువులు గౌలిపురా : వ్యయం : రూ.4.38 కోట్లు, కాంట్రాక్టు విలువ: రూ. 1.5 కోట్లు , సామర్ధ్యం: , 400 మేకలు/గొర్రెలు చెంగిచెర్ల రెండరింగ్ ప్లాంట్ : వ్యయం రూ. 19.17 కోట్లు, ఓ అండ్ఎం కాంట్రాక్టు అంచనా : రూ. 6 కోట్లు ,ప్రాసెసింగ్ సామర్ధ్యం: 80 మెట్రిక్ టన్నులు -
నేనెక్కడికీ పారిపోలేదు.. కోర్టుకు హాజరవుతా
-
కల్తీ శెనగ పిండి మిల్లుపై పోలీసుల దాడి
పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధి శ్రీరామకాలనీ పారిశ్రామిక వాడలో కల్తీ శెనగ పిండి తయారు చేస్తున్న మిల్లుపై ఎస్వోటీ పోలీసులు బుధవారం ఉదయం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు రూ.6 లక్షల విలువైన 110బస్తాల రాందేవ్ బ్రాండ్ శెనగపిండి, 276 బస్తాల శెనగపప్పు, 9వేల ఖాళీ కవర్లతోపాటు మిల్లును సీజ్ చేశారు. సూరజ్మల్, దుర్గయ్య, చౌహాన్ రాహుల్ అనే వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. -
అనంతలో కల్తీమద్యం కలకలం
-
కల్తీ మద్యం కేసులో మల్లాది శ్రీనివాస్ అరెస్ట్
-
కల్తీ మద్యం కేసులో మల్లాది శ్రీనివాస్ అరెస్ట్
విజయవాడ: కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బార్ మేనేజర్ వెంకట్రావు సహకారంతో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. విజయవాడలోని స్వర్ణ బార్లో మద్యం సేవించి అయిదుగురు మృత్యు వాత పడగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు బార్లోనే కల్తీ జరిగినట్లు గుర్తించారు. -
'బార్లోనే కల్తీ జరిగింది'
-
'బార్లోనే కల్తీ జరిగింది'
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనలో విచారణ నివేదిక సిద్ధమైంది. స్వర్ణ బార్లోనే మద్యం కల్తీ జరిగినట్లు అధికారులు ఓ నిర్థారణకు వచ్చారు. ఈ ఘటనపై విచారణ నివేదికను ఎక్సైజ్ కమిషనర్ మీనా స్వయంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించనున్నారు. బార్లోనే మోతాదుకు మించి మిథైనల్ కలిపినట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పుతున్నారు. దీనిని ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇద్దరి అధికారుల సస్పెన్షన్‌తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కల్తీ మద్యం సేవించి అయిదుగురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. -
కల్తీ మద్యం ఘటనలో మరో అధికారిపై వేటు
-
కల్తీ మద్యం ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు
-
కల్తీ మద్యం కేసులో నిందితులు జాబితా వెల్లడి
-
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
-
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: చంద్రబాబు
విజయవాడ: కల్తీ మద్యం ఘటనపై సమగ్రవిచారణ చేపడతామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. కల్తీ మద్యం మృతుల కుటుంబాలకు సోమవారం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విభాగాలు సరిగా పని చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. -
వామపక్షాల ఆందోళన..అరెస్ట్
విజయవాడ: కల్తీ మద్యం బారిన పడి విజయవాడలోని నెహ్రూనగర్‌కు చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై వామపక్షాలు మండిపడ్డాయి. సీఎం చంద్రబాబునాయుడు పరామర్శిస్తున్న ఆంధ్రా ఆస్పత్రి వద్ద సోమవారం రాత్రి వామపక్షాలు ఆందోళనకు దిగియి. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వామపక్షాలు పోలీసుల అనుమతి కోరాయి. అయితే వారిని ముందుకు రాకుండా అడ్డుకొని పలువురు నేతలను అరెస్టు చేశారు. -
అక్రమాల పుట్టగా కల్తీనెయ్యి రాకెట్
-
మీర్పేట్లో కల్తీ నెయ్యి స్వాధీనం
-
కెమికల్స్ మిక్సింగ్‌తో నకిలీ నెయ్యి
-
నిన్న నెయ్యి.. నేడు సాస్!
హైదరాబాద్: తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెడ్తూ కల్తీ ఆహార పదార్థాలు తయారుచేస్తున్న ముఠాలు బరితెగిస్తున్నాయి. విజయవాడలో భారీగా కల్తీ నెయ్యి తయారుచేస్తూ శుక్రవారం ఓ ముఠా పట్టుబడగా.. శనివారం హైదరాబాద్‌లో కల్తీ సాస్ తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. వనస్థలిపురంలో రసాయన పదార్థాలతో కల్తీ సాస్ తయారుచేస్తున్న ఓ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 30 డ్రమ్‌ల సాస్, భారీగా కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
నిన్న నెయ్యి.. నేడు సాస్!
-
ఎనిమిది క్వింటాళ్ల కల్తీ స్వీట్స్ సీజ్
లక్నో: దీపావళి పండుగకు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం సాధారణం. అయితే పండుగ సందర్భంగా వ్యాపారులు కక్కుర్తికి పాల్పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో చెడిపోయిన, అపరిశుభ్రమైన మిఠాయిలను పోలీసులు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. చాత్ వాలా నగరంలో స్వీట్స్ షాపులలో అమ్మాకానికి వుంచిన దాదాపు ఎనిమిది క్వింటాళ్ల కల్తీ తెల్ల రసగుల్లా స్వీట్స్ ను పోలీసులు సీజ్ చేశారు. పండుగ రోజున ఇంత భారీ మొత్తంలో కల్తీ స్వీట్స్ మార్కెట్లో లభ్యమవడం స్థానికంగా భయాందోళనలు రేపింది. దీపావళి పర్వదినం సందర్భంగా తాము నిర్వహించిన తనిఖీల్లో రెండు దుకాణాల్లో కల్తీ తెల్ల రసగుల్లాలను గుర్తించినట్లు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి రాజేందర్ సింగ్ తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం, శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్లు చెప్పారు. అలాగే భారీ ఎత్తున్న స్వాధీనం చేసుకున్న స్వీట్స్‌ను అక్కడ నుంచి తరలించి వాటిని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. నివేదిక అనంతరం ఆయా దుకాణాల యజమానులపై చర్య తీసుకుంటామన్నారు. -
కల్తీ కల్లు తాగి ముగ్గురి పరిస్థితి విషమం
చింతపల్లి(నల్లగొండ): కల్తీ కల్లు తాగి ముగ్గురు యువకులు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమించడంతో.. మెరుగైన చికిత్స మేరకు హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కెళ్లపల్లి పంచాయతి పరిధిలోని రోటిగడ్డతాండలో ఆదివారం జరిగింది. వివరాలు.. తాండకు చెందిన రాములు(30), షావుకారి(28), హరిప్రసాద్(27)అనే ముగ్గురు స్నేహితులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమించడంతో.. 108 సాయంతో హైదరాబాద్‌కు తరలించారు. -
కల్తీ కల్లు దొరకక మహిళ ఆత్మహత్య
-
పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు
-
కల్తీ కట్టడికి అత్యాధునిక పరికరం
నూనెల్లో నాణ్యత నిర్ధారణకు చైనా నుంచి దిగుమతి హైదరాబాద్: విజయ నూనెలో కల్తీని కట్టడి చేసేందుకు అత్యాధునిక పరికరాన్ని ఆయిల్‌ఫెడ్ కొనుగోలు చేసింది. ‘గ్యాస్ లిక్విడ్ క్రొమొటోగ్రఫీ(జీఎల్సీ)’గా పిలిచే ఆ పరికరాన్ని వారం కిందే చైనా నుంచి తెప్పించుకుంది. దీన్ని సోమవారం నుంచే కల్తీ నిర్ధారణ పరీక్షలకు వాడటం మొదలుపెట్టారు. ఇటీవల విజయ నూనెలో కల్తీలు జరిగిన సంఘటనలు వెలుగు చూశాయి. దీంతో ఏకంగా నలుగురు ఉన్నతాధికారులను ఆ సంస్థ ఎండీ వీరబ్రహ్మయ్య తొలగించారు. ఈ నేపథ్యంలో విజయనూనె నాణ్యతపై మచ్చ ఏర్పడింది. దీంతో కల్తీని సరిగా అంచనా వేయడానికి వారం కిందట రూ.12 లక్షలు ఖర్చు చేసి జీఎల్‌సీని కొనుగోలు చేశారు. ఈ పరికరంతో వందల రకాల ద్రవ పదార్థాల కల్తీని గుర్తించవచ్చు. కల్తీ సమాచారాన్ని ప్రింటెడ్ రూపంలోనూ పొందొచ్చు. అయితే కొత్త పరికరం తీసుకొచ్చినా పాత పద్ధతి ప్రకారం తప్పనిసరిగా పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త పరికరంలో పరీక్షలు నిర్వహించాక అందులో అంతా సానుకూలంగా వచ్చినా పాత పద్ధతి ప్రకారం చేసే నాణ్యత పరీక్షలో కల్తీ బయటపడితే పాత దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారని అంటున్నారు. ఆయిల్‌ఫెడ్ విభజన నేపథ్యంలో విజయనూనె పేరును కూడా మార్చాలని ఆయిల్‌ఫెడ్ యోచిస్తోంది. ఏపీకి ‘విజయ’ పేరు కొనసాగుతుందని, తెలంగాణకు మాత్రం విజయ కాకతీయ, విజయ గోల్కొండ, విజయ దక్కన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. -
కేంద్రం, రాన్‌బాక్సీలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: కలుషిత ఔషధాలను సరఫరా చేస్తున్న రాన్‌బాక్సీ లాబొరేటరీస్ లెసైన్సును రద్దుచేసి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజం (పిల్) మేరకు కంపెనీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. అయితే, ఔషధాలను తయారు చేయకుండా రాన్‌బాక్సీకి తాత్కాలిక ఉత్తర్వులివ్వాలన్న విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ పి.సదాశివం సారథ్యంలోని బెంచ్ శుక్రవారం తోసిపుచ్చింది. ఎంఎల్ శర్మ అనే అడ్వొకేట్ ఈ పిల్ దాఖలు చేశారు. కలుషిత ఔషధాలు తయారుచేసి, విక్రయిస్తున్నందుకు రాన్‌బాక్సీపై 50 కోట్ల డాలర్ల జరిమానాను అమెరికా ఆహార, ఔషధ సంస్థ (యుఎస్ఎఫ్డీఏ) విధించిందని పిటిషనర్ తెలిపారు. అమెరికాలో కలుషిత ఔషధాలు సరఫరా చేశామంటూ రాన్‌బాక్సీ తప్పు ఒప్పుకున్నప్పటికీ, కంపెనీపై భారీ మొత్తంలో జరిమానా విధించినప్పటికీ భారత్‌లో ఆ కంపెనీ ఉత్పత్తుల నిషేధానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య లూ చేపట్టలేదని పేర్కొన్నారు. కాగా దేశీయ మార్కె ట్లో తాము విక్రయిస్తున్న ఔషధాలన్నీ సురక్షితమైనవి, ప్రభావవంతమైనవేనని రాన్‌బాక్సీ స్పష్టం చేసింది. -
జంకులేని బంకులు
సిటీలో పెట్రోల్ బంకుల బరితెగింపు శివారు ప్రాంతాల్లో మరీనూ... వాహనదారులను నిలువునా దోచేస్తున్న వైనం ఏటా రూ.35 కోట్లకుపైగా మోసం యథేచ్చగా కల్తీ పరిమాణంలోనూ భారీగా చేతివాటం మామూళ్ల మత్తులో తూనికలు కొలతలశాఖ హైదరాబాద్ సంఘటనలతోనైనా కళ్లుతెరవని అధికారులు కంటికి కనిపించని దొంగతనం అంటే ఏంటో తెలుసా..ఎప్పుడైనా చూసి ఉంటారా...లేదంటే సిటీలో పెట్రోల్ బంక్‌ల తీరును నిశితంగా గమనిస్తే ఇట్టే పట్టేయొచ్చు. నిజం..నగరంలో పెట్రోల్ బంకులు బరితెగించేస్తున్నాయి. నిలువు దోపిడీయే లక్ష్యంగా బంక్‌లతో పంపింగ్ చేస్తున్నాయి. నాలుగు చేతులు నిండితేచాలు వాహనదారులు ఏమైపోతే మనకెందుకు అనే ధోరణితో ఏటా కోట్లకు కోట్లు పిండేస్తున్నాయి. బంక్‌కు వచ్చిన వాహనదారులు తొందరగా పెట్రోల్ పోయించుకుపోతే చాలనే కంగారుతో పరోక్షంగా బంక్‌ల అక్రమాలకు బలైపోతున్నారు. ఒక పక్క కల్తీ, మరోపక్క పరిమాణం రూపంలో బంక్‌ల యాజమాన్యాలు భారీగా దిగమింగుతూ చెలరేగిపోతున్నాయి. అడ్డుకునేవాళ్లు లేక, బాధ్యత వహించాల్సిన తూనికలు కొలతలశాఖ బంక్‌లు పోసే మామూళ్ల మత్తులో తేలుతున్నాయి. ఏటా రూ.35 కోట్లకుపైగా జరుగుతున్న ఈ దోపిడీకి అంతంలేకుండా పోతోంది. మేమంతే...అడ్డుకునేవాళ్లేరి? అన్ని కంపెనీలవి కలిపి నగరంలో మొత్తం 72పెట్రోలు బంక్‌లున్నాయి. వీటిలో చాలా బంకులు అడ్డగోలుగా బరితెగించేస్తున్నాయి. నిబంధనలకు పెట్రోలొదిలి అందినకాడికి దోచుకుంటున్నాయి. వాస్తవా నికి వాహనదారుడెవరైనా బంక్‌కు వస్తేనిక్కచ్చి కొలతతో ఇంధనం పోయాలి. కానీ అడ్డగోలు మాయాజాలం లెక్కలతో తక్కువ పరిమాణం పెట్రోలుతో దోచేస్తున్నాయి. శివారు ప్రాంతంతోపాటు జాతీయరహదారిపైనున్న పదులసంఖ్యలోని పెట్రోల్ బంకులు యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. లీటర్ ఇంధనం కొట్టాల్సినచోట పరిమాణం తగ్గించి పంప్ చేస్తున్నాయి. ఇలా నిత్యం వందల వాహనాల్లో ఇంధనం నింపి ఏటా కోట్లలో వెనకేసుకుంటున్నాయి. కొన్ని బంక్‌లు తక్కువ పరిమాణంలో ఇంధనం నింపి ఎక్కువ కొట్టినట్టు తప్పుడు మీటర్లతో మాయచేస్తోన్న సంఘటనలు ఇటీవల రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో బయట పడ్డాయి. సరిగ్గా ఇటువంటి దోపిడీకూడా నగరంలో యథేచ్చగా జరుగుతోంది. పేరుకు మీటర్ రీడింగ్ సక్రమంగానే కనిపించినా ట్యాంకులో మాత్రం అంత ఇంధనం పడడంలేదు. విషయం తెలియక, బంక్‌ల బరితెగింపు అర్థంకాక వినియోగదారులు చేసేదిలేక మళ్లీ ఇంధనానికి అక్కడకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కేవలం కొన్ని బంక్‌లు మినహా చాలావి ఇదే దారిలో నడుస్తున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ కల్తీచేసి విక్రయిస్తూ వేలాది వాహనాల జీవిత కాలాన్ని దెబ్బతీస్తున్నాయి. ఏదైనా లారీ 100 లీటర్లు డీజిల్ కొట్టిస్తే ట్యాంకులో పడేది కేవలం 9వేల మిల్లీలీటర్ల వరకు పరిమాణం తగ్గించేస్తున్నారు. అంటే సుమారుగా 9లీటర్లకుపైగానే మోసం జరుగుతోంది. ఈ విధంగా నిత్యం నగరం, చుట్టుపక్క ప్రాంతాల్లో వేలాది లారీలు వందలాది లీటర్లు ఇంధనం కొట్టిస్తాయి. ఈ విధంగా ఏటా కోట్లలో వీటినుంచి పిండేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టించుకునే ఇంధనంలో అయిదు లీటర్లకు 100ఎంఎల్ వరకు తగ్గించేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అయితే యథేచ్చగా మీటర్ ట్యాంపరింగ్ జరుగుతోంది. అయిదు లీటర్లు పెట్రోలుకు నాలుగు లీటర్లే కొట్టినా మీటర్ రీడింగ్ మాత్రం సరిగ్గానే చూపిస్తున్నాయి. వాస్తవానికి పెట్రోల్ బంక్‌ల మాయాజాలాన్ని జిల్లా తూనికలు కొలతలశాఖ అధికారులు పట్టుకుని వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ నగరంలో మాత్రం ఆశాఖ పనిచేస్తోన్న దాఖలాలు కనిపించడంలేదు. కొన్నిసార్లు నెలనెలా, వివిధ సందర్భాల్లోనూ, నిబంధనలన్నీ సరిగ్గా అమలవుతున్నాయన్న సర్టిఫికెట్, స్టాంపింగ్ వేసే సమయాల్లో వీటినుంచి అందినకాడికి దోచేస్తున్నారు. దీంతో అధికారులు తమ జోలికి రారనే ధైర్యంతో అడ్డగోలుగా బరితెగించేస్తున్నారు. నిబంధనల ప్రకారం పెట్రోల్ బంక్‌లపై ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. కానీ ఇదెక్కడా అమలు కావడంలేదు. నగరంలో భారీగా బంక్‌లు దోచేస్తుంటే అధికారులు మాత్రం తమ తనిఖీల్లో కేవలం అయిదు లీటర్లకు 30నుంచి 40 ఎంఎల్ మాత్రమే పరిమాణం తగ్గిస్తున్నారని చెప్పడం విశేషం. మరో పక్క ప్రతి పెట్రోల్ బంక్ విక్రయించే ఇంధన శాంపిళ్లను బంక్ వద్ద ప్రదర్శించాలి. దాన్ని తరచూ అధికారులు తనిఖీలు చేస్తుండాలి. నగరంలో 90శాతం వరకు బంక్‌లు శాంపిళ్లను ప్రదర్శించడం లేదు. విడి పెట్రోల్‌ను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఇందులోను భారీగా బయటకుతరలిపోయి బాటిళ్ల రూపంలో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై తూనికలుకొలతలశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ మాధురిని వివరణ కోరగా, సిటీలో బంక్‌లు కొంతవరకు మోసంచేసున్నాయని, పదిరోజులుగా తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు.