మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు
సిద్దిపేటటౌన్ : స్వరాష్ట్రంలో రైతులు బాగుపడతారని ఆశిస్తే.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దం లక్ష్మి, రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హాత్యలేనని ఆరోపించారు. బుధవారం జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఒక్క పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. రైతులకు మట్టితో సహా రూ.లక్ష రుణమాఫీ చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.6 లక్షలు పరిహారంగా ఇస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో జువ్వన్న ప్రసాద్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment