బుక్కరాయసముద్రం(అనంతపురం జిల్లా): మండలంలోని రేకులకుంటలో గురువారం ఓ చైన్‌స్నాచర్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని పుట్లూరు మండలానికి చెందిన పరమేశ్వరెడ్డిగా గుర్తించారు. వివరాలు.. గురువారం ఉదయం పుట్లూరు నుంచి అనంతపురానికి ద్విచక్ర వాహనంపై వస్తున్న పరమేశ్వరరెడ్డి.. రేకులకుంటలో వీరనారాయణమ్మ అనే మహిళ ఇంటి వద్ద ఆపి తాగునీరు అడిగాడు. ఆమె నీళ్లు అందిస్తుండగా మెడలోని బంగారు గొలుసు లాక్కొని ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లిపోయాడు.
చదవండి: ఆనందంగా గడిపి.. కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక..
బాధితురాలి కేకలతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే బీకేఎస్ సీఐ సాయిప్రసాద్‌కు సమాచారం అందించడంతో సెట్ ద్వారా ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. అప్పటికే కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు చేపట్టిన బందోబస్తుకు వెళ్లిన సిబ్బంది.. వెంటనే చెరువు కట్ట గోశాల వద్ద బ్యారికేడ్లను అడ్డుగా ఉంచి తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసుల చర్యలను గమనించిన పరమేశ్వరరెడ్డి ద్విచక్ర వాహనాన్ని వదిలి చెరువులోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన పోలీసులు వెంబడించి నిందితుడిని అదుపులోకి 3.50 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment