సాక్షి, విజయవాడ: విజయవాడలో మాంసం దుకాణాలపై వీఎంసీ అధికారులు దాడులు చేపట్టారు. కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమలో మాచవరం, బీఆర్టీఎస్ రోడ్డు, ప్రకాష్‌నగర్, కొత్తపేట మార్కెట్లలో సోదాలు జరిపారు. మాచవరంలో 500 కేజీల కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నటీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ.. మాంసాన్ని కొనే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుళ్లిపోయిన మాంసాన్ని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారని, తద్వారా అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మొత్తం పరిశీలన చేసిన తరువాతే మాసం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కుళ్లిపోయిన మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చదవండి: నాపరాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ముగ్గురు కూలీలు దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment