Fake gold coins
-
కేటుగాళ్లు.. నకిలీ బంగారు నాణేలతో మోసం..
-
కేటుగాళ్లు.. నకిలీ బంగారు నాణేలతో మోసం..
సాక్షి, అనంతపురం జిల్లా: తక్కువ ధరకే బంగారం ఇస్తామని తెలంగాణ వాసి నుంచి పది లక్షల రూపాయలు దోచుకెళ్లిన కర్ణాటక ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు 10 లక్షల నగదు, కిలోన్నర నకిలీ బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నల్గొండ జిల్లాకు చెందిన పరమేష్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని దుండగులు ఉడాయించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ముఠాను పట్టుకున్నారు. చదవండి: మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు -
ఘరానా మోసం
పర్వతగిరి: అతి ఆశ, అమాయకత్వం వారి గొప్ప ముంచింది. తక్కువ ధరకు బంగారం అందిస్తామన్న మోసగాళ్ల మాటలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నకిలీ బంగారం చేతిలో పెట్టి రూ.4లక్షల ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఇస్లావత్ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ధరంసోత్ హుక్యా తెలిపిన వవరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తన ఫోన్ నంబర్ సేకరించి తమ ఇంటి వద్ద పెద్ద ఎత్తున బంగారం ఉందని, తులానికి రూ.20వేలకు అందిస్తామని మాయమాటలు చెప్పాడు. ఇది నమ్మిన హుక్యా బల్లారి వెళ్లి రూ.4లక్షలు చెల్లించి బంగారం తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి చెక్ చేసే సరికి నకిలీ బంగారమని తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. అలా మొదలైంది.. తండాకు చెందిన హుక్యా అన్నయ్య వెంకన్నకు తరచూ బంగారం ఉంది తక్కువ ధరకు ఇస్తామని దుండగులు ఫోన్ చేస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వెంకన్న మేం కూలీ పనిచేసుకుంటాం మా వద్ద డబ్బులు లేవు అని చెప్పినప్పటికీ దుండగులు మళ్లీ మళ్లీ ఫోన్ చేసి ఇబ్బందిపెట్టారు. పదే పదే ఫోన్ చేస్తుడడంతో తమ ఇంటికి బంగారాన్ని చూపించాలనడంతో దుండగుడు నెక్కొండ మండల కేంద్రానికి వచ్చి రెండు చిన్న బంగారు బిళ్లలను అప్పగించి కేవలం రూ.500 తీసుకుని వెళ్లాడు. తదుపరి రెండు రోజు తర్వాత ఫోన్ చేసి అసలు బంగారమో నకిలీదో తేల్చుకుని రండి మీకు ఎంత బంగారం కావాలంటె అంత అప్పగిస్తాను తులానికి రూ.20వేల చొప్పున అని మాయ మాటలతో నమ్మించాడు. పక్కనే ఉన్న హుక్యా గతంలో ఇచ్చిన బంగారాన్ని చెక్ చేయించాడు. నిజమైన బంగారమని తేలడంతో ఇతరుల వద్ద అప్పుగా రూ. 4.50లక్షలు తీసుకువచ్చి వెంకన్నతో పాటు మరో వ్యక్తితో బల్లారి బయలుదేరారు. బల్లారి వద్ద దబ్బులను దుండగుల చేతిలో పెట్టి నకిలీ బంగారం తీసుకు వచ్చారు రౌడీలకు బయపడి... దుండగుడు నకిలీ బంగారం ఇచ్చాడని నిర్ధారణకు వచ్చిన హుక్యా, వెంకన్న వారిని నిలిదిసేందుకు బయపడ్డారు. డబ్బులు చెల్లించి నకిలీ బంగారం తీసుకునే సమయంలో సుమారు ఇరవై మంది పక్కనే ఉన్నట్లు తెలిపారు. ప్రాణాలను రక్షించుకోవాలనే తపనతో అక్కడి నుండి బయపడి వెనక్కి తిరిగారు. పోలీసులు ఫోన్ చెసినప్పటికీ.. కర్ణాటక పోలీసులు కొద్ది రోజులకు దుండగులను పట్టుకుని విచారిస్తున్న సమయంలో వారి ఫోన్ నంబర్లు బయటపడ్డాయి. ఫోన్ సమాచారంతో పోలీసులు బాధితుడికి ఫోన్ చేసి బల్లారికి వచ్చి పిటిషన్ ఇవ్వాలని తెలిపినప్పటికీ బాధితుడు బయపడి బల్లారికి వెల్లడం మానేశాడు. పోలీసులు మాత్రం దుండగులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిడుతు ఫిర్యాదు చేస్తే సహకారం అందిస్తామని కర్ణాటక పోలీసులు తెలిపినట్లు సమాచారం. స్థానిక పోలీసులు సహకరించి డబ్బులు ఇప్పించాలని బాధిడుతు, అతడి భార్య వేడుకుంటున్నారు. -
బంగారు నాణేల పేరుతో మోసం: ముఠా అరెస్టు
గోరంట్ల(అనంతపురం): నకిలీ బంగారు నాణేలను అంటగడుతూ ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు అనంతపురం జిల్లా గోరంట్ల పోలీసులు. కొత్తచెర్వు సీఐ శ్రీధర్ తెలిపిన వివరాలివీ.. ధర్మవరం ప్రాంతానికి చెందిన రామాంజనేయులు, అలివేలమ్మ, హనుమంతరాజు, ఉత్తమ్‌రెడ్డి, నారాయణస్వామి, అంజయ్య అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి గోరంట్ల తదితర ప్రాంతాల్లోని గ్రామాల్లో తిరుగుతూ తమకు బంగారు నాణేలు దొరికాయని, వాటిని చాలా తక్కువ ఖరీదుకే ఇస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. వారి మాటలను నమ్మిన అమాయకులు డబ్బులు, కొందరు బంగారు నగలను ఇచ్చి నాణేలను తీసుకుంటున్నారు. అయితే, మోసపోయినట్లు గ్రహించిన చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గోరంట్ల ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం ఉదయం టాటా సుమో వాహనంలో ముఠా సభ్యులంతా బెంగళూరు వైపు వెళ్తుండగా గోరంట్ల సమీపంలో అడ్డుకుని, స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి పావు కిలో నకిలీ బంగారు నాణేలు, వృషభ ఆకారంలో ఉన్న పురాతన పాత్రతోపాటు రూ.1.20 లక్షల నగదును, నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. టాటాసుమోను సీజ్ చేశారు.