badget
-
మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు తర్వాత శనివారం తొలిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ రాహుల్ విలేకరిపై నిగ్రహం కోల్పోయారు. ఈ మేరకు రాహుల్ మీడియా ప్రసంగంలో..ఒక జర్నలిస్ట్ రాహుల్ 2019లో లోక్సభ ఎన్నికల్లో చేసిన దొంగలందరికీ మోదీ పేరే ఎందుకు ఉంటుంది అనే వ్యాఖ్య గురించి నేరుగా ప్రశ్నించాడు సదరు విలేకరి. దీంతో రాహుల్ ఒక్కసారిగా ఆ విలేకరిపై విరుచుకుపడ్డారు. మీరు నన్ను ఈ ప్రశ్నను పరోక్షంగా అడగాలి ఇలా కాదంటూ మండిపడ్డారు. "మీరు బీజేపీ కోసం పనిచేయాలనుకుంటే మీ ఛాతీపై బ్యాడ్జి పెట్టుకుంటే బావుండేది. అప్పుడూ నేను అందుకు తగ్గట్టుగా సమాధానం ఇస్తాను. నేను భారతదేశ ప్రజల ప్రజాస్వామ్య వాణిని కాపాడుతూనే ఉంటానని, ఎవ్వరికీ భయపడేది లేదు. గౌతమ్ అదానీ షెల్ కంపెనీలకు రూ. 20 వేల కోట్లు ఎవరకీ వెళ్లాయి అనే సాధరణ ప్రశ్న కారణంగా ప్రధాని మోదీ తనను తాను రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న దాడులు ఇవి. అయినా నేను ఈ అనర్హతలు, జైలు శిక్ష వంటి వాటికి భయపడను. నేను మోదీ కళ్లల్లో భయం చూశాను. అదానీపై నా తదుపరి ప్రసంగానిక ప్రధాని భయపడుతున్నారు." అందువల్లే ఈ అనర్హత వేటు అని రాహుల్ తేల్చి చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా బీజేపీ మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలతో వెనుకబడిన ఓబీసీ కమ్యూనిటీలను అవమానించారంటూ పునురుద్ఘాటించారు. అయినా ఆయన ఒక్కరే కాదు బీజేపీకి చెందిన ఆరుగురి తోసహా దేశవ్యాప్తంగా 32 మంది నేతలపై అనర్హత వేటు పడిందని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ అన్నారు. అంతేగాదు కర్ణాటక ఎన్నికల ప్రయోజనం కోసం కాంగ్రెస్ రాహుల్ని ఏదో బలిపశువుగా చేసినట్లుగా యత్నిస్తోందంటూ విమర్శించారు. (చదవండి: రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ఘాటుగా స్పందించిన శరద్ పవార్) -
లోటు బడ్జెట్కు ప్రభుత్వమే కారణం
ఏఐఎస్జీఈఎఫ్ చైర్మన్ ముత్తు సుందరం మంకమ్మతోట : దేశంలో రూ.5,028వేల కోట్ల లోటు బడ్జెట్కు కేంద్రమే కారణమని ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాÄæూస్ ఫెడరేషన్ చైర్మన్ ముత్త సుందరం విమర్శించారు. సెప్టెంబర్ 2న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని టీఎన్జీవో భవన్లో గురువారం నిర్వహించిన సన్నాహక సదస్సులో మాట్లాడారు. రిలయన్స్ కంపెనీకి రూ.5వేల కోట్లకు పైగా పన్ను చెల్లింపులో మినహాయింపు ఇవ్వడంతోనే లోటు బడ్జెట్ ఏర్పడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. టీఎన్జీవోస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్రావు మాట్లాడుతూ కొత్త పింఛన్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం కొనసాగించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఖాళీల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కారం రవీందర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ హమీద్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి వేముల సుగుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.