Guide Lines
-
సుప్రీంలో సీనియర్ హోదా.. కొత్త మార్గదర్శకాలు జారీ
ఢిల్లీ: సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదుల నియామకం విషయంలో నూతన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. భారత సుప్రీంకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాదుల హోదా కోసం మార్గదర్శకాలు- 2023 పేరిట దీనిని విడుదల చేసింది సర్వోన్నత న్యాయస్థానం. కొత్తగా వయో పరిమితి విధింపుతోపాటు పలు నిబంధనలనూ చేర్చింది. ఇందిరా జైసింగ్ వర్సెస్ సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా.. ఈ ఏడాది మే 12వ తేదీన వెల్లడించిన ఆదేశాలనుసారం ఈ మార్గదర్శకాలు విడుదల చేసినట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. ఈ కేసులో తీర్పు వెలువరించిన రెండు నెలలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం గమనార్హం. ఇక తీర్పులో.. న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా నియమించడానికి హైకోర్టులు, సుప్రీంకోర్టు అనుసరించిన ఇంటర్వ్యూ ప్రమాణాలను కోర్టు సమర్థించింది, సీనియర్ న్యాయవాదుల కేటాయింపునకు సంబంధించి వ్యవహారాలను.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించే కమిటీ పర్యవేక్షిస్తుందని, ఇందులో ఇద్దరు సీనియర్ జడ్జిలతో పాటు అటార్నీ జనరల్, అలాగే చైర్పర్సన్.. సభ్యులుగానీ నామినేట్ చేసే ఓ బార్ మెంబర్ సైతం సభ్యులుగా ఉంటారని తెలిపింది. అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే రహస్య బ్యాలెట్ ఓటింగ్‌ను ఆశ్రయించాలని కొత్త మార్గదర్శకాలు నిర్దేశించాయి. 45 ఏళ్లు నిండి ఉండాలి కనీసం పదేళ్లు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కనీసం 5 ఆర్టికల్స్ వేర్వేరు పబ్లికేషన్లలో ప్రచురితం కావాలి. ప్రచురణల సంఖ్యకు ఇచ్చిన పాయింట్లను 15 మార్కుల నుండి 5కి తగ్గించింది. కేసును వాదించి గెలవాలి, జడ్జిమెంట్ రావాలి న్యాయ కళాశాలల్లో బోధించిన అనుభవం పరిగణనలోకి తీసుకుంటారు తీర్పుల కోసం ఇచ్చిన పాయింట్ల సంఖ్యను గతంలో 40 నుండి 50 పాయింట్లకు పెంచారు. -
క్రిస్మస్, కొత్త ఏడాదిపై ఆంక్షలు?
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): బెంగళూరుతో పాటు రాష్ట్రంలో కరోనా మూడో దశ, రూపాంతర ఒమిక్రాన్ భయాలు క్రిస్మస్, నూతన ఏడాది సందడిని తగ్గించేలా ఉన్నాయి. మూడో దశను అడ్డుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్, కొత్త సంవత్సర సంబరాలను కట్టడి చేయాలనుకుంటున్నట్లు సమాచారం. సర్కారుకు గురువారం కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. ఈ నెల 22 నుంచి జనవరి 2 వరకు జన సందడిని నియంత్రించాలని కోరింది. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
హోటళ్ల వ్యాక్సినేషన్ ప్యాకేజీలు.. కేంద్రం కన్నెర
కరోనా టైంలో విలాసవంతమైన హోటల్స్ ఐసోలేషన్ సెంటర్లుగా మారిపోయాయి. ఈమధ్య అయితే ఏకంగా వ్యాక్సిన్ డోసులూ అందిస్తున్నాయి. వ్యాక్సినేషన్ పేరిట స్పెషల్ ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో చేతులు కలిపి లగ్జరీ హోటల్స్ ఈ దందాను నడిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కన్నెర చేసింది. న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్పత్రులు, హోటల్స్‌తో కలిసి నడిపిస్తున్న వ్యాక్సినేషన్ దందాలను సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్, వ్యాక్సినేషన్ గైడ్లెన్స్ కూడిన లేఖల్ని శనివారం పంపించారు. #Unite2FightCorona Health Ministry writes to States/UTs on some private hospitals giving package for #COVID19 Vaccination in collaboration with some hotels. Says it is against the guidelines issued for the National Covid Vaccination Program. pic.twitter.com/qum9SqOJtW — Ministry of Health (@MoHFW_INDIA) May 29, 2021 ఈమధ్య కొవిడ్ వ్యాక్సినేషన్ ప్యాకేజీల పేరుతో లగ్జరీ హోటల్స్ యాడ్స్ ఇచ్చుకుంటున్నాయి. ఫలానా రోజులకి, ఫలానా రేటంటూ ప్రకటించుకుంటున్నాయి. ఫుడ్, బెడ్, వైఫైలతో పాటు పేరుమోసిన పెద్ద ఆస్పత్రుల నుంచి సిబ్బందిని తెప్పించి కస్టమర్లకు వ్యాక్సిన్ డోసులు అందిస్తున్నాయి. ఈ ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఈ తరుణంలోనే కేంద్రం స్పందించింది. స్టార్ హోటళ్లలో టీకాలు వేయడం రూల్స్ విరుద్ధమని, తక్షణం కార్యక్రమాన్ని నిలిపివేసేలా చూడాలని, అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆ మార్గదర్శకాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి గట్టిగానే సూచించారు. కాగా, ఒకవైపు వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్న వేళ.. ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ డోసులు అందించడంపై కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో తాజా ఆదేశాలు కొంచెం ఊరట ఇచ్చే అంశమే. ఇప్పటిదాకా మన దేశంలో 21 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఎక్కడెక్కడంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు, వర్క్ ప్లేసులు, వయసు మళ్లినవాళ్ల కోసం హోం కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు, గ్రూప్ హౌజింగ్ సొసైటీల దగ్గర వైకల్యం ఉన్నవాళ్లకు, ఆర్డబ్ల్యూఏ ఆఫీసుల్లో, కమ్యూనిటీ సెంటర్లలో, పంచాయితీ భవన్లలో, విద్యా సంస్థల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో టెంపరరీ బేస్ మీద వ్యాక్సిన్ అందించాలని కేంద్రం గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిశితంగా పరిశీలించాలని, అవకతవకలు జరిగితే కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ సూచించింది. -
మేకప్ ఇంటిదగ్గరే.. నిర్మాతలదే పూర్తి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: సినిమా, టీవీ షూటింగ్‌లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా మార్గదర్శకాలు, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని సీఎం కేసీఆర్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షూటింగ్ పూర్తైన సినిమా, టీవీ సీరియల్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా అసంపూర్తిగా నిలిచిపోయిన సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు కూడా అనుమతినిస్తూ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. (షూటింగ్‌లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్: చిరు) నటీనటుల ఎంపిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. నటీనటుల మేకప్ ఇంటి వద్దే చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వైద్యుల సలహా మేరకు మాత్రమే 10 ఏళ్ల లోపు, 60 ఏళ్లు పైబడిని నటీనటులను తీసుకోవాలని పేర్కొంది. ఆర్టిస్టుల ఆరోగ్య భద్రత నిర్మాతలదేనని స్పష్టం చేసింది. ఆ మేరకు నిర్మాతలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. షూటింగ్ స్పాట్లో మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఇండోర్ షూటింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. షూటింగ్లలో 40 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. (లైట్స్.. కెమెరా.. యాక్షన్) -
కొత్త మార్గదర్శకాలెక్కడ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో పారిశ్రామిక రంగం అత్యంత కీలకమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2015, జనవరి ఒకటి నుంచి నూతన పారిశ్రామిక చట్టం టీఎస్ ఐపాస్‌ను అమలు చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల పాటు అమల్లో ఉన్న టీఎస్ఐపాస్ మార్గదర్శకాల అమలు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. నూతన పారిశ్రామిక చట్టం మార్గదర్శకాల రూపకల్పనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పాత మార్గదర్శకాలను కొనసాగించాలని పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 నుంచి రాయితీలు,ప్రోత్సాహకాల చెల్లింపు రూ.2,540 కోట్ల మేర బకాయిల రూపంలో నిలిచిపోయాయి. పాత మార్గదర్శకాలు అమలుకు నోచుకోక, కొత్త మార్గదర్శకాలపై స్పష్టత లేక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో గందరగోళం నెలకొంది. ఇది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎన్నాళ్లు.. రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించి పారిశ్రామిక చట్టం టీఎస్‌ఐపాస్‌లో అంతర్భాగంగా ఉన్న టీ ఐడియా, టీ ప్రైడ్‌ను తదుపరి మార్గదర్శకాలు జారీ అయ్యేంత వర కు కొనసాగించాలంటూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఏడాది మార్చి 28న ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 2019–24 మధ్యకాలంలో ఐదేళ్ల పాటు అమల్లో ఉండేలా టీఎస్ఐపాస్కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రూపొందించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి లేఖ రాసి 6 నెలలు గడిచినా నూతన మార్గదర్శకాల రూపకల్పనపై పరిశ్రమల శాఖకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. దీంతో టీఎస్ఐపాస్ పాత మార్గదర్శకాలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ వర్గాలు అంటున్నాయి. బకాయిలు రూ.2,540 కోట్లు.. టీఎస్‌ఐపాస్‌లో భాగం గా జనరల్ కేటగిరీ పరిశ్రమల యజమానులకు టీ ఐడియా, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు టీ ప్రైడ్ కింద కలిపి మొత్తంగా 29 వేల మంది పారిశ్రామికవేత్తలకు రూ.2,540.17 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాల బకాయి లు అందాల్సి ఉంది. రాష్ట్ర అవతరణకు పూర్వం అమ్మకం పన్నుకు సంబంధిం చిన బకాయిలు 2013 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుత్ రాయితీలు, పావలా వడ్డీ ప్రోత్సాహకం, తనఖా సుంకం, నైపుణ్య శిక్షణ తదితరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో 2017 నుంచి, జనరల్ కేటగిరీల్లో 2015 నుంచి పరిశ్రమల శాఖ నుంచి విడుదల కావాల్సిన రాయితీలు, బకాయిలు పేరుకుపోయాయి. టీఎస్ఐపాస్ పాత మార్గదర్శకాల ప్రకారమే రాయితీలు, బకాయిలు కొనసాగిస్తామని పరిశ్రమల శాఖ ప్రకటించినా..ఏళ్ల తరబడి బకాయిలు పేరుకు పోవడంతో పరిశ్రమల నిర్వహణ భారంగా మారుతోందని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. కొత్త మార్గదర్శకాలు రూపొం దించే పక్షంలో రాయితీలు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వ వైఖరెలా ఉంటుందనేది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అంతు చిక్కడం లేదు. ముగిసిన గడువు... త్వరితగతిన పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014లో ‘తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ప్రాజెక్టు అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్’(టీఎస్ఐపాస్) చట్టాన్ని రూపొందించింది. 14 కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేలా మార్గదర్శకాలు రూపొందించింది. టీఎస్ఐపాస్ కింద అనుమతిచ్చిన పరిశ్రమలు: 11,000 ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమలు: 8,400 వీటి కోసం చేసిన ఖర్చు: 1.60 లక్షల కోట్లు ప్రత్యక్షంగా ఉపాధి లభించిన వారు: 12 లక్షలు పరోక్షంగా ఉపాధి పొందిన వారు: 20 లక్షలు -
ఫేక్ న్యూస్ ఆదేశాలు.. వెనక్కి తగ్గిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : తప్పుడు వార్తల విషయంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సమాచార శాఖను ఆదేశించారు. పూర్తి ఆధారాలు లేకుండా కథనాలను ప్రచురిస్తే వాటిని ఫేక్ న్యూస్‌ల కింద పరిగణించి జర్నలిస్టుల అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని గత రాత్రి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో వివిధ ఛానెళ్ల, పత్రికల ఎడిటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జర్నలిస్టు సంఘాల నుంచి పెద్ద ఎత్తున్న నిరసనలు ఎదురయ్యాయి. దీనికి తోడు ఈ నిర్ణయం పత్రికా స్వేచ్ఛను హరించటమేనంటూ రాజకీయ పక్షాలు రంగంలోకి దిగాయి. ఆ ఉత్తర్వుల్లో ఏవైనా మార్పులు సూచించాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ ఉదయం ట్వీట్ చేశారు. అయినా ఆందోళనలు చల్లారకపోవటంతో నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఫేక్ న్యూస్‌ల వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో చర్చించిన తర్వాతే ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సమాచార శాఖకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. -
సింగిల్‌గా తెచ్చింది
ఓ సినిమాలో పాపులర్ డైలాగ్.. ‘సింహం సింగిల్‌గా వస్తుందని’! పాస్‌పోర్టు ఆఫీస్ మాత్రం.. జారియా జంటగానే రావాలి అంది! ‘‘కుదర్దు సింగిల్‌గానే వస్తుంది.. సింగిల్‌గానే మార్పు తెస్తుంది’’ అని మనసులోనే శపథం చేసుకుంది జారియా! ఈ సింగిల్ మదర్ .. పోరాటం.. విజయం.. వెరిమచ్ ఇన్స్పైరింగ్. ‘‘క్యా హువా బేటా (ఏమైందమ్మా)’’బయటి నుంచి వచ్చి ఈసురోమంటూ సోఫాలో చేరగిలబడ్డ కూతురిని చూస్తూ అడిగింది తల్లి ఆత్రంగా! ‘‘కుఛ∙నహీ హువా మా... హమేషాకి తరహ్ (ఏమీ కాలేదమ్మా.. ఎప్పటిలాగే)’’.. నిరాశగా నిట్టూరుస్తూ జవాబిచ్చింది కూతురు.‘‘పరేషాన్ మత్ హో.. సబ్ ఠీక్ హోగా (కంగారు పడకు.. అంతా సవ్యంగానే జరుగుతుంది)’’.. అంది తల్లి కూతురి తల నిమురుతూ! కళ్లల్లో నీళ్లొచ్చాయి కూతురికి తల్లి స్పర్శతో. వెంటనే తమాయించుకుని ‘‘ఏక్ మినట్ మా... ’’అంటూ దిగ్గున లేచి తన గదిలోకి వెళ్లింది కూతురు. హడావుడిగా ల్యాప్‌ట్యాప్ తెరిచి.. ‘ఛేంజ్ డాట్ ఓఆర్జీ’కి ఓ పిటిషన్ మెయిల్ చేసింది. తర్వాత విదేశీ వ్యవహారాలశాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేసింది. ఆమె పేరు జారియా పట్నీ. ముంబై నివాసి. ఉన్నపళంగా పిటిషన్, మంత్రికి ట్వీట్ చేయాల్సిన అవసరమేంటి? గతం జారియాకు పందొమ్మిదేళ్లప్పుడు పెళ్లయింది. ముంబైలో వాళ్ల బిల్డింగ్‌లోనే ఓ అపార్ట్మెంట్లో అద్దెకుండే ఓ వ్యక్తితో పరిచయమైంది. అతను ఆమెకన్నా ఏడేళ్లు పెద్దవాడు. ‘‘నువ్వంటే ఇష్టం’’ అన్నాడు. ఆమె స్నేహం చేసింది. కాఫీ షాప్‌లు, సినిమాలు, షాపింగ్‌లకు కలిసి వెళ్లేవారు. ఆ చనువు ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లీ అయింది. పెళ్లయ్యాక అతనికి దుబైలో ఉద్యోగం రావడంతో జారియాను తీసుకొని దుబై వెళ్లాడు. ఆమె ఏం తినాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎవరితో మాట్లాడాలి? ఎలాంటి వాళ్లు స్నేహితులుగా ఉండాలి అనేవన్నీ అతనే నిర్ణయించడం మొదలుపెట్టాడు. మొదట్లో.. ఏ బట్టలు వేసుకోవాలో, ఏం తినాలో భర్త చెబుతుంటే ప్రేమ అనుకుంది. కాని రానురాను ఆ తీరు పొసెసివ్‌నెస్‌గా, అతని అభద్రతగా అర్థమైంది జారియాకు. అయితే ఆయన ప్రతాపం అంతటితో ఆగలేదు. జారియా తన హక్కు గురించి ఏమాత్రం మాట్లాడినా చేయిచేసుకునేదాకా వెళ్లింది. ఆ సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. అయినా హింస ఆపలేదు. గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను కొట్టాడు. తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రి పాలైంది. ఒక్కరోజు ఆలస్యమైనా జారియా ప్రాణంమీదకు వచ్చేదని చెప్పారు డాక్టర్లు. దాంతో భయపడిపోయిన జారియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవగానే ముంబైకి ప్రయాణమైంది. జరిగిన విషయం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. అండగా నిలిచారు. మళ్లీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కేస్ కోర్టులో ఉండగానే జారియాకు కొడుకు పుట్టాడు. బిడ్డతో పాటు విచారణలకు వెళ్లొచ్చేది. ఎట్టకేలకు బిడ్డకు ఆమెను లీగల్ గార్డియన్‌గా చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఊపిరి పీల్చుకుంది జారియా. ప్రస్తుతం చేంజ్ డాట్ ఓఆర్జీలో ఆమె పిటిషన్‌కు తొంభైఆరువేల మంది మద్దతు పలికారు. దాంతో ప్రభుత్వం... సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌కు విరుద్ధంగా ఉన్న తన నిబంధనను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. తల్లి లీగల్ గార్డియన్ అని ఉన్న సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌ను గౌరవిస్తూ తల్లి సంతకంతోనే జారియా కొడుకుకు పాస్‌పోర్ట్ మంజూరు చేశారు. తన పోరాటం ఎంతో మంది ఒంటరితల్లులకు ఊరటైనందుకు చాలా సంతోషంగా ఉంది జారియా పట్నీ! బ్రాండ్ ఫొటోగ్రాఫర్ ఓ వైపు పిల్లాడి పెంపకం బాధ్యతలు చూసుకుంటూనే ఇంకోవైపు తండ్రికి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటోంది జారియా. బాబు కొంచెం పెద్దయ్యాక భర్త పక్కన పెట్టించిన ఫొటోగ్రఫీ అభిరుచిని మళ్లీ ప్రారంభించింది. త్వరలోనే మంచి పేరున్న బ్రాండ్స్ నుంచి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఆ షూటింగ్‌లు, వ్యాపారంతో చాలా బిజీ అయిపోయింది. షూటింగ్స్ విదేశాల్లో ఉండటంతో అక్కడికీ వెళ్లాల్సి వచ్చింది. ఒకసారి కొడుకును కూడా తీసుకెళ్దామనుకుంది. పాస్‌పోర్ట్‌కు అప్లయ్ చేస్తే రిజెక్ట్ అయింది. కొంతకాలం ఆగి మళ్లీ చేసింది. మళ్లీ దరఖాస్తును తోసిపుచ్చారు. ఖంగు తినింది. కారణమేంటో తెలియలేదు. పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఆరా తీసింది. పిల్లాడి తండ్రి సంతకం తప్పనిసరిగా కావాలన్నారు. ‘‘అదేంటి? సింగిల్ పేరెంట్‌ని. విడాకులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు అతని దగ్గరకు వెళ్లి సంతకం ఎలా తీసుకొస్తాను? తేలేను’’ అని తేల్చేసింది. ‘‘మేమూ ఇవ్వలేం’’ అని వాళ్లూ స్పష్టం చేశారు. షాక్ అయింది జారియా. అతని హింసను భరించలేక కాపురం వద్దనుకోవడమే కాదు జన్మలో అతని మొహమే చూడకూడదనుకుంది. సంతకం కోసం అలాంటి వ్యక్తి దగ్గరకు మళ్లీ వెళ్లాలా? సమస్యే లేదు. పాస్ పోర్ట్ ఎలా రాదో చూస్తా అనుకుంది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ చూసింది. విడాకుల కేసుల్లో పిల్లలకు సంబంధించి దరఖాస్తు ఫారాల్లో తల్లి, తండ్రి ఇద్దరిలో ఎవరి సంతకమైనా చెల్లుతుంది అని రాసి ఉంది. ఆ గైడ్‌లైన్‌ను పట్టుకొని ఇంకోసారి పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లింది. తండ్రి సంతకం తప్పనిసరిగా కావాలని ప్రభుత్వ నియమాన్ని, నిబంధనను తీసి చూపించారు పాస్‌పోర్ట్ అధికారులు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌ను చెల్లదు పొమ్మన్నారు! డీలా పడి ఇల్లు చేరింది. అంతలోకే ఆలోచన వచ్చి చేంజ్ డాట్ ఓఆర్జీకి పిటిషన్, సుష్మాస్వరాజ్‌కు ట్వీటూ చేసింది. – శరాది -
మూతబడులు!
నల్లగొండ అర్బన్ : రేషనలైజేషన్ (విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ల కేటాయింపు-హేతుబద్ధీకరణ)తో జిల్లాలో 470 ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. వీటిలో 270 ప్రైమరీ స్కూళ్లు, 200 హైస్కూళ్లు, సక్సెస్ స్కూళ్లు ఉండనున్నాయి. దసరా సెలవుల్లోనే రేషనలైజేషన్ అమలు చేయాలంటూ ప్రభుత్వం శనివారం జీఓనంబరు 6 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రేషనలైజేషన్ కు సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించింది. 20మంది విద్యార్థుల కన్నా తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను దగ్గరలోని ప్రాథమిక పాఠశాలల్లో, 75మంది విద్యార్థులకన్నా తక్కువగా ఉండే హైస్కూళ్లను మూసివేసి సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేసే విధంగా గైడ్‌లైన్స్ రూపొందించారు. ఇదే నిబంధన ఇంగ్లీష్ మీడియంలోని సక్సెస్ హైస్కూళ్లకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించారు. రేషనలైజేషన్ పూర్తయితే పెద్దసంఖ్యలో ఉపాధ్యాయుల ఖాళీలకు గ్రహణం వీడనుంది. అధికంగా ఉన్న ఉపాధ్యాయులను సమీపంలోని స్కూళ్లకు బదిలీచేస్తే డీఎస్సీ ప్రకటన ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పరస్పర విరుద్ధంగా నిబంధనలు.. విద్యాహక్కు చట్టం ప్రకారం కిలోమీటర్ దూరంలోపే ప్రభుత్వ పాఠశాల ఉండాలని నిబంధనలున్నాయి. మరోవైపు 20మంది పిల్లలకన్నా తక్కువ సంఖ్య ఉన్న (19 మంది విద్యార్థులున్నా సరే) ప్రైమరీ స్కూళ్లను మూసివేయాలని రేషనలైజేషన్‌లో నిబంధన పెట్టారు. అదే విధంగా జిల్లాలో ప్రస్తుతం 20మందిలోపు ఉన్న పాఠశాలలు 270 దాకా ఉన్నాయి. వీటిని మూసివేస్తే ఒక్కో పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులున్నా, సగటున 550 మంది టీచర్లు మిగులుతారు. వీరిని ఉపాధ్యాయ ఖాళీలున్న ఇతర పాఠశాలల్లోకి బదిలీ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు తగ్గే అవకాశముంటుంది. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒకింత నిరాశను మిగిల్చే పరిణామమిది. అంతేకాకుండా 75 మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న హైస్కూళ్లను కూడా సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. జిల్లాలో దాదాపు 200కు పైగా హైస్కూళ్లు, సక్సెస్ సూళ్లపై కూడా రేషనలైజేషన్ ప్రభావం పడనుంది. సక్సెస్ స్కూళ్ల పేరుతో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టి అదనపు సెక్షన్లు ఏర్పాటు చేశారు. చాలా పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు 60 నుంచి 70 మంది విద్యార్థులే చదువుతున్నారు. వీటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులను కూడా ఇతర చోట్ల సర్దుబాటు చేస్తారు. దీంతో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది. మూతబడేది ఇలా.. గుర్రంపోడు మండల పరిధిలోని పోచంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో 50మంది, తెలుగు మీడియంలో 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. 75 మంది కన్నా తక్కువ ఉన్న స్కూళ్లను ఎత్తివేయాలనే నిబంధనలో పేర్కొన్నారు. దీంతో తెలుగు, ఇంగ్లిష్ మీడియం రెండూ ఎత్తివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో ఇలాంటి పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఇవి కాకుండా యూపీఎస్‌లలో కూడా 6వ తరగతిలో 20 మంది, 7వ తరగతిలో 20 మంది లేకపోతే ఆ పాఠశాలను కూడా మూసివేయాలని నిబంధనలు రూపొందించడంతో అనేక యూపీఎస్‌ల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. విద్యా సంవత్సరం మధ్యలో రేషనలైజేషన్ తగదు : టీఆర్టీఎఫ్ వేసవి సెలవుల్లో రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే బాగుండేదని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నంద్యాల మోహన్‌రెడ్డి, నిమ్మనగోటి జనార్దన్ అన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి నిబంధనలు తీసుకరావడం వల్ల ఇటు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరమే. అందుకే ప్రస్తుత రేషనలైజేషన్‌ను వ్యతిరేకిస్తున్నాం. గ్రామీణ విద్యార్థులు సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. వారిని పక్క గ్రామాలకు వెళ్లి వేరే స్కూళ్లో చదవాలంటే మానేసి పరిస్థితి ఏర్పడుతుంది. రేషనలైజేషన్ ఉద్దేశం పాఠశాలలను ఎత్తివేసే లక్ష్యంతో ఉండకూడదు. దీని ప్రభావం డీఎస్సీ నోటిఫికేషన్‌పై కూడా ఉంటుంది. -
రాష్ట్ర విభజనలో భాగంగా ఆలిండియా సర్వీసు