రంగారెడ్డి: బెదిరింపులకు పాల్పడుతూ అక్రమదందాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. కుషాయిగూడలో ఓ స్కూల్ యజమానిని రూ.లక్షా 50 వేలు డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ కేసులో ప్రధాన నిందితుడు సత్యప్రసాద్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఏడుగురుని కూడా అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్టు పోలీసులు తెలిపారు.