హైదరాబాద్: తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెడ్తూ కల్తీ ఆహార పదార్థాలు తయారుచేస్తున్న ముఠాలు బరితెగిస్తున్నాయి. విజయవాడలో భారీగా కల్తీ నెయ్యి తయారుచేస్తూ శుక్రవారం ఓ ముఠా పట్టుబడగా.. శనివారం హైదరాబాద్‌లో కల్తీ సాస్ తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. వనస్థలిపురంలో రసాయన పదార్థాలతో కల్తీ సాస్ తయారుచేస్తున్న ఓ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 30 డ్రమ్‌ల సాస్, భారీగా కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిన్న నెయ్యి.. నేడు సాస్!
Published Sat, Nov 14 2015 6:34 PM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM
Advertisement
Advertisement