బెజవాడలో వీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. తక్షణమే జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు ఆందోళనకు దిగగా, మరోవైపు మంచినీటి ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఢిల్లీ తరహాలో విజయవాడలో కూడా ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.