Sauce
-
అత్యంత స్పైసీ హాట్ సాస్..జస్ట్ మూడు నిమిషాల్లో..!
కొంచెం నోటికి ఘాటుగా తగిలితేనే హ్హ..హ్హ అంటూ హాహాకారాలే చేస్తాం. ఎప్పుడైనా సరదాగా స్పైసీ ఫుడ్ తిన్న కూడా అమ్మ బాబోయ్ ఏంటీ ఘాటూ అని గోల చేసేస్తాం. అలాంటిది ఇక్కడొక వ్యక్తి అత్యంత స్పైసీగా ఉండే రెండు సాస్ బాటిల్స్‌ని చక్కగా తినేసి గిన్నిస్ రిక్కార్డుల కెక్కాడు.కెనడాకు చెందిన యూట్యూబర్ మైక్ జాక్ రెండు బాటిళ్ల చిల్లీ సాస్ని జస్ట్ మూడు నిమిషాల్లో హాంఫట్ చేసేశాడు. ఏదో తియ్యటి సూప్ తాగుతున్నట్లుగా తాగేసి ఔరా అనిపించుకున్నాడు. అత్యంత ఘాటుగా ఉండే సాస్ ఇది. కొంచెం టేస్ట్ చేయగానే కళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి. అలాంటిది మన మైక్ దాన్ని అమృతం తాగినట్లు తాగిసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. పైగా ఈ స్టంట్ పూర్తి అయిన తర్వాత ఎలా తినేయగలిగావు ఈ సాస్ని అని ప్రశ్నిస్తే..తనకు ఫ్లేవర్ ఫెటీగ్ టెక్నీక్ని ఉపయోగించి తినేశానంటూ వివరణ ఇచ్చాడు. అంటే తనకిష్టమైన ఫ్రూట్ ఊహించుకుని ఆ రుచిని ఆశ్వాదిస్తూ తినడమే "ఫ్లేవర్ ఫెటీగ్" టెక్నిక్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రం అతడు తింటుంటే మా నోటిలోకి నీళ్లు వచ్చేసాయని కామెంట్ చేస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: వామ్మో..! రాను రాను హోటల్లో ఆతిథ్యం ఇలా ఉంటుందా..!) -
మట్టి పరిమళం: ఈ పెర్ఫ్యూమ్తో.. బయట వర్షం పడుతుందేమో అనే అనుభూతి..
వేడి, పొడి వాతావరణంలో ఒక్కసారిగా కురిసే చినుకులతో భూమి నుండి వెలువడే ఆహ్లాదకరమైన సువాసన మనసును సేదతీరుస్తుంది. ఇది మట్టి వెదజల్లే సహజ పరిమళం కావడంతో మన మనసుల్ని సంతోష సాగరంలో విహరింపజేస్తుంది. తొలకరి చినుకులు నేలను తాకినప్పుడు వచ్చే ఈ మట్టి సువాసనను ఆస్వాదించడంలో ఆడ–మగ అనే భేదమేమీ లేదు. అందుకే, ఈ సువాసనలు ఇప్పుడు అత్తరు రూపంలో అందరినీ అల్లుకు పోతున్నాయి.ప్రకృతి నుండి ప్రేరణ పొంది, సురక్షితమైన పదార్థాలతో తయారైన మట్టి అత్తరు పరిమళాలకు వందల సంవత్సరాల నైపుణ్యం గల వారసత్వ కంపెనీలు కూడా ఉన్నాయి. చెమట వాసనను దూరం చేస్తూ విభిన్న శ్రేణి వ్యక్తులను ఆకర్షిస్తుంది. ‘ది సెంట్ ఆఫ్ రైన్’ లేదా ‘పెట్రిచోర్ ఎసెన్షియల్ ఆయిల్’గా ప్రసిద్ధి చెందినవీ ఉన్నాయి. అన్ని దేశాలలోనూ ఈ తరహా సువాసనలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆఫ్‌లైన్–ఆన్లైన్ మార్కెట్లో వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఈ ఎర్త్ సెంటెడ్ పెర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి.చెక్.. తప్పనిసరి:– మనసును కదిలించే ఈ సువాసనగల అత్తరులో ఆల్కహాల్ వాడకం లేనివి ఎంచుకోవాలి.– అత్తరు లేదా పెర్ఫ్యూమ్ మన చర్మ తత్త్వానికి సరిపడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ముందుగా దూది ఉండతో మణికట్టు, చెవి వెనక భాగాన కొద్దిగా అద్ది/స్ప్రే చేసి, 30 నిమిషాలు ఉండాలి. సరిపడితే రోజూ ఉపయోగించుకోవచ్చు.ప్రయోజనాలు ఏంటంటే?– మట్టి పరిమళం గల సహజ అత్తరు/పెర్ఫ్యూమ్ను వాడి మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ కావచ్చు.– ఏకాగ్రతను మెరుగుపరుచుకోవాలనుకునేవారికి ఉత్తమమైన సాధానాలలో మట్టి పరిమళం ఒకటి లగ్జరీ హోటళ్లు, యోగా అండ్ ఆయుర్వేద రిసార్ట్‌లలో, అరోమా థెరపీ రిట్రీట్‌లలో సుగంధ లేపనాల తయారీలోనూ ఈ మట్టి అత్తరును ఉపయోగిస్తుంటారు.– మట్టి పరిమళం స్ప్రే చేసుకొని వెళితే మీ చుట్టూ ఉన్నవారు బయట వర్షం పడుతుందేమో అన్న అనుభూతికి లోనుకాకుండా ఉండలేరు.ఇవి చదవండి: Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్! -
సాస్ బాటిల్ నాకిన విద్యార్థి.. కోట్లలో నష్టం, లబోదిబోమంటున్న కంపెనీ!
టోక్యో : పిల్లల్ని బయటకు తీసుకెళ్తే వాళ్లు చేసే అల్లరి మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో షికారు అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అలా లేదంటే ఒక్కోసారి మూల్యం భారీగానే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఈ తరహా ఘటనే జపాన్‌లో చోటు చేసుకుంది. ఓ సంస్థ ఒక బాలుడి చేసిన పనికి తమకు నష్టం వాటిల్లిందని ఏకంగా రూ.4 కోట్లు జరిమానా చెల్లించాలని కోర్టులో దావా వేసింది. అసలేం అక్కడ ఏం జరిగిందంటే.. వివరాల్లోకి వెళితే.. ఒసాకా జిల్లా కోర్టులో దాఖలైన వ్యాజ్యం ప్రకారం, ఓ విద్యార్థి జనవరి 3న స్నేహితుడితో కలిసి గిఫు ప్రిఫెక్చర్‌లోని సుషిరో అవుట్‌లెట్‌ను సందర్శించాడు. రెస్టారెంట్లో ఉన్నప్పుడు, సుషిరో కంపెనీకి చెందిన ఉత్పత్తులు తయారైన తర్వాత కన్వేయర్ బెల్టుపై వెళ్తుండగా, అతను తన వేలిని చీకి కన్వేయర్ బెల్టుపై ఉన్న ఒక ప్లేట్‌ను తాకాడు. అంతటితో ఆగకుండా సోయాసాస్ బాటిల్, కప్‌ను నాకాడు. ఇదంతా అక్కడ అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. (చదవండి: ‘కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. పరువును బజారుకీడ్చొద్దు’) విద్యార్థి అపరిశుభ్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీని తర్వాత జపాన్‌లోని సుహీరో రెస్టారెంట్లు కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపారు. సుషీ చైన్ సూట్ కూడా ఈ సంఘటన తన మాతృ సంస్థ కేవలం రెండు రోజుల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్లో 16 బిలియన్ యెన్ల కంటే ఎక్కువ నష్టపోవడానికి కారణమైందని పేర్కొంది. దీంతో తమకు కలిగిన నష్టానికి నష్టపరిహారంగా 67 మిలియన్ యెన్లు (భారత కరెన్నీ ప్రకారం 4 కోట్ల రూపాయలు) చెల్లించాలంటూ బాలుడిపై ఆ సంస్థ దావా వేసింది. 🇯🇵 FLASH - Le "terrorisme du sushi" fait fureur au #Japon : des adolescents s’amusent à se filmer en train de lécher la vaisselle ou jouer avec la nourriture, dans des restaurants de #sushis servis sur tapis roulant. (HuffPost) #sushiterrorism #sushiterro pic.twitter.com/Wlpm0JlGj6 — Mediavenir (@Mediavenir) February 4, 2023 చదవండి: ‘ఆకలేస్తోంది.. అమ్మ చనిపోయింది!’.. వాళ్లను నవ్వించేందుకు రెస్క్యూ టీం ఏం చేసిందంటే..! -
సాస్ ఇవ్వలేదని రెస్టారెంట్‌ను బాంబులతో పేల్చేస్తానన్నాడు.. చివరికి
ఆహారం విషయంలో కొంతమంది భోజన ప్రియులు కచ్చితంగా ఉంటారు. అలాగే వారికి నచ్చిన ఆహారం కోసం గతంలో కొందరు వందల కిలోమీటర్లు వెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఓకే గానీ ఏదైనా సృతి మించకూడదని అంటారు. కాగా ఓ వ్యక్తి ఆ విషయంలో చాలా దూరం వెళ్లాడు. ఎంతంటే ఏకంగా రెస్టారెంట్‌ను బాంబులతో పేల్చేస్తానంటూ ఆ యజమానికే కాల్ చేసి బెదిరిస్తూ రెచ్చిపోయాడు. అసలు అతనికి అంతలా ఆగ్రహానికి గల కారణం తెలిస్తే షాక్ అవుతారు. మరేమీ లేదండీ.. సాస్ ఇవ్వడం మరిచిపోయాడని అతను అంత రచ్చ చేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లోవాలో నివసిస్తున్న రోబర్ట్ గాల్విట్జెర్ ఫుడ్ రెస్టారెంట్ సంస్థ మెక్ డొనాల్డ్స్‌కు ఫోన్ చేసి చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ చేశాడు. మెక్‌డొనాల అంటేనే చికెన్ నగ్గెట్స్, బర్గర్స్కి ప్రత్యేకమని అందరికీ తెలిసిన విషయమే. ఇంకేముంది రుచికరమైన వంటకం వస్తోంది, ఓ పట్టు పట్టాలి అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతనికి చికెన్ నగ్గెట్స్ అందాయి. కానీ, అవి డిప్ చేసి తినేందుకు అందులో సాస్ ఇవ్వడం ఆ రెస్టారెంట్ సిబ్బంది మరిచిపోయారు. అసలు సాస్ లేకుండా ఎలా డెలివరీ చేస్తారని మనోడికి కోపం వచ్చింది. వెంటనే డెలివరీ సిబ్బందిని కొట్టడమే కాకుండా, రెస్టారెంట్‌కు ఫోన్ చేసి.. బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాల్విట్జెర్‌ను అరెస్టు చేశారు. చదవండి: వాంటెడ్ క్రిమినల్‌గా ‘మార్క్ జుకర్‌బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు -
టేస్టీ టొమేటి
టొమాటో కొనకుండా కూరగాయలు కొనటం పూర్తి కాదు. ఏ వంటలోనైనా పడక తప్పని కాయగూర టొమాటో. కాని టొమాటోకే ఒక అస్థిత్వం ఉంది. దానికంటూ కొన్ని రెసిపీలున్నాయి. అది చేసే కొన్ని మేళ్లు ఉన్నాయి. అది చూపే కొన్ని రుచులు ఉన్నాయి. పిజ్జా సాస్, టొమాటో సాస్, టొమాటో షోర్బా, టొమాటో ఖజూర్ చట్నీ, టొమాటో చోకా... వీటిని ప్రయత్నించండి, టొమాటోనే మేటి అనండి. టొమాటో చోకా కావలసినవి: టొమాటోలు – 200 గ్రా; పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; ఆవ నూనె – అర టీ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, పొడిగా ఉన్న గ్రిల్ మీద ఉంచి కాల్చాలి (పెనం మీద కూడా వేడి చేసుకోవచ్చు) ∙బాగా కాలే వరకు ముందుకి, వెనక్కు తిప్పుతూ కాల్చి తీసేసి, చల్లారనివ్వాలి ∙బాగా చల్లారాక తొక్కలు తీసేసి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఆవ నూనె, నిమ్మ రసం జత చేయాలి ∙ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి ∙పరాఠా, చపాతీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది. పిజ్జా సాస్ కావలసినవి: టొమాటో ముక్కలు – 3 కప్పులు; వెల్లుల్లి తరుగు – టీ స్పూను; పుదీనా – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – తగినంత. తయారీ ►టొమాటోలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి గుజ్జు చేసి, పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి ►టొమాటో గుజ్జు జత చేసి నాలుగైదు నిమిషాలు సన్నని మంట మీద వేయించాలి ►గుజ్జు బాగా ఉడికిన తరవాత, పుదీనా ఆకులు, ఉప్పు, మిరియాల పొడి జత చేసి, దింపేయాలి ►పిజ్జా మీద సాస్ వేసి సర్వ్ చేయాలి. టొమాటో సాస్ కావలసినవి: టొమాటోలు – రెండున్నర కిలోలు; వెల్లుల్లిరెబ్బలు – 15; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 10; కిస్మిస్ – అర కప్పు; వైట్ వెనిగర్ – అర కప్పు; ఉప్పు – తగినంత; పంచదార – ఒక కప్పు; సోడియం బెంజోట్ – పావు టీ స్పూను. తయారీ: ∙టొమాటోలను నీళ్లలో శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి ∙స్టౌమీద పెద్ద పాత్రలో టొమాటో ముక్కలు వేసి, అల్లం వెల్లుల్లి, ఎండు మిర్చి, కిస్మిస్, వైట్ వెనిగర్, ఉప్పు, పంచదార జత చేసి, బాగా కలియబెట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) టొమాటో గుజ్జు బాగా ఉడికి చిక్కబడ్డాక దింపి (సుమారు అరగంట సమయం పడుతుంది) చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసి, జల్లెడ పట్టాలి ∙ఈ గుజ్జును ఒక పెద్ద పాత్రలో వేసి మరోమారు స్టౌ మీద ఉంచి సుమారు అర గంట సేపు ఉడికించాలి ∙ఒక చిన్న పాత్రలో ఒక టీ స్పూను నీళ్లు, పావు టీ స్పూను సోడియం బెంజోట్ వేసి కరిగేవరకు కలిపి, తయారైన కెచప్‌లో వేసి కలిపి దింపేయాలి ∙చల్లారాక జాడీలోకి తీసుకుని భద్రపరచుకోవాలి ∙ఫ్రిజ్‌లో ఉంచి, రెండు రోజుల తరవాత వాడుకోవాలి. టొమాటో ఖజూర్ చట్నీ కావలసినవి: ఆవ నూనె – 2 టేబుల్ స్పూన్లు; పాంచ్ పోరన్ (మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, సోంపు) – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; అల్లం తురుము – అర టీ స్పూను; టొమాటోలు – పావు కేజీ; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; ఖర్జూరాల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేడి చేశాక, పాంచ్ పోరన్ జత చేసి వేయించాలి ∙ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙అల్లం తురుము జత చేసి, కొద్దిసేపు వేయించాలి ∙టొమాటో తరుగు జత చేయాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టి, మూత ఉంచి, సుమారు పది నిమిషాల పాటు ఉడికించాలి ∙మెత్తగా ఉడికిన తరవాత కిస్మిస్, ఖర్జూరాల తరుగు జత చేసి మరోమారు కలపాలి ∙పంచదార, ఆమ్చూర్ పొడి జత చేసి మరోమారు కలిపి, మూత ఉంచి, సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపి, చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి (ఫ్రిజ్‌లో ఉంచితే సుమారు నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది). టొమాటో షోర్బా కావలసినవి: టొమాటో తరుగు – 2 కప్పులు; నూనె – అర టేబుల్ స్పూను; బిర్యానీ ఆకు – 1; జీలకర్ర – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; ధనియాల పొడి – పావు టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – తగినంత. తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో అర టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి కలియబెట్టాలి ∙టొమాటో గుజ్జు, బిర్యానీ ఆకు జత చేసి బాగా కలపాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి జత చేసి బాగా కలియబెట్టాలి ∙రెండు కప్పుల నీళ్లు జత చేయాలి ∙మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు ఉడికించాక, ఉప్పు జత చేయాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి దింపేయాలి ∙ఇది వెజ్ పులావు, కాజూ రైస్, జీరా రైస్‌లతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. -
భయంకరమైన క్షణం బతికివున్న ఎలుకల్ని తినేసాడు
-
నిన్న నెయ్యి.. నేడు సాస్!
హైదరాబాద్: తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెడ్తూ కల్తీ ఆహార పదార్థాలు తయారుచేస్తున్న ముఠాలు బరితెగిస్తున్నాయి. విజయవాడలో భారీగా కల్తీ నెయ్యి తయారుచేస్తూ శుక్రవారం ఓ ముఠా పట్టుబడగా.. శనివారం హైదరాబాద్‌లో కల్తీ సాస్ తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. వనస్థలిపురంలో రసాయన పదార్థాలతో కల్తీ సాస్ తయారుచేస్తున్న ఓ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 30 డ్రమ్‌ల సాస్, భారీగా కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
నిన్న నెయ్యి.. నేడు సాస్!