fake iphones
-
డమ్మీ ఐఫోన్ల ముఠా అరెస్ట్
హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఎల్బీనగర్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఢిల్లీకి చెందినదిగా గుర్తించిన పోలీసులు ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యల చేపడుతున్నారు. ఓఎల్ఎక్స్లో ఐ ఫోన్స్ విక్రయిస్తామంటూ ప్రకటన ఇచ్చి డమ్మీ ఐఫోన్లు, బాక్స్‌లలో రాళ్లు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. ఈ ముఠా నగరంలో ఇప్పటివరకు సుమారు 10 మందికి పైగా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్ట్రాలజీ నిపుణులమంటూ, రంగురాళ్లను ఇస్తామంటూ ఎల్చీ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు వారి వద్ద నుంచి హైదరాబాద్, కర్ణాటక, ఢిల్లీ చిరునామాలతో కూడిన పలు ఓటర్ ఐడి కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సులు, 5 చైనా ఐ ఫోన్స్, ఒక లక్ష రూపాయల నగదుతో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ ఐఫోన్ల తయారీ ముఠా అరెస్టు
హైదరాబాద్ : నకిలీ ఐఫోన్ల తయారి చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాగుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన ప్రిన్స్ మల్హోత్రా అలియాస్ సోను (22), అమన్ నాగ్‌పాల్ అలియాస్ అర్మాన్ మాలిక్ (23), జితిన్ మున్ని, ధ్రువ్, నాకుల్, సత్యం తదితరులు ఏడుగురు నెలన్నరగా నగరంలోని మాదాపూర్‌లో నివసిస్తున్నారు. ఐఫోన్లను పోలిన నకిలీ ఫోన్లు తయారు చేస్తూ వాటికి పత్రాలు కూడా సృష్టించి వివిధ షాపులలో రీప్లేస్మెంట్ చేస్తూ కొత్త వాటిని తీసుకుని.... వాటిని కూడా విక్రయిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 45లోని ఆప్ట్రానిక్స్‌లో ఇటీవల ఓ నకిలీ ఐ ఫోన్‌ను రీప్లేస్ చేస్తూ సదరు వ్యక్తులు దొరికిపోయారు. షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో... వారిని అదుపులోకి తీసుకుని ... పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పట్టుబడిన సోను, అమన్నాగ్పాల్ను విచారించగా తాము ఢిల్లీలోని జఫర్‌మార్కెట్ నుంచి వాటిని తీసుకొస్తున్నామని వెల్లడించారు. వారిద్దరి నుంచి దాదాపు 20 నకిలీ ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా అయిదుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐఫోన్లు మార్చి.. చైనా ఫోన్లు పెట్టేశాడు!
ఆన్లైన్లో మీరు ఏమైనా ఖరీదైన వస్తువులు బుక్ చేసుకున్నారా? కానీ అసలు వస్తువుకు బదులు నకిలీలు వస్తున్నాయా.. అయితే ఖంగారు పడకండి. డెలివరీ చేసే బోయ్‌లు ఈ తరహా మోసాలకు పాల్పడే అవకాశం చాలా ఉంది. సరిగ్గా ఇలాగే చేసిన ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బోయ్ మోసాన్ని పోలీసులు పసిగట్టారు. ఐఫోన్లు బుక్ చేసుకున్నప్పుడు.. అసలు వాటికి బదులు నకిలీలు అంటగట్టడం అతగాడికి వెన్నతో పెట్టిన విద్య అట. నాలుగు నెలల క్రితం చెన్నైలో ఉద్యోగానికి చేరిన నవీన్ (21) తాను డెలివరీ చేయాల్సిన ప్రాంతంలో ఎవరైనా ఐఫోన్లు ఆర్డర్ చేస్తే, వాటిలోని అసలు ఫోన్లను తాను తీసేసుకుని.. వాటికి బదులు నకిలీ ఫోన్లను కస్టమర్లకు అంటగట్టేవాడు. తర్వాత.. కస్టమర్‌కు అది నచ్చలేదంటూ వాటిని రిటర్న్ ఇచ్చేసేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 ఫోన్లను అతడు మార్చేశాడు. మొదటిసారి తనను ఎవరూ పట్టుకోలేకపవడంతో.. ఈ స్కామును నెలరోజుల పాటు కొనసాగించాడు. ఎట్టకేలకు ఒకే ప్రాంతం నుంచి ఇలా ఐఫోన్లు తిరిగి వస్తున్న విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ కంపెనీ గమనించింది. వెట్రిసెల్వం అనే గోడౌన్ యజమాని నవీన్ మీద ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అతడు ముందుగా ఒక నకిలీ చిరునామాతో ఫోన్ ఆర్డర్ చేసి, దాన్ని చైనా ఫోన్‌తో మార్చేశాడని.. కస్టమర్‌కు నచ్చలేదంటూ దాన్ని తిరిగి గోడౌన్‌కు తెచ్చాడని వెట్రిసెల్వం చెప్పారు. బీకాం చదివిన నవీన్.. తన అప్పులు తీర్చుకోలేక ఇలా చేసినట్లు చెబుతున్నారు. కాలేజి రోజుల్లో విలాసవంతమైన జీవితం గడపడం కోసం స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికే ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.