Fish pond
-
డేంజర్ ‘డెవిల్’ ఫిష్!
తెనాలి: అత్యంత ప్రమాదకరమైన డెవిల్ ఫిష్ (దెయ్యపు చేప) గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులోని చేపల చెరువులో ప్రత్యక్షమైంది. నదులు, సముద్రాలకే పరిమితం కావాల్సిన ఈ చేపలను చూసి రైతు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. దావులూరుకు చెందిన కోట రాంబాబు వ్యవసాయం చేస్తూనే, ఎకరంన్నర విస్తీర్ణం గల చెరువులో చేపల పెంపకం చేస్తున్నారు. గత ఆగస్టులో మార్కెట్ డిమాండ్ కలిగిన బొచ్చె, రాగండి, గడ్డి చేపల సీడ్‌ను రెండు వేల కౌంటు చెరువులో వేశారు. రోజూ మేత వేస్తున్నారు. ఫీడింగ్ ఎలా ఉంది? చేపలు ఎదుగుతున్నాయా? వ్యాధులు ఏమైనా అశించాయా? అనేది తెలుసుకునేందుకు బుధవారం వల వేయించి చేపలు పట్టించాడు. వాస్తవంగా తాము చెరువులో వేసిన చేపలు ఒకటీ, రెండూ మాత్రమే వస్తూ, డెవిల్ చేపలు ఎక్కువ పడుతుండడాన్ని గమనించాడు. వలకు బొచ్చె, రాగండి చేపలు తక్కువగా రావటమే కాదు...వచ్చి న ఒకటీ ఆరా చేప కూడా అర కిలో బరువు తూగాల్సి ఉంటే, కేవలం పావు కిలోకు మించలేదని చెప్పారు. అంటే డెవిల్ చేపలు రోజూ వేస్తున్న మేతను, చేపలను కూడా తినేస్తున్నాయన్న నిర్ధారణకు వచ్చి, ఆందోళనలో పడ్డాడు. కృష్ణానదికి మూడునెలల క్రితం వచ్చిన భారీ వరదలతో డెవిల్‌ఫిష్ ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి డెవిల్‌ఫిష్ 2016లో తొలిసారిగా కృష్ణానదిలో విజయవాడ వద్ద కనిపించింది. భూమిమీద కూడా వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డెవిల్ ఫిష్, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 65 శాతం నీటివనరులకు విస్తరించిందని అంచనా వేస్తున్నారు. స్థానిక చేపల జాతులను విపరీతంగా తినేస్తూ.. సున్నితమైన జల జీవావరణ వ్యవస్థనూ దెబ్బతిస్తుంది. విభిన్నమైన ఆహారాలను తీసుకునే ఈ చేపలు అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేరు. ఆక్సిజను లేని పరిస్థితిని కూడా తట్టుకుంటాయి. కొన్ని సందర్భాల్లో వలలకు నష్టం చేయడంతో పాటు మత్స్యకారులకు గాయాలను కూడా చేసిన ఘటనలున్నాయి. 152 విభిన్న మంచినీటి చేప జాతులకు నిలయమైన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో డెవిల్ ఫిష్‌ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని, లేకుంటే చేపల చెరువులు, పంట కాలువలు, నదుల్లో చేపల ఉత్పత్తికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తీర్పే బలం, బలగం
⇒ పొద్దు పొడవక ముందే భుజాన వెదురు గెడకు మావులు, సల్దికూడు (సద్దన్నం) క్యారేజీ తగిలించుకుని గోచీ పెట్టుకుని నడిచి వెళ్లి కొల్లేరులో తాటి దోనెలపై తిరిగి సహజసిద్ధంగా చేపలను వేటాడి మార్కెట్‌కు పోయి అయినకాడికి అమ్ముకుని బతుకు నెట్టుకొచ్చిన మట్టి మనుషులు ఒకనాడు. ⇒ సమాజంలో మిగిలిన వారిలాగానే కాలానికి అనుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకుని చేపల చెరువులతో ఆదాయం ఆర్జించి అభివృద్ధివైపు అడుగులు వేసిన గట్టి మనుషులు నేడు.⇒ రాష్ట్రంలోని ఏలూరు–పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో నివసించే ప్రజల జీవన గమనాన్ని పరిశీలిస్తే గొప్ప సందేశాన్ని బాహ్య ప్రపంచానికి పంచుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కొల్లేరులో ఎదిరీదే బతుకుచిత్రమిదీ. జీవన విధానంలో మార్పులు వచ్చినా కొల్లేరులో మనిషి మారలేదు. వారి మనసూ మారలేదు. కార్పొరేట్ కల్చర్, కుట్రలు, కుతంత్రాలు వారిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు.ఎన్ని కష్టాలొచ్చినా ఐక్యమత్యమే మహాబలం అనేదానికి కొల్లేరువాసులు నిలువెత్తు సాక్ష్యం. ఇది ఒకటి రెండేళ్లు కాదు. ఏకంగా 150 ఏళ్ల క్రితం నుంచి వారంతా ఒకే మాట, ఒకే బాట అనే తీరుతో ముందుకు సాగుతున్నారు. పరస్పర సహకారం, గ్రామాభివృద్ధికి తోడ్పాటు, వ్యక్తిగత తగాదాలు, కుటుంబంలోని పేచీలు ఇలా విషయం ఏదైనా సరే వారంతా గ్రామంలోనే నిర్ణయం తీసుకునే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. – సాక్షి, అమరావతిఆకాశంలో విహరించే పక్షుల సమూహాలు...నీటిలో జలపుష్పాల పరుగులు ..చుట్టూ నీటి మధ్యలో దీవుల్లాంటి భువిపై వెలిసిన గ్రామాల్లో జీవనం సాగించే అ‘సామాన్యులు’. ఇది మంచినీటి సరస్సుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘కొల్లేరు’తో పెనవేసుకున్న జీవరాశులతో సహజీవనం.కాంటూరు కుదింపునకు వైఎస్ సర్కారు తీర్మానంకొల్లేరు ఐదో కాంటూరు వరకు 77,138 ఎకరాల విస్తీర్ణాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. దీన్ని మూడో కాంటూరుకు కుదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కాంటూరు పరిధి తగ్గించడం వల్ల 43,072 ఎకరాలు అభయారణ్యం పరిధి నుంచి బయటపడతాయి. వాటిలో పట్టా భూములు 14,932 ఎకరాలు, జిరాయితీ భూములు 5,510 ఎకరాలను వాటి హక్కుదారులకు అప్పగించగా మిగిలిన భూమిని పేదలకు పంచాలన్నది అప్పటి వైఎస్ ప్రభుత్వ సంకల్పం. కానీ పర్యావరణ, న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉండటంతో కాంటూరు కుదింపు జరగలేదు.వైఎస్ హయాంలో రూ.1300 కోట్లతో కొల్లేరులో ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అమలు చేశారు. వైఎస్సార్ హయాంలో ప్రతిపాదించిన రెగ్యులేటర్ నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కదలిక వచ్చింది. కొల్లేరులోని సర్కారు కాలువపై కీలకమైన వంతెన నిర్మాణానికి వైఎస్సార్ హయాంలో నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాన్ని చేపట్టలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ వంతెన నిర్మాణం పూర్తి చేయడం గమనార్హం.పెద్దొడ్డి మాటేశిరోధార్యం..కొల్లేరులో భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు జీవించొచ్చు కానీ వారిలో భిన్నమైన మాటలు మాత్రం ఉండవు. వ్యక్తిగత, సామాజిక, రాజకీయ అంశాలైనా అక్కడ ఊరి పెద్దగా చెలామణి అయ్యే పెద్దొడ్డి (పెద వడ్డి) మాటే శిరోధార్యం. రెండు జిల్లాల్లోని 122 గ్రామాల్లోను ప్రజలందరూ కలిసి కొందరికి పెద్దరికం కట్టబెడతారు. తొలినాళ్లలో బయట వారి నుంచి రక్షణ కల్పించుకునేందుకు, వ్యక్తిగత ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తమకు తాముగా సంఘాలు పెట్టుకుని నాయకులను (పెద్దొడ్డి) పెట్టుకునే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ఒక్కో గ్రామంలో నలుగురి నుంచి 12 మంది వరకు పెద్దొడ్డిలుంటారు. ఏ సమస్య వచ్చినా గ్రామం నడిబొడ్డున ఉండే చావిడి, ఆలయంలో పెద్దొడ్డిలను ఆశ్రయిస్తారు. సాధారణంగా అందరూ పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు వచ్చాక సాయంత్రం సమయంలో ఈ పంచాయతీలు నడుస్తుంటాయి. రెండు వైపులా వాదనలు విని స్థానిక న్యాయస్థానాలు మాదిరిగా వారిచ్చే తీర్పును ప్రజలు ఆచరిస్తారు. చిత్రం ఏమిటంటే పేచీలు పెట్టుకుని వారు పోలీస్ ఠాణాలు, బయటి వారి గడప తొక్కరు. దశాబ్దాలు గడిచినా అదే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.ఒడిశా నుంచి వలసొచ్చి...విస్తరించిపొట్ట చేతపట్టుకుని రాష్ట్ర సరిహద్దులు దాటి ఒడిశా నుంచి వలసొచ్చిన 50 కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి కొల్లేరులో గ్రామాలను నిర్మించాయి. దాదాపు 150 ఏళ్ల కిందట వచ్చిన వడ్డెర (వడ్డీలు) కులానికి చెందిన వలస జనం ప్రధానంగా చేపల వేటపైనే ఆధారపడి బతికేవారు. ఎటుచూసినా నీరు, మధ్య దిబ్బలాంటి ప్రాంతాల్లో దట్టమైన పొదలతో అడవికంటే భయంకరంగా ఉండే ఆ ప్రాంతంలో మానవమాత్రుడు ఉండటం కష్టంగా ఉండే రోజుల్లోనూ నాగరికతకు దూరంగా బతకడం మొదలైంది. పొదలు, తుప్పలను బాగుచేసి కొల్లేరులో దొరికే కిక్కిసకర్రలతో చిన్నపాటి గుడిసె (పాకలు) వేసుకుని జీవించేవారు.కొల్లేరు నీటి అడుగు దొరికే అలిపిరి కాయలు, కాలువ దుంపలను ఆహారంగా తినేవారు. కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే నల్లజాతి చేపలు పుష్కలంగా ఉండటంతో వాటిని వేటాడి బయట ప్రాంతాల్లో విక్రయించి కుటుంబాలను పొషించుకునే వారు. వడ్డీలతోపాటు సమీప ప్రాంతాల్లోని ఎస్సీలు కూడా కొల్లేరులో స్థిరపడి చేపల వేటపై జీవనం సాగిస్తున్నారు.జీవన చిత్రాన్ని మార్చేసిన చెరువులుకొల్లేరులో చేపల చెరువులు ఆ ప్రాంత వాసుల జీవన చిత్రాన్ని మార్చేశాయి. చిత్రం ఏమిటంటే కొల్లేరు వాసులు బతకడం కోసం గతంలో కొల్లేరులో చేపల చెరువులు తవ్వకపోతే ప్రభుత్వం కేసులు పెడితే...జనజీవనానికి ప్రమాదంగా పరిణమించిన కాలుష్యకారక చేపల చెరువులను తొలగించకపోతే కేసులు పెట్టాల్సిన పరిస్థితి వరకూ వచ్చింది. కొల్లేరులో చేపల వేటపైనే ఆధారపడిన వారికి మేలు చేసేలా సొసైటీలుగా ఏర్పడి ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వుకునేలా 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిర్ణయం తీసుకున్నారు.కొల్లేరు వాసులకు దానిపై అవగాహన కల్పిస్తూ శృంగవరప్పాడు గ్రామంలో తొలి సొసైటీ చెరువు తవ్వకానికి శంఖుస్థాపన చేశారు. సహజసిద్ధంగా చేపల వేటపై ఆధారపడి బతికే తమ పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం సొసైటీ చెరువులు తవ్విస్తోందంటూ కొల్లేరు వాసులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. వారిని కట్టడి చేసేలా కేసులు పెట్టి, నిర్బంధంగా చెరువులు తవ్వేలా అప్పట్లో ప్రభుత్వం వ్యహరించింది. క్రమంగా సొసైటీల పేరుతో కొల్లేరులో ప్రాంతాలు విభజించుకుని కొల్లేరు వాసులు చేపలను వేటాడుకుని మెరుగైన జీవనానికి అలవాటు పడ్డారు.కొల్లేరుపై కన్నేసిన పొరుగు ప్రాంతాల వాళ్లు రంగంలోకి సొసైటీలకు డబ్బులు (లీజు)ఇచ్చి చెరువులు తవ్వి పెద్ద ఎత్తున చేపలసాగు చేపట్టడంతో పర్యావరణ సమస్య ఉత్పన్నమైంది. దీంతో పర్యావరణ సంస్థలు పోరాటంతో న్యాయస్థానాల ఆదేశాలతో ప్రభుత్వం కొల్లేరు పరిరక్షణకు 120 జీవో జారీచేయడం, చేపల చెరువుల తొలగింపునకు(కొల్లేరు ఆపరేషన్) నిర్వహించడం చకచకా జరిగిపోయింది.మగ బిడ్డకూ వాటా..రెండు జిల్లాల్లో తొమ్మిది మండలాల్లో విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు 80 వేల కుటుంబాల్లో మూడు లక్షల 30 వేల మంది జీవిస్తున్నారు. రెండు లక్షల పది వేల మంది ఓటర్లున్న కొల్లేరులో ఉన్న సొసైటీలు, గ్రామాలు వారీగా ఉన్న చెరువుల ఆదాయం (లీజు)లో ప్రతీ కుటుంబంలోను పెద్దకు వాటాలు ఇస్తారు. పుట్టిన మగ బిడ్డకు కూడా వాటాలు వేస్తారు. కొల్లేరుకు అక్కడివారు వలసరాక ముందే కొల్లేటి కోటలో వెలసిన పెద్దింట్లమ్మ అమ్మవారే ఆయా ప్రాంత వాసులకు పెద్దదిక్కు. ప్రతీఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. పెద్దయ్యాక వాటా ఇస్తారు. -
చెరువులో చేపల మేత వేస్తూ..
జగ్గయ్యపేట: చేపల చెరువులో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆధ్వర్యంలో సాగవుతున్న చేపల చెరువు రక్షణకు ఒంగోలుకు చెందిన మేడా వెంకట్రావ్ (27), భార్య, ఇద్దరు పిల్లలతో కాపలాదారునిగా ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్న సమయంలో అదే గ్రామానికి చెందిన వల్లెపు ప్రవీణ్ (22) కూలీ పనుల్లో భాగంగా చెరువు వద్దకు వెళ్లాడు. కాపలాదారు వెంకట్రావ్, ప్రవీణ్ చేపలకు మేత వేసేందుకు ఒడ్డునున్న ఇనుప రేకు పడవతో చెరువులోకి వెళ్లి మేత వేస్తుండగా.. ఒక్కసారిగా పడవ మునిగిపోయింది. దీంతో ఒడ్డున ఉన్న భార్యా, పిల్లలు కేకలు వేయడంతో సమీపంలోని పంట పొలాల్లో ఉన్న కూలీలు పరుగున వచ్చారు. చెరువులో పైకి తేలిన వెంకట్రావ్‌ను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అప్పటికి ప్రవీణ్ ఆచూకీ లభించలేదు. చిల్లకల్లు ఎస్ఐ చిన్నబాబు సిబ్బందితో వచ్చి ప్రవీణ్ కోసం గాలించగా.. మృతదేహం లభ్యమైంది. ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, వెంకట్రావు తండ్రి ఇదే చెరువుకు కాపలాదారుడిగా ఉంటూ గతేడాది గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో వెంకట్రావ్ ఏడాదిగా చెరువుకు కాపలాదారుడిగా ఉంటున్నాడు. -
ఫాంపాండ్‌లో విష ప్రయోగం!
కౌడిపల్లి(నర్సాపూర్): గిరిజన రైతుల చేపలు పెంచే ఫాంపాండ్ (పంటకుంట)లో గుర్తుతెలియని వ్యక్తులు విషం చల్లడంతో సుమారు 32వేల చేపలు మృతి చెందగా, సుమారు రూ.10లక్షల వరకు నష్టం వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కొట్టాల పంచాయతీ లింగంపల్లి బిట్లతండాలో జవాహర్ నాయక్ పంటకుంట (ఫాంపాండ్)లో వివిధ రకాలకు చెందిన 32వేల చేపలను పెంచుతున్నాడు. ప్రస్తుతం పావు కిలో సైజ్‌లో పెరిగాయి. రోజు అక్కడే కాపలా ఉండే జవాహర్ నాయక్ కుంటుంబ సభ్యులు శనివారం మొక్కజొన్న తెంపేందుకు వెల్లారు. ఆదివారం ఉదయం నుంచి ఒక్కొక్కటి చేపలు చనిపోగా మధ్యాహ్నం వరకు పూర్తిగా చనిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేపలు పెంచే పంటకుంటలో విషం కలపడంతోనే మృతి చెందాయని బాధితుడు తెలిపారు. దీంతో సుమారు 10లక్షలు నష్టపోయానని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
చెరువులో చేపలు లూటీ చేశారని..
మేళ్లచెరువు (హుజూర్నగర్) : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని కంది బండ గ్రామ పరిధిలోని ఊరచెరువులో చేపలు గురువారం లూటీకి గురయ్యాయి. వివరాలు.. మండలంలోని కందిబడం గ్రామం పరిధిలోని ఊరచెరువు స్థానిక మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఉండగా దాన్ని కొంతమంది గ్రామస్తులు రూ.30లక్షల లీజుకు తీసుకుని చేప పిల్లలు పోసి పెంచారు. కాగా రెండురోజులుగా చేపలు పడుతున్నారు. గురువారం కూడా చేపలు పట్టే సమాయానికి మండలంలోని పలు గ్రామాలతో పాటు కోదాడ, హుజూర్నగర్, మఠంపల్లి, గరిడేపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు వందల మంది చెరువులోకి దిగి ఇష్టం వచ్చనట్లు చేపలు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన లీజు దారులు చేపలు పట్టె వారికి చెందిన సుమారు 20బైక్‌లకు నిప్పంటించారు. దీంతో బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో హుజూర్నగర్ ఫైర్ స్టేషన్ వారు వచ్చి మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కాలిపోయిన సుమారు 8 బైక్‌లను స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వారు తెలిపారు. దగ్ధమవుతున్న లూటీదారుల బైక్‌లు -
ఆక్రమణల చెరవు
ఆయన రాజరిక కుటుంబం నుంచి వచ్చారు. అటు తరువాత ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ అర్హతలతోనే గాబోలు... ఏకంగా పాతిక ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి ఎంచక్కా చేపల చెరువు నిర్వహించేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో అది సర్కారు భూమేనని స్పష్టం చేస్తున్నా... అధికారులు సైతం దానిని పట్టించుకోలేదు. నిర్భయంగా చేపల చెరువుగా మార్చుకునేందుకు అనుమతులిచ్చేశారు. ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. సాలూరు, టాస్క్‌ఫోర్స్ : జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో ఒక్కో నాయకుడి తీరు ఒక్కోలా ఉంది. ఎవరికి వారే తమ శక్తి కొలదీ అక్రమాలకు పాల్పడుతూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు. వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నా చలించట్లేదు సరికదా... తాము చేసింది తప్పుకాదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. టీడీపీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.భంజ్‌దేవ్ వ్యవహా రం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. నిన్నగాక మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను గిరిజ నుడిగా పేర్కొంటూ జీఓ జారీచేయడంతో గిరిజన సంఘాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎంతో ఇష్టంగా పాచి పెంట మండలంలో సాగుచేస్తున్న చేపల చెరువులో 25 ఎకరాలకు పైగా ప్రభుత్వభూమే ఉండటం ఇప్పుడు మరో వివాదానికి దారితీస్తోంది. అన్నదమ్ముల పేరున అనుమతి 2013 జూన్‌లో ఆర్.పి.భంజ్‌దేవ్‌తో పాటు ఆయన సోదరులు పాచిపెంట మండలంలోని విశ్వనాథపురం, పణుకువలస రెవెన్యూ గ్రామాల పరిధి లోని భూముల్లో చేపల చెరువు నిర్మాణానికి మత్స్యశాఖ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.భంజ్‌దేవ్ విశ్వనాథపురం రెవెన్యూ పరిధి లోని సర్వే నంబరు 14–2లో 15ఎకరాల భూమి లో చేపల చెరువు నిర్మాణానికి, ఆయన సోదరుడైన జితేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ అదే సర్వే నంబ రు గల భూమిలో మరో 10ఎకరాల 46సెంట్లలో చేపల చెరువు తవ్వించుకునేందుకు దరఖాస్తు చేశారు. జూన్ 2015 నుంచి జూన్ 2021 వరకు చేపల సాగుకు అనుమతి లభించడంతో దాదాపు 40 ఎకరాల్లో చేపల చెరువు ప్రస్తుతం సాగుచేస్తున్నారు. అయితే వారు దరఖాస్తు చేపలసాగు చేస్తున్న చెరువులో 25 ఎకరాల 46సెంట్ల భూమి ప్రభుత్వానిది(ఇనాం భూమి)గా రెవెన్యూ వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో వుండడం విశేషం. అన్నింటా ఉల్లంఘనే... భంజ్‌దేవ్ చేపల చెరువు వ్యవహారానికి సంబం ధించి అన్నింటా నిబంధనలు ఉల్లంఘించినట్టు స్పష్టమౌతోంది. సాధారణ భూమిని చేపల చెరువుగా మార్చాలంటే స్థానిక రెవెన్యూ డివిజినల్ అధికారి కన్వర్షన్‌కు అనుమతులివ్వాలి. సర్వే నం బరు 14–2లో మొత్తం 25ఎకరాల 46సెంట్ల ప్రభు త్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా చూపుతుంటే ఎలా అనుమతులిచ్చారన్నది ప్రశ్న. అంతేగాకుండా 2015లో అదే సర్వే నంబరుగల ప్రభుత్వ భూమిలో చేపల చెరువు నిర్మిస్తే రెవెన్యూ అధికారులు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది మరో ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తయితే 2015లో ప్రభుత్వం జరిపిన రైతు రుణమాఫీ ద్వారా ఆ సర్వే నంబరుగల భూమితోపాటు ఇంకొంత భూమిపై రూ. లక్షా 50వేలు రుణమాఫీ జరిగింది. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారులు చెల్లించే సమయంలో రెవెన్యూ అధికారులు ఎందుకు అడ్డుకోలేదన్నది మరో ప్రశ్న. రెవెన్యూ రికార్డులు ఆన్లైన్ చేసినా..?: భంజ్‌దేవ్ 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చేపల చెరువు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకి లేకుండా చేసుకున్నారన్నది రాజకీయ ప్రత్యర్థుల వాదన. రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించిన నేపథ్యంలో 14–2 సర్వే నంబరుగల భూమి, ప్రభుత్వానిదేనని తేటతెల్లం చేస్తోంది. అదే నిజమైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి, చేపలచెరువును నిర్మిస్తే రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాచిపెంట రెవెన్యూ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూమిలో భంజ్‌దేవ్ చేపలసాగు చేపడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పుపడి ఉండొచ్చు మా కుటుంబ సభ్యులం ల్యాండ్ సీలింగ్ సమయంలో చాలా భూములు కోల్పోవలసి వచ్చింది. అలాంటి మాకు ప్రభుత్వభూమిని ఆక్రమించుకుని చేపలసాగు చేయాల్సిన అవసరం లేదు. ఆ భూమిని మా తాత, తండ్రుల కాలం నుండి సాగుచేస్తున్నాం. రెవెన్యూ రికార్డుల్లో తప్పుపడివుంటే సరిచేయమని రెవెన్యూ అధికారులను కోరతాం. – ఆర్పీ భంజ్‌దేవ్, మాజీ ఎమ్మెల్యే, సాలూరు కులాన్నే కాదు, పొలాన్నీ వదలం మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపల చెరువును నిర్మించుకున్నారు. వాటికి సంబంధించిన రెవెన్యూ రికార్డులన్నీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సర్వే నంబరు 14–2 ప్రభుత్వభూమి. ఆ భూమి మరలా ప్రభుత్వానికి చెందేవరకు పోరాడుతాం. ఆయన కులం విషయంలో గిరిజనుడు కాకపోయినా ప్రభుత్వం అడ్డగోలుగా జీఓ జారీచేసింది. ఇప్పుడేమో పొలం విషయంలో రెవెన్యూ అధికారులు స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తాం. – రేగు మహేశ్వరరావు, జనసేన నాయకుడు, న్యాయవాది. వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగానే ఉంది సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్‌లో అలోక్నారాయణ్ పురుషోత్తమ్ భంజ్‌దేవ్ పేరుతో ఆ భూమి నమోదై ఉంది. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం ప్రభుత్వ భూమిగానే చూపిస్తోంది. వెబ్‌ల్యాండ్‌లో తప్పు పడి ఉండవచ్చు. – కుప్పిలి నాగేశ్వరరావు, పాచిపెంట మండల ఇన్చార్జి తహసీల్దార్ -
కాలువలకు జలకళ
- తాగునీటి అవసరాల కోసం విడుదల - తొలుత బందరు, ఏలూరు కాలువలకు.. - ఆ తరువాత రైవస్ కాలువకు.. - 10 రోజులపాటు నీటి విడుదలకు అవకాశం - చేపల చెరువులకు నిషేధం సాక్షి, విజయవాడ : వేసవిలో ప్రజల తాగు నీటి కష్టాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తాగునీటి అవసరాల కోసం శనివారం రాత్రి 8 గంటలకు కాలువలకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు సుగుణాకరరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ పది రోజులు పాటు గ్రామాల్లోని చెరువులు నింపుకోవడానికి కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న 389 తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని వివరించారు. ఈ చెరువులు పూర్తిగా నిండితే వచ్చే మే నెలాఖరు వరకు గ్రామాల్లో నీటి ఎద్దడి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఆ తరువాత మరో సారి తాగునీరు విడుదల చేస్తామని వెల్లడించారు. 500 క్యూసెక్కుల చొప్పున తొలుత కృష్ణా ఈస్ట్రన్ బ్రాంచ్ కెనాల్‌తో పాటు బందరు, ఏలూరు కాలువలకు 500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ఐదారు రోజులు తరువాత రైవస్ కాలువకు రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇలా పది రోజులు పాటు నీరు విడుదల చేస్తే చెరువులు పూర్తిస్థాయిలో నిండుతాయని భావిస్తున్నారు. వాస్తవంగా ప్రకాశం బ్యారేజీ నుంచి మరి కొంత ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే నాగార్జునసాగర్ నుంచి రోజుకు రెండువేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు విడుదల కావడంలేదు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువునకు కూడా ఆచితూచి నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలు నిండటానికి అర టీఎంసీ నీరు సరిపోతుంది. అయితే కాలువ చివర వరకు వెళ్లడంతో పాటు, కాలువల్లో ఉన్న వ్యర్థాలు సముద్రంలో కలవడానికి సుమారు మూడు టీఏంసీల నీరు అవసరం అవుతుందని, అప్పుడే బ్యారేజీకి దిగువున ఉన్న చెరువులన్నీ నిండుతాయని ఎస్ఈ సుగుణాకరరావు తెలిపారు. సాగర్ నుంచి ఆరు టీఎంసీల నీరు విడుదల చేయాలని అధికారులు కోరగా.. ప్రస్తుతానికి అర టీఎంసీ నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ నీటిని పులిచింతల ప్రాజెక్టులో నిల్వచేసి జాగ్రత్తగా కాల్వలకు వదులుతున్నారు. చేపల చెరువులకు నిషేధం నాగార్జున సాగర్ నుంచే వచ్చే నీటిని జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఈ మండు వేసవిని దాటేందుకు ఇరిగేషన్ ఇంజినీర్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాలువలకు విడుదల చేసిన నీటిని తాగునీటి చెరువులకు చేరకుండా చేపల చెరువులకు మళ్లిస్తే భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల చేపల చెరువులకు నీటిని మళ్లించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా చేపల చెరువులకు నీటిని మళ్లిస్తే ఆ ప్రాంతంలోని ఇరిగేషన్ అధికారులుపై కఠినచర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
అనుమతి తప్పనిసరి
విజయవాడ : మంచినీటి చేపల చెరువుల తవ్వకానికి తహసీల్దార్ల అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ బాబు.ఎ అన్నారు. విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మత్స్యశాఖ జిల్లాస్థాయి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి చేపల చెరువుల తవ్వకానికి ఆటోక్యాడ్ సర్టిఫికెట్ అనుమతి దరఖాస్తుతో పాటు దాఖలు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. జిల్లాలో ఏడు మండలాల పరిధిలో 80 మంది మంచినీటి చెరువుల తవ్వకానికి పెట్టుకున్న దరఖాస్తులను కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఇకపై ఎప్పటికప్పుడు చెరువులకు అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 671 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి చేపల చెరువులకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కర విధులు నిర్వహించే గజ ఈతగాళ్ల వివరాలను వారి ఆధార్ నంబరుతో సహా పుష్కర సెల్‌కు అందించాలని మత్స్యశాఖ జేడీని కలెక్టర్ ఆదేశించారు. ఘాట్లవారీగా గత ఈతగాళ్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వారికి ప్రత్యేకమైన జాకెట్‌తో సహా తగు డ్రెస్ కోడ్ అమలు చేయాలని చెప్పారు. అనంతరం నమూనా జాకెట్‌ను పరిశీలించారు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్లకు ప్రత్యేక చానల్ ద్వారా స్నానాలకు నీటిని ఏర్పాటుచేస్తున్న దృష్ట్యా అక్కడ గజ ఈతగాళ్ల అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.కోటేశ్వరరావు, మత్స్య పరిశ్రమ ఆదర్శ రైతు నరసింగరాజు యాదవ్, వ్యవసాయ శాఖ డీడీ ఎస్.బాలూనాయక్, ఇరిగేషన్ ఈఈ పి.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పాపం ఆ కవల చిన్నారులు!
కవల చిన్నారులు షాన్, రైస్ పాలిట విధి వక్రీకరించింది. ఈ రెండేళ్ల కవల సోదరులను విషాదకర పరిస్థితుల నడుమ మృత్యువు బలిగొంది. తల్లిదండ్రులకు తీరని గుండెకోతను మిగిలించింది. స్కాట్లాండ్లోని ఫిఫె నగరంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఇంటి వెనుక ఉన్న గార్డెన్‌లోని చేపల చెరువులో మునిగిపోయి ఈ ఇద్దరు కవల సోదరులు ప్రాణాలు ప్రాణాలు విడిచారు. ఉదయం సమయంలో ఈ ఘటన జరిగింది. కవల చిన్నారులు బయట ఆడుకోవడానికి వెళ్లి ఉంటారని తల్లిదండ్రులు భావించారు. కానీ వారు ఇంటి వెనుక ఉన్న చేపల చెరువులో విగతజీవులుగా కనిపించడం తల్లిదండ్రుల్ని దిగ్భ్రమకు గురిచేసింది. ఈ ఘటన గురంచి ఉదయం 8.30 ప్రాంతంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారుల తల్లిదండ్రులను మెర్విన్ స్కాట్, సారా అట్కెన్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సరిగ్గా ఎలా జరిగిందనే విషయాన్ని వారు ఆరా తీస్తున్నారు. ముద్దుగా ఉండి, తల్లిదండ్రులు, ఇరుగుపొరుగువారు అల్లారుముద్దుగా చూసుకొనే కవలలను మృత్యువు ఒకేసారి కబళించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక కౌన్సిలర్లు, నేతలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
ప్రత్తికోళ్లలంకలో 144 సెక్షన్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో పాతకక్షలు భగ్గుమన్న నేపథ్యంలో పోలీసుల గస్తీని మరింత పెంచారు. గ్రామం అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని 53 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతికోళ్లలంకలో చేపల చెరువుల వివాదంలో శుక్రవారం ఇరు వర్గాలు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు మరణించగా... మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని... పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులోభాగంగా 53 మందిపై కేసు నమోదు చేశారు. క్షతగాత్రులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
భగ్గుమన్న పాతకక్షలు : ఒకరి మృతి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం పత్తికోళ్లలంకలో పాతకక్షలు శుక్రవారం మరోసారి భగ్గుమన్నాయి. చేపల చెరువుల వివాదంలో చోటు చేసుకున్న ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు మరణించగా... మరో ఐదుగురు గాయపడ్డారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని... పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... ఏలూరు తరలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. -
చేపల చెరువుకూ రుణమాఫీ!
గుడివాడ రూరల్ : రెండు విడతలుగా విడుదల చేసిన రుణమాఫీ జాబితాల్లో అనేకమంది రైతులు అన్ని ఆధారాలూ సమర్పించినా తమ పేర్లు కనిపించక ఆందోళనకు గురవుతుంటే.. గుడివాడ మండలం చౌటపల్లిలో చేపల చెరువుకు రుణమాఫీ చేయడం విమర్శలకు తావిస్తోంది. గ్రామంలోని సర్వే నంబర్ 207/2లో 2.5 ఎకరాల చేపల చెరువు సాగవుతోంది. ఇది తనకు వారసత్వంగా వచ్చిందని గ్రామానికి చెందిన కొత్తపల్లి సూర్యనారాయణ అనే రైతు చేపలు సాగు చేస్తున్నాడు. స్థానికంగా ఉన్న దళితులు ఈ చెరువును తమ పూర్వీకులు గేదెల కోసం, దుస్తులు ఉతికేందుకు కేటాయించారని కోర్టులో కేసు వేశారు. దీనిపై హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో విచారణ చేసి రిపోర్టు పంపించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ లోపుగానే కేడీసీసీ బ్యాంకు సిబ్బంది దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా పంట రుణం కింద దాదాపు రూ.40 వేలు రుణమాఫీ చేసింది. ఈ మేరకు రుణమాఫీ విమోచన పత్రాన్ని సాగు చేస్తున్న రైతుకు సాధికార సదస్సులో అధికారులు అందజేశారు. ఆగ్రహిస్తున్న రైతులు... ప్రభుత్వం అన్ని పత్రాలూ సమర్పించిన రైతులకు మొండిచేయి చూపించి, నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువుకు ఎలా రుణమాఫీ వర్తింపజేశారని అధికారులను నిలదీసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గ్రామానికి చెందిన బొబ్బరపల్లి లక్ష్మీనారాయణ దీనిపై క్షేత్రస్థాయి విచారణ జరపాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
రెండు వర్గాలు ఘర్షణ: పలువురికి గాయాలు
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఉద్రిక్తత ఏర్పడింది. చేపల చెరువు విషయంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న స్వల్ప వివాదం మంగళవారం ఘర్షణకు దారి తీసింది. దాంతో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఆ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఏల్చూరుకు చేరుకున్నారు. గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా గ్రామంలో మోహరించారు. -
చేపల చెరువులో మద్యం డంప్
చేపలు ఉండాల్సిన చెరువుల్లో మందుబాటిళ్లు బయటపడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు.. లెక్కలేనన్ని మందు బాటిళ్లు ఆ చెరువులో ఉన్నాయి. చేపలు పట్టుకుందామని వెళ్లిన మత్స్యకారులకు ఉన్నట్టుండి ఆ సీసాలు కనపడటంతో వారు అవాక్కయ్యారు. వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు. ఈ చిత్రం విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామ సమీపంలో జరిగింది. ఆలమండ సమీపంలోని విజయసాగరం చెరువులో భారీ మద్యం డంపును జాలర్ల సహకారంతో ఎక్సైజు అధికారులు ఛేదించారు. ఉదయం నుంచి అధికారులు సోదా చేయగా, భారీ మొత్తంలో సీసాలు బయటపడ్డాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా అలమండ చెరువులో సుమారు 1580 మద్యం బాటిళ్లు లభించాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికే ఈ మద్యం తెచ్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడకు భారీ మొత్తంలో మద్యం దిగుమతి అయినట్లు కొద్ది రోజుల క్రితమే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. దాన్ని ఛేదించడానికి ప్రయత్నించినా అప్పట్లో ఎలాంటి ఆచూకీ లభించలేదు. తాజాగా దొరికిన మద్యం గతంలో తాము పట్టుకోవడానికి ప్రయత్నించిందేనని ఎక్సైజ్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మద్యం డంప్ కోసం మరిన్ని చెరువుల్లో గాలింపు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. -
మద్యం బాటిళ్ల డంప్ స్వాధీనం