పాపం ఆ కవల చిన్నారులు! | Twin brothers aged just 2 who drowned in fish pond in garden | Sakshi
Sakshi News home page

పాపం ఆ కవల చిన్నారులు!

Published Sun, Mar 13 2016 4:39 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

పాపం ఆ కవల చిన్నారులు!

పాపం ఆ కవల చిన్నారులు!

కవల చిన్నారులు షాన్‌, రైస్‌ పాలిట విధి వక్రీకరించింది. ఈ రెండేళ్ల కవల సోదరులను విషాదకర పరిస్థితుల నడుమ మృత్యువు బలిగొంది. తల్లిదండ్రులకు తీరని గుండెకోతను మిగిలించింది. స్కాట్లాండ్‌లోని ఫిఫె నగరంలో శనివారం ఈ ఘటన జరిగింది.

ఇంటి వెనుక ఉన్న గార్డెన్‌లోని చేపల చెరువులో మునిగిపోయి ఈ ఇద్దరు కవల సోదరులు ప్రాణాలు ప్రాణాలు విడిచారు. ఉదయం సమయంలో ఈ ఘటన జరిగింది. కవల చిన్నారులు బయట ఆడుకోవడానికి వెళ్లి ఉంటారని తల్లిదండ్రులు భావించారు. కానీ వారు ఇంటి వెనుక ఉన్న చేపల చెరువులో విగతజీవులుగా కనిపించడం తల్లిదండ్రుల్ని దిగ్భ్రమకు గురిచేసింది.

ఈ ఘటన గురంచి ఉదయం 8.30 ప్రాంతంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారుల తల్లిదండ్రులను మెర్విన్ స్కాట్, సారా అట్‌కెన్‌గా పోలీసులు గుర్తించారు.  ఈ ఘటన సరిగ్గా ఎలా జరిగిందనే విషయాన్ని వారు ఆరా తీస్తున్నారు. ముద్దుగా ఉండి, తల్లిదండ్రులు, ఇరుగుపొరుగువారు అల్లారుముద్దుగా చూసుకొనే కవలలను మృత్యువు ఒకేసారి కబళించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.  స్థానిక కౌన్సిలర్లు, నేతలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement