నకిలీ పాన్‌కార్డులు.. 2 కోట్లు టోకరా | fake pan cards making gang arrested in hyderabad | Sakshi
Sakshi News home page

నకిలీ పాన్‌కార్డులు.. 2 కోట్లు టోకరా

Published Tue, May 1 2018 4:07 PM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

fake pan cards making gang arrested in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో నకిలీ పాన్‌కార్డులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్స్‌ సృష్టించి పాన్‌కార్డులు తయారు చేసి బ్యాంకులను మోసం చేస్తున్న16 మందిని అదుపులోకీ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నాలుగు గ్యాంగ్‌లుగా ఏర్పడిన నిందితులు ఇప్పటి వరకు 2 కోట్ల 39 లక్షల మేర బ్యాంకులకు టోకరా వేశారు. 

పట్టుబడ్డ నిందితుల నుంచి రూ. 4 లక్షల రూపాయల నగదు , 7 ల్యాప్‌ టాప్‌లు, వివిధ బ్యాంకులకు చెందిన 200 క్రెడిట్‌ కార్డులు, 49 పాన్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.  నిందితులకు పలువురు బ్యాంకు సిబ్బంది సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement