gang arrested
-
బ్రాండెడ్ చాక్లెట్స్కు నకిలీ సరుకు తయారు చేస్తున్న ముఠా
-
చిన్నపిల్లలు తినే చాక్లేట్లను కల్తీ చేస్తున్న ముఠా
-
రెండు తలల పాములు తీసుకొస్తే రూ.3 లక్షలు..
రామచంద్రాపురం(పటాన్చెరు): రెండు తలల పాములను విక్రయిస్తున్న ఓ ముఠాను రామచంద్రాపురం, ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు పాములు, రూ.1,90,000, రెండు కార్లు స్వాదీనం చేసుకున్నారు. శుక్రవారం మియాపూర్ ఏసీపీ నరసింహారావు, సంగారెడ్డి డీఎఫ్ఓ శ్రీధర్‌రావులు విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మాణిక్‌రెడ్డి రామచంద్రాపురంలోని జ్యోతినగర్‌లో నివాసముంటున్నాడు. మాణిక్‌రెడ్డి అద్దెకు కార్లు తిప్పుతుండగా, ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌తో స్నేహం ఏర్పడింది. మాణిక్‌రెడ్డి రెండుతలల పామును గురించి తెలుసుకొని వాటిని విక్రయిస్తే పెద్దఎత్తున డబ్బు వస్తుందని భావించాడు. ఆ క్రమంలో చంద్రశేఖర్‌తో రెండు తలల పాము గురించి మాట్లాడాడు. రెండు తలల పాములు తీసుకొస్తే డబ్బులు ఇస్తానని చెప్పి రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. చంద్రశేఖర్, నవీన్, భాస్కర్లు నల్లమల అటవీ ప్రాంతం నుంచి రెండు తలల పాములు రెండింటికి తీసుకొని మాణిక్‌రెడ్డి ఇంటికి ఈనెల 15వ తేదీన వచ్చారు. వీటిని విక్రయించేందుకు మాణిక్‌రెడ్డి కర్ణాటకకు చెందిన ఓ ముఠాతో సంప్రదింపులు చేశాడు. గురువారం చంద్రశేఖర్‌కు డబ్బు ఇస్తానని చెప్పి మాణిక్‌రెడ్డి ఇంటికి పిలిచాడు. అదే సమయంలో పాములను కొనుగోలు చేసేందుకు కర్ణాటక నుంచి పలువురు వచ్చారు. కచ్చితమైన సమాచారం రావడంతో రామచంద్రాపురం పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మాణిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. మాణిక్‌రెడ్డితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్, నవీన్, భాస్కర్, కర్ణాటకకు చెందిన ఎండీభాష, రాఘవేందర్, రమేష్, షేక్ సికిందర్, విజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. రెండుపాములను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ కేసుతో సంబంధమున్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో సీఐ సంజయ్‌కుమార్, ఎస్ఓటి సీఐ శివశంకర్, అటవీశాఖ రేంజర్ వీరేంద్రబాబు, ఎస్ఐ శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూఢనమ్మకాలతోనే పాములకు ముప్పు మూఢనమ్మకాలతో రెండు తలకాయల పాము జాతి అంతరించిపోతుందని డీఎఫ్ఓ శ్రీధర్‌రావు తెలిపారు. రెండు తలల పామును ఇంట్లో పెట్టుకుంటే తక్కువ సమయంలో ధనవంతులు అవుతారన్న మూఢనమ్మకం అనేకమందికి ఉందన్నారు. గుప్త నిధులను గుర్తించడంలో రెండు తలల పాము ఉపయోగపడుతుందన్న మూఢనమ్మకంతో వీటి క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు. ఇది సరైనది కాదని, వీటిని విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. -
హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
మదనపల్లె (అన్నమయ్య జిల్లా) : వాట్సప్‌లో అందమైన యువతుల ఫొటోలు పంపి యువకులను ఆకర్షించి ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లమధ్య రహస్యంగా నడుపుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టును మదనపల్లె టూటౌన్ పోలీసులు బయటపెట్టారు. వ్యభిచార నిర్వాహకురాలితో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేసి యువతులను కౌన్సెలింగ్‌కు పంపనన్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. పట్టణంలోని శివారుప్రాంతమైన చంద్రాకాలనీ గురుకుల పాఠశాల వెనుకవైపు అమ్మాజాన్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారగృహం నిర్వహిస్తోంది. బెంగళూరు, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి, వారి ఫొటోలను వాట్సప్ ద్వారా విటులకు చేరవేయడం, ఫోన్లో బేరసారాలు సాగించడం, లొకేషన్ షేర్ చేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా రహస్యంగా దందా నిర్వహించేంది. ఫోన్ పే ద్వారా డబ్బులు తన ఖాతాకు వేయించుకుని వచ్చిన దాంట్లో సగం తనకు, మిగిలిన సగం యువతులకు ఇచ్చేది. ఈ క్రమంలో అమ్మాజాన్ ఇంటికి కొత్త వ్యక్తులు రాకపోకలు అధికమవడం, ఇటీవల కాలనీలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాల్సిందిగా కోరడంతో స్థానికులు పోలీసులకు వ్యభిచారంపై సమాచారం అందించారు. ప్రజల నుంచి అందిన సమాచారం మేరకు పక్కా ప్లాన్ ప్రకారం అమ్మాజాన్ ఇంటిపై నిఘావేసి పకడ్బందీగా నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాజాన్, ఇద్దరు విటులైన సాదిక్(బసినికొండ), సతీష్(చింతపర్తి)లను అరెస్ట్ చూపుతూ ఇమ్మోరల్ ట్రాఫిక్(ప్రివెన్షన్) యాక్ట్, 1956 కింద కేసు నమోదుచేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. వీరి నుంచి మూడు సెల్ఫోన్లు, మూడువేల నగదు, కండోమ్ ప్యాకెట్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. యువతులకు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబసభ్యులకు లేదా కోర్టులో హాజరుపరిచి తదుపరి ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు. పట్టణంలో అపరిచితులకు, కొత్తవ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారి గురించి అన్ని వివరాలు, సరైన ఆధారాలు తీసుకుని ఇవ్వాలన్నారు. ప్రజల సహకారం లేనిదే నేరాల నియంత్రణ అసాధ్యమని, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లైతే మహిళా పోలీసులు, వలంటీర్లు, డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ చంద్రమోహన్, రామమూర్తి, రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒంటరి మహిళలే టార్గెట్.. నమ్మించి నగ్న వీడియోలు తీసి..
బనశంకరి(కర్ణాటక): ఒంటరి, వితంతు మహిళలను మాయమాటలతో నమ్మించి నగ్నచిత్రాలు తీసి డబ్బు గుంజుతున్న మహిళతో పాటు నలుగురు ఖతర్నాక్ గ్యాంగ్‌ను ఆదివారం మహాలక్ష్మీ లేఔట్ పోలీసులు అరెస్ట్‌చేశారు. మంగళ, రవి, శివకుమార్, శ్రీనివాస్ ఆ ముఠా సభ్యులు. మంగళ, రవి దంపతులు కాగా శివకుమార్, శ్రీనివాస్‌తో కలిసి ముఠాగా అయ్యారు. ఒంటరి మహిళలను గాలించి మంగళ వారిని పరిచయం చేసుకునేది. చదవండి: ఒంటరిగా బతకలేను.. అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి మహిళలను కారులో ఎక్కించుకుని నిర్జన ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించి నగ్నచిత్రాలు వీడియో తీసేవారు. ఇక అప్పటినుంచి వారిని బెదిరించి డబ్బులు రాబట్టుకునేవారు. ఈ ముఠాపై మహాలక్ష్మీ లేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఓ బాధితురాలు కేసు పెట్టింది. తనను బెదిరించి బంగారుచైన్, నగలు, రూ.84 వేల నగదు దోచుకున్నారని తెలిపింది. దీంతో ముఠాను అరెస్ట్‌చేసి వీరి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన నగలు, రూ.70 వేల నగదు, కారు, మొబైల్, కత్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. -
కేటుగాళ్లు.. నకిలీ బంగారు నాణేలతో మోసం..
-
కేటుగాళ్లు.. నకిలీ బంగారు నాణేలతో మోసం..
సాక్షి, అనంతపురం జిల్లా: తక్కువ ధరకే బంగారం ఇస్తామని తెలంగాణ వాసి నుంచి పది లక్షల రూపాయలు దోచుకెళ్లిన కర్ణాటక ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు 10 లక్షల నగదు, కిలోన్నర నకిలీ బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నల్గొండ జిల్లాకు చెందిన పరమేష్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని దుండగులు ఉడాయించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ముఠాను పట్టుకున్నారు. చదవండి: మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు -
Visakhapatnam: చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు
ఆరు బయట ఆడుకునే పిల్లలు.. ఆసుపత్రి వద్ద కని పెంచలేని తల్లులు.. నిద్రపోతున్న చిన్నారులు.. పిల్లలు లేని తల్లిదండ్రులు.. ఇది ఓ ముఠా టార్గెట్. చిన్నారులను ఎత్తుకుపోవడం మరొకరికి విక్రయించడం అదికూడా లక్షల్లో.. చాలా కాలంగా సాగుతున్న ఈ అక్రమ వ్యవహారానికి విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. అరకులో జరిగిన ఓ ఉదంతంతో ఈ మొత్తం వ్యవహారానికి బ్రేక్ పడింది. సాక్షి, విశాఖపట్నం: పెందుర్తి ప్రాంతానికి చెందిన నీలాపు రమణి విక్టోరియా ఆసుపత్రి లో సెక్యూర్టీ గార్డుగా పని చేస్తున్నారు. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన పొలమర శెట్టి రమేష్‌తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. వీరిరువురు కలిసి ఆస్పత్రి వద్ద పిల్లలు కలగని తల్లులకు పిల్లలను ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని భావించారు. ఆ క్రమంలో ఈ ఏడాది జూన్ నెలలో క్రాంతి అనే వ్యక్తికి ఓ చిన్నారిని అప్పగించారు. దీనికి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ వ్యవహారం లాభదాయకంగా మారడంతో అరకులో అమ్మ, నాన్న పక్కన అర్ధరాత్రి నిద్రపోతున్న ఓ ఆరు నెలల బాబును కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ బాబును మరొకరికి విక్రయించాలని పథకం వేశారు. కానీ నిందితులు బాబును కిడ్నాప్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఓ మొబైల్‌ని కూడా ఎత్తుకుపోయారు. చదవండి: (నాలుగేళ్ల తర్వాత గల్ఫ్ నుంచి ఇంటికి.. 24 గంటలు గడవకముందే..) తమ పక్కన నిద్రిస్తున్న బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరకు పోలీసులు విచారణలో భాగంగా మొబైల్ ఫోన్ కూడా పోయిందని గుర్తించి టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుల్లో పెందుర్తికి చెందిన నీలపు రమణి సూత్రధారిగా తేలింది. ఆమె తన సన్నిహితుడు పొలమరశేట్టు రమేష్‌తో తెలిసి ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. ఈ వ్యవహారంలో మొత్తం 12 మందికి భాగస్వామ్యం ఉన్నట్టు విశాఖ పోలీసుల గుర్తించారు. నీలపు రమణి, పొలమరశెట్టి రమేష్‌లను అరెస్ట్ చేసి.. నిందితుల నుంచి నాలుగు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇటీవల కాలంలో అరకులోని బాబుతో పాటు మరో నలుగురిని విక్రయించినట్లు తేలడంతో ఆ చిన్నారులను కూడా తల్లిదండ్రులకు అప్పగించారు. -
గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..
కర్నూలు: నకిలీ విత్తన కవర్ల తయారీదారులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారం రోజుల క్రితం ఆదోని మండలం చిన్న పెండేకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్, జయరాముడు నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తుండగా ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వెంకటేశ్, గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి నకిలీ కవర్లు అమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో వారిని అరెస్ట్ చేయగా.. హైదరాబాద్‌కు చెందిన కపీశ్వర్ రోటో ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు బయటకు వచ్చింది. ఆ కంపెనీ సీఈఓ బొగుడ సురేష్..నకిలీ కవర్లు తయారు చేస్తున్నట్లు తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రూ. 2 కోట్ల విలువ చేసే యంత్రాలు, ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తన ముఠాలపై దృష్టి.. శివారు ప్రాంతాల్లోని పాడుబడిన భవనాలు, మూతపడిన మిల్లులు, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాలుగా మార్చుకుని నకిలీ విత్తన దందా సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నకిలీ విత్తన ముఠాలపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఫక్కీరప్ప క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, పట్టణాల వారీగా ఎక్కడెక్కడ ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నారో పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నారు. స్పిన్నింగ్ మిల్లుల్లో పత్తిని తీసిన తరువాత మిగిలిన గింజలనుయాసిడ్‌తో శుద్ధి చేసి నిగనిగలాడేలా చేసి ఏదో ఒక బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి రైతులకు అంటగడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీలపై సమాచారం కోసం.. నకిలీలపై సమాచారం కోసం పోలీసు శాఖ వాట్సాప్ నంబర్‌ను కేటాయించింది. నకిలీ వ్యాపారాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి 7993822444 వాట్సాప్ నంబర్‌కు సమాచారమివ్వాలని సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి తెలిపారు. పీడీ యాక్టు నమోదుకు కసరత్తు.. ప్రభుత్వ పరంగా ఎన్ని రకాలుగా అప్రమత్తం చేసినా రైతులు నకిలీ విత్తన విక్రయదారుల బారిన పడుతున్నారు. తక్కువ ధరకు కావాలని కోరుకుంటుండటంతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. విత్తనం నాటిన కొన్నాళ్ల తరువాత ఫలితం రాకపోవడంతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది వెల్దుర్తికి చెందిన మునిగొండ రత్నాకరరావు పావని సీడ్స్ పేరుతో లైసెన్స్ లేకుండా విత్తన వ్యాపారం చేస్తుండటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ప్రివెంటివ్ డిటెక్షన్(పీడీ చట్టం) యాక్ట్ ప్రయోగించారు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన నూకల మనోహర్‌రావుపై 14 గుట్కా కేసులు నమోదు కావడంతో గత సంవత్సరం పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపారు. ఇదే తరహాలోనే హైదరాబాద్‌కు చెందిన కపీశ్వర్ రోటో ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ బొగుడ సురేష్‌పై కూడా పీడీ చట్టం ప్రయోగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇతనిపై పలు స్టేషన్లలో కేసులున్నాయి. ఈ నేపథ్యంలో నిర్బంధ చట్టం ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. చదవండి: స్మార్ట్ కిల్లర్స్.. రక్తం చుక్క బయట పడకుండా.. టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ జాబ్.. ఏమైందో తెలియదు -
నేపాలీ గ్యాంగ్ చిక్కింది..
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం ఠాణా పరిధిలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్ దోపిడీ కేసులో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న బోర్వెల్ వ్యాపారి గూడూరు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఆహారంలో మత్తు మందు కలిపి..యజమానులు స్పృహ కోల్పోయాక పనిమనుషులు దోపిడీకి పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనలో పాల్గొన్న వారంతా నేపాల్ నుంచి పనుల కోసం ఇక్కడికి వచ్చినవారుగా గుర్తించిన పోలీసులు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేశారు. పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు...వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని నేపాల్ సరిహద్దులోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీమ్‌పూర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.5.2 లక్షల నగదుతో పాటు రూ.20 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్ సోమవారం మీడియాకు తెలిపారు. సూత్రధారి నేత్రా నేపాల్‌లోని కైలాలి జిల్లా మోతీపూర్ ఠాణా పరిధిలోని లకమీచూహకు చెందిన నేత్రా బహదూర్ శశి అలియాస్ నేత్రా ఈ దోపిడీలో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఉపాధి కోసం భారత్‌కు వచ్చిన ఇతడు దేశంలోని ముఖ్యమైన నగరాల్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పనిచేశాడు. ఈ క్రమంలోనే ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో తమ్ముడు మనోజ్ బహదూర్ సాహీతో కలిసి వచ్చి ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పనికి కుదిరాడు. ఈజీమనీ కోసం అలవాటు పడిన నేత్రా...నేపాల్‌లోని తన సమీప గ్రామాల్లోని ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాల్లో పనిమనుషులుగా, వాచ్మన్లుగా ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలుసుకున్నాడు. ఆ తర్వాత వారితో పరిచయం పెంచుకొని సన్నిహితంగా ఉంటూ వారిని దొంగతనానికి ఒప్పుకునేలా మచ్చిక చేసుకున్నాడు. తాను చెప్పినట్టుగా యజమానులకు ఇచ్చే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇస్తే మత్తులోకి జారుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉండే నగదు, విలువైన వస్తువులు ఓ బ్యాగ్‌లో చుట్టేసి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తాడు. ఈ మేరకు ముంబై, ఢిల్లీ, ఉదయ్‌పూర్, సూరత్‌లలో ఉండే తన బృంద సభ్యులను హైదరాబాద్‌లో దింపాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 4న కూడా కోకాపేట గ్రామంలోని అరిస్టోస్ పోలోమిలో ఉంటున్న జి.కీర్తిరెడ్డి ఇంట్లోనూ దోపిడీకి పాల్పడ్డాడు. అలాగే ఈ నెల 5న బోర్వెల్ వ్యాపారి గుడూరు మధుసూదన్‌రెడ్డి ఇంట్లో కుటుంబసభ్యులకు అదే ఇంట్లో పనిమనిషిగా ఉన్న నేపాల్‌కు చెందిన జానకికి మార్గదర్శనం చేసి వారు తినే ఆహారం, టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి దోపిడీ చేయడంలో సఫలుడయ్యాడు. మూడు వాహనాలు మార్చి... నేపాల్‌కు పారిపోతూ .. మధుసూదన్‌రెడ్డి ఇంట్లో దోపిడీ చేసిన వెంటనే నేపాలీ వాసులు రాజేందర్, (డ్రైవర్), దేవీరామ్ దమ్లా, జానకి, వినోద్ కమల్ షాహీ, భోజల్ బీక, మనోజ్ బహదూర్ సాహీ రెండు బృందాలుగా విడిపోయి ఢిల్లీ, ముంబై వైపు చెరి కొంత సొత్తు తీసుకొని పారిపోయారు. అయితే నేత్రతో పాటు ప్రకాష్ శషి అలియాస్ ప్రతాప్, సిటలావర్‌లు మరో బృందంగా ఏర్పడి మరికొంత సొత్తు, నగదుతో అద్దె వాహనంలో బయలుదేరారు. హైదరాబాద్ నుంచి నాందేడ్, ఇండోర్, లక్నో, లఖీమ్‌పూర ప్రాంతం మీదుగా నేపాల్‌కు వెళ్లాలనుకున్నారు. గతంలోనూ వీరు ఇలానే నేపాల్‌కు వెళ్లి అక్కడ సొత్తును, డబ్బులు పంచుకొని ఎవరి ఊళ్లకు వారు వెళ్లేవారు. అయితే ఈ దోపిడీని సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పది బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ పోలీసులతో పాటు ఎస్ఎస్బీ అధికారులతో మాట్లాడారు. అప్పటికే యూపీ–నేపాల్ సరిహద్దుగా ఉన్న లఖీమ్‌పూర్‌కు నేత్రా బృందం చేరుకోగానే అక్కడే మాటువేసి ఉన్న సైబరాబాద్ పోలీసుల బృందం అక్కడి పోలీసుల సహకారంతో పట్టుకుంది. పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం కూడా ఇతర బృందాలు గాలిస్తున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన రాయదుర్గం ఇన్స్పెక్టర్ రవీందర్, మాదాపూర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధీర్, నార్సింగి డీఐ బాలరాజులను సీపీ సజ్జనార్ రివార్డులతో సన్మానించారు. ‘లేక్ గార్డెన్స్’ మోసగాళ్లు సిటీలో ‘ఫ్రెండ్షిప్ క్లబ్స్’ బాధితులు సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని లేక్ గార్డెన్స్ ప్రాంతం నకిలీ కాల్ సెంటర్లకు అడ్డాగా మారింది. ఫ్రెండ్షిప్ క్లబ్స్ పేరుతో ఇక్కడ ఏర్పాటవుతున్న కాల్ సెంటర్ల ద్వారా మోసగాళ్లు దేశ వ్యాప్తంగా అనేక మందిని టార్గెట్ చేస్తున్నారు. వీరి చేతిలో మోసపోతున్న బాధితుల్లో దక్షిణాదికి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ ప్రాంతంపై దాడి చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు సూత్రధారుల్ని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తరహాలోనే కోల్‌కతాలో ‘లేక్ గార్డెన్స్’ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ కారణంగానే అనేక మంది మోసగాళ్లు దీనిని అడ్డాగా మార్చుకుంటున్నారు. వ్యాపార కార్యాలయాల పేర్లతో ఆయా ప్రాంతాల్లోని ఇండిపెండెంట్ ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. యజమానులకు అనుమానం రాకుండా పాన్‌కార్డులు, ఆధార్లతో పాటు ట్రేడ్ లైసెన్సులు అందిస్తున్నారు. సదరు ఇళ్లల్లో నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకునేవీరు అందుకు ప్రత్యేకంగా మహిళల్ని ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారు. ఈ కాల్ సెంటర్ల నుంచే ఫ్రెండ్షిప్ క్లబ్స్ పేరుతో మోసాలకు తెరలేపుతున్నారు. వీరు టార్గెట్ చేసుకునేవారిలో దక్షిణాదికి చెందిన వారు, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ప్రాథమికంగా ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా సెక్స్ చాట్, డేటింగ్ అంటూ ఎరవేస్తున్నారు. ఆయా కాల్సెంటర్లలో పని చేసే ఉద్యోగినులకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు జీతాలు చెల్లిస్తుండటం గమనార్హం. తమ ఎరలకు ఆకర్షితులై స్పందించిన వారిని ముగ్గులోకి దింపడానికి ఈ యువతులు రంగంలోకి దిగుతారు. తొలుత బాధితుల నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో కొంత మొత్తం కట్టించుకుంటారు. ఆపై ఈ కాల్ సెంటర్లలోని ఉద్యోగినులు వారితో ‘ప్రత్యేక’ కాల్స్, చాటింగ్స్ ప్రారంభిస్తారు. పూర్తిగా తమ ట్రాప్‌లోకి వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో వీరు టార్గెట్ చేసిన వారికి వీడియో కాల్స్ కూడా చేస్తుంటారు. ఆపై డేటింగ్ చేద్దాం అంటూ వారి నుంచి అందినకాడికి దండుకుని నిండా ముంచుతున్నారు. ఓ వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేసిన తర్వాత ఇక వారికి స్పందించరు. అతడి సెల్‌ఫోన్ నంబర్‌ను బ్లాక్‌లో పెట్టడమో, తమ నంబర్‌ను మార్చేయడమో చేస్తారు. కొన్నిసార్లు బెదిరింపులకూ పాల్పడతారు. కోల్‌కతాలో వివిధ రకాలైన వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ‘అదనపు ఆదాయం’ కోసం ఈ లేక్ గార్డెన్స్ ప్రాంతంలో నకిలీ కాల్ సెంటర్ల దందా చేస్తున్నారు. ఈ కారణంగానే ఇక్కడ ఈ తరహా సెంటర్లు పెరిగిపోయాయి. ఆ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆనంద్ కర్, బుద్ధదేబ్ పాల్ సైతం ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 25 మంది యువతులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. ఈ నకిలీ కాల్ సెంటర్ వల్లో పడిన వారిలో నగరానికి చెందిన పది మంది ఉన్నారు. కొందరు బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. వీరిని పట్టుకునేందుకు కోల్‌కతా వెళ్లిన ప్రత్యేక బృందం ఆనంద్, పాల్లను అరెస్టు చేసింది. మందలించినందుకు ఘాతుకం చైతన్యపురి: పని చేయడం లేదని మందలించినందుకు ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా, చిట్యాల గ్రామానికి చెందిన ఏదూరి వెంకన్న, సుభద్ర దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చారు. వెంకన్న కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఆరేళ్లుగా వారిరువురు విడివిడిగా ఉంటున్నారు. సుభద్ర పీఅండ్‌టీ కాలనీలోని అనంతలక్ష్మి ఆపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ పిల్లలతో కలిసి ఉంటుంది. నెలరోజుల క్రితం పెద్దమనుషులు పంచాయితీ చేసి నచ్చజెప్పడంతో వెంకన్న భార్యా పిల్లల వద్దకు వచ్చాడు. వెంకన్న ఏపని చేయకుండా ఖాళీగా ఉండటంతో శనివారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. పిల్లలు బయట పడుకోగా వెంకన్న, సుభద్ర గదిలో నిద్రించారు. భార్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న వెంకన్న పార్కింగ్‌లో ఉన్న బైక్‌ల నుంచి బాటిల్లో పెట్రోల్ తీసుకువచ్చి నిద్రిస్తున్న సుభద్రపై పోసి నిప్పంటించాడు. నిద్రనుంచి మేల్కొన్న సుభద్ర మంటలతోనే భర్తను పట్టుకుంది. అతను ఆమెను తోసేసి బయట గడియ పెట్టి అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సుభద్రను స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుమారుడు మహేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితుడు వెంకన్నను సోమవారం ఉదయం ఎల్బీనగర్లో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. యువతి బలవన్మరణం ముషీరాబాద్: మూడుసార్లు చార్టెడ్ అకౌంట్ పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సామ్యానాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంనగర్ లక్ష్మమ్మ పార్కు ప్రాంతానికి చెందిన ఉత్తమ్‌చంద్ జైన్ కుమార్తె స్వప్న జైన్ (24) చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలకు సిద్ధమవుతోంది. కుటుంబ సభ్యులు మొదటి అంతస్తులో ఉంటుండగా, స్వప్న రెండో అంతస్తులోని తన గదిలో పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆదివారం మధ్యాహ్నమైనా గదిలోనుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఉత్తమ్‌చంద్ జైన్ తలుపులు బద్దలు కొట్టిచూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్వప్న జైన్ మూడుసార్లు సీఏ పరీక్షలు మూడుసార్లు రాసినా క్వాలిఫై కాకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలిలో అంతర్రాష్ట్ర బెట్టింగ్ గ్యాంగ్! అరెస్టు చేసి తీసుకువెళ్లిన రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వ్యవస్థీకృతంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) రట్టు చేసింది. ఆదివారం రాత్రి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్రలతో పాటు నగరంలో గచ్చిబౌలి ప్రాంతంలోనూ సదరు అధికారులు దాడులు నిర్వహించారు. ముంబైలో మకాం వేసిన బుకీలు పారిపోగా, మిగిలిన చోట్ల 14 మందిని అరెస్టు చేసిన ఏటీఎస్ రూ.16 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. గచ్చిబౌలిలో జరిగిన దాడిలో కన్నయ్య లాల్, చలానీ, చంపాలాల్, కిషోర్, భానులను అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ ఆన్లైన్ ద్వారానూ ఆర్థిక లావాదేవీలకు పాల్పడటంతో ఆ మొత్తం ఎంత అనేది ఆరా తీస్తున్నారు. వీరు బెట్టింగ్ నిర్వహణకు అత్యాధునిక పరిజ్ఞానం వాడుతున్నట్లు తేలింది. -
నకిలీ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు
సాక్షి, ఒంగోలు: నకిలీ సర్టిఫికెట్స్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును ప్రకాశం జిల్లా పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఇంకొల్లు, చీరాల, యర్రగొండపాలెం విశాఖపట్నంలను కేంద్రంగా చేసుకుని నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఏడుగురు నిందితులను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాలలో నకిలీ సర్టిఫికెట్ల తయారీ కేంద్రాలను గుర్తించి నిందితులు, వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, కంప్యూటర్లు నకిలీ పత్రాలు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మీడియాకు వివరించారు. జేఎన్‌టీసీ అనే స్వచ్ఛంద సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకొని పలుమోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసును చాకచాక్యంగా చేధించిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. (పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం) -
పోలీసుల అదుపులో కోల్ మాఫియా గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: బొగ్గును అక్రమ రవాణా చేస్తున్న కోల్ మాఫియా గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నల్లబొగ్గు అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది నిందితులను అదుపులోకి తీసుకున్నాం. 1,050 టన్నుల బొగ్గును సీజ్ చేశాం. నిందితల నుంచి రెండు లక్షల యాభై వేల నగదు, రెండు లారీలతో సహా దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం బొగ్గు మాఫియాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నాం. ఇబ్రహీంపట్నం రాందాస్‌పల్లిలో డంపింగ్ యార్డ్ తయారు చేసుకుని ముఠా కోల్ మాఫియా కొనసాగిస్తున్నట్లు గుర్తించాం. అక్రమంగా లారీ డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారం నడిపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన బొగ్గును ఈ డంపింగ్ యార్డ్‌కు తెసుకొచ్చి వాటిని కల్తీ చేసి వివిధ ప్రాంతాలకు పంపుతారు. కృష్ణ పట్నం, కొత్తగూడెం నుంచి బొగ్గు సరఫరా ఎక్కువగా అవుతుంది. ఇతర రాష్ట్రాల సిమెంట్, ఐరన్ ఫ్యాక్టరీలకు బొగ్గును సరఫరా చేస్తారు. క్వాలిటీ ఉన్న బొగ్గులో నాణ్యత లేని వాటిని మిక్స్‌చేసి పలు కంపెనీలకు సరఫరా చేస్తారు' అని మహేష్ భగవత్ తెలిపారు. -
గజ్వేల్‌లో స్టువర్టుపురం దొంగల ముఠా అరెస్టు
గజ్వేల్‌రూరల్: చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్టు చేసినట్లు గజ్వేల్ సీఐ ఆంజనేయులు తెలిపారు. శనివారం గజ్వేల్‌లో సీఐ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు శుక్రవారం మఫ్టిలో ఉన్న పోలీసులకు కనబడగా... వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారన్నారు. స్టూ్టవర్టుపురం దొంగలు.. వీరంతా గుంటూరు జిల్లా బాపట్ల మండలం çస్టూవర్టుపురం గ్రామానికి చెందిన మాసపాటి వెంకటేశ్వర్లు అలియాస్ పెద్దులు, గజ్జెల అంకాలు, అవుల రాజవ్వలు ఒక ముఠాగా ఏర్పడి ప్రయాణీకుల నుంచి పిక్ పాకెటింగ్‌తో పాటు బ్యాగులను చోరీ చేసేవారన్నారు. వీరు విజయవాడ, బాపట్ల, గూడురు, పిడుగురాల్ల, సూర్యారావుపేట, చీరాల, బోనకల్, కాల్వపాలెం, సత్తెనపల్లి ప్రాంతాల్లో 20వరకు చోరీలు చేసి జైలు వెళ్ళివచ్చారని తెలిపారు. నేరాల వివరాలు.. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జేబీఎస్ నుంచి సిద్దిపేటకు బస్సులో వస్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగును దొంగిలించి.. అందులో ఉన్న 5తులాల బంగారు ఆభరణం తీసుకొని బ్యాగును బస్టాండ్ ప్రాంతంలో పడేసి, నగలను తమకు తెలిసిన ఓ వ్యక్తి(కోటయ్య)వద్ద పెట్టారన్నారు. అదే విధంగా మే నెలలో స్వరూప అనే మహిళలు పిల్లతో కలిసి ప్రజాపూర్‌లో బస్సు ఎక్కేసమయంలో ఆమెకు అడ్డుగా వెళ్ళి బ్యాగులో నుంచి పర్సును దొంగిలించగా... అందులో రూ. 21వేల నగదు, నల్లపూసల దండ, రింగులు, మాటీలను, ఆగస్టు నెలలో సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి బస్సు ఎక్కేసమయంలో మహిళ బ్యాగులో నుంచి పర్సును దొంగిలించగా.. అందులో లాంగ్‌చైన్, నెక్లెస్, నల్లపూసల దండను, అక్టోబర్ నెలలో నాచారం గుడివద్ద బస చేసి మరుసటి రోజు గజ్వేల్ బస్టాండ్ వద్ద ఆటోలో ప్రయాణీస్తున్న ఓ మహిళ బ్యాగులో నుంచి చంద్రహారం, నల్లపూసల దండ, బంగారు లాకెట్, వంకు ఉంగరాలు, కమ్మలు, చిన్నపిల్లల ఉంగరాలతో ఉన్న పర్సును చోరీ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొమ్ము.. వీరి వద్దనుంచి ఐదున్నర తులాల బంగారు పెద్దగొలుసు, 4తులాల చంద్రహారం, 3తులాల నల్లపూసల దండ, రెండున్నర తులాల నల్లపూసల దండ, 1.25తులాల బంగారు లాకెట్‌ను స్వా«దీనం చేసుకున్నామన్నారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో గజ్వేల్ సీఐలు ఆంజనేయులు, మ«ధుసూదన్రెడ్డి, సిద్దిపేట 1టౌన్ సీఐ సైదులు, క్రైం పార్టీ సిబ్బంది యాదగిరి, రాంజి, సుభా‹Ùలు ప్రత్యేక టీంగా ఏర్పడి నేరస్తులను పట్టుకోవడం జరిగిందని వీరికి సిద్దిపేట సీపీ రివార్డును అందించినట్లు తెలిపారు. -
పాడేరు– కామెరూన్ వయా బెంగళూరు
సాక్షి, కడప: తీగలాగితే డొంక కదిలినట్లు చిక్కింది ఐదుగురు నేరస్తుల ముఠా. స్పందనలో వచ్చిన ఫిర్యా దును తీవ్రంగా పరిగణించి కడప పోలీసులు దర్యాప్తు చేసి దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. ముఠా వివరాలు వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ శనివారం వెల్లడించారు. పోలీసులు నిర్వహించే స్పందనకు కేరళకు చెందిన అబ్దుల్ కరీం వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేశారు. కడప భాగ్యనగర్ కాలనీకి చెందిన చింపిరి సాయికృష్ణ ఫేస్బుక్ ద్వారా పరిచయమై ఖరీదైన, నాణ్యమైన విగ్గులను విక్రయిస్తున్నట్లు చెప్పి డబ్బులను కాజేశారనేది సారాంశం. అలాగే సాయికృష్ణ మోసం చేశాడని కడపకు చెందిన జనార్దన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సీఐ అశోక్‌రెడ్డి దీనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ సైబర్ నేరాలను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తునకు కడప డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. గుట్టు రట్టు ఇలా: కడప నగరంలో ఒక ప్రయివేట్ లాడ్జీలో ఆ ముఠా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడి చేసి పట్టుకున్నారు. చింపిరి సాయికృష్ణ (కడప), పంగి దాసుబాబు (విశాఖ జిల్లా సిమిలిగూడ), కుర్రా జగన్నాథ్ (విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం పెద్దపాడు), కామెరూన్ దేశానికి చెందిన ఏంబిఐ అడోల్ప్ ఆషు, ఆకో బ్రోన్సన్ ఎనౌ పోలీసులకు చిక్కిన వారిలో ఉన్నారు. వారి నుంచి 9కిలోల గంజాయి, రూ.9,600 నగదు, రూ.7.28 లక్షల విలువైన నకిలీ రూ.2వేల నోట్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, కలర్ ప్రింటర్, ఏడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి గంజాయిని కామెరూన్ దేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు. నకిలీ రూ.2000 నోట్లను కూడా ప్రింట్ చేస్తున్నట్లు గుర్తించా రు. పాడేరులో రూ.6వేలకు గంజాయి కొనుగోలు చేసి కామెరూన్లో విక్రయిస్తే పదిరెట్లు ఆదాయం వస్తుందని నిందితులు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి పాస్‌పోర్టులను స్వా«దీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. -
నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కరెన్సీ రూ.2వేలు, రూ.100 నోట్లను చెలామణి చేస్తుండగా హెచ్‌బీ కాలనీ దరి స్టీల్ ప్లాంట్ కళావేదిక వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా మీడియాకు ఆదివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఇసుకతోట ప్రాంతానికి చెందిన కడపల నాగ వెంకట సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు శివాజీపాలెంకి చెందిన మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి బొంత పద్మారావుతో పరిచయం ఏర్పడింది. అతని మధ్యవర్తిత్వంతో చోడవరం ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సయ్యద్ రెహమాన్‌ల నుంచి 1:3 నిష్పత్తిలో నకిలీ కరెన్సీ (ప్రతి మూడు నకిలీ కరెన్సీ నోట్లుకి ఒక ఒరిజినల్ నోటు) సత్యనారాయణ తీసుకున్నాడు. ఈ నకిలీ నోట్లు మార్పిడంతా సత్యనారాయణ తన కారు డ్రైవర్ రౌతు జయరాం ద్వారా చేస్తుండేవాడు. నకిలీ నోట్లను షాపులు, పెట్రోల్ బంకుల్లో డ్రైవర్ సాయంతో మార్చేవాడు. ఎవరికీ అనుమానం రాకపోవడంతో కొద్దిరోజుల కిందట మళ్లీ చోడవరం వెళ్లి షేక్ అబ్దుల్ రెహమాన్, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సయ్యద్ రెహమాన్‌ల నుంచి రూ.2,96,100లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారని సమాచారం రావడంతో ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ సీహెచ్ షణ్ముఖరావు, ఎస్సై సూర్యనారాయణ అప్రమత్తమయ్యారు. హెచ్‌బీ కాలనీ స్టీల్ ప్లాంట్ కళావేదిక వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడ సంచరిస్తున్న ముగ్గురు నిందితులు సత్యనారాయణ, పద్మారావు, జయరాంలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7వేలు నగదు, నకిలీ కరెన్సీ రూ.2,96,100లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.వీరికి నకిలీ కరెన్సీ నోట్లు అందించిన వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీపీ మీనా తెలిపారు. సమావేశంలో డీసీపీ – 2 ఉదయ్ భాస్కర్ బిల్లా, ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ షణ్ముఖరావు, ఎస్సై సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మధ్యప్రదేశ్ ముఠా గుట్టురట్టు
సాక్షి,కర్నూలు: రన్నింగ్ వాహనాలే లక్ష్యంగా వరుస దోపిడీలకు పాల్పడి.. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘హైవే దొంగలు’ పట్టుబడ్డారు. మంగళవారం రాత్రి వెల్దుర్తి, పాణ్యం వద్ద హైవేలపై పక్కా స్కెచ్‌తో వారిని పట్టుకుని ‘శభాశ్ పోలీస్’ అనిపించారు. ముగ్గురు దొంగలతో పాటు రెండు లారీలను అదుపులోకి తీసుకున్నారు. దొంగలను రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. దొంగతనాలు చేసే తీరు, ముఠా తీరుతెన్నులు, జీవనశైలి, అక్కడి రాజకీయనేతల అండదండలు తదితర అంశాలను పరిశీలిస్తే.. వీరు అత్యంత చాకచక్యంగా, కిరాతకంగా దోపిడీలు చేసే ‘గ్యాంగ్స్టర్స్’గా పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 4న నంద్యాల– పాణ్యం మధ్యలో ‘వరల్డ్ ఫస్ట్ కొరియర్స్’, 5న డీటీడీసీ, అదే రోజు మళ్లీ ‘వరల్డ్ ఫస్ట్ కొరియర్స్’, 6న కర్నూలు– బెంగళూరు హైవేలో ‘ఎక్స్‌ప్రెస్ బీస్’ కొరియర్ వాహనాలను రన్నింగ్‌లోనే దొంగలు కొల్లగొట్టారు. ఈ ఘటనల నేపథ్యంలో ఈ నెల 10న ‘హైవే దొంగలు’ శీర్షికతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. వీరు దోపిడీలు చేసే తీరు గురించి సమగ్రంగా వివరించింది. ఈ కేసులను ఎస్పీ ఫక్కీరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువగా దోపిడీలు జరిగినట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని సెల్టవర్ల నుంచి వెళ్లిన సిగ్నల్స్ ఆధారంగా మధ్యప్రదేశ్‌కు చెందిన కొన్ని ఫోన్ నంబర్లపై నిఘా పెట్టారు. వాటికి సంబంధించిన సిగ్నల్స్ కొద్దిరోజుల తర్వాత మళ్లీ కన్పించాయి. దీంతో హైవేల్లో పోలీసులతో గస్తీ ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని పోలీసులు ప్రశి్నంచగా.. వారు మధ్యప్రదేశ్ వాసులుగా తేలింది. వారు వచ్చిన లారీల నంబర్ ప్లేట్లు మాత్రం రాజస్థాన్ రిజి్రస్టేషన్‌తో ఉన్నాయి. అనుమానంతో వారిని పట్టుకునేందుకు యతి్నంచగా.. కొందరు పారిపోయారు. ముగ్గురు దొరికారు. రెండు లారీలు పట్టుబడ్డాయి. వాటిలో ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు లభించాయి. దొంగలను కర్నూలులోని పోలీసుహెడ్‌క్వార్టర్స్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో విస్తుపోయే వాస్తవాలు హైవేలో రన్నింగ్ వాహనాలను కొల్లగొట్టడంలో వీరు ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. 20–35 ఏళ్ల వయసున్న యువకులే ముఠాలో ఉంటారు. గ్యాస్కట్టింగ్, గోడలు పగలగొట్టడం, సీసీ కెమెరాలు, ఎలక్ట్రికల్ వస్తువుల నియంత్రణ ఇలా.. ముఠాలో ఒక్కొక్కరికి ఒక్కో నైపుణ్యం ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి రాబరీ(నలుగురు, అంత కంటే తక్కువ మంది), డెకాయిట్ (ఐదుగురు, అంతకంటే ఎక్కువ..) గ్రూపుల్లో ఉంటారు. బైక్ దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, రైళ్లలో దోపిడీలు, బ్యాంకులు, ఏటీఎంలతో పాటు ధనవంతుల ఇళ్లలో చోరీలకు తెగిస్తారు. ఈ ముఠాలన్నీ ఆర్గనైజింగ్ గ్యాంగ్‌లు. వీటికి డాన్లు ఉంటారు. కేసుల్లో ఇరుక్కుంటే బయటకు తీసుకొచ్చే బాధ్యతను లాయర్లు, డాన్లు చూసుకుంటారు. ఏపీలో ఈ తరహా ఆర్గనైజింగ్ గ్యాంగ్‌లు లేవు. మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువ.. మధ్యప్రదేశ్‌లో ఆది నుంచి తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. ఒక భవంతి కూడా లేకుండా గుడిసెలు, రేకుల షెడ్లు మాత్రమే కని్పంచే గ్రామాలెన్నో! వీరికి బతికేందుకు ఉపాధి ఉండదు. జంతువులను వేటాడి.. వాటి మాంసాన్ని అమ్మి బతికేవాళ్లు ఎందరో ఉన్నారు. అలాగే కొన్ని తెగలకు చెందిన వారు దొంగతనాలకు అలవాటు పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడదామంటే వారి పరిస్థితీ అంతంత మాత్రమే. దీంతో పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో చోరీలు మొదలెట్టారు. అక్కడ చోరీలు ఎక్కువ కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దొంగలను కాల్చేసేలా ఉత్తర్వులు ఇచి్చంది. దీంతో వారి దృష్టి దక్షిణాదిపై పడింది. ఉత్తరాదితో పోలి్చతే దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం వినియోగం ఎక్కువ. ఉత్తరాది మహిళలు పండుగ, ఏదైనా ఫంక్షన్ జరిగితేనే బంగారు ఆభరణాలు వేసుకుంటారు. కానీ ఇక్కడి మహిళలు నిత్యం బంగారాన్ని వాడతారని వారి అభిప్రాయం. దీనివల్లే తమిళనాడు, కర్ణాటక, ఏపీలో దొంగతనాలకు అలవాటుపడ్డారు. హైవే దోపిడీలతో పాటు సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా రైళ్లలోకి ప్రవేశించి..ప్రయాణికుల నుంచి బంగారు, నగదు కూడా దోచేస్తారు. ఇలా వచ్చిన డబ్బుతో విచ్చలవిడిగా మద్యంతాగి, ఇష్టమైన ఆహారం తిని.. పేకాట ఆడతారు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్నది వీరి ఫిలాసఫీ. చంపేందుకూ వెనుకాడరు! ఇతర రాష్ట్రాల్లోని పోలీసులు వీరిని పట్టుకునేందుకు మధ్యప్రదేశ్‌కు వెళితే దాడులకు తెగబడతారు. దొంగల ఇళ్లలోని మహిళలు దుస్తులు చించుకుని పోలీసులపైనే అత్యాచారం కేసులు నమోదు చేయిస్తారు. అక్కడి హక్కుల సంఘాలు కూడా వీరికి అనుకూలం. మురికివాడలు, మారుమూల పల్లెల్లో నివసించే పేదలను పోలీసులు వేధిస్తున్నారంటూ వారి తరఫున ఆందోళనలు చేస్తాయి. వీరికి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఇళ్లు ఉండవు. గుడిసెలు మాత్రమే ఉంటాయి. పైగా అక్కడి పోలీసులతో మంచి సంబంధాలు కల్గివుంటారు. దీంతో మన పోలీసులకు సహకరించరు. ప్రస్తుతం జిల్లా పోలీసుల అదుపులో ముగ్గురు దొంగలు ఉండగా.. రాష్ట్రంలోకి కనీసం 50–100 మంది ముఠా సభ్యులు ప్రవేశించి ఉంటారని సమాచారం దొంగలు దొరికారు..విచారిస్తున్నాం రన్నింగ్లోని వాహనాలను కొల్లగొట్టే ముఠాను పట్టుకున్నాం. రెండు లారీలు, ముగ్గురు వ్యక్తులు అదుపులో ఉన్నారు. మా విచారణలో కొన్ని విషయాలు తెలిశాయి. పూర్తి వివరాలను విచారణ ముగిసిన తర్వాత వెల్లడిస్తాం. – ఫక్కీరప్ప, ఎస్పీ -
మందలించాడని మట్టుబెట్టించింది!
సాక్షి, మైదుకూరు : వివాహేతర సంబంధం విషయమై భర్త పలుమార్లు మందలించడంతో.. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. చివరకు ప్రియుడితో కలిసి అంతమొందించింది. ఈ కేసులో ఆమెతో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శుక్రవారం వైఎస్సార్ జిల్లా మైదుకూరు పోలీసు సబ్‌డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ విజయ్‌కుమార్ విలేకరులకు వెల్లడించారు. కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ముడావత్ తులసీనాయక్, సాలిబాయికి 17 ఏళ్ల కిందట వివాహమైంది. నాలుగేళ్ల కిందట వైఎస్సార్ జిల్లా టి.సుండుపల్లి మండలం మన్యంవారిపల్లెకు చెందిన మూడె రెడ్డినాయక్‌కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వెళ్లిన సాలిబాయి అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై ఆమెను భర్త తులసీనాయక్ పలుమార్లు మందలించాడు. అతన్ని అంతమొందిస్తే తాము సంతోషంగా ఉండవచ్చునని రెడ్డి నాయక్‌తో కలిసి సాలిబాయి కుట్ర పన్నింది. అందులో భాగంగా రెడ్డినాయక్ తన స్నేహితులైన చక్రాయపేట మండలం ఎర్రగుడి తండాకు చెందిన వినోద్‌కుమార్ నాయక్, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అయితేపల్లెకు చెందిన విజయ్‌కుమార్, విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన మునగపాటి జగన్నాథరాజుతో కలిసి.. తులసీనాయక్‌ను చంపేందుకు లక్ష రూపాయలకు సుఫారీ ఖరారు చేసుకున్నారు. రూ.30 వేలు అడ్వాన్సుగా చెల్లించారు. కాగా రెడ్డినాయక్.. సాలిబాయికి రూ.10 వేలు బాకీ ఉండటంతో ఆ సొమ్మును చెల్లిస్తానంటూ ఈ నెల 12న తులసీనాయక్‌ను వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామ సమీపానికి పిలిపించారు. అక్కడ తులసీనాయక్‌కు మద్యం తాపారు. అనంతరం మద్యం బాటిల్‌తో కొట్టారు. అతను పారిపోబోగా తమ వద్ద ఉన్న స్కార్పియో వాహనంతో తొక్కించి చంపారు. అనంతరం మృతదేహాన్ని దువ్వూరు మండలం పెద్దజొన్నవరం మిట్ట దగ్గర జాతీయ రహదారి కల్వర్టు పక్కన పడేశారు. ఈ నెల 15న మృతదేహం ఉన్న విషయం తెలియడంతో దువ్వూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తప్పుదోవ పట్టించే యత్నం పోలీసులు కనుగొన్న మృతదేహం తన భర్తదేనని, అతని మరణానికి తమ గ్రామానికి చెందిన దమన పెద్దపుల్లయ్య కారణమని సాలిబాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. సాలిబాయి సెల్‌ఫోన్‌లోని కాల్ డేటాను పరిశీలించారు. ఆమె ప్రియుడు రెడ్డినాయక్‌తో రోజూ మాట్లాడుతున్నట్టు తెలుసుకున్నారు. ప్రియుడితో కలిసి ఆమె భర్తను అంతమొందించినట్టు నిర్ధారించారు. శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు. -
టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా ఆరెస్ట్
-
టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా అరెస్ట్
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. టీటీడీలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నలుగురు సభ్యుల బృందం నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసింది. సుమారు 100 మంది నుంచి లక్ష రూపాయలు తీసుకున్న ముఠా సభ్యులు బిచాణా ఎత్తేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన తిరుపతి ఈస్ట్ పోలీసులు నిందితులను పట్టుకుని కటకటల్లోకి నెట్టారు. -
ఖమ్మంలో నకిలీ కరెన్సీ ముఠా ఆరెస్ట్
-
విజయవాడలో డ్రగ్స్ గంజాయి ముఠా గుట్టురట్టు
-
ఇళ్ల మధ్యలో గుట్టుగా..
సాక్షి, నెల్లూరు: ఇళ్ల మధ్యలో గుట్టుగా పేకాట కేంద్రం నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి తొమ్మిది మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.05 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి జూదరుల వివరాలను వెల్లడించారు. పడారుపల్లికి చెందిన కె.వసుంధర్రెడ్డి క్రాంతినగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అందులో గుట్టుచప్పుడు కాకుండా కొంతకాలంగా వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులను తీసుకువచ్చి పేకాట ఆడిస్తున్నాడు. వారి నుంచి ఆటకు రూ.5 వేలు వసూలు చేయసాగాడు. పేకాట కేంద్రంపై పోలీసు అధికారులకు సమాచారం అందింది. దర్గామిట్ట, చిన్నబజారు పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు ఎం.నాగేశ్వరమ్మ, ఐ.శ్రీనివాసన్‌లు తమ సిబ్బందితో కలిసి ఇంటిపై నిఘా ఉంచారు. నిందితుల్లో స్పెషల్ పార్టీ పోలీసులు మంగళవారం రాత్రి పోలీసులు పేకాట కేంద్రంపై దాడి చేశారు. నిర్వాహకుడు వసుంధరరెడ్డితోపాటు పేకాట ఆడుతున్న పడారుపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి, ఏసీనగర్కి చెందిన రామలింగారెడ్డి, మినీబైపాస్‌కు చెందిన రఘు, కోటమిట్టకు చెందిన అఫ్రోజ్, ఏకేనగర్కు చెందిన నాగరాజు, బుజబుజనెల్లూరుకు చెందిన చంద్రబాబు, స్పెషల్‌పార్టీ కానిస్టేబుల్స్ మహేష్, శ్రీహరిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,05,100 నగదు, మూడు మోటార్‌బైక్‌లు, 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిర్వాహకుడిపై గతంలో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉన్నట్లు తెలిపారు. జూదరులను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్లతోపాటు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ ఎస్సై షేక్ జిలానీబాషా, చిన్నబజారు ఏఎస్ఐ హరి, దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.ప్రసాద్, కానిస్టేబుల్స్ మహేంద్రనాథ్‌రెడ్డి, పురుషోత్తం తదితరులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. సమాచారం ఇవ్వండి ప్రజలు తమ ప్రాంతాల్లో ఏక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా గుర్తిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో చిన్నబజారు, దర్గామిట్ట ఇన్స్పెక్టర్లు ఐ.శ్రీనివాసన్, మిద్దె నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. అలగానిపాడు పొలాల్లో.. విడవలూరు: మండలంలోని అలగానిపాడు పొలాల్లో గుట్టుచప్పుడుగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై విడవలూరు పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగబాబు మాట్లాడుతూ అలగానిపాడు పొలాల్లో వారంరోజులుగా పేకాట జరుగుతోందని సమాచారం వచ్చిందన్నారు. దీంతో సిబ్బందితో వెళ్లి దాడులు చేసినట్టుగా తెలిపారు. పోలీసుల రాకను పసిగట్టిన జూదరులు అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. అదే ప్రాంతంలో డైమండ్ డబ్బా ఆడుతున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మండలంలో జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
జనంగాంలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
కర్ర కదలొద్దు..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు.. ఉన్న అడవిని కాపాడుకునేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. రోజురోజుకూ అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఊళ్లను వనాలు చేసేందుకు.. అడవి వదిలి జంతువులు బయటకు రాకుండా ఉండేందుకు తీరొక్క ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. అడవుల్లో మహా వృక్షాలను రక్షించేందుకు.. వాటిపై వేటు వేసే అక్రమార్కుల జాడ తెలుసుకునేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. నిఘా కెమెరాలు గతంలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కెమెరాల సంఖ్యను పెంచింది. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. తనిఖీలను ముమ్మరం చేయనున్నది. ఇటువంటి చర్యలతో అక్రమార్కుల పని పట్టేందుకు, అటవీ సంపదను, విస్తీర్ణాన్ని కాపాడుకునేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 64వేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో 20వేల హెక్టార్లు ఖమ్మం డివిజన్లో.. 44వేల హెక్టార్లు సత్తుపల్లి డివిజన్లో ఉంది. గతంలో అటవీ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టినప్పటికీ ఏదో ఒక మార్గంలో కలప తరలిపోవడంతోపాటు ఇతర అక్రమాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎక్కువగా రాత్రి వేళల్లోనే అడవుల నుంచి కలప తరలిపోతుండడంతో అధికారులు దీనికి చెక్ పెట్టడంతోపాటు అక్రమంగా పోడు కొట్టకుండా చూసేందుకు చర్యలు చేపట్టారు. ఇటువంటి పకడ్బందీ చర్యలతో జిల్లాలో అడవుల సంరక్షణకు అవకాశం ఏర్పడింది. 12 కెమెరాల ఏర్పాటు.. అటవీ ప్రాంతాల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ ఆయా ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. ఎక్కువగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానం ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టం చేసేందుకు అటవీ అధికారులు పూర్తిస్థాయి చర్యలు చేపట్టారు. ఖమ్మం డివిజన్ పరిధిలోని గుబ్బగుర్తి, భీమవరం, చీమలపాడు అటవీ ప్రాంతాల్లో.. సత్తుపల్లి డివిజన్ పరిధిలోని కనకగిరి అడవులు, లంకపల్లి అడవుల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో ఆయా ప్రాంతాల్లో 4 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో కూడా అటవీ అధికారులు ఎల్లవేళలా నిఘా ఏర్పాటు చేసి.. గస్తీ తిరగడం వంటి కార్యక్రమాలు చేపట్టేవారు. గస్తీ తిరుగుతున్న ప్రాంతంలో కాకుండా.. మరో ప్రాంతంలో అక్రమాలు చోటుచేసుకునే వీలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అటవీ శాఖ నిఘా కెమెరాల సంఖ్యను మరింత పెంచింది. మరో 8 కెమెరాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. దీంతో వీటి సంఖ్య ఇప్పుడు 12కు చేరింది. ఖమ్మం, సత్తుపల్లి డివిజన్ పరిధిలోని అటవీ విస్తీర్ణంలో నిఘా కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు అడవిలోకి ఎవరు వస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలు రికార్డు అవుతుండడంతో స్మగ్లర్లు, ఇతరులు అడవిలో అక్రమాలకు పాల్పడేందుకు సాహసించడం లేదు. ప్రతి రెండు, మూడు రోజులకోసారి నిఘా కెమెరాల్లో రికార్డు అయిన పుటేజీని అటవీ శాఖ సిబ్బంది తీసుకొచ్చి ఆయా డివిజన్ కార్యాలయాల్లో అందజేస్తారు. అక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి పుటేజీని పంపుతారు. దానిని పరిశీలించిన అధికారులు ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నట్లు రికార్డు అయితే.. వాటిపై చర్యలు తీసుకునేందుకు కిందిస్థాయి సిబ్బందిని ఆదేశిస్తారు. అలాగే పుటేజీని భద్రపరుస్తారు. పెరగనున్న చెక్‌పోస్టులు.. ఇప్పటికే అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలిపోకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. అటవీ శాఖ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి, ముత్తగూడెం, తల్లాడ, పాలేరు, ఖమ్మం ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నిరంతరం తనిఖీలు చేస్తుంటారు. వీటితోపాటు మరో రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను పెంచాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు మరో రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు గల ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆయా ప్రాంతాల్లో మరో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. అడవులను సంరక్షించేందుకు.. జిల్లాలో అడవులను రక్షించేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా నిఘా కెమెరాల సంఖ్యను పెంచాం. దీంతో కలప అక్రమ రవాణాను నివారించే అవకాశం ఉంది. అలాగే మరో రెండు చెక్‌పోస్టులను పెంచేందుకు ప్రభుత్వానికి నివేదికను పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వాటిని ఏర్పాటు చేయనున్నాం. – బి.సతీష్‌కుమార్, ఇన్చార్జి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్, ఖమ్మం -
గుంటూరు జిల్లాలో నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్
-
అద్దెకు తీసుకున్న కార్లు అమ్ముకున్న కేటుగాల్లు
-
చిన్నపిల్లల కిడ్నాపర్ల ముఠా అరెస్టు
సాక్షి, గుంటూరు : చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ఓ ముఠాను గుంటూరు రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు వివరాలు వెల్లడించారు. గత నెల 28వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు నక్క శామ్యూల్, సరస్వతి దంపతులకు చెందిన ఆరేళ్ల కుమారుడిని గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరు గ్రామం లాకుల సెంటర్లో గుర్తు తెలియని పురుషుడు, మహిళ కిడ్నాప్ చేశారు. తల్లితండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన అమృతలూరు పోలీసులు కూచిపూడి గ్రామం ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా మోటర్ సైకిల్‌పై వెళ్తున్న జంటను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా పురుషుడు బైక్‌ను వదిలి పారిపోయాడు. పట్టుబడిన మహిళ ముత్యాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తూర్పు గోదావరి జిల్లా నాగుల్లంక గ్రామానికి చెందిన లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన కొండమ్మ, తూర్పుగోదావరి జిల్లా ఆడూరు గ్రామానికి చెందిన సంత అనే ముగ్గురు మహిళలు, పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామానికి చెందిన ఏడుకొండలు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. ముఠా ప్రధాన సభ్యుడు తూర్పుగోదావరి జిల్లా ఆడూరు గ్రామానికి చెందిన దానయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుల నుంచి ఆరు సంవత్సరాల వయసు గల ముగ్గురు మగపిల్లలు, 5 సంవత్సరాల పాపను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కిడ్నాపర్ల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న చిన్న పిల్లల శరీరాలపై తీవ్రంగా కొట్టి, వాతలు పెట్టిన గాయాలున్నాయని ఎస్పీ తెలిపారు. నిందితులంతా పాత ముద్దాయిలే... కిడ్నాప్ కేసులో పట్టుబడ్డ ముఠా సభ్యులంతా గతంలో అనేక దొంగతనాలు, హత్య కేసుల్లో జైలుశిక్ష అనుభవించిన వారేనని ఎస్పీ వెల్లడించారు. వీరు అమృతలూరు, బాపట్ల, తెనాలి, చెరుకుపల్లి, వేమూరు మండల పరిధిలో ఆరు దొంగతనాలు చేశారని, దొంగతనాలకు సంబంధించి రూ.5.50 లక్షల విలువ గల 196 గ్రాముల బంగారు ఆభరణాలు, కిడ్నాప్‌కు ఉపయోగించిన ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారి చేత బలవంతంగా బిక్షాటన చేయించేవారని చెప్పారు. కిడ్నాపర్ల ముఠా సభ్యులంతా ఉభయగోదావరి జిల్లాలకు చెందిన దగ్గరి బంధువులేనని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ముగ్గురు మగపిల్లల్లో ఒకరిని శామ్యూల్, సరస్వతి దంపతుల కుమారునిగా గుర్తించామని, మిగిలిన ముగ్గురు పిల్లలను గుర్తించడంలో భాగంగా డీఎన్ఏ శాంపిల్స్ సేకరిస్తున్నామని ఎస్పీ చెప్పారు. -
వాహనాలు చోరీ చేసే ముఠా అరెస్ట్
గుంటూరు: వ్యసనాలకు బానిసలై ద్విచక్ర వాహనాలను, ఆటోలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ విజయారావు వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి బైక్‌లను, ఆటోలను చోరీ చేసి వాటిని విక్రయించిన డబ్బుతో జల్సాగా తిరగడం అలవాటు పడ్డారన్నారు. అర్బన్ సీసీఎస్, నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 14 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పోలీసుల చాకచాక్యంతో గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన షేక్ చందులాల్ అలియాస్ చందు, తాడిశెట్టి జూన్ హోసన్న అలియాస్ జానీ, గుడిమెట్ల గోపి అలియాస్ గొల్లెం, కొరిటెపాడుకు చెందిన మిర్యాల సుబ్బారావు అలియాస్ డాడీ, మరో మైనర్ బాలుడు ముఠాగా ఏర్పడ్డారని ఎస్పీ చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిలిపి ఉంచిన బైక్‌లను, ఆటోలను చోరీ చేస్తూ, వాటిని విక్రయించి జల్సా చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో వారి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అనుమానంతో వారిని అదుపులోకి విచారించగా 11 ద్విచక్ర వాహనాలను, నాలుగు ఆటోలను చోరీ చేసినట్లు అంగీకరించడంతో వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అదే విధంగా కృష్ణాజిల్లా మైలవరం గ్రామానికి చెందిన పత్తిపాటి చందు గుంటూరులోని వాసవినగర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండంతో అదుపులోకి తీసుకుని విచారించగా మూడు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించారని వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీలు బీపీ తిరుపాల్, ఎన్.వెంకటరెడ్డి, కేజీవీ సరిత, సీసీఎస్ సీఐ రత్నస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇచ్చట అన్ని డాక్యుమెంట్లు అమ్మబడును!
సాక్షి, హైదరాబాద్ : అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసా కోసం దాఖలు చేయాల్సిన పత్రాలు నకిలీవి తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సూత్రధారిగాని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఏజెంట్ల కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. భూపాలపల్లికి చెందిన డి.విష్ణువర్ధన్ బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. బీటెక్ మధ్యలోనే మానేసిన ఇతగాడు తొలినాళ్లల్లో అనేక కన్సల్టెన్సీల్లో పని చేశాడు. ఈ నేపథ్యంలోనే విష్ణుకు వీసా ప్రాసెసింగ్‌పై అవగాహన వచ్చింది. దీంతో 2013 నుంచి బంజారాహిల్స్ నెం.12లో తానే ఓ వీసా ప్రాసెసింగ్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. నగరం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రస్తుతం విదేశాల్లో 14 మందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్లాలని భావిస్తున్న వారిని ఏజెంట్లు విష్ణు వద్దకు పంపేవారు. ఆ వ్యక్తి పేరుతో యూజర్ ఐడీ క్రియేట్ చేసి వీసా ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసే విష్ణు అప్లికేషన్ సైతం డౌన్లోడ్ చేసేవాడు. వీసా ఇంటర్వ్యూ పై తర్ఫీదు ఇచ్చేవాడు. వీటితో పాటు ప్రాసెసింగ్‌కు అవసరమైన పత్రాలు నకిలీవి తయారు చేసి అందిస్తున్నాడు. ఈ పంథాలో ఇప్పటి వరకు దాదాపు 100 మందికి ప్రాసెస్ చేసి భారీగా దండుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై స మాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు దాడి చేసి విష్ణును ప ట్టుకున్నారు. అతడి నుంచి 18 బోగస్ డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్,ప్రింటర్స్ స్వాధీనం చేసుకుని కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు టోకరా
-
నకిలీ పాన్‌కార్డులు.. 2 కోట్లు టోకరా
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ పాన్‌కార్డులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి పాన్‌కార్డులు తయారు చేసి బ్యాంకులను మోసం చేస్తున్న16 మందిని అదుపులోకీ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నాలుగు గ్యాంగ్‌లుగా ఏర్పడిన నిందితులు ఇప్పటి వరకు 2 కోట్ల 39 లక్షల మేర బ్యాంకులకు టోకరా వేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ. 4 లక్షల రూపాయల నగదు , 7 ల్యాప్ టాప్‌లు, వివిధ బ్యాంకులకు చెందిన 200 క్రెడిట్ కార్డులు, 49 పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు పలువురు బ్యాంకు సిబ్బంది సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
ఇదో కొత్తరకం మోసం
కరీంనగర్ క్రైం : కొన్నేళ్లుగా నల్లని నోట్లు అంటగడుతూ.. వాటిని రంగుద్రావకంలో వేస్తే చెల్లుబాటు అవుతాయని నమ్మించి మోసం చేస్తున్న ముఠాను కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సురేష్‌నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఘని అలియాస్ షాకిర్ (47), తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన గువ్వల ప్రకాశ్ అలియాస్ నాని(37) ముఠాగా ఏర్పడ్డారు. నల్లని రంగు షీట్లను రూ. 2000, రూ.500 నోట్ల పరిమాణంలో కట్‌చేసుకుని బండిల్స్‌గా మార్చి.. వాటిలో మధ్య అక్కడక్కడా ఒరిజినల్‌నోట్‌కు అయోడిన్ ద్రావణాన్ని పూస్తున్నారు. అసలైన నోట్లకు నల్లరంగు పూసి వాటి మధ్య పెడుతున్నారు. తమ వద్ద నల్లని రంగు కాగితాలను కరెన్సీనోట్లుగా మార్చే ద్రావకం, పేపర్లు ఉన్నాయని చెప్పి.. వాటిని చూపిస్తున్నారు. నమ్మించేందుకు ముందే పెట్టుకున్న అసలైననోటు తీసి.. ఫొటోప్రేమ్‌లు కడగడానికి వినియోగించే ఐపో ద్రావకంలో కడుగుతున్నారు. ఇలా బాధితులను నమ్మించి లక్ష నిజమైన కరెన్సీ ఇస్తే.. రూ.మూడు లక్షల నల్లని కరెన్సీ, ద్రావకం ఇస్తామని మోసగిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు వందలాది మందిని మోసం చేసినట్లు సమాచారం. చిక్కింది ఇలా.. మానకొండూరుకు చెందిన అమ్మిశెట్టి రవి నుంచి రూ.75 వేలు తీసుకున్నాడు. ఇదే విషయాన్ని తన మిత్రుడు సంపత్‌కు చెప్పాడు. అతడు నిందితులకు రూ.4.65 లక్షల వరకు ఇచ్చాడు. దీంతో నిందితులు సంపత్‌ను సామర్లకోటకు పిలిపించుకుని రూ.20 లక్షలంటూ.. నల్లనినోట్లు, ద్రావకం ఇచ్చారు. తిరిగి వస్తుండగా.. ద్రావకమున్న బాటిల్ పగిలిపోయింది. విషయాన్ని నిందితులకు చెప్పడంతో వారు మరో రూ.రెండు లక్షలు డిమాండ్ చేశారు. అవి ఇచ్చి.. ద్రావకంతో ఇక్కడికొచ్చాక పరిశీలిస్తే.. నిజం నోట్లు కావని తేలింది. నిందితుల కోసం గాలించినా.. వారి ఆచూకీ లభించలేదు. దీంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీఐ శ్రీనివాసరావు, ప్రత్యేక బృందం కలసి నిందితులు షాకిర్, గువ్వల ప్రకాశ్‌ను పట్టుకున్నారు. వారిని విచారించగా ఎంతోమందిని మోసం చేశామని ఒప్పుకున్నారని సీపీ తెలిపారు. నిందితులను అరెస్టుచేసి వారి నుంచి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, మెసానికి వినియోగించే నల్లని నోట్లు, ద్రావకం, బ్యాంక్ అకౌంట్లు, 70కి పైగా ఏటీఎం కార్డులు, 15 నకిలీ బంగారు బిళ్లలు, రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు, సీఐ మాధవి, మానకొండురు సీఐ కోటేశ్వర్, సిబ్బందిని సీపీ అభినందించి నగదు రివార్డులు అందించారు. -
సెల్‌ఫోన్ దొంగల ముఠా అరెస్ట్
జడ్చర్ల : నాలుగేళ్లుగా సెల్ఫోన్లు దొంగిలిస్తూ.. ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటూ.. యథేచ్ఛగా తమ దొంగతనాలను కొనసాగిస్తున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన బేతంపల్లి ఎల్లప్ప, వడ్డె గౌరీ, బేతంపల్లి ప్రభు, వడ్డె సంధ్య, వడ్డె ప్రశాంత్‌లు భూత్పూర్ మండలం అమిస్తాపూర్, దేవరకద్రలో ఆటో డ్రైవర్లుగా చెలామని అవుతూ అద్దె ఇళ్లలో ఉంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ సెల్ఫోన్లను చోరీ చేసేవారు. ప్రధానంగా సంతలు, బస్టాండ్లు, జాతరలు తదితర జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సెల్ఫోన్లను చాకచక్యంగా అపహరించేవారు. ఇలా అపహరించిన సెల్ఫోన్లను హైదరాబాద్‌లో తక్కువ ధరలకు విక్రయించేవారు. పట్టుబడ్డారు ఇలా.. ఈ నెల 23న కృష్ణారావు అనే వ్యక్తి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తన సెల్‌ఫోన్‌ను జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో దొంగలు కొట్టేశారని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొత్త బస్టాండ్‌లో నిఘా వేయగా నిందితులు తాము దొంగిలించిన ఫోన్లను హైదరాబాద్‌లో అమ్మేందుకు వెళ్తూ తమకు చిక్కినట్లు డీఎస్పీ తెలిపారు. వీరిలో వడ్డె గౌరీ, వడ్డే ప్రశాంత్‌లు తప్పించుకుని పారిపోగా.. మిగతా నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి శ్యాంసంగ్, ఐ ఫోన్లు తదితర కంపెనీలకు చెందిన మొత్తం 72 ఫోన్లను స్వాధీనపర్చుకున్నామని, వీటి విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందన్నారు. -
ఆరా తీసి.. ఆశ చూపి
శంషాబాద్ : శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టయింది. సులభ మార్గంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా శిశువుల విక్రయాన్ని వృత్తిగా మార్చుకున్న వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 12 మంది చిన్నారులను విక్రయించినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బుధవారం శంషాబాద్ డీసీపీ పి.వి. పద్మజ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి (32) మొదటి భార్యకు విడాకులిచ్చి 2013 నుంచి నగరంలోని గాజులరామారంలో నివాసముంటున్నాడు. సంతాన సాఫల్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఇతడు అక్కడికి వచ్చిపోయే వారిలో అధిక సంతానం ఉన్న వారి వివరాలు సేకరించేవాడు. వారి అవసరాలను గుర్తించి వారి పసికందులను తీసుకొచ్చి విక్రయించే దందాను గత మూడేళ్లుగా కొనసాగిస్తున్నాడు. తాజాగా మాచర్ల శివపురం తండాలోని లక్ష్మీ అనే మహిళకు మూడో సంతానంగా పుట్టిన పదిహేను రోజుల ఆడ శిశువును తీసుకుని ఆమెకు రూ.83 వేలు ఇచ్చాడు. ఆ పాపను తీసుకుని గతంలో ఇలాంటి వ్యవహారంలో తనకు సహకరించిన శంషాబాద్ పట్టణంలో రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసముంటున్న సురేష్, మంగ దంపతులకు అప్పగించాడు. శిశువుకు అధిక ధర వచ్చే వరకు ఆలనాపాలనా చూసుకోవాలని అప్పజెప్పాడు. అయితే అకస్మాత్తుగా ఆ దంపతుల వద్ద చిన్నారి కనిపించడంతో.. అనుమానం వచ్చిన ఎయిర్‌పోర్టులో పనిచేసే ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ నెల 23న రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా మంగను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం పన్నెండు మంది చిన్నారులు మంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా శిశువుల విక్రయ దందా వెలుగుచూసింది. గంగాధర్‌రెడ్డి గతంలో కూడా ఓ పసికందును తన వద్ద కొన్ని రోజులు ఉంచి ఆలనాపాలనా చూసినందుకు రూ. 10 వేలు ఇచ్చాడని వెల్లడించింది. ఆ పాపను స్థానికంగా తహసీన్ పాషా అనే వ్యక్తికి రూ. 1.60 వేలకు విక్రయించినట్లు తెలిపింది. మంగ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంగాధర్‌రెడ్డిని రెండురోజుల కిందట అతడి స్వగృహంలో అరెస్ట్ చేశారు. గతంలో విక్రయించిన చిన్నారితో పాటు మంగ వద్ద ఉన్న చిన్నారిని సైతం బండ్లగూడలోని శిశువిహార్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో మొత్తం 12 మంది పసికందులను తాను విక్రయించినట్లు గంగాధర్‌రెడ్డి వెల్లడించాడు. గతంలో అతడిపై గాంధీనగర్, మాదన్నపేట, ఛత్రినాకా పోలీస్స్టేషన్ల పరిధిలో ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై వచ్చిన అతడు తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నాడు. ఈ కేసులో మంగను రెండురోజుల కిందటే పోలీసులు రిమాండ్‌కు తరలించగా గంగాధర్‌కు విక్రయాలకు సహకరించిన శ్రీను, శిరీష, శారద, అరుణ లక్ష్మీలను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్, సీఐ మహేష్‌లు పాల్గొన్నారు. -
నకిలీ బంగారం ముఠా అరెస్ట్
కరీంనగర్‌క్రైం: ప్రజలకు నకిలీ బంగారాన్ని అంటగడుతున్న రాజస్థాన్‌కు చెం దిన ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వివరాలను హెడ్‌క్వార్టర్స్‌లో వెల్లడించారు. రాజస్థా న్ రాష్ట్రం సిరోహి జిల్లా నరదర గ్రామా నికి చెందిన సోళంకి రమేశ్, రాజుఆకా శ్ స్నేహితులు. మొదటగా ఒక ప్రాం తాన్ని ఎంచుకుని నివాసం ఏర్పాటుచేసుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్లాస్టిక్ వస్తువులు అమ్మేవారిగా తిరుగుతారు. తమవద్ద పెద్ద ఎత్తున బం గారం ఉందని, తక్కువ ధరకు ఇస్తామ ని నమ్మిస్తారు. ఓచోటు చెప్పి ప్రజలు డబ్బులతో వెళ్లగానే నకిలీ బంగారాన్ని అంటగడతారు. పరీక్షించేలోపు అక్కడి నుంచి జారుకుంటారు. ఇలా కరీంనగర్ ముకరంపురకు చెందిన ఓ వ్యక్తికి కిలో బంగారం ఇస్తామని రూ.5లక్షల తో ఉడాయించారు. ఇలా చిక్కారు.. కరీంనగర్‌కు చెందిన దయ్యాల మల్ల య్య రెండ్రోజుల క్రితం ఆర్టీసీబస్టాండ్‌కు వెళ్లగా అక్కడే ఉన్న రమేశ్, అకాశ్ పరిచయం చేసుకున్నారు. తమవద్ద 20తులాల బంగారం ఉందని, మార్కె ట్లో రూ.5లక్షలు పలుకుతుందని, రూ. 50 వేలకే ఇస్తామని చెప్పారు.మల్లయ్య ఇంటికి వెళ్లి డబ్బు తీసుకొచ్చాడు. బం గారం తీసుకుని అది నకిలీగా గుర్తించాడు. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసు లకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీసులకు అప్పగించి రిమాండ్ చేశారు. సీఐలు శ్రీనివా సరావు, కిరణ్, మాధవి ఉన్నారు. -
తీగ లాగినా డొంక కదలదేం..?
బెట్టింగ్ భూతాన్ని తుదముట్టిస్తామని పోలీసు అధికారులు శపథాలు చేశారు.. బుకీల ఆటకట్టించి ఊచలు లెక్కబెట్టిస్తామని బీరాలు పలికారు.. పౌర సమాజం సహకరిస్తే ఎంతటి వారినైనా విడిచేది లేదని ప్రగల్భాలు పలికారు.. ఎవరు వివరాలు అందజేసినా తక్షణం స్పందిస్తామని అభయమిచ్చారు. తీరా జిల్లాకు చెందిన కీలక బుకీలను రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో అక్కడి పోలీసులు అరెస్టు చేసినా ఇక్కడ స్పందించే వారే కరువయ్యారు. తీగ లాగినా..డొంక కదిలించడంలో జిల్లా పోలీసులు విఫలమయ్యారు. ‘అధికారం’ అండతో గల్లీ నాయకులు రెచ్చిపోతున్నా చూస్తూ ఉండిపోతున్నారు. సాక్షి, గుంటూరు: రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో బెట్టింగ్ నిర్వహిస్తూ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసులకు పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వీరి వల్ల ఇబ్బందులు పడిన అనేక మంది బాధితులు తెలంగాణా పోలీసులను చూసైనా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి బెట్టింగ్ ముఠా మూలాలను వెతికి పట్టుకుంటారని ఆశించారు. అయితే పోలీసుల నుంచి ఏమాత్రం కనీస స్పందన లేకపోవడం గమనార్హం. పల్నాడులో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అండదండలు ఉండటంతోనే రెంటచింతల నాయకులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల ఉదాసీన వైఖరితో బెట్టింగ్ పెచ్చరిల్లుతోందనే విమర్శలు వస్తున్నాయి. భారీ సరంజామా స్వాధీనం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక క్రికెట్ బెట్టింగ్ ముఠా వద్ద హైదరాబాద్ పోలీసులు భారీ మొత్తంలో నగదు, సెల్ఫోన్లు సీజ్ చేయడం గమనార్హం. హైదరాబాద్ ప్రగతినగర్‌లోని లక్ష్మీనిలయం పెంట్ హౌస్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెంటచింతల మండల పరిషత్ ఉపాధ్యక్షుడి సోదరుడు గొంటు రవికిరణ్రెడ్డితో పాటు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కాసాని కోటిరెడ్డి, ఎం.అజయ్‌రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి వద్ద నుంచి రూ.15,28,460 నగదు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఒక నోట్‌ప్యాడ్, 33 సెల్ఫోన్లు, కమ్యూనికేటర్ బాక్స్, ఎల్ఈడీ టీవీ, రెండు కోడ్బుక్లు, నాలుగు చెక్‌బుక్‌లు, నాలుగు డెబిట్ కార్డులు, రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇన్నోవా వాహనం కూడా పోలీసులు స్వాధీనంలో తీసుకున్నారు. రవికిరణ్‌రెడ్డి మూడు మ్యాచ్‌లకు సంబంధించిన నగదును అరెస్టు అయిన రోజు ఉదయం ప్రధాన బుకీ అయిన వెంకిబాబుకు చేరవేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది. ఒక్కరోజు ముందు పోలీసులు దాడి చేసి ఉంటే భారీ మొత్తంలో నగదు దొరికి ఉండేదని పోలీసులే అంచనా వేయడం గమనార్హం. ఏజెంట్లను నియమించి మరీ ‘బెట్టింగ్’ రెంటచింతల మండలపరిషత్ ఉపాధ్యక్షుడు గొంటు సుమంత్‌రెడ్డి సోదరుడు రవికిరణ్‌రెడ్డి గతంలో రెంటచింతల కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం నడిపేవాడని సమాచారం. అంచెలంచెలుగా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. చీకటి సామ్రాజ్యంలో ఎందరో బుకీలతో సంబంధాలు ఏర్పరుచుకుని రాష్ట్రవ్యాప్తంగా బుకీగా అవతారమెత్తాడు. అనేక జిల్లాల్లో ఏజెంట్లను నియమించి మరీ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడంటే ఏ స్థాయికి చేరాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో రేషన్ మాఫియా సైతం సదరు వ్యక్తి కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అండదండలతోనే ఈ తతంగమంతా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడిన రవికిరణ్రెడ్డికి గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో బుకీలు, ఏజెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆస్తులను రికవరీ చేయాలని బెట్టింగ్‌లతో నష్టపోయిన బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. -
నగరంలో వృద్ధులే టార్గెట్..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో నకిలీ ఆయుర్వేదిక్ మందులు తయారు చేస్తున్న ఓ ముఠాని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 19 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 లక్షల నగదుతో పాటు 24 సెల్ఫోన్లు, 11 బైకులను సీజ్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా వృద్ధులను టార్గెట్ చేసుకుని నకిలీ ఆయుర్వేదిక్ మందులను అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైంది. సైఫాబాద్, సుల్తాన్ బజార్, అంబర్పేట్, ఎస్సార్ నగర్ల లో భారీగా నకిలీ ఆయుర్వేదిక్ మందుల అమ్మకాలు జరిపినట్లు తెలిసింది. -
సాక్షి ఎఫెక్ట్: గంజాయి ముఠా గుట్టు రట్టు
-
నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ కేంద్రంగా నాసిరకం విత్తనాలు తయారు చేసి విక్రయిస్తూ రైతులు జీవితాలతో చెలగాటమాడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాలివీ.. కాలం చెల్లిన విత్తనాలతో పాటు, నాసిరకం విత్తనాలను తయారు చేసి విక్రయిస్తున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు ప్రదేశాల్లో దాడులు చేపట్టి నలుగురు సభ్యుల ముఠా చిన్నం జానకి రాం, సంఘి మహేందర్ , శ్రీను, లక్ష్మీ అనే వారిని అరెస్ట్ చేశారు. సృష్టి, గోపీ కృష్ణ సీడ్స్ పేరుతో వీరు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లో రైతులను మోసం చేశారు. తొర్రూర్‌లోని సృష్టి సీడ్స్ కంపెనీ నుంచి 1651 నకిలీ పత్తి విత్తనాల బ్యాగులను హయత్ నగర్ పొలీసులు సీజ్ చేశారు. అలాగే, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్‌లోని గోపీ కృష్ణ సీడ్స్ కంపెనీపై దాడి చేసి 2045 కేజీల పత్తి విత్తనాలను, నకిలీ కందులు 1050 కేజీలను సీజ్ చేశారు. వీటి విలువ 46 లక్షలుంటుంది. ఈ మేరకు నిందితులపై సీడ్ కంట్రోల్ యాక్ట్ కింద సెక్షన్ 420 , ఐపీసీ 13 (1), 18(1) కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన భూత్పూర్ ఎస్ఐ అశోక్ ను సస్పెండ్ చేశారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.50 లక్షల నగదుతో పాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు బెట్టింగ్ స్థావరం పై దాడి చేసి ముగ్గురు సభ్యుల బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: ఐపీఎల్-10 సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగరంలోని వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ సాగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.40 లక్షల నగదుతో పాటు 9 సెల్ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు -
గంజాయి ముఠా అరెస్ట్
-
నయీం గ్యాంగ్ పేరుతో బెదిరింపులు..
నిజామాబాద్ : నయీం గ్యాంగ్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, దర్పల్లి మండలాల పరిధిలో గ్యాంగ్‌స్టర్ నయీం పేరుతో బెదిరింపులకు దిగుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
విగ్రహాల దొంగల ముఠా అరెస్టు
హైదరాబాద్: పురాతన విగ్రహాలను దొంగిలించే ముఠా ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు వనస్థలిపురం పోలీసులు బుధవారం ఉదయం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా నుంచి ఓ వాహనంలో వస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. నల్లగొండ జిల్లా డిండిలోని ఓ ఆలయంలో ఇటీవల దేవతా విగ్రహాలను ఎత్తుకుపోయారు. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై ముఠా కదలికలపై కన్నేసిన పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన మూడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. -
ఎల్బీ నగర్లో ఐఫొన్ బురిడీ గ్యాంగ్ అరెస్ట్
-
డమ్మీ ఐఫోన్ల ముఠా అరెస్ట్
హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఎల్బీనగర్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఢిల్లీకి చెందినదిగా గుర్తించిన పోలీసులు ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యల చేపడుతున్నారు. ఓఎల్ఎక్స్లో ఐ ఫోన్స్ విక్రయిస్తామంటూ ప్రకటన ఇచ్చి డమ్మీ ఐఫోన్లు, బాక్స్‌లలో రాళ్లు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. ఈ ముఠా నగరంలో ఇప్పటివరకు సుమారు 10 మందికి పైగా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్ట్రాలజీ నిపుణులమంటూ, రంగురాళ్లను ఇస్తామంటూ ఎల్చీ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు వారి వద్ద నుంచి హైదరాబాద్, కర్ణాటక, ఢిల్లీ చిరునామాలతో కూడిన పలు ఓటర్ ఐడి కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సులు, 5 చైనా ఐ ఫోన్స్, ఒక లక్ష రూపాయల నగదుతో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
ల్యాప్‌టాప్ బుక్ చేస్తే ఏం వచ్చిందో తెలుసా?
ఆన్లైన్లో మంచి ల్యాప్‌టాప్ చూసుకుని, దాని కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేసుకుని బుక్ చేసుకుంటే.. తీరా ఇంటికి పార్సిల్ వచ్చిన తర్వాత ఆ బాక్సులో ల్యాప్‌టాప్‌కు బదులు అందమైన మెటల్ ఫ్రేములో అమర్చిన టైల్స్ కనిపిస్తున్నాయి. మధ్యలో ఒక గ్యాంగు జోక్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఎట్టకేలకు తేలింది. ఆ గ్యాంగుకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇలా హై ఎండ్ ల్యాప్‌టాప్‌లను వాళ్లు చోరీ చేసి, అమ్మేసుకుంటున్నారు కూడా. ల్యాప్‌టాప్‌లను చోరీ చేసి, వాటి స్థానంలో సిరామిక్ టైల్స్‌ను ఉంచుతున్నారు. వాటి బరువు కూడా ఏమాత్రం తేడా రాకుండా ఉండేందుకు వాటిని మెటల్ ఫ్రేములలో బిగిస్తున్నారు. ఇలాంటి గ్యాంగులు ఇప్పటివరకు 45 ల్యాప్‌టాప్‌లు చోరీ చేయగా, వాటిలో 28 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆదేశ్ కుమార్ (25), శైలేంద్రకుమార్ (22), సుబోధ్ రాయ్ (34), మిథున్ కుమార్ (22), సనోజ్ కుమార్ (22), జయేష్ పటేల్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. ఒక కార్గో కంపెనీ యజమాని సందీప్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసు స్టేషన్లో డిసెంబర్ 18న కేసు నమోదు చేశామని, తమ వాహనంలో తాము డిసెంబర్ 5న 140 ల్యాప్‌టాప్‌లు లోడ్ చేసి, డెలివరీకి పంపామని, తీరా అవి బయటకు వెళ్లేసరికి వాటిలో 38 ల్యాప్‌టాప్‌లు, వాటి చార్జర్లు కనిపించలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లోపలి వాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానంతో కల్కాజీ ఏసీపీ అమిత్ గోయల్ దర్యాప్తు చేయగా, డ్రైవర్ ఆదేశ్ కుమార్ మీద మొదట అనుమానం వచ్చింది. అతడిని విచారించగా మిగిలిన గ్యాంగు మొత్తం బయటపడింది. వీళ్లలో జయేష్ పటేల్ పది ల్యాప్‌టాప్‌లు తీసుకుని ముంబై వెళ్లాడని, అతడిని పట్టుకోడానికి గాలింపు జరుగుతోందని డీసీపీ చెప్పారు. -
నగదు మార్పిడి ముఠా అరెస్టు
హైదరాబాద్: కమీషన్‌పై నగదు మార్పిడికి పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన భాను, వెంకటేశ్, నవీన్‌రెడ్డి అనే వారు శుక్రవారం ఉదయం ఎల్బీనగర్లో పాతనోట్లను కమీషన్‌పై తీసుకుని కొత్తనోట్ల మార్పిడి చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.19.70 లక్షల కొత్తనోట్లతోపాటు కారు, బైక్‌ను సీజ్ చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపారు. -
నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
వలిగొండ: పాతనోట్లకు కమీషన్‌పై కొత్తనోట్లను ఇచ్చే ముఠాను యాదాద్రి భువనగరి జిల్లా వలిగొండ పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీనగర్కు చెందిన ఐదుగురు, వలిగొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం ఉదయం స్థానిక అరూర్ రోడ్డులో నోట్ల మార్పిడికి యత్నిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు వారిని పట్టుకుని విచారిస్తున్నారు. వారి నుంచి రూ.4 లక్షల విలువైన కొత్తనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మానవహక్కుల సంఘం పేరిట వసూళ్లు
- నలుగురు అరెస్ట్ సుల్తానాబాద్: మానవహక్కుల సంఘం పేరిట ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లోని పలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను గత కొన్ని రోజులుగా ఓ ముఠా మానవ హక్కుల సంఘం పేరిట వేధింపులకు గురిచేస్తూ.. అక్రమంగా చందాలు వసూలు చేస్తోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నలుగురు వ్యక్తుల ముఠాను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ విజయేందర్ రెడ్డి వివరాలు తెలిపారు. -
నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
ముషీరాబాద్: నోట్ల మార్పిడికి యత్నిస్తున్న వ్యక్తులను ముషీరాబాద్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ బిట్టు మోహన్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కూకట్‌పల్లికి చెందిన బియ్యం వ్యాపారి లక్ష్మణస్వామి వ్యాపార లావాదేవీల నిమిత్తం రూ.18లక్షలు సేకరించాడు. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా తనకు పరిచయస్తుడైన సాయికుమార్ అనే వ్యక్తి ఐదు శాతం కమీషన్ ఇప్పిస్తానని చెప్పడంతో అందుకు లక్ష్మణస్వామి అంగీకరించాడు. దీంతో సాయికుమార్ అజాం అనే వ్యక్తికి ఈ విషయం చెప్పగా, అతను తన స్నేహితులు సయ్యద్ అంజద్, మహ్మద్ నఫీజ్ ఖాన్, అబ్దుల్ విలాయత్‌తో కలిసి నగదు మార్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వారిని గాంధీనగర్ రమ్మని చెప్పడంతో మంగళవారం లక్ష్మణస్వామి తన స్నేహితుడు నాగేంద్రకుమార్‌రెడ్డితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అక్కడ సాయికుమార్‌ను కలిసి బాకారంలోని ఇంటికి వచ్చి మొదటి అంతస్తులో కుర్చున్నారు. వారి వద్ద కొత్త నోట్లను కొట్టేయాలని పథకం పన్నిన అజాం అతని స్నేహితులు లక్ష్మణస్వామిని మరో ఇంటికి రమ్మని కబురుచేశారు. అక్కడ తెల్ల పేపర్లను కట్‌చేసి 25కట్టలుగా బ్యాగులో అమర్చారు. లక్ష్మణ స్వామి పాతనోట్లను చూయించాలని కోరగా వారిపై దాడి చేసి డబ్బులను లాక్కున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామని బెదిరించారు. ఆ డబ్బును నలుగురు స్నేహితులు పంచుకోగా వారిలో ముగ్గురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రూ. 16లక్షలు రికవరీ చేశారు. రెండు లక్షలతో పరారైన ఆజాం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నకిలీ పోలీసుల ఆటకట్టు అమీర్‌పేట: రద్దయిన పాతనోట్లు మార్చి ఇస్తామంటూ నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షల దండుకున్న ఇద్దరు నకిలీ పోలీసులను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌కం ట్యాక్స్ అధికారుల అవతారం ఎత్తిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై వీరస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి వైఎస్ఆర్జిల్లా మైదుకూరుకు చెందిన సునీల్, వెంకటసుబ్బయ్య మోతీనగర్‌లో ఉంటూ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకుగాను వారు నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు. ఐడీ కార్డులను కూడా తయారు చేసుకున్నారు. రద్దుచేసిన రూ.500 ,1000 పాత నోట్లను మార్చి ఇస్తామని ప్రచారం చేసుకోవడంతో మరధురానగర్‌కు చెందిన చంద్రశేఖర్ రూ.10 లక్షలు తీసుకుని వారి వద్దకు రాగా ఐడీ కార్డులు చూపి అతడిని బెదిరించి డబ్బులు తీసుకున్నారు. అంతలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులుగా చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు అక్కడికి రాగా తామే పట్టుకున్నామని డబ్బులు తీసుకుని స్టేషన్‌ను వెళుతున్నట్లు చెప్పి నలుగురు కలిసి వెళ్లిపోయారు. దీంతో బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సునీల్, వెంకట సుబ్బయ్యను అరెస్టు చేసి రూ. 9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
కొత్త నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
-
కొత్త నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
విజయనగరం: కొత్త నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను విజయనగరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కొత్త నోట్లకు అదనంగా 20 శాతం పాత నోట్లు ఇస్తామని తొమ్మిది మంది ఉన్న ముఠా ప్రజలను నమ్మిస్తోంది. గత కొంత కాలం నుంచి నోట్లను మార్పిడి చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారి వద్ద ఉన్న రూ.2.10 లక్షలు విలువైన కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
లారీ బ్యాటరీ దొంగల ముఠా అరెస్ట్
-
సింగరేణిలో ఉద్యోగాలంటూ మోసం
పెద్దపల్లి: సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయిదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. సుమారు 100 నుంచి రూ. 1.19 కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వలవేసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లను గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గల్ఫ్ లో ఉద్యోగాలు: ముఠా అరెస్ట్
హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ నార్త్‌జోన్ పరిధిలో కన్సల్టెన్సి కార్యాలయం నిర్వహిస్తూ.. దుబాయ్ పంపిస్తామని డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దీంతో దాడులు చేసి ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
నకిలీ పాస్‌పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్
ఖానాపూర్: నకిలీ పాస్ పుస్తకాల సాయంతో బ్యాంక్ ద్వారా రుణాలు పొందడానికి యత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల పరిధిలో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు, పహాణీలు సృష్టించి అధికారుల ఫోర్జరీ సంతకాల సాయంతో బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు యత్నించిన ముఠాకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ పట్టదారు పాసు పుస్తకాలు, పలు ఆఫీసుల స్టాంపులు, తహశీల్దార్, ఆర్డీవో అధికారుల ఆఫీసు ముద్రలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను మరికొద్దిసేపట్లో మీడియాకు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. -
సీజ్ చేసిన బంగారం తక్కువ ధరకే ఇస్తామని..
♦ రూ.3 లక్షలు, 10 సెల్ఫోన్లు, సుమో స్వాధీనం కోరుట్ల : కస్టమ్స్ అధికారులు సీజ్చేసిన బంగారం తక్కువ ధరకే ఇస్తామని చెప్పి సూట్‌కేసు మాయతో లక్షల్లో డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్న దొంగలముఠా సభ్యులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కోరుట్ల పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టుపడినవారిలో ఒకరు డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఉండడం గమనార్హం. డీఎస్పీ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు చెందిన వనమాల తిరుపతయ్య గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఓ దొంగతనం కేసులో సస్పెండ్అయ్యాడు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన చెక్క సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా వక్కలంకకు చెందిన బండితి శ్రీనివాస్ కలిసి 20 ఏళ్లుగా బంగారం ఎరగా వేసి మోసాలకు పాల్పడుతున్నారు. తిరుపతయ్య తాను కస్టమ్స్ ఆఫీసర్‌గా తప్పుడు ఐడెంటిటీ కార్డు తయారుచేయించి దాన్ని ఆధారంగా చేసుకుని తమ వద్ద సీజ్ చేసిన బంగారం ఉందని తక్కువ ధరకు అమ్ముతామని చెబుతూ ఫోన్లో సంప్రదిస్తాడు. మొదట స్విస్ దేశపు ముద్ర ఉన్న బంగారు బిళ్లను చూపుతాడు. అదే బంగారం కిలో వరకు ఉందని కేవలం రూ.15–20 లక్షలు ఇస్తే అమ్ముతామని నమ్మబలుకుతారు. వీరి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చిన వారిని సూట్‌కేసుతో మాయ చేస్తారు. వారి డబ్బులు తీసుకుని దర్జాగా పారిపోతారు. సూట్‌కేసు మాయాజాలం ఇలా.. బంగారం కోసం వచ్చినవారి నుంచి డబ్బులు తీసుకునే సమయంలో నిందితులు తమ వద్ద ఉన్న రెండు అరల సూట్‌కేసు తీసుకెళ్లారు. ఈ సూట్‌కేసులోని రెండు అరల్లో ఒకే రీతిలో ఉన్న నల్లటి చిన్నబ్యాగులు ఉంచుతారు. బంగారం కోరిన వారి దగ్గర నుంచి తీసుకున్న డబ్బులను నల్లబ్యాగులో ఉంచి సూట్‌కేసులో ఓ అరలో ఉంచుతారు. ఆ తరువాత తమ బంగారం మరో వ్యక్తి తెస్తున్నాడని చెబుతారు. కొంతసేపటికి తమ వ్యక్తి బంగారం తేవడంలో అలస్యమవుతోందని, బంగారం ఇవ్వకుండా డబ్బులు తీసుకోమని చెప్పి సూట్‌కేసులో మరో అరలో ఉంచిన తెల్లకాగితాల నోట్లు ఉన్న మరో బ్యాగును తీసి వాపస్ ఇచ్చేస్తారు. సూట్‌కేసులో రెండు అరలు ఉన్న విషయం నల్లబ్యాగు మారిన విషయం గమనించని బాధితులు తమ డబ్బులు తమ వద్దనే ఉన్నాయని భావిస్తారు. ఈలోపు నిందితులు బంగారం తీసుకువస్తామని బయటకు వెళ్లి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి జారుకుంటారు. బంగారం కొనుగోలు చేద్దామనుకున్న వారు వీరు ఎంతకీ రాకపోయే సరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి తమ వద్ద ఉన్న నల్లబ్యాగును తెరిచి అందులో తెల్లనోట్ల కాగితాలు ఉండటంతో లబోదిబోమంటారు. లెక్కలేనన్ని మోసాలు.. తిరుపతయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్ కలిసి ఏడాదిన్నర వ్యవధిలో ఇదే రీతిలో ఐదుగురిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2015 జనవరిలో వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన గంగినేని రాజేందర్ వద్ద రూ.10లక్షలు, 2015 అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని టప్పాచబుత్రాలో ఉండే దయానంద్ వద్ద రూ.11.50 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల మండలం ఎర్రవెల్లికి చెందిన రాధాకృష్ణ వద్ద ఈ ఏడాది మారిచలో రూ.10 లక్షలు, గత నెలలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన సందీప్ అనే వ్యాపారి వద్ద రూ.15 లక్షలు తీసుకుని బంగారం ఇవ్వకుండానే ఉడాయించారు. నెల క్రితం మెట్పల్లి మండలం చింతలపేటకు చెందిన తిరుపతిరెడ్డిని ఉచ్చులోకి లాగేందుకు యత్నించారు. వరంగల్‌కు చెందిన గంగినేని రాజేందర్‌తో వ్యాపార భాగస్వామిగా ఉన్న తిరుపతిరెడ్డి బంగారం విషయమై సలహా అడిగాడు. దీంతో రాజేందర్ తాను ఏడాది క్రితం మోసపోయిన విషయాన్ని వెల్లడించాడు. అప్రమత్తమైన తిరుపతిరెడ్డి వెంటనే కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజుకు సమాచారం ఇచ్చారు. జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ రాజశేఖర్‌రాజు చాకచక్యంగా వలపన్ని నిందితులను పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం పోలీస్ బోర్డు పెట్టుకుని కోరుట్ల శివారు ప్రాంతంలో టాటా సుమోలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాము చేసిన మోసాలు ఒప్పుకున్నారు. వీరిని అరెస్టు చేసి రూ.3లక్షలు నగదు, 3 తులాల స్విస్ బంగారం బిళ్ల, 10 సెల్ఫోన్లు, సూట్‌కేసు, సుమో స్వా«ధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో చొరవ చూపిన సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై బాబురావు, ప్రొబేషనరీ ఎస్సై సూరి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, నరేందర్, నరేష్రావును డీఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు. -
నగరానికి ఎఫిడ్రిన్ మత్తు
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరం నియంత్రణ పదార్థాల జాబితాలోకి వచ్చే ఇంటర్మీడియరీ ప్రొడక్ట్ ఎఫిడ్రిన్ ఉత్పత్తి, స్మగ్లింగ్‌కు అడ్డాగా మారుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనస్థలిపురం ఆటోనగర్‌లోని ఓ లాడ్జిపై జూన్ 2న దాడులు నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.5 కోట్ల విలువైన 50 కేజీల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో దక్షిణాఫ్రికా వెళ్తున్న ఓ యువకుడి నుంచి 12 కేజీల సరుకును పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు ఇటీవల నగరంలో తరచూ పట్టుబడుతుండటంతో ఈ మాదకద్రవ్యాన్ని నగర శివార్లలోని బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్, ఖాయిలా పడ్డ పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోనూ దీని ఉత్పత్తి జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సముద్రమార్గంలో సరఫరా... ఎఫిడ్రిన్ సముద్రమార్గంలోనే ఎక్కువగా విదేశాలకు అక్రమ రవాణా అవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కంటైనర్లలో ఇతర సరుకుల మధ్య దాచి, దేశం దాటిస్తున్నట్లు సమాచారం. గతంలో పట్టుబడిన ఎఫిడ్రిన్ కర్ణాటకలో తయారై హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటోనగర్‌లో డీఆర్ఐ స్వాధీనం చేసుకున్న కేసులోనూ ‘సరుకు’ చెన్నైకి చేరాల్సి ఉంది. వివిధ ప్రాంతాల్లో తయారైన సరుకును ఓడ రేవులు ఉన్న ప్రాంతాలకు తరలించి, కంటైనర్ల ద్వారా దేశాలు దాటించేందుకు అనేక ముఠాలు వ్యవస్థీకృతంగా పని చేస్తున్నట్లు డీఆర్ఐ అనుమానిస్తోంది. గతంలో పట్టుబడిన నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు, లింకులు సైతం ఇందుకు బలాన్నిస్తున్నాయి. సోమవారం చిక్కిన యువకుడు ఏకంగా విమానంలోనే దేశం దాటించేందుకు యత్నించడం గమనార్హం. లింక్ సిస్టమ్‌లో... ఆగ్నేయాసియా, సౌదీ దేశాల్లో గిరాకీ ఉన్న ఎఫిడ్రిన్ తయారీ, అక్రమ రవాణా అంతా లింక్ సిస్టమ్‌లో జరిగిపోతోంది. సోమవారం ఉదంతాన్నే తీసుకుంటే ఆటోనగర్‌లోని లాడ్జి వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి 50 కేజీ ఎఫిడ్రిన్‌ను కార్టన్ బాక్సుల్లో పార్శిల్ చేసి తీసుకువచ్చి పట్టుబడిన ఇరువురికీ అందించాడు. వారు దానిని చెన్నై తీసుకువెళ్లి మరో వ్యక్తికి అప్పగించాలి. తమకు ‘సరుకు’ ఇచ్చిన వారి వివరాలు, తాము ఇవ్వబోతున్న వారి వివరాలు కానీ ఈ దళారులకు తెలీదు. కేవలం ‘పై నుంచి’ వచ్చే ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలా లింక్ సిస్టంలో దందా చేయడం ద్వారా ఎవరు పట్టుబడినా... చైన్ అక్కడితో తెగిపోయి సూత్రధారులు సేఫ్‌గా ఉండిపోతున్నారని డీఆర్ఐ అధికారులు పేర్కొంటున్నారు. రూ. వేల నుంచి రూ.లక్షల్లోకి... మనదేశంలో అంతగా డిమాండ్ లేని ఈ మాదకద్రవ్యం ధర కేవలం రూ.వేలల్లోనే ఉండటంతో పట్టుబడిన ప్రతి ముఠా దగ్గరా కేజీల లెక్కల స్వాధీనమవుతోంది. అయితే దళారుల చేతులు మారే సరికి దీని ధర రూ.లక్షల్లోకి చేరుతోంది. ఇక్కడ రహస్యంగా తయారవుతున్న ఈ కెమికల్ కాంపౌండ్‌ను (వివిధ రసాయనాల మిశ్రమం) అక్కడి ముఠాలు వివిధ ప్రాంతాలకు చెందిన దళారులకు కిలో రూ.20 వేల నుంచి రూ.25 వేలకు విక్రయిస్తారు. వీరి చేతుల్లోంచి డ్రగ్ స్మగ్లింగ్ ముఠాలకు చేరేసరికి కేజీ ధర రూ.50 వేల నుంచి రూ.74 వేలకు చేరుతోంది. వారి నుంచి ఓడరేవు ప్రాంతాల్లోని డ్రగ్ మాఫియా వద్దకు వెళ్తే రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కేజీ రూ.కోట్లను తాకుతోంది. అవసరాన్ని బట్టి, చేతులు మారిన ముఠాల సంఖ్య పెరిగికొద్దీ ఈ డ్రగ్ ధర పెరుగుతూనే ఉంటోంది. నేరుగా వాడటం కుదరదు... ఎఫిడ్రిన్‌ను ఇంటర్మీడియరీ ఫార్మా ప్రొడక్ట్‌గా పిలుస్తారు. సూడో ఎఫిడ్రిన్‌ను సిములెంట్గా వినియోగిస్తారు. ఇది నేరుగా మాదకద్రవ్యం కాదు. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్‌లో డిడక్షన్ అనే రసాయన ప్రక్రియ ద్వారా యాంఫిడమైన్, మెటా యాంఫిడమైన్గా మారుస్తారు. వీటిని మాత్రమే మాదకద్రవ్యాలుగా వినియోగిస్తారు. గతంలో కేవలం ఈ రెండూ మాత్రమే నియంత్రణ పదార్థాలుగా ఉండేవి. ఆపై ఎఫిడ్రిన్‌ను సైతం ఈ జాబితాలో చేర్చారు. దేశంలోని అనేక దివాళా తీసిన, సెకండ్ గ్రేడ్, లైసెన్స్‌లేని బల్క్ డ్రగ్ కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. దీనిని రాష్ట్రంలో వినియోగించిన దాఖలాలు అధికారికంగా లేనప్పటికీ... ఆగ్నేయాసియా, సౌదీ దేశాలకు అక్రమంగా పెద్ద ఎత్తున రవాణా అవుతోంది. గతంలో చిక్కిన కేసులివీ... ► 2009లో డీఆర్ఐ అధికారులు హైదరాబాద్‌తోపాటు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 400 కేజీల ఎఫిడ్రిన్‌ను పట్టుకున్నారు. ► సైబరాబాద్ పోలీసులు 2010లో ఓ సినీ నిర్మాతతో పాటు అతడి అనుచరుడినీ అరెస్టు చేసి 25 కేజీల సరుకు స్వాధీనం చేసుకున్నారు. ► డీఆర్ఐ అధికారులు 2012లో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరి నుంచి 65 కేజీల ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ► 2014లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు చౌటుప్పల్, హయత్‌నగర్‌ల్లో దాడుల్లో 300 కేజీల ఎఫిడ్రిన్ స్వాధీనమైంది. ► 2015లో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు లిబర్టీ చౌరస్తా వద్ద పట్టుకున్న ముఠా నుంచి ఎల్‌ఎస్‌డీతో పాటు ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ► డీఆర్ఐ అధికారులు గత జూన్ 2న ఆటోనగర్‌లో, సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ► రాజధానిలో ఈ మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ఆరోపణలపై గతంలో మూడు సంస్థలను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. -
ధృవీకరణ పత్రాలు లేకుండానే ఓటర్ ఐడీ
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకున్నా అవసరమైన వారికి ఓటర్ ఐడీలు తయారు చేసి ఇస్తున్న ముఠా గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని, వీరిలో ఒకరు జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అని డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం వెల్లడించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని వెంకటాపురానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్ 2011లో జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. కొంతకాలం బేగంపేటలోని ఓ కంపెనీలో పని చేసిన ఇతగాడు... 2012లో మూసాపేటలో ఎస్ఎస్వీ ట్యాక్స్ కన్సల్టెన్సీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. వ్యాట్ రిజిస్ట్రేషన్ నుంచి ఐటీ రిటర్న్‌్స వరకు వివిధ పనులు చేశాడు. ఈ విధంగా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు అన్వేషించాడు. ఇదే సమయంలో ఇతడికి ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న డి.రాముతో పరిచయమైంది. వీరిద్దరూ కలిసి ముఠాగా ఏర్పడి అవసరమైన వారికి బోగస్ ఓటర్ ఐడీలు తయారు చేసి ఇచ్చే దందా ప్రారంభించారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఓటర్ ఐడీలు కావాలంటూ తనను సంప్రదించే వారి వివరాలను శ్రీనివాస్ ఈ–మెయిల్ ద్వారా రాముకు పంపుతాడు. అతడు ఆ వివరాలతో ఓటర్ ఐడీ సృష్టించి ఆ రిఫరెన్స్ నెంబర్‌ను శ్రీనివాస్‌కు పంపిస్తాడు. దీని ఆధారంగా సదరు వినియోగదారుడు మీ సేవ కేంద్రం నుంచి ఓటర్ ఐడీ తీసుకునే వాడు. ఈ రకంగా ఒక్కో ఓటర్ ఐడీకి రూ.700 చొప్పున వసూలు చేస్తున్న శ్రీనివాస్ అందులో రూ.350 రాముకు ఇస్తున్నాడు. ఈ ద్వయం ఇప్పటి వరకు దాదాపు 450 మందికి బోగస్ వివరాలతో ఓటర్ ఐడీలు అందించింది. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజా వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం వలపన్ని ఆదివారం పట్టుకుంది. నిందితుల నుంచి కంప్యూటర్, ధ్రువీకరణపత్రాలు లేకుండా ఓటర్ ఐడీ దరఖాస్తులు తదితరాలు స్వాధీనం చేసుకుని కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది -
నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు: 13 మంది అరెస్ట్
విజయవాడ : నకిలీ కరెన్సీ ముఠా గుట్టును విజయవాడ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 8 లక్షల దొంగ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి... తమదైన శైలిలో వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే పట్టుబడిన నిందితులు అంతా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ వాసులను పోలీసులు తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ : కుషాయిగూడలోని భవాని నగర్లో 20-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ. 11 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
పైపులైన్లకు కన్నం: భారీగా డీజిల్ చోరీ
నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీ నగర్ సమీపంలో పైపులైన్ల నుంచి డీజిల్ చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే హెచ్‌పీసీఎల్, ఐఓసీ కంపెనీల పైపులైన్లకు బీబీ నగర్ సమీపంలోని పడమటి సోమవారం దగ్గర కన్నంపెట్టి రోజూ మూడు నుంచి నాలుగు ట్యాంకర్ల మేర కొల్లగొడుతున్నారు. ఈ డీజిల్‌ను నగరంలోని పెట్రోల్ బంకుల్లో అక్రమంగా విక్రయిస్తున్నారు. డీజిల్ చోరీపై అనుమానంతో చమురు కంపెనీల ప్రతినిధులు పోలీసులతో కలసి సోమవారం దాడి చేయగా ముఠా వ్యవహారం రట్టయింది. ముంబైకి చెందిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీకి ఉపయోగించే పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
రాజమహేంద్రవరం క్రైం: న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య 20-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌కు బుధవారం రాత్రి బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు అందిన సమాచారంతో టూటౌన్ సీఐ కె. నాగేశ్వరరావు, సిబ్బందితో కలసి రాజమహేంద్రవరం మొయిన్ రోడ్డులోని మిరియాలవారి వీధిలో ఒక ఇంటిపై దాడి చేసి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఆరు సెల్ఫోన్లు, ఐదు ఏటీఎం కార్డులు, ఒక టీవీ, సోనీ సెట్‌టాప్ బాక్స్, రెండు మోటారు సైకిళ్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1.5 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. న్యూజిలాండ్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు 25మంది బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలిసిందన్నారు. ముద్దాయిలు తెలిపిన వివరాల ప్రకారం మిగిలిన ముద్దాయిల కోసం సీఐ తమ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి కోటిపల్లి బస్టాండ్ వద్ద గురువారం ముగ్గురిని పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టుకు పంపినట్టు సీఐ తెలిపారు. మిగిలిన ముద్దాయిల కోసం గాలిస్తున్నామన్నారు. -
బీటెక్ బాబులు.. రూ. 8.6 కోట్లు కొట్టేశారు!
వాళ్లంతా బీటెక్ బాబులు. ఇంజనీరింగ్ చదువుతున్నారు. నలుగురైదుగురు కలిశారు. సులభంగా డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించారు. ఓ బ్యాంకు మొబైల్ వాలెట్ లావాదేవీలను చూశారు. అందులో వాళ్లకు ఓ లొసుగు కనిపించింది. అంతే, సులభంగా దాన్ని పట్టేసి, ఏకంగా రూ. 8.6 కోట్లు కొట్టేశారు. అయితే చివరకు పోలీసుల చేతికి మాత్రం చిక్కారు. బ్యాంకులతో పాటు కస్టమర్లకు కూడా టోపీలు పెడుతున్న కుర్రాళ్ల తీరు చూసి పోలీసులు నోళ్లు వెళ్లబెడుతున్నారు. డిసెంబర్ నెలలో వాలెట్ ట్రాన్సాక్షన్లు మొదలుపెట్టిన ఓ ప్రైవేటు బ్యాంకు, అందులో ఓ లోపం ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయింది. కస్టమర్ తన సొంత వ్యాలెట్ నుంచి మరో వ్యాలెట్ హోల్డర్‌కు డబ్బు పంపాలనుకుంటే.. అప్పుడు కావాలనో అనుకోకుండానో మధ్యలో ఇంటర్నెట్ కనెక్షన్ ఆగిపోతే అతడి బదులు బ్యాంకే అవతలి వ్యక్తికి డబ్బు కట్టేస్తోంది. ఇవతల మొదట కట్టాలనుకున్నవాళ్లకు మాత్రం ఖాతాలో డబ్బు యథాతథంగా మిగిలిపోతోంది. ఇలా తమ ఖజానాలోంచి రూ. 8.6 కోట్లు వెళ్లిపోయే వరకు బ్యాంకుకు ఆ విషయం తెలియనే లేదు. కోల్‌కతాలో జరిగిన ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిదిమందిని డిటెక్టివ్ శాఖ అరెస్టు చేసింది. వాళ్లలో ఐదుగురు విద్యార్థులుండగా, బీటెక్ బాబు జ్యూయెల్ రాణా ఈ గ్యాంగుకు లీడర్‌గా వ్యవహరించాడు. వీళ్లందరికీ ముందే యాక్టివేట్ చేసిన ప్రీపెయిడ్ సిమ్‌కార్డులు వేల సంఖ్యలో ముర్షీదాబాద్ జిల్లా నుంచి అందాయి. ఏమీ తెలియని గ్రామీణులకు ఈ సిమ్‌కార్డులు ఇచ్చి వాటితో బ్యాంకులో అకౌంట్లు, వాలెట్లు తెరవాల్సిందిగా చెప్పేవారు. అందుకోసం వారికి కొంత సొమ్ము కూడా ఆశ చూపించారు. హబీబుర్ రెహ్మాన్ అనే మొబైల్ సర్వీసు ప్రొవైడర్‌కు జ్యూయెల్ రాణా తెలుసని, అతడి ద్వారానే సిమ్ కార్డులు అందుకుని ఈ వ్యవహారం అంతా నడిపాడని జాయింట్ సీపీ దేవాశీష్ బోరల్ తెలిపారు. కోల్‌కతా, ముర్షీదాబాద్ ప్రాంతాల్లో ఏకంగా 2వేల ఖాతాలు ఓపెన్ చేసి, వాటి ద్వారా వేలాది లావాదేవీలు నడిపించాడు. వాలెట్ యాప్‌లు కనీసం ప్రాథమిక నియమాలను కూడా పాటించడం లేదని, వాళ్లు ఒక లావాదేవీ జరిగేటప్పుడు కనీసం డేటాను ఎన్‌క్రిప్ట్ కూడా చేయకపోవడంతో తమకు తలనొప్పులు తప్పట్లేదని సీనియర్ డిటెక్టివ్ అధికారి ఒకరు తెలిపారు. సిద్దార్థ భన్సాలీ అనే ఈ మార్కెటింగ్ కన్సల్టెంటు వ్యాలెట్‌నే ఎవరో హ్యాక్ చేసి అందులో డబ్బు కొట్టేశారని అన్నారు. భన్సాలీ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి వాలెట్ కంపెనీతో నెలల తరబడి పోరాడిన తర్వాత ఆయన డబ్బుతో పాటు పరిహారం కూడా ఇస్తామని చెప్పారు. తగిన సెక్యూరిటీ ఫీచర్లను పాటిస్తే తప్ప.. వాలెట్లతో ఇటు ఖాతాదారులు, అటు బ్యాంకులు కూడా సొమ్ము పోగొట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని అంటున్నారు. -
తక్కువ ధరకు వజ్రం..
అయిజ: అసలే ఇది ఆఫర్ల కాలం. కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో వేలకొద్దీ కంపెనీలు లక్షల రకాల ఆఫర్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ. 50 లక్షల విలువైన వజ్రం రూ.15 లక్షలకే లభిస్తుందని ఓ వ్యాపారికి ఆఫర్ వచ్చింది. ఎంతో ఆశగా అడ్వాన్స్ సైతం చెల్లించిన ఆయన.. చివరికి ఎలా మోసపోయాడో మహబూబ్ నగర్ పోలీసులు వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన బాబన్న రియల్టర్. గత అక్టోబర్ 20న బాబన్న డ్రైవర్ గా పనిచేస్తున్న తిరుపతికి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ. 50 లక్షల విలువైన వజ్రాన్ని అమ్మాలనుకుంటున్నట్లు, రూ. 15 లక్షలకైనాసరే ఇచ్చేస్తామని ఫోన్ సారాంశం. ఇదే విషయాన్ని డ్రైవర్ తిరుపతి.. బాబన్నకు చెప్పాడు. అదేరోజు డీల్ కుదుర్చుకునేందుకు ఐదుగురు వ్యక్తులు డోన్ కు వచ్చారు. మొదట 5 లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తే, వజ్రం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఈ నెల 29న అడ్వాన్స్ మొత్తం అందుకున్న డైమండ్ గ్యాంగ్ పత్తాలేకుండా పారిపోయిన తర్వాతగానీ మోసపోయామని గ్రహించిన బాబన్న పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ కు చెందిన ఆకాశింగ్, పాపింగ్, శోకింగ్, శాంచర్, కమతిసింగ్, పెనుకుమార్, కసాత్సింగ్ అనే ఏడుగురిని శనివారం గద్వాల రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసినట్లు గద్వాల డీఎస్సీ బాలకోటి తెలిపారు. -
నిన్న నెయ్యి.. నేడు సాస్!
హైదరాబాద్: తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెడ్తూ కల్తీ ఆహార పదార్థాలు తయారుచేస్తున్న ముఠాలు బరితెగిస్తున్నాయి. విజయవాడలో భారీగా కల్తీ నెయ్యి తయారుచేస్తూ శుక్రవారం ఓ ముఠా పట్టుబడగా.. శనివారం హైదరాబాద్‌లో కల్తీ సాస్ తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. వనస్థలిపురంలో రసాయన పదార్థాలతో కల్తీ సాస్ తయారుచేస్తున్న ఓ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 30 డ్రమ్‌ల సాస్, భారీగా కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
నిన్న నెయ్యి.. నేడు సాస్!
-
తిరుమలలో లడ్డూ దళారీ గ్యాంగ్ అరెస్ట్
-
నకిలీ పాస్‌పుస్తకాల కేసులో మరో వ్యక్తి అరెస్టు
అనంతపురం (తాడిపత్రి) : నకిలీ పాస్ పుస్తకాల తయారీలో ఓ వ్యక్తిని అనంతపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలో ఓ ముఠా భారీగా నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేసి పలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంది. ఈ కేసులో పలువురు అరెస్టు అయ్యారు. అయితే తాడిపత్రికి చెందిన రంగనాయకులు రబ్బరు స్టాంపుల తయారీ షాపు నిర్వహిస్తున్నాడు. రంగనాయకులు కూడా ఈ కేసులో కీలకమైన నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతడిని గురువారం అరెస్టు చేశారు. -
బెదిరించారు..అరెస్టయ్యారు
రంగారెడ్డి: బెదిరింపులకు పాల్పడుతూ అక్రమదందాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. కుషాయిగూడలో ఓ స్కూల్ యజమానిని రూ.లక్షా 50 వేలు డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ కేసులో ప్రధాన నిందితుడు సత్యప్రసాద్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఏడుగురుని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్టు పోలీసులు తెలిపారు. -
బెజవాడలో నకిలీనోట్లపై ప్రత్యేకనిఘా
-
నకిలీ పత్రాల తయారీ ముఠా అరెస్ట్
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): నకిలీ పత్రాలను తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కడప అర్బన్‌లో మంగళవారం జరిగింది. వివరాలు..ర వీంద్ర నగర్‌కు చెందిన సయ్యద్ జైనుల్లా అబిబుల్ పట్టణంలో ట్రావెల్ వర ల్డ్ షాపును నడుపుతున్నాడు. ఈ క్రమంలో పాస్‌పోర్టును పోగోట్టుకున్న బచ్చావలే షౌకత్‌అలీ అబిబులాను సంప్రదించి కొత్త పాస్‌పోర్టును ఇప్పించాలని కోరాడు. అందుకు గాను రూ. 4000 నగదును ముట్టజెప్పాడు. ఈ క్రమంలో పోలీసుల తనిఖీల్లో షౌకత్‌అలీ సమర్పించిన పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అతన్ని అదపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. పోలీసులు వెంటనే అబిబుల్ను, అతనికి సహాకరిస్తున్న షేక్ మహమ్మద్ గౌస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వీరితో సంబంధం ఉన్న సాయిపేటకు చెందిన ఏబీ ప్రింటర్స్ షాప్ నిర్వాహకుడు ఖాజా మోహినుద్దీన్ను అరెస్ట్ చేశారు. వీరందరు పాస్‌పోర్టు పరిశీలనకు కావాల్సిన నకిలీ పత్రాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా వీరు డెత్, బర్త్, విద్యాపరమైన, పోలీస్ వెరీఫీకేషన్ పత్రాల నకల్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు తనిఖీల్లో తేలింది. -
కరుడుగట్టిన నేరస్తుల ముఠా అరెస్ట్
నల్లగొండ క్రైంః వారంతా కరుడుగట్టిన నేరస్తులు. చర్లపల్లి జైలులో ఓ ముఠా గా ఏర్పాడ్డారు.. వారిపై ఎన్నెన్నో కేసులు. ముఠాలో ఓ సభ్యుడు ఫ్యాక్షనిస్టులు పటోళ్ల గోవర్దన్‌రెడ్డి, మద్దెల చెర్వు సూరి వద్ద పనిచేశాడు. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ వద్ద కూడా పనిచేశాడు. తాజాగా మిర్యాలగూడకు చెందిన వ్యాపారిని హత్య చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.. వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రభాకర్‌రావు నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డారు ఇలా... నల్లగొండ సీసీఎస్, మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు మంగళవారం మిర్యాలగూడ సాగర్ రింగ్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా నేరస్తుల ము ఠా పట్టుబడింది. వీరి వద్ద ఒక రివాల్వర్, మారుతి మ్యాన్, ఇండికా కారు, రెండు మారణాయుధాలు, రెండు కారం ప్యాకెట్లు, రూ.1.50 లక్షల నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నా రు. వీరంతా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ వ్యాపారిని హత్య చేసేం దుకు పథకం పన్నినట్లు గుర్తించామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బుర్జుకాడి విజయ్‌కుమార్ అలియాస్ విష్ణు,రంగారెడ్డి జిల్లా శివారెడ్డిగూడెం పోలీసుమహేందర్, వరంగల్ జిల్లా మడిపల్లికి చెందిన గుంటుక రమేష్, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లకు చెందిన కాసర్ల రాజు ముఠాగా ఏర్పడి వ్యాపారి గోపాల్‌రెడ్డిని హత్య చేసేందుకు రూ.10 లక్షలు ఒప్పందం చేసుకున్నారు. జిల్లాలోని పెన్‌పహాడ్ మండలానికి చెందిన నారాయణ పాపిరెడ్డి, నేరేడుచర్ల మండలానికి చెందిన నూకల మధుకర్‌రెడ్డి, తిప్పర్తి మండలం యల్లమ్మగూడేనికి చెందిన ఉట్కూరి వెంకట్‌రెడ్డి కలిసి హత్యకు పథకం పన్ని రూ.3 లక్ష 20 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు. మిర్యాలగూడలో రాఘవేంద్రస్వామి ఐరన్, హార్డ్‌వేర్ షాపు నిర్వహించే గోపాల్‌రెడ్డికి సంబంధించిన పాస్‌ఫొటో, షాపు అడ్రసును ఈ ముఠాకు అందజేశారు. తననే హత్య చేస్తాడని.. గోపాల్‌రెడ్డి తన సమీప బంధువైన నారాయణ పాపిరెడ్డికి రూ.5 లక్షలు ఇ వ్వాల్సి ఉన్న విషయం కోర్టు పరిధిలో కేసు సాగుతోంది. గత నవంబరులో గోపాల్‌రెడ్డి నారాయణగూడెం గ్రామానికి వెళ్లడంతో అక్కడే నివాసం ఉంటున్న పాపిరెడ్డి గమనించి తనను చంపడానికి వచ్చాడని భావించాడు. డబ్బులు ఇవ్వకపోగ, హత్య చేసేందుకు పథకం వేశాడని అనుమానించాడు. దీనితో గోపాల్రెడ్డినే హత్య చేసేందుకు పాత నేర చరి త్ర కలిగిన నలుగురు వ్యక్తుల ముఠా మధుకర్‌రెడ్డి, వారి సమీప బంధువు సందీప్‌రెడ్డి ఫ్యాక్షన్ నేరస్తుడైన విజయ్‌కుమార్‌ను సంప్రదించారు. విజయ్‌కుమార్, రమేష్, మహేందర్, రాజులు వివిధ కేసుల్లో చర్లపల్లి జైలులో ఉండి పరి చయం ఏర్పడి ఒక ముఠాగా ఏర్పాడ్డా రు. ముఠాలో ప్రథమ ముద్దాయి విజయ్‌కుమార్‌తో కలిసి పాపిరెడ్డి, మధుకర్‌రెడ్డి, సందీప్‌రెడ్డిలు ఒక కారులో వెళ్లి గోపాల్‌రెడ్డి హ్యత చేసేందుకు ఇంటిని, షాపును రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో అనుకున్న ప్రకారం విజయ్‌కుమార్ తన అనుచరులతో మంగళవారం ఉదయం ఓ వ్యాన్‌లో హత్యకు కావాల్సిన మారణాయుధాలు, కారం ప్యా కెట్లు తీసుకుని హైదరాబాద్ నుంచి ఇబ్రహింపట్నం మీదుగా మిర్యాలగూడ చేరుకోన్నారు. గోపాల్‌రెడ్డి షాపుకు కొద్ది దూరంలో వ్యాన్‌లో ఉన్న వీరందరినీ పోలీసులు పట్టుకున్నారు. ముఠా హత్య ప్రయత్నానికి కారకులైన వారిని సీసీఎస్ డీఎస్పీ సునీతా మోహన్, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎస్పీ అభినందించారు. -
బైక్ దొంగల ముఠా అరెస్టు
మాచవరం: నలుగురు ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేసినట్లు పిడుగురాళ్ళ పట్టణ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లుట్ల జంక్షన్లో వాహనాల తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న మోర్జంపాడు గ్రామానికి చెందిన గుణపాటి చంద్రశేఖరరెడ్డి, కోర్ని సీతారామయ్య, మేకల గోవిందు, పిడుగురాళ్ళమండలం పందిటివారిపాలెంకు చెందిన బైలడుగుల పిచ్చయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా 15 ద్విచక్రవాహనాలను దొంగిలించినట్లు చెప్పారని పేర్కొన్నారు. రూ.9 లక్షల విలువైన 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. మాచవరం, పిడుగురాళ్ళ, రాజుపాలెం, బెల్లంకొండ, మేళ్లచెరువు, దుర్గి, గురజాల, కారంపూడి గ్రామాల్లో ఇళ్ల ముందు రోడ్లపై ఉంచిన ద్విచక్రవాహనాలను నిందితులు దొంగిలించారని, వాటిలో నాలుగు వాహనాలను విక్రయించడానికి వెళుతుండగా పట్టుకున్నామని చెప్పారు. వీటితోపాటు చంద్రశేఖరరెడ్డి గృహంలో ఐదు, పిచ్చయ్య గృహంలో ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మాచవరం ఎస్ఐ ఆవుల హరిబాబు మాట్లాడుతూ చెడు అలవాట్లకు బానిసై సులభమైన మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కేవలం18 లక్షలకే... కేజీ బంగారం
ఏలూరు: రూ. లక్ష ఇవ్వండి రూ. 3 లక్షలు తీసుకోండి... కిలో బంగారం కేవలం రూ. 18 లక్షలే అంటూ జనాన్ని చీటింగ్ చేస్తున్న ఓ ముఠా గుట్టును పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ముఠాకు చెందిన అయిదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ బంగారంతోపాటు అధిక మొత్తంలో నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముఠా సభ్యులను పట్టణంలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ నగదు ఇస్తే... అధిక మొత్తంలో నగదు ఇస్తామంటూ గత కొంత కాలంగా జిల్లాలో ఓ ముఠా మోసగిస్తుంది. ఇటీవల కాలంలో ఆ ముఠా ఆగడాలు అధికమైనాయి. దాంతో జల్లాలోని పలు ప్రాంతాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో జిల్లావ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు నిఘాను అధికం చేశారు. ఆ క్రమంలో సదరు ముఠా గుట్టును పోలీసులు మంగళవారం రట్టు చేశారు. -
దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు
కర్నూలు: కర్నూలు జిల్లాలో దొంగనోట్ల కలకలం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. దాంతో దొంగనోట్ల చలామణి చేస్తున్న ఓ ముఠా గుట్టును కర్నూలు నగర పోలీసులు బుధవారం తెల్లవారుజామున రట్టు చేశారు. నగర పోలీసులు తనిఖీలలో భాగంగా బుధవారం తెల్లవారుజామునా ఓ నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌ను తరలించారు. ఆ ముఠాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా పోలీసులు ముఠా సభ్యులను ప్రశ్నించగా వారు ఎంతకీ పెదవి విప్పలేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. దాంతో ముఠా సభ్యుల నోటి నుంచి నిజాలు తన్నుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు ముఠాసభ్యులు పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణ కొనసాగుతుంది. -
8 మంది బందిపోటు ముఠా సభ్యులు అరెస్ట్
హైదరాబాద్: అంతరాష్ట్ర బందిపోటు ముఠా గుట్టును నాచారం పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన 8 మంది సభ్యులను బోరబండలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షల విలువ చేసే కాపర్ లోడుతో ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారని పోలీస్ స్టేషన్‌కు తరలించి... తమదైన శైలిలో విచారిస్తున్నారు. రాష్ట్రంలో గతంలో చేసిన నేరాలను పోలీసులు వారి నుంచి రాబడుతున్నారు. రాష్ట్రంలో జరిగిన పలు చోరీలతో వీరికి సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. -
టెలిఫోన్ కేబుల్ దొంగలముఠా అరెస్టు
భూగర్భంలో వేసిన టెలిఫోన్ కేబుళ్లను చోరీ చేస్తున్న దొంగల ముఠాను దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో కేబుళ్లను వారు తస్కరిస్తుండగా ఎంటీఎన్ఎల్ అధికారులు వాళ్లను పట్టుకున్నారు. వాళ్ల వద్ద ఇలా చోరీ చేసిన దాదాపు 6 లక్షల రూపాయల విలువ చేసే కేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మొయిన్ (24), మంజీర్ ఆలం (25), మహ్మద్ షకీల్ (22), త్రివేణి సింగ్ (40)గా గుర్తించారు. వాళ్లు కేవలం కేబుళ్లను ఎక్కడికక్కడ చోరీ చేయడమే కాదు, ఏకంగా వాటిని భూగర్భం నుంచి బయటకు లాగేందుకు ఉపయోగించే ఐషర్ కాంటర్ ట్రక్కు కూడా సొంతంగా సమకూర్చుకున్నారు. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో దక్షిణ ఢిల్లీలోని తొమ్మిది వేర్వేరు పోలీసు స్టేషన్ల పరిధిలో కేబుల్ చోరీ కేసులు పరిష్కారం అయ్యాయని డీసీపీ బీఎస్ జైస్వాల్ తెలిపారు.