కొత్త నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్ | ew notes exchange gang arrested in vizianagaram | Sakshi
Sakshi News home page

కొత్త నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్

Published Tue, Dec 13 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

ew notes exchange gang arrested in vizianagaram

విజయనగరం: కొత్త నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను విజయనగరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కొత్త నోట్లకు అదనంగా 20 శాతం పాత నోట్లు ఇస్తామని తొమ్మిది మంది ఉన్న ముఠా ప్రజలను నమ్మిస్తోంది. గత కొంత కాలం నుంచి నోట్లను మార్పిడి చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారి వద్ద ఉన్న రూ.2.10 లక్షలు విలువైన కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement