
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ ఉధృతి పెరగడంతో ప్రముఖులు పెద్దసంఖ్యలో వైరస్‌కు గురవుతున్నారు. సీఎం బొమ్మైకి కోవిడ్ సోకడం తెలిసిందే. ఆయన కుమారుడు భరత్, కోడలుకు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. మంత్రి మాధుస్వామి, ఆయన కుమారునికి, అలాగే మరో ఎమ్మెల్యే హెచ్.ఎం.రేవణ్ణ, కాంగ్రెస్ నేత ఇబ్రహీంకి కోవిడ్ నిర్ధారణ అయింది. సీఎం కొడుకు, కోడలు మణిపాల్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొన్నారు.
ఇంట్లోనే సీఎం క్వారంటైన్
సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత సీఎం బసవరాజ బొమ్మై మంగళవారం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా, వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఇంట్లోనే చికిత్స కొనసాగించాలని సూచించారు. దీంతో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ కరోనా లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రిలోనే ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆర్‌టీ నగరలోని నివాసంలోనే వారంరోజులు క్వారంటైన్‌లో ఉంటారు. అక్కడి నుంచే పరిపాలనా పనులు నిర్వహిస్తారు.
చదవండి: బాలికపై అఘాయిత్యం.. 80 ఏళ్ల వృద్ధుడితోపాటు.. మరో ఐదుగురు
Comments
Please login to add a commentAdd a comment