హైదరాబాద్: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఎల్బీనగర్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఢిల్లీకి చెందినదిగా గుర్తించిన పోలీసులు ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యల చేపడుతున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో ఐ ఫోన్స్ విక్రయిస్తామంటూ ప్రకటన ఇచ్చి డమ్మీ ఐఫోన్లు, బాక్స్‌లలో రాళ్లు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. ఈ ముఠా నగరంలో ఇప్పటివరకు సుమారు 10 మందికి పైగా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆస్ట్రాలజీ నిపుణులమంటూ, రంగురాళ్లను ఇస్తామంటూ ఎల్చీ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు వారి వద్ద నుంచి హైదరాబాద్, కర్ణాటక, ఢిల్లీ చిరునామాలతో కూడిన పలు ఓటర్ ఐడి కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సులు, 5 చైనా ఐ ఫోన్స్, ఒక లక్ష రూపాయల నగదుతో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.