మాన్వాడ రిజర్వాయర్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు
బోయినపల్లి : మధ్యమానేరు ప్రాజక్టుకు గండిపడడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్ విమర్శించారు. మంగళవారం మిడ్‌మానేరును రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే.నగేశ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు వారికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కుమార్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రాజెక్టుపై స్పష్టమైన అవగాహన లేదన్నారు.
-
కాంట్రాక్ట్ అప్పగింతలో ముందుచూపు కరువు
-
నష్టపోయిన పంటలకు పరిహారమివ్వాలి
-
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కుమార్, రాష్ట్ర కార్యదర్శి నగేశ్
-
మిడ్‌మానేరును సందర్శించిన నాయకులు
బోయినపల్లి : మధ్యమానేరు ప్రాజక్టుకు గండిపడడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్ విమర్శించారు. మంగళవారం మిడ్‌మానేరును రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే.నగేశ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు వారికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కుమార్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రాజెక్టుపై స్పష్టమైన అవగాహన లేదన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా సర్కారు స్పందించకపోవడం శోచనీయమన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి బినామీలకు పనులు అప్పగించడంతో గండి పడి ప్రజాధనం వృథా అయ్యిందని విమర్శించారు. గండితో పంటలు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నగేశ్ మాట్లాడుతూ సామర్థ్యానికి మించి నీటిని నిల్వ చేయడంతోనే గండి పడిందన్నారు. మాన్వాడ గ్రామాన్ని పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్‌బాబు, రాష్ట్ర యువత కార్యదర్శి దుబ్బాక సంపత్, జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేని వేణుమాధవరావు, గినుకొండ రామకృష్ణారెడ్డి తదితరులున్నారు.