డేంజర్‌ ‘డెవిల్‌’ ఫిష్‌! | he most dangerous devil fish appeared in the fish pond | Sakshi
Sakshi News home page

డేంజర్‌ ‘డెవిల్‌’ ఫిష్‌!

Published Sat, Nov 16 2024 5:30 AM | Last Updated on Sat, Nov 16 2024 5:30 AM

he most dangerous devil fish appeared in the fish pond

నదులు, సముద్రాలకే పరిమితం కావాల్సిన చేప

వరదలతో విస్తరించి దావులూరు చెరువులో ప్రత్యక్షం 

దాణాతో సహా సగం చేపల్ని తినేసిందని రైతు గగ్గోలు

తెనాలి: అత్యంత ప్రమాదకరమైన డెవిల్‌ ఫిష్‌ (దెయ్యపు చేప) గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులోని చేపల చెరువులో ప్రత్యక్షమైంది. నదులు, సముద్రాలకే పరిమితం కావాల్సిన ఈ చేపలను చూసి రైతు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. దావులూరుకు చెందిన కోట రాంబాబు వ్యవసాయం చేస్తూనే, ఎకరంన్నర విస్తీర్ణం గల చెరువులో చేపల పెంపకం చేస్తున్నారు. గత ఆగస్టులో మార్కెట్‌ డిమాండ్‌ కలిగిన బొచ్చె, రాగండి, గడ్డి చేపల సీడ్‌ను రెండు వేల కౌంటు చెరువులో వేశారు. 

రోజూ మేత వేస్తున్నారు. ఫీడింగ్‌ ఎలా ఉంది? చేపలు ఎదుగుతున్నాయా? వ్యాధులు ఏమైనా అశించాయా? అనేది తెలుసుకునేందుకు బుధవారం వల వేయించి చేపలు పట్టించాడు. వాస్తవంగా తాము చెరువులో వేసిన చేపలు ఒకటీ, రెండూ మాత్రమే వస్తూ, డెవిల్‌ చేపలు ఎక్కువ పడుతుండడాన్ని గమనించాడు. వలకు బొచ్చె, రాగండి చేపలు తక్కువగా రావటమే కాదు...వచ్చి న ఒకటీ ఆరా చేప కూడా అర కిలో బరువు తూగాల్సి ఉంటే, కేవలం పావు కిలోకు మించలేదని చెప్పారు. 

అంటే డెవిల్‌ చేపలు రోజూ వేస్తున్న మేతను, చేపలను కూడా తినేస్తున్నాయన్న నిర్ధారణకు వచ్చి, ఆందోళనలో పడ్డాడు. కృష్ణానదికి మూడునెలల క్రితం వచ్చిన భారీ వరదలతో డెవిల్‌ఫిష్‌ ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి డెవిల్‌ఫిష్‌ 2016లో తొలిసారిగా కృష్ణానదిలో విజయవాడ వద్ద  కనిపించింది. భూమిమీద కూడా వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డెవిల్‌ ఫిష్, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 65 శాతం నీటివనరులకు విస్తరించిందని అంచనా వేస్తున్నారు. 

స్థానిక చేపల జాతులను విపరీతంగా తినేస్తూ.. సున్నితమైన జల జీవావరణ వ్యవస్థనూ దెబ్బతిస్తుంది. విభిన్నమైన ఆహారాలను తీసుకునే ఈ చేపలు అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేరు. ఆక్సిజను లేని పరిస్థితిని కూడా తట్టుకుంటాయి. కొన్ని సందర్భాల్లో వలలకు నష్టం చేయడంతో పాటు మత్స్యకారులకు గాయాలను కూడా చేసిన ఘటనలున్నాయి. 

152 విభిన్న మంచినీటి చేప జాతులకు నిలయమైన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో డెవిల్‌ ఫిష్‌ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని, లేకుంటే చేపల చెరువులు, పంట కాలువలు, నదుల్లో చేపల ఉత్పత్తికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement