అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ | Inter-district gang of thieves arrested | Sakshi
Sakshi News home page

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

Published Mon, Mar 10 2014 2:46 AM | Last Updated on Sat, Aug 11 2018 8:57 PM

Inter-district gang of thieves arrested

 విశాఖపట్నం, న్యూస్‌లైన్ : పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన ముఠాను ఆరిలోవ జోన్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్‌లో క్రైం ఏడీసీపీ ఎస్.వరదరాజు విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండ లం సుబ్రహ్మణ్యం గ్రామానికి చెందిన గురుగుబిల్లి మల్లేశ్వరరావు అలియాస్ గణేష్, అదే జిల్లా మందస గ్రామానికి చెందిన రేగి సుధీర్‌తో కలసి 2007 నుంచి విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, అమలాపురం, ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం, హైదరాబాద్‌ల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. 2012 మార్చిలో ఆరిలోవ పాతడైరీఫారం వద్ద గల ఐఏఎస్ అధికారి ఇంట్లో రివాల్వర్, బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. రివాల్వర్‌ను హైదరాబాద్‌లో రూ.35 వేలకు విక్రయించినట్లు తెలిసింది. 
 
 జైలులో మరో ఇద్దరు నిందితులతో జత
 గురుగుబిల్లి మల్లేశ్వరరావు విజయనగరం జిల్లా జైలులో ఉన్నప్పుడు విశాఖకు చెందిన  సత్యనారాయణ అలియాస్ సతీష్, ప్రసాద్ గార్డెన్స్‌కు చెందిన కుక్కట్ల దుర్గాప్రసాద్‌లతో పరిచయం ఏర్పడింది. వారికి నేరాలు ఎలా చేయాలో శిక్షణ నిచ్చాడు. వీరి సాయంతో ఆరిలోవ, విశాలాక్షినగర్, ఆదర్శనగర్, రవీంద్రనగర్, సుజాతనగర్, ఎంవీపీ కాలనీ, దసపల్లా హిల్స్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో 13 వరకు దొంగతనాలకు పాల్పడ్డారు. ఆ వస్తువులను విక్రయించేందుకు బైక్‌పై వెళ్తుండ గా ఆరిలోవ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్.ధనుంజయనాయుడు, ఎస్‌ఐ జి.అప్పన్న, ఏఎస్‌ఐ మోహనరావు, సిబ్బంది హనుమంతువాక వ ద్ద శనివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement