
సాక్షి, విజయవాడ : విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ వాహనాలను బుధవారం మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమీషనర్ ప్రసన్న వెంకటేశ్ మాట్లాడుతూ.. స్వచ్ఛత పై అవగాహన కల్పించేందుకు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ వాహనాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నగరంలోని 59 డివిజన్లలో ఈ వాహనాల ద్వారా తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని తెలిపారు. దీంతో పాటు వైఎస్‌ఆర్ నవశకం వాహనాన్ని సైతం ప్రారంభించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment