
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం మరో మెగామిషన్‌ను పక్రటించనుందట. ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో భారత్ 30 ర్యాంకులు ఎగబాకడం, అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్ బూస్ట్‌తో జోష్ మీద ఉన్న నరేంద్రమోదీ ప్రభుత‍్వం మరో మెగా మిషన్‌కు సన్నద్ధమవుతోంది.
డీమానిటైజేషన్, జీఎస్‌టీ, ఆధార్ అనుసంధానం లాంటి సంస్కరణల తరువాత మరో కీలక చర‍్యపై దృష్టిపెట్టింది. ఒకవైపు ఆధార్ అనుసంధానంపై వివాదం కొనసాగుతుండగానే.. 1 బిలియన్ , 1 బిలియన్, 1 బిలియన్ కనెక్టివిటీపై దృష్టి పెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అంటే 100కోట్ల ఆధార్ నంబర్లతో 100కోట్ల బ్యాంకు ఖాతాల అనుసంధానం, 100 కోట్ల మొబైల్స్ లింకింగ్.. ఇదే కేంద్ర సర్కార్ నెక్ట్స్ టార్గెట్.
పెద్దనోట్ల రద్దు తర్వాత అధికంగా నమోదవుతున్న బ్యాంక్ ఖాతాలు, పుంజుకుంటున్న డిజిటల్ లావాదేవీల నేపథక్యంలో ప్రభుత్వం ఈ లక్ష్యంపై దృష్టి పెట్టిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1 + 1 +1 ప్లాన్ తొందర్లనే ప్రకటించవచ్చని ప్రభుత్వ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఆర్థిక, డిజిటల్ సేవల విస్తరణలో ఇది పెద్ద ముందుడుగు భావిస్తున్నాయి.