నూనెల్లో నాణ్యత నిర్ధారణకు చైనా నుంచి దిగుమతి
హైదరాబాద్: విజయ నూనెలో కల్తీని కట్టడి చేసేందుకు అత్యాధునిక పరికరాన్ని ఆయిల్‌ఫెడ్ కొనుగోలు చేసింది. ‘గ్యాస్ లిక్విడ్ క్రొమొటోగ్రఫీ(జీఎల్‌సీ)’గా పిలిచే ఆ పరికరాన్ని వారం కిందే చైనా నుంచి తెప్పించుకుంది. దీన్ని సోమవారం నుంచే కల్తీ నిర్ధారణ పరీక్షలకు వాడటం మొదలుపెట్టారు. ఇటీవల విజయ నూనెలో కల్తీలు జరిగిన సంఘటనలు వెలుగు చూశాయి. దీంతో ఏకంగా నలుగురు ఉన్నతాధికారులను ఆ సంస్థ ఎండీ వీరబ్రహ్మయ్య తొలగించారు. ఈ నేపథ్యంలో విజయనూనె నాణ్యతపై మచ్చ ఏర్పడింది. దీంతో కల్తీని సరిగా అంచనా వేయడానికి వారం కిందట రూ.12 లక్షలు ఖర్చు చేసి జీఎల్‌సీని కొనుగోలు చేశారు. ఈ పరికరంతో వందల రకాల ద్రవ పదార్థాల కల్తీని గుర్తించవచ్చు. కల్తీ సమాచారాన్ని ప్రింటెడ్ రూపంలోనూ పొందొచ్చు.
అయితే కొత్త పరికరం తీసుకొచ్చినా పాత పద్ధతి ప్రకారం తప్పనిసరిగా పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త పరికరంలో పరీక్షలు నిర్వహించాక అందులో అంతా సానుకూలంగా వచ్చినా పాత పద్ధతి ప్రకారం చేసే నాణ్యత పరీక్షలో కల్తీ బయటపడితే పాత దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారని అంటున్నారు. ఆయిల్‌ఫెడ్ విభజన నేపథ్యంలో విజయనూనె పేరును కూడా మార్చాలని ఆయిల్‌ఫెడ్ యోచిస్తోంది. ఏపీకి ‘విజయ’ పేరు కొనసాగుతుందని, తెలంగాణకు మాత్రం విజయ కాకతీయ, విజయ గోల్కొండ, విజయ దక్కన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెప్పారు.
కల్తీ కట్టడికి అత్యాధునిక పరికరం
Published Wed, Jul 29 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement
Advertisement