మాట్లాడుతున్న ముత్తు సుందరం
-
ఏఐఎస్‌జీఈఎఫ్ చైర్మన్ ముత్తు సుందరం
మంకమ్మతోట : దేశంలో రూ.5,028వేల కోట్ల లోటు బడ్జెట్‌కు కేంద్రమే కారణమని ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాÄæూస్ ఫెడరేషన్ చైర్మన్ ముత్త సుందరం విమర్శించారు. సెప్టెంబర్ 2న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని టీఎన్‌జీవో భవన్‌లో గురువారం నిర్వహించిన సన్నాహక సదస్సులో మాట్లాడారు. రిలయన్స్ కంపెనీకి రూ.5వేల కోట్లకు పైగా పన్ను చెల్లింపులో మినహాయింపు ఇవ్వడంతోనే లోటు బడ్జెట్ ఏర్పడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. టీఎన్‌జీవోస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్‌రావు మాట్లాడుతూ కొత్త పింఛన్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం కొనసాగించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఖాళీల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ హమీద్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి వేముల సుగుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.