రెండు వర్గాలు ఘర్షణ: పలువురికి గాయాలు | Two groups quarrel due to fish pond in prakasam district | Sakshi
Sakshi News home page

రెండు వర్గాలు ఘర్షణ: పలువురికి గాయాలు

Published Tue, Jun 10 2014 10:59 AM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

Two groups quarrel due to fish pond in prakasam district

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఉద్రిక్తత ఏర్పడింది. చేపల చెరువు విషయంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న స్వల్ప వివాదం మంగళవారం ఘర్షణకు దారి తీసింది. దాంతో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఆ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఏల్చూరుకు చేరుకున్నారు. గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా గ్రామంలో మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement