కేటుగాళ్లు.. నకిలీ బంగారు నాణేలతో మోసం.. | Fake Gold Coins Gang Arrested In Anantapur District | Sakshi
Sakshi News home page

కేటుగాళ్లు.. నకిలీ బంగారు నాణేలతో మోసం..

Jan 19 2022 2:44 PM | Updated on Jan 19 2022 3:23 PM

Fake Gold Coins Gang Arrested In Anantapur District - Sakshi

తక్కువ ధరకే  బంగారం ఇస్తామని తెలంగాణ వాసి నుంచి పది లక్షల రూపాయలు దోచుకెళ్లిన కర్ణాటక ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

సాక్షి, అనంతపురం జిల్లా: తక్కువ ధరకే  బంగారం ఇస్తామని తెలంగాణ వాసి నుంచి పది లక్షల రూపాయలు దోచుకెళ్లిన కర్ణాటక ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు 10 లక్షల నగదు, కిలోన్నర నకిలీ బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నల్గొండ జిల్లాకు చెందిన పరమేష్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని దుండగులు ఉడాయించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ముఠాను పట్టుకున్నారు.
చదవండి: మసాజ్‌ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement