సాక్షి, హైదరాబాద్: సినిమా, టీవీ షూటింగ్‌లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని సీఎం కేసీఆర్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షూటింగ్ పూర్తైన సినిమా, టీవీ సీరియల్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా అసంపూర్తిగా నిలిచిపోయిన సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు కూడా అనుమతినిస్తూ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. (షూటింగ్‌లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్: చిరు)
నటీనటుల ఎంపిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. నటీనటుల మేకప్ ఇంటి వద్దే చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వైద్యుల సలహా మేరకు మాత్రమే 10 ఏళ్ల లోపు, 60 ఏళ్లు పైబడిని నటీనటులను తీసుకోవాలని పేర్కొంది. ఆర్టిస్టుల ఆరోగ్య భద్రత నిర్మాతలదేనని స్పష్టం చేసింది. ఆ మేరకు నిర్మాతలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. షూటింగ్ స్పాట్‌లో మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఇండోర్ షూటింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. షూటింగ్‌లలో 40 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. (లైట్స్.. కెమెరా.. యాక్షన్)
Comments
Please login to add a commentAdd a comment