హైదరాబాద్ : కుషాయిగూడలోని భవాని నగర్‌లో 20-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ. 11 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.