
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ నేపథ్యంలో యాచకులు, నిరాశ్రయులపై వీఎంసీ(విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడలో ఉన్న యాచకులు, నిరాశ్రయుల కోసం రోడ్లపై జల్లెడ పడుతున్నారు. స్వచ్చంధ సంస్ధలు రోడ్లపైకి వస్తూ యాచకులు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తుండడంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీంతో అధికారులు అప్రమత్తమయ్యి రోడ్లపై యాచకులు కనిపిస్తే వారిని వెంటనే షెల్టర్లకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐదు బస్సుల ద్వారా 250మందికి పైగా యాచకులను షెల్టర్‌లకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా విజయవాడ పరిధిలోని పది షెల్టర్ల లో యాచకులను ఉంచనున్నట్లు, మిగతా నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వీఎంసీ అధికారులు తెలిపారు. యాచకులు, నిరాశ్రయులకు భోజనం పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతితో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ('శ్రియా.. ప్లీజ్ అతన్ని ఇబ్బంది పెట్టకు')
Comments
Please login to add a commentAdd a comment