50 రోజుల్లో 13 లక్షల లీటర్ల మద్యం విక్రయం
లిక్కర్ గోదాము నుంచి రూ.79 కోట్ల విలువైన మద్యం సరఫరా
మద్యపానంలో ధర్మవరం టాప్
సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రభుత్వం అమలు చేసిన నూతన మద్యం పాలసీతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. కోరుకున్న వారికి ఏ క్షణంలోనైనా మద్యం దొరుకుతుండడంతో రోజూ మద్యం మత్తులో తూలుతున్న వారి సంఖ్య పెరిగింది.
అగ్రస్థానంలో ధర్మవరం
నిత్యావసర సరుకుల తరహాలో మద్యం అక్రమ సరఫరా కూటమి నేతలు జేబులు నింపుతోంది. అధికారిక పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో మద్యం దుకాణ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత అక్టోబరు 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు మద్యం దుకాణాలు వెలిశాయి. కొన్నచోటే మద్యం తాగేందుకు చాలా ప్రాంతాల్లో అనుమతిస్తుండడం మందుబాబులకు వరంగా మారింది. అక్రమార్జనే ధ్యేయంగా ప్రతి మద్యం దుకాణం పరిధిలో సగటున 10 బెల్టు షాపులూ నిర్వహిస్తున్నారు. క్వార్టర్‌పై రూ.100 ఎక్కువ ఇస్తే ఇంటి వద్దకే మద్యాన్ని చేరవేస్తున్నారు. జిల్లా పరిధిలో ఏర్పాటైన 87 ప్రైవేటు మద్యం దుకాణాల ప్రారంభమైనప్పటి నుంచి ఈ 50 రోజుల వ్యవధిలో రూ.79 కోట్ల విలువ చేసే 13 లక్షల లీటర్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఒక్క ధర్మవరం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోనే రూ.19 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగడం విశేషం.
రోజుకు 26 లక్షల లీటర్ల చొప్పున
జిల్లా వ్యాప్తంగా వెలసిన 87 మద్యం దుకాణాలకు గానూ ఇప్పటి వరకూ 13 లక్షల లీటర్ల మద్యం గోదాముల నుంచి సరఫరా అయింది. సగటున 26 వేల లీటర్ల మద్యం వినియోగించినట్లు తెలుస్తోంది. అతి తక్కువ వ్యవధిలో రూ.79 కోట్ల విలువ చేసే మద్యం తాగారంటే ప్రతి మద్యం దుకాణం నుంచి సగటున రోజుకు 300 లీటర్లకుపైగా మద్యం సేల్ అవుతున్నట్లు అంచనా. ఇందులో బీర్ల కంటే మద్యం అమ్మకాలే భారీ స్థాయిలో ఆదాయం తెచ్చి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక చీప్ లిక్కర్ అందుబాటులోకి వస్తే మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
నాల్గో వంతు బీర్ల సేల్
జిల్లా వ్యాప్తంగా ఈ 50 రోజుల వ్యవధిలో 1.44 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో కేవలం 35 వేల కేసులు మాత్రమే బీర్లు అమ్ముడు పోయినట్లు ఎకై ్సజ్ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆరంభంలో ఒక్కో మద్యం దుకాణం పరిధిలో రోజుకు రూ.లక్షకు మించి వ్యాపారం జరగలేదు. అనంతరం బెల్టు షాపులకు తెరలేపడంతో వ్యాపారం రెట్టింపయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment