
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): బెంగళూరుతో పాటు రాష్ట్రంలో కరోనా మూడో దశ, రూపాంతర ఒమిక్రాన్ భయాలు క్రిస్మస్, నూతన ఏడాది సందడిని తగ్గించేలా ఉన్నాయి. మూడో దశను అడ్డుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్, కొత్త సంవత్సర సంబరాలను కట్టడి చేయాలనుకుంటున్నట్లు సమాచారం. సర్కారుకు గురువారం కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. ఈ నెల 22 నుంచి జనవరి 2 వరకు జన సందడిని నియంత్రించాలని కోరింది.