నేడు బ్యాంకుల సమ్మె
Published Thu, Jul 28 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
నిజామాబాద్‌బిజినెస్ : ప్రభుత్వరంగ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడానికి వ్యతిరేకంగా, ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయాలనే యోచనకు నిరసనగా శుక్రవారం బ్యాంకులను మూసి సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిల్లా కన్వీనర్ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది లక్షల మంది బ్యాంకు ఆఫీసర్లు, ఉద్యోగులు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్‌లో గల ఎస్‌బీహెచ్ జోనల్ కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులందరు కలసి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement