విగ్రహాల దొంగల ముఠా అరెస్టు | Idol smuggling racket busted | Sakshi
Sakshi News home page

విగ్రహాల దొంగల ముఠా అరెస్టు

Published Wed, Jan 11 2017 3:26 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Idol smuggling racket busted

హైదరాబాద్‌: పురాతన విగ్రహాలను దొంగిలించే ముఠా ఆటకట్టించారు హైదరాబాద్‌ పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు వనస్థలిపురం పోలీసులు బుధవారం ఉదయం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా నుంచి ఓ వాహనంలో వస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. నల్లగొండ జిల్లా డిండిలోని ఓ ఆలయంలో ఇటీవల దేవతా విగ్రహాలను ఎత్తుకుపోయారు. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై ముఠా కదలికలపై కన్నేసిన పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన మూడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement