మాట్లాడుతున్న కలెక్టర్ శివలింగయ్య
సాక్షి, మహబూబాబాద్ : ప్రభుత్వ కార్యక్రమాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం మండల ప్రత్యేక అధికారులు, సంబం« దిత సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసి లీకేజీలు లేకుండా చూడాలని, కల్వర్టులు పూర్తి చేయాలని, ఏప్రిల్ 15 నాటికి నీటి సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ఇన్‌ట్రా విలేజ్ పనుల్లో భాగంగా 1,075 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు గాను 300 మాత్రమే పూర్తయ్యాయని, మిగతా వాటికి స్థల సేకరణ చేసి పూర్తి చేయాలన్నా రు. కాగా ఈ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ మొదటి దశలో పెండింగ్‌లో ఉన్న పనులను ఈనెల చివరిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో దశలో చెరువు పూడికతీత పనుల్లో మిగతా 17చెరువుల్లో నీరున్నందున మే చివరి నాటివరకు పూర్తి చేయాలన్నారు. మూడోదశలో 183 చెరువుల పనులను జూన్‌లోగా, నాలుగో విడతలో మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తిచేయాలన్నారు. హరితహారంలో 4వ విడతలో 96లక్షల మొక్కలు నాటమే లక్ష్యంగా కృషిచేయాలన్నారు. డీఆర్వో పి.రాంబాబు, డీఎఫ్‌ఓ కిష్టగౌడ్, డీఆర్‌డీఓ వైవీ.గణేష్, సీపీఓ వెంకటనారాయణ, ఆర్డీఓలు భాస్కర్‌రావు, కృష్ణవేణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment