పంట కుంటవద్ద మృతి చెందిన చేపలు
కౌడిపల్లి(నర్సాపూర్): గిరిజన రైతుల చేపలు పెంచే ఫాంపాండ్ (పంటకుంట)లో గుర్తుతెలియని వ్యక్తులు విషం చల్లడంతో సుమారు 32వేల చేపలు మృతి చెందగా, సుమారు రూ.10లక్షల వరకు నష్టం వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కొట్టాల పంచాయతీ లింగంపల్లి బిట్లతండాలో జవాహర్ నాయక్ పంటకుంట (ఫాంపాండ్)లో వివిధ రకాలకు చెందిన 32వేల చేపలను పెంచుతున్నాడు. ప్రస్తుతం పావు కిలో సైజ్‌లో పెరిగాయి. రోజు అక్కడే కాపలా ఉండే జవాహర్ నాయక్ కుంటుంబ సభ్యులు శనివారం మొక్కజొన్న తెంపేందుకు వెల్లారు. ఆదివారం ఉదయం నుంచి ఒక్కొక్కటి చేపలు చనిపోగా మధ్యాహ్నం వరకు పూర్తిగా చనిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేపలు పెంచే పంటకుంటలో విషం కలపడంతోనే మృతి చెందాయని బాధితుడు తెలిపారు. దీంతో సుమారు 10లక్షలు నష్టపోయానని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment