employees protest
-
రెండో రోజు టీటీడీ ఉద్యోగుల నిరసన కొనసాగింపు
-
మా జీతాలు మాకివ్వండి.. స్టీల్ ప్లాంట్ కార్మికుల ధర్నా!
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కార్మికుల నిరసన
-
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వామపక్షాలు ఆందోళన
-
ఉక్కు పోరాటం ఉధృతం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం ఉధృతం
-
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసన
-
సెబీ చీఫ్ రాజీనామా చేయాల్సిందే.. ఉద్యోగుల నిరసన
భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్పర్సన్ మాధవి పూరి బచ్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఆమె రాజీనామాను డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది ఉద్యోగులు సెబీ ముంబై ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.సెబీలో విధి నిర్వహణ పరిస్థితులపై ఉద్యోగులు ఆర్థిక శాఖకు చేసిన ఫిర్యాదుపై సెబీ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే ఉద్యోగులు నిరసనకు దిగారు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. నిరసన దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. నిరసన తర్వాత ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వెళ్లారు.తమ ఫిర్యాదుపై ఉన్నతస్థాయి అధికారులు చేస్తున్న వక్రీకరణకు వ్యతిరేకంగా, తమ ఐక్యతను ప్రదర్శించడమే ఈ నిరసన ఉద్దేశం అని ఉద్యోగుల మధ్య అంతర్గత సందేశాన్ని ఉటంకిస్తూ మనీకంట్రోల్ పేర్కొంది. సెబీ ఉద్యోగులపై అసత్యాలు ప్రచారం చేస్తూ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉపసంహరించుకోవడం, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయడం తక్షణ డిమాండ్ అని ఆ సందేశంలో ఉన్నట్లు తెలిపింది.నిరసన ఎందుకంటే..సెబీలో పని చేయడం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదని, ఇక్కడ విషపూరితమైన పని వాతావరణం ఉందంటూ కొంతమంది సెబీ ఉద్యోగులు గత నెలలో ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. దీన్ని సెబీ తప్పుబట్టింది. పనితీరు, జవాబుదారీతనంలో ప్రమాణాలను పాటించే విషయంలో ఉద్యోగులను బయటి శక్తులు తప్పుదోవ పట్టించాయంటూ సెబీ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. -
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె
-
పరిస్థితికి తగ్గ చర్యలు
సాక్షి, అమరావతి: కొత్త వేతన సవరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏ రూపంలో ఉన్నా, వాటిని ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. పరిస్థితికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం రాజ్యాంగ వ్యతిరేకమే కాక, సర్వీసు నిబంధనలకు కూడా విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసును రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ విశాఖపట్నంకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం కోర్టు విచారణ మొదలు కాగానే సాంబశివరావు తరఫు న్యాయవాది ఎస్.శరత్ కుమార్ తమ పిల్ గురించి న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కుంభజడల మన్మధరావుల ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళుతున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో విచారణ జరపాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యోగులు ఆందోళనలు చేస్తూ ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారాన్నే ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఘర్షణ ఉండకూడదన్నారు. చర్చలు, ఏకాభిప్రాయం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా, ఉద్యోగులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని వివరించారు. ఉద్యోగులు మూకుమ్మడిగా సమ్మెకు వెళితే పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయన్నారు. ‘ఛలో విజయవాడ’ పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగులందరూ ఓ చోట చేరారని, ప్రస్తుత కోవిడ్ థర్డ్‌వేవ్ పరిస్థితుల్లో ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు. ఓ రకంగా రాష్ట్రాన్ని కోవిడ్ ప్రమాదంలోకి నెట్టడమే అవుతుందని తెలిపారు. అందుకే సమ్మెను నిషేధించాలని కోరుతున్నామని తెలిపారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విన్నవించారు. రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యోగులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఉద్యోగులు ప్రస్తుతం సమ్మె చేయడం లేదు కదా? అని ప్రశ్నించింది. పెన్‌డౌన్ మొదలు పెట్టారని శరత్ చెప్పగా, పెన్‌డౌన్ సమ్మె కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్ ఉండగా ఎలా అనుమతి ఇచ్చారు? ఈ వ్యవహారంలో మీ స్పందన ఏమిటని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌ను అడిగింది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదన్న వాదన సరికాదని శ్రీరామ్ చెప్పారు. మరి గురువారం ఏం జరిగింది? కోవిడ్ వ్యాప్తి ఉన్నా అనుమతులు ఎలా ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. గురువారం ఛలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని శ్రీరామ్ తెలిపారు. 5 వేల మంది రావాల్సిన చోట 35 వేల నుంచి 40 వేల మంది వరకు వచ్చారని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని శ్రీరామ్ చెప్పారు. సుప్రీంకోర్టు కూడా టీకే రంగరాజన్ కేసులో ఇదే చెప్పిందన్నారు. కాబట్టి సమ్మె చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అలా అయితే ప్రభుత్వం కోవిడ్‌ను నియంత్రించేందుకు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా మహమ్మారి ఇతరులపై కూడా ప్రభావం చూపుతుందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలంది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తాము ఆ అంశం జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో శరత్ స్పందిస్తూ, సమ్మెకు వెళ్లకుండా ఉద్యోగులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రానున్న రోజుల్లో పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో తెలియదని చెప్పింది. ఉద్యోగుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఈ నెల 10న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. చదవండి: (సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ) -
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు కీలక చర్చలు జరిపారు. ఉద్యోగుల సమ్మె నోటీస్ నేపథ్యంలో సమాలోచనలు జరిపారు. చర్చలకు రాకుండా సమ్మెకు వెళితే ప్రత్యామ్నాయం ఎలా అనే అంశంపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చదవండి: (సీఎం జగన్‌ను కలిసిన ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ థియరీ బెర్దెలాట్) -
స్టీల్ ప్లాంట్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం..
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం.. జీవీఎంసీ ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక ఎన్ఏడీ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ సాగింది. నిరసనల్లో ఆల్ ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి మద్దతు పలికారు. విశాఖ ఉక్కును సాధించుకుంటామని స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు రామారావు, ఆదినారాయణరావు, వెంకట్రావు, అయోధ్యరామ్, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: ‘హక్కు’ కోసం.. ‘ఉక్కు’ సంకల్పం) సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎంవీవీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, స్టీల్ ప్లాంట్ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌లో రూ.4900 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను లోక్‌సభలో అడ్డుకుంటామని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎంవీవీ అన్నారు.(చదవండి: ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్) లోక్‌సభలో పోరాడతాం: ఎంపీ సత్యవతి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు లోక్‌సభలో పోరాడతామని ఎంపీ సత్యవతి అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను పోరాటాలతో సాధించుకున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనించిందని, వేల కోట్లను కేంద్ర,రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఆర్జించి పెట్టిందన్నారు.ప్రైడ్ ఆఫ్ ఏపీగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలిచిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడాన్ని అడ్డుకుంటామని ఎంపీ సత్యవతి స్పష్టం చేశారు. -
గూగుల్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన
శాన్ ఫ్రాన్సిస్కొ : శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ ప్రధాన కార్యాలయం ముందు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఏ కారణం లేకుండానే ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపడమేంటని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని దాదాపు 200 మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సెలవుపై పంపిన ఇద్దరిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'సంస్థలో గత కొంతకాలంగా జరుగుతున్న లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని నేను, నా తోటి ఉద్యోగులతో కలిసి సంస్థకు వివరించాం. అదే సమయంలో పని వేళల విషయంలోనూ కొన్ని సంస్కరణలు చేయాలని అడిగాం. కానీ మా విన్నపాలను ఏవీ పట్టించుకోకపోగా నోరు మూసుకొని ఉండాలని బెదిరిస్తున్నారు. అంతటితో గాక తమకు ఎదురు తిరిగిన వారిని సెలవుల పేరుతో ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని' సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న జాక్ జొరాతంగ్ వాపోయారు. వెంటనే సెలవుపై పంపిన ఇద్దరు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల మొదట్లో ఇద్దరు ఉద్యోగులు కంపెనీలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు వారిని సెలవుపై పంపినట్లు గూగుల్ సంస్థ ప్రతినిధి మీడియాకు తెలిపారు. -
సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం పార్లమెంట్ వీధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల నిరసనలో టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజేందర్, పలువురు ఉద్యోగులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసించారు. సీపీఎస్ విధానంతో 33 సంవత్సరాల పాటు పని చేసి రిటైర్ అయితే ఏ భరోసా లేకుండా పోతున్నదని టి ఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానంతో అనేక మంది ఉద్యోగులు నష్టపోతున్నారని..గతంలో ఉన్న ఓపిఎస్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని కోరారు. సీపీఎస్ విధానాల అమలులో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కత్తెర వేశారని అన్నారు.ఉద్యోగ వ్యతిరేక విధానాలను విరమించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తున్నా కేంద్రం దురహంకారంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధానంతో నష్టం జరుగుతున్నదని అన్నారు. తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఎస్ రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించుకొని పిఆర్సీలు సాధిస్తున్నామని అన్నారు. ఉద్యోగుల ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉందని పన్నుల రూపంలో 3 నెలల జీతాన్నికేంద్రమే తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై తెలంగాణ ఎంపీలు కేంద్రానికి లేఖలు కూడా రాసారని చెప్పారు.ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రయివేటికరిస్తే ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ జనవరిలో దేశవ్యాప్త సమ్మె చేపట్టే యోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. -
ఏపీలో బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ ధర్నాలు
-
గళమెత్తిన ఉద్యోగులు
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సమస్యల సాధన కోసం పలు శాఖలకు చెందిన ఉద్యోగులు శుక్రవారం కలెక్టరేట్ వద్ద గళమెత్తారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయటంతోపాటు సమస్యలను పరిష్కరించాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని వివిధ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఏపీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మణికుమార్ మాట్లాడుతూ 30 నుంచి 35 సంవత్సరాల విధి నిర్వహణలో ఉద్యోగులకు బీపీ, షుగర్ తప్ప ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం నుంచి రావటం లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వానికి చేయూతను అందిస్తుంటే కష్టాలను మాత్రం పట్టించుకోకుండా మిన్నకుండి పోతున్నారన్నారు. తూర్పు కృష్ణా జేఏసీ చైర్మన్ ఉల్లి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు సమస్యలపై పోరాడుతున్నా ప్రభుత్వం ఇంత వరకు వాటిని పరిష్కరించలేదన్నారు. పింఛనుదారులకు క్వాంటమ్ ఆఫ్ పింఛన్‌ను మంజూరు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ వారిని క్రమబద్ధీకరించాలని కోరారు. వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోతే సమ్మె ద్వారానైనా సమస్యలను సాధించుకుంటామన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘ నాయకుడు శోభన్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగులను రోడ్డు పాలు చేసిందన్నారు. నాలుగు సంవత్సరాలపాటు బీజేపీ ప్రభుత్వ సహకారంతో పాలన చేసి ఇప్పుడు నిధులు ఇవ్వకపోవటంతో ఆ ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తోందని ప్రకటిస్తున్న పాలకులు ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించకుండా మోసం చేస్తోందన్నారు. యూటీఎఫ్ జిల్లా నాయకుడు కేఏ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎస్టీయూ నాయకుడు కొమ్ము ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలోనే ఉద్యోగులు రోడ్డు మీద పడతారన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం వేల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవటం లేదన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి సత్యనారాయణ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు వివిధ ఉద్యోగ సంఘాలతో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ధర్నా కార్యక్రమంలో తూర్పు జేఏసీ కన్వీనర్ దారపు శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సంఘ నాయకులు లెనిన్‌బాబు, జీవీఎస్ పెరుమాళ్లు, తమ్ము నాగరాజు, మహంకాళరావు, జేఏసీ మహిళా విభాగం కన్వీనర్ కె గౌరి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు దుర్గాప్రసాద్, ఈవీ రామారావు, పీవీ సాయికుమార్, జీటీవీ రమణ, విజయ్‌కుమార్, బాబాప్రసాద్, బి భానుమతి, బీటీఏ సంఘ నాయకులు మట్టా రాజేష్, టి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఆ గట్టునొకరు ఈగట్టునొకరు
ఇద్దరూ ఒక పార్టీకి చెందినవారే.. ప్రజాప్రతినిధులే.. తమ పరిధిలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న వారే..కానీ ఎవరికివారు నాకెందుకులే.. అన్న భావనతో నిర్లిప్తత వహిస్తున్నారు. కారణం.. వారిద్దరికీ పొసగకపోవడమే.. ఆ ఇద్దరిలో ఒకరు మంత్రి గంటా శ్రీనివాసరావు కాగా.. రెండోవారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.వారిద్దరి మధ్య విభేదాలకు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడానికి లింకేమిటి? అన్న సందేహం రావచ్చు..లింకు ఉంది.. ఎలా అంటే.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత తదితర సమస్యల పరిష్కారం కోరుతూ గత కొద్దిరోజులుగా ఉద్యమిస్తున్నవారు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు.. ప్రతిష్టాత్మమైన ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణం వెలగపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గంలోనే ఉంది. ఇక అదే నియోజకవర్గ పరిధిలో నివాసం ఉంటున్న గంటా శ్రీనివాసరావు స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి..ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు కలిసి ప్రయత్నిస్తే.. ఏయూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం పెద్ద విషయం కాదు.. అయినా వారిద్దరి మధ్య విభేదాల కారణంగా అది సాధ్యం కాదు.. పోనీ.. ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారా అంటే.. అదీ లేదు.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తే ఆ క్రెడిట్ గంటాకు వెళ్లిపోతుందేమోనని వెలగపూడి.. మంత్రిగా తాను చొరవ చూపితే.. ఆ పేరు వెలగపూడి కొట్టేస్తాడేమోనని గంటా.. ఎవరికి వారు కురచబుద్ధులు ప్రదర్శిస్తుండటంతో ఉద్యమపథంలో ఉన్న ఏయూ ఉద్యోగులు బలవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 28 రోజుల ఉద్యోగులు, టైమ్‌స్కేల్ సిబ్బంది గత వారం రోజులుగా ఉద్యమిస్తున్నారు. 28 రోజుల ఉద్యోగులకు టైంస్కేల్ కల్పించాలని, టైంస్కేల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు రూ.4 నుంచి 8 వేల వరకు, 28 రోజుల ఉద్యోగులకు నెలకు రూ.12,800, టైంస్కేల్ ఉద్యోగులకు రూ.18వేల నుంచి రూ.23 వేల వరకు వేతనంగా వర్సిటీ చెల్లిస్తోంది. ఉద్యోగులకు రూ 12,600 కనీస వేతనం చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ వర్సిటీ దీన్ని విస్మరించి తక్కువ వేతనాలు చెల్లిస్తోంది. ఉద్యోగుల్లో అధికులు ‘తూర్పు’వాసులే ప్రస్తుతం ఆందోళన చేస్తున్న ఉద్యోగుల్లో అధికశాతం మంది తూర్పు నియోజకవర్గం పరిధిలోనే నివాసం ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఎన్నోమార్లు కలిసి తమ సమస్య పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. కానీ ఇప్పటి వరకు ఆయన పట్టించుకోలేదు. గత వారం రోజుల్లో రెండుసార్లు మొక్కుబడిగా దీక్షా శిబిరం వద్దకు వచ్చి వెళ్ళారే గానీ సమస్యల పరిష్కారం దిశగా కనీస యత్నాలు మొదలుపెట్టలేదు. సంబంధిత మంత్రి గంటాతో చర్చిస్తాను అనే మాట కూడా ఆయన నోట వెంట రాలేదు. సమస్యలు పరిష్కారమైతే ఆ క్రిడిట్ మంత్రి గంటాకు వస్తుందనే వెలగపూడి పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఆందోళనకారుల నుంచే వ్యక్తమవుతోంది. ఇక మంత్రి గంటా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పటివరకు ఆయన వర్సిటీ ఉద్యోగుల గోడు వినే ప్రయత్నమే చేయలేదు. వర్సిటీలోని దీక్షా శిబిరానికి రాకపోయినా, జేఏసీ సభ్యులతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. మంత్రి పిలిస్తే చర్చలకు వెళ్ళేందుకు తాము సిద్ధమని జేఏసీ సభ్యులు ప్రకటించినా గంటా నుంచి పిలుపు రాకపోవడం ఉద్యోగ సంఘాల నేతలను విస్మయ పరుస్తోంది. ఇక గత ఆదివారం వర్సిటీలో జరిగిన పూర్వవిద్యార్థుల సదస్సులోనూ, కాంట్రాక్ట్ అధ్యాపకులు చేసిన సత్కార కార్యక్రమాల్లో పాల్గొన్న గంటా పక్కనే అరకొర జీతాలతో ఉద్యమం చేస్తున్న బోధనేతర ఉద్యోగులను పట్టించుకోకపోవడం గమనార్హం. ఉద్యోగుల గోడు పట్టని వీసీ, రిజిస్ట్రార్ ఉద్యోగులు వారం రోజులుగా దీక్షలు కొనసాగిస్తున్నా వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్లు ఇప్పటివరకు దీక్షా శిబిరం వైపు కన్నెత్తి చూడలేదు. వారిరువురే కాదు.. ఉన్నతాధికారులు కూడా దీక్ష శిబిరం జోలికి పోలేదు. వర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు లైజన్ అధికారులు ఉంటారు. వీరు ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని అధికారులకు వివరిస్తుంటారు. వారు సైతం బోధనేతర ఉద్యోగుల శిబిరానికి రాలేదు. దీంతో అధికారుల వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆచార్య వేణుగోపాలరెడ్డి వీసీగా ఉన్న సమయంలో పాలక మండలి నిర్ణయంతో వందలాది మంది ఉద్యోగులకు 28 రోజులు, టైంస్కేల్ వర్తింప చేశారు. ప్రస్తుత పాలకులు ఈ దిశగా ఆలోచన చేయకుండా కుంటిసాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. కనీసం బుధవారం జరిగే పాలక మండలి సమావేశంలోనైనా తమ సమస్యలను చర్చించి పరిష్కారదిశగా ప్రకటన చేస్తారేమోనని ఉద్యోగులు భావిస్తున్నారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెకు వెళతామని ఇప్పటికే ఉద్యోగులు నోటీసు ఇచ్చారు. ఈ నెల 10న పూర్వవిద్యార్థుల సమావేశం, 19న స్నాతకోత్సవం ఉన్న నేపధ్యంలో వర్సిటీ పాలకులు, ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. దీక్షా శిబిరానికి నేడు విజయసాయిరెడ్డి ఏయూ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం సందర్శించి సంఘీభావం తెలపనున్నారు. -
ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఉద్యోగుల నిరసన
బొబ్బిలి : బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న ఆర్ అప్పారావు తీరుపై అక్కడి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడి ఎస్ఈ కార్యాలయం వద్ద సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మూకుమ్మడి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విలేకర్లకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతీ పనికీ కొర్రీలు వేస్తున్నారనీ, అందరి సీట్ల వద్దకు వచ్చి వేధిస్తున్నారని, మహిళలు అని చూడకుండా గౌరవం లేకుండా ఏకవచనంతో సంభోదిస్తున్నారని, ఇంటికి పోతావ్ జాగ్రత్త, సస్పెండ్ చేయిస్తానని హుకుం జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన్ని నోడల్ అధికారిగా సాలూరులో నియమించినా నేటికీ వెళ్లలేదని, ఇప్పటికే ఈ విషయం కలెక్టర్, సీఈ, జేసీ, మంత్రి సుజయ్‌కృష్ణకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పైళ్లను తన వద్ద ఉంచుకుని తమను తీసుకురమ్మంటున్నారని, ప్రతీ చిన్న విషయానికీ పనిష్మెంట్ ఇవ్వాలి, ఎస్సార్ తీసుకురండంటూ భయపెడుతున్నారని వాపోయారు. ఇన్నాళ్లూ మౌనంగా భరించినా వేధింపులు ఎక్కువైపోతుండడంతో ఇలా బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో ధవళేశ్వరంలో పనిచేసినప్పుడు ఉద్యోగిపై చేయి చేసుకుని సస్పెండ్ అయ్యారని తెలిపారు. నిత్యం ఏదో సమస్య సృష్టిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఆయన మానసిక స్థితి బాగాలేదని, ఆయన తీరుతో ఉద్యోగాలు సరిగ్గా చేయలేకపోతున్నామని తెలిపారు. ఇంతకుముందు ఎన్నడూ ఇలా లేదని, ఎన్నాళ్లీ ఇబ్బందులన వారు ప్రశ్నిస్తున్నారు. సుమారు 36 మంది ఉద్యోగులు ఆయన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై డిప్యూటీ ఎస్ఈ అప్పారావును వివరణ కోరగా విషయం చెప్పలేదు. సక్రమంగా వివరణ కూడా ఇవ్వలేదు. వారినే అడగండంటూ నవ్వేయడం కొసమెరుపు. -
గ్రామపంచాయతీ సిబ్బంది అర్ధనగ్న ప్రదర్శన
మాచారెడ్డి నిజామాబాద్ : గ్రామపంచాయతీ సిబ్బంది నా లుగో రోజు సమ్మెలో భాగంగా గురువారం గ్రామ పంచాయతీ కారోబార్లు, వాటర్మెన్లు, సపాయి కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కారోబార్ల సంఘం మండలాధ్యక్షుడు బట్ట రమేశ్ మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సమ్మెను విరమిం చేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కారోబార్ల సంఘం ప్రధాన కార్యదర్శి బాల్నర్సు, ప్రతినిధులు సురేష్, దశరథ్‌రెడ్డి, రవి, నర్సింలు, రాజు పాల్గొన్నారు. -
నాడు శిక్ష..నేడు ప్రోత్సాహం
-
సాక్షి ఎఫెక్ట్: దిగొచ్చిన టీటీడి
-
విజయవాడలో రోడ్డెక్కిన ఉద్యోగులు
-
ముదురుతున్న ప్రొటోకాల్ వివాదం
⇒ ఎమ్మెల్యే వైఖరిపై ఉద్యోగుల నిరసన ⇒ నిరసనలు వద్దని చేతులు జోడించిన కలెక్టర్ ⇒ రసమయికి మద్దతుగా కళాకారుల ధర్నా సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో బుధవారం నిర్వహించిన డిజీధన్ మేళాలో జరిగిన ప్రొటోకాల్ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఎమ్మెల్యేలకు మద్దతుగా కళాకారులు, కలెక్టర్‌కు సంఘీభావంగా ఉద్యోగులు నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హాజరైన డిజీ ధన్‌మేళాలో కలెక్టర్, ఎమ్మెల్యేల మధ్యన ఫ్రోటోకాల్ వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఎమ్మెల్యే వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం కలెక్టరేట్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ వెంటనే అధికారులు, ఉద్యోగులను పిలిచి నిరసనలు వద్దంటూ చేతులు జోడించారు. మరో వైపు కలెక్టర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మద్దతుదారులు, సాంస్కృతిక సారథి కళాకారులు నిరసన వ్యక్తం చేశారు. దళిత సంఘాలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. కాగా బుధ, గురువారాల్లో జరిగిన సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీ రంగంలోకి దిగగా, వివాదం వెనుక వాస్తవాలు ఏమిటి? అన్న కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసన
విజయవాడ: సహకార రంగంలోని బ్యాంకుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విజయవాడలో ఆ బ్యాంకుల ఉద్యోగులు ఆందోళన చేశారు. రద్దయిన పెద్ద నోట్ల మార్పిడిలో డీసీసీబీలపై ఆర్బీఐ నిషేధం విధించింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆర్బీఐ ఆంక్షలను వ్యతిరేకిస్తూ విజయవాడ కేడీసీసీ బ్యాంకు నుంచి లెనిన్ సెంటర్ వరకు ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు. -
సచివాలయంలో ఉద్యోగుల ఆందోళన
-
నేడు బ్యాంకుల సమ్మె
నిజామాబాద్బిజినెస్ : ప్రభుత్వరంగ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడానికి వ్యతిరేకంగా, ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయాలనే యోచనకు నిరసనగా శుక్రవారం బ్యాంకులను మూసి సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిల్లా కన్వీనర్ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది లక్షల మంది బ్యాంకు ఆఫీసర్లు, ఉద్యోగులు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్‌లో గల ఎస్బీహెచ్ జోనల్ కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులందరు కలసి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. -
19న ఆర్బీఐ ఉద్యోగుల నిరసన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఇండియాకు (ఆర్బీఐ) ఉన్న స్వయంప్రతిపత్తి హోదాను తీసివేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ‘సేవ్ ఆర్బీఐ’ పేరుతో నాలుగు ఉద్యోగ సంఘాలు కలిపి కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. నవంబర్ 19న దేశవ్యాప్తంగా ఉన్న 17,000 మంది ఉద్యోగులు సామూహిక సెలవులతో కేంద్రానికి తమ నిరసన తెలుపుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీంతో దేశవ్యాప్తంగా రూ. 3 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు ఆగిపోతాయని అంచనా వేస్తున్నట్లు ఆర్బీఐ ఆల్ ఇండియా ఆర్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జి.క్రాంతి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డీరేట్ల సవరణపై ఆర్బీఐ గవర్నర్‌కి ఉన్న వీటో హక్కును తీసేయాలనుకోవడాన్ని, ఆర్బీఐ వద్ద ఉన్న అత్యవసర నిధి రూ. 2.43 లక్షల కోట్లలో లక్ష కోట్లు వాడుకోవాలని చూడటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఆర్బీఐ లాభాలను ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, అత్యవసర నిధిని వాడుకోవాలన్న ప్రయత్నం గర్హనీయమని అన్నారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని హరించే ప్రక్రియను తాము అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కు అమలు చేస్తున్నట్లుగానే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్బీఐ పెన్షనర్లకు పెన్షన్ అప్డేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే అందరి సహకారంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. -
తెలంగాణ గడ్డపై జన్మించలేదని
ఉద్యోగాల నుంచి తొలగిస్తారా? నిరసన తెలిపిన విద్యుత్ అధికారులు, ఉద్యోగులు కడప అగ్రికల్చర్ : విద్యుత్ సంస్థలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏడీఈ, ఏఈలు, ఉద్యోగులను, సిబ్బందిని పుట్టుకను ఆధారం చేసుకుని దాన్నే స్థానిక ప్రామాణికంగా పరిగణించి తొలగించడం దారుణమని జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తు నిరసన తెలిపారు. శుక్రవారం జిల్లా అంతటా భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కడప నగరంలోని విద్యుత్ భవన్ ఎదుట జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీరు ఎన్విఎస్ సుబ్బారాజు, టెక్నికల్ డీఈ బ్రహ్మానందరెడ్డి, డీఈలు శోభావాలెంతెనా, సురేష్‌కుమార్ మాట్లాడుతూ వెంటనే తొలగించిన వారందని విధుల్లోకి తీసుకోక పోతే తీవ్రస్థాయిలో పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లాలోని డివిజన్ల డీఈలు, ఏడీఈలు, ఉద్యోగులు నిరసన తెలిపారు. -
బెజవాడలో వీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. తక్షణమే జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు ఆందోళనకు దిగగా, మరోవైపు మంచినీటి ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఢిల్లీ తరహాలో విజయవాడలో కూడా ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.